
సాక్షి, హైదరాబాద్: భారత ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్‌ను విధించడంతో అనేక మంది దినసరి కూలీలు, అనాధలు, బిక్షాటన చేసుకునే వారు పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వాలు వీరి ఆకలిని తీర్చడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, దాతలు వచ్చి ఆహారం దొరకని వారికి అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్ వారు క్యాంపస్‌కు సమీపంలో ఉన్న వారికి ఆదివారం నిత్యవసర సరుకులు అందించారు. దాదాపు 450 కుటుంబాలకు సాయాన్ని అందించారు. ఈ విషయం పట్ల మండల ఎంఆర్‌వో శ్రీగోవర్ధన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్‌పిలానీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. సుందర్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎం. శ్రీనివాసరెడ్డి, రజిని వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న రెండురోజుల్లో అంతైపల్లి, ఫరాహ్‌నగర్ ప్రాంతాల్లో ఇలాంటి డ్రైవ్ నిర్వహిస్తామని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment