సాక్షి,అమరావతి : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ మూడు కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం.గౌతమ్ రెడ్డి, ఆళ్ల శరణ్ సీఎం జగన్‌ను కలిసి చెక్కును అందజేశారు. దీంతో పాటు రెండు కోట్ల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కూడా అందించనున్నట్టు ప్రకటించారు.
అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి మిడ్‌వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బుధవారం మిడ్‌వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రామచంద్ర కొల్లారెడ్డి, కె రాఘవరెడ్డి కలిసి విరాళానికి సంబంధించిన చెక్‌ను అందచేశారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ టెక్ట్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఛైర్మన్ లంకా రఘురామిరెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, అసోసియేషన్ సభ్యులు వసంతకృష్ణప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు.
సాగర్ సిమెంట్స్ కోటి విరాళం
ముఖ్యమంత్రి నివాసంలో నిన్న (మంగళవారం) సీఎం వైఎస్ జగన్‌కు సాగర్ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఆనంద్‌రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శ్రీకాంత్ రెడ్డి విరాళం చెక్‌ను అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment