
కరోనా మహమ్మారి కట్టడికి భారత ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభించడంతో 3వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరోనా అంతకంతకు పెరుగుతుండటంతో ఆర్ధికపరమైన విషయాల కంటే ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరాయి. పంజాబ్, ఒడిషా, తెలంగాణ , మహారాష్ట లాంటి ప్రభుత్వాలు ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దినసరి కూలీలు, వలస కూలీలు, నిరుపేదలు జీవన భృతి కోల్పొయి అష్టకష్టాలు పడుతున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతో పాటు సామాన్యులు కూడా ముందుకు వచ్చి వారికి తోచిని సాయం చేస్తున్నారు. అలా సాయం చేస్తూ మానవత్వాన్ని కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (మానవ సేవే మాధవ సేవ)
మూసపేటలో ఉంటున్న కె. అజయ్‌సాయి కరోనా కాలంలో పేదలకు అండగా నిలవడం కోసం తన చుట్టు పక్కన ఉండే నిజమైన పేదవారిని గుర్తించి వారి తన సొంత ఖర్చులతో నిత్యవసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
లాక్‌డౌన్ కారణంగా తమ తమ ప్రాంతాలకు వెళ్లలేక వలస కూలీలు పరిస్థితి దుర్భరంగా మారింది వారిని ఆదుకునేందురకు మోహన్‌కుమార్ ముందుకొచ్చారు. కర్నూలు జిల్లా ఒబులపురంలో ఉంటున్న వలసకూలీలకు నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్ కడింపల్లి, చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర కమిటీ సభ్యులు - రైతు స్వరాజ్య వేదిక, శేఖర్ పోతుల , చంద్ర శేఖర్ రాజు చార్టెడ్ అకౌంటెంట్ , జుబేదా తదితరులు పాల్గొన్నారు.
ఈ కరోనా కారణంగా మనుషులతో పాటు నోరు లేని మూగజీవులు కూడా తిండి దొరకక అష్టకష్టాలు పడుతున్నాయి. దీంతో పాటు వేసవికాలం కూడా కావడంతో నీరు కూడా దొరకని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు బ్రాడీపేటలో ఉంటున్న రాధాకృష్ణ మూగజీవాలకు ఆహారాన్ని అందించి సహృదయాన్ని చాటుకున్నారు.
మీరు అందిస్తున్న సాయం ఎంతో మందిలో స్ఫూర్తి నింపవచ్చు. మీరు చేస్తున్న సాయాన్ని తెలియజేయాలనుకుంటే వివరాలను webeditor@sakshi.com కి పంపించండి.
Comments
Please login to add a commentAdd a comment