BITS pilani
-
బిట్స్ పిలానీలో ప్రారంభమైన సీఆర్‌ఈఎన్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ (సీఆర్‌ఈఎన్‌ఎస్)ని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఆవిష్కరించింది. సీఆర్‌ఈఎన్‌ఎస్ చేపట్టే పరిశోధన, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమాలు దేశీయ సాంకేతికత, భద్రత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. డీఆర్డీఓ, ఇస్రో, పోలీస్ డిపార్ట్మెంట్, రక్షణ, పరిశ్రమల సహకారంతో జాతీయ భద్రతా విషయంలో దేశ అభివృద్ధికి కృషి చేస్తుంది. ఇది దేశ వ్యూహాత్మక, ఆర్థిక వృద్ధికి దోహదపటమే కాకుండా సురక్షితమైన వృద్ధికి సహకారం అందించనుంది. సీఆర్‌ఈఎన్‌ఎస్, అధికారిక లోగోను బిట్స్ పలానీ క్యాంపస్‌లో మాజీ డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్. జి.సతీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘దేశ సరిహద్దుల నుంచి హెల్త్, సైబర్ స్పేస్ వంటి కీలక అంశాల్లో సీఆర్‌ఈఎన్‌ఎస్ దూరదృష్టిని అభినందించారు. ప్రస్తుతం ప్రపంచంలో భద్రత అంశాలను సవాలు చేసే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సమయంలో కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయాల్పిన అవసరం ఎంతగానో ఉంది. ముఖ్యంగా బిట్స్ పిలానీ హైదరాబాద్‌లో సీఆర్‌ఈఎన్‌ఎస్ ఏర్పాటు కావటం ఎంతో ఉపయోగకరం. హైదరాబాద్‌లోని పలు జాతీయ సంస్థలతో కలిసి పని చేయడానికి దానికి వీలు కలుగుతుంది’’ అని అన్నారు. అనంతరం సీఆర్‌ఈఎన్‌ఎస్ వెబ్‌సైట్‌ను డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీసీ డాక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తి, నేవీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఏవీఎస్ఎం, వీఎస్ఎం సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్టి సారిన్‌లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిట్స్ పలానీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వీ. రాంగోపాల్ రావు మాట్లాడారు. సీఆర్‌ఈఎన్‌ఎస్ మూడు రకాలు లక్ష్యాలను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. మొదటిది.. జాతీయ భద్రతా విభాగంలో నిపుణుల నైపుణ్యం మెరుగుపర్చటం, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో హైబ్రిడ్ కోర్సులను అందింటం. రెండోది.. సరిహద్దులో సేవలు అందించే సైనికులకు పలు అంశాల్లో కీలకమైన పరిష్కారాలను అందించడానికి పరిశోధన చేయటం. మూడో లక్ష్యం.. దేశ అవసరాలకు అవసరమైన రక్షణ, అంతరిక్ష వ్యూహాత్మక రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ నూతన ఆష్కరణలకు కృషి చేయటం’ అని అన్నారు. -
ఐటీ ఉద్యోగుల్లో ఒంటరి తనం.. కారణం ఇదే
ఇటీవల మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా మారాడు. అందుకు కారణం ఒంటరితనాన్ని భరించలేక, నలుగురితో మాట్లాడే అవకాశం కోసం ఇలా ఆటో నడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సదరు టెక్కీ ఆటో నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బెంగళూరు నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండడంపై బిట్స్ ఫిలానీ పూర్వ విద్యార్ధి హర్ష్ బెంగళూరులోని టెక్కీల పరిస్థితుల గురించి పోస్ట్ చేశారు. Most techies in Bangalore are pretty lonely. Away from family, no real friends, stuck in traffic, high rents, children not getting good values, peers into status games, cringe tech meet-ups, shoves body with coffee & alcohol, hair-loss, tummies popping out & pays highest taxes.— harsh (@harshwsingh) July 23, 2024 ఒంటరితనం, పర్సనల్ లైఫ్-ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, శారీరక, మానసిక అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ‘బెంగుళూరులో చాలా మంది టెక్కీలు చాలా ఒంటరిగా ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారికి నిజమైన స్నేహితులు ఉండరు. ట్రాఫిక్ కష్టాలు,భారీగా ఇంటి రెంట్లు,పిల్లలు వారికి గౌరవం ఇవ్వకపోవడం, టెక్ మీట్ అప్లు, కాఫీ - ఆల్కహాల్ అధికంగా సేవించడం, ఎయిర్ లాస్ అవ్వడం, పొట్టలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక మొత్తంలో పన్నులు చెల్లించడం వంటి కారణాలు ముడిపడి ఉన్నాయని, అందుకే బెంగళూరులో పనిచేస్తున్న టెక్కీల్ని ఒంటరితనం ఆవహించేస్తోంది అని ట్వీట్ చేశారు. దీని నుంచి బయటపడాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ద, కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ని 6.94 లక్షల మంది వీక్షించారు. 12వేల మంది లైక్ చేశారు. -
నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్ రియాక్షన్
బిట్స్ పిలానీ డ్రాప్‌అవుట్, 20యేళ్ల యూట్యూబర్ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ‘లీక్డ్’ పేరుతో నిర్వహించిన పోడ్కాస్ట్లో ఇషాన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.విషయం ఏమిటంటే 2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే అంశంపై భారత్‌పే ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్‌కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్1 పోడ్కాస్ట్లో భాగంగా ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్ గ్రోవర్ వంతైంది. ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.Shocking Reaction of Ashneer Grover and Sanjeev Bikchandani After Knowing Ishaan Makes Over ₹35 Lakhs a MonthThis is Excellent, Commendable at His Age pic.twitter.com/BCmO60Vgl9— Ravisutanjani (@Ravisutanjani) July 17, 2024 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు, ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్ మనీ అంటాడేంటి భయ్యా అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. -
టాప్ టెక్ ఇన్స్టిట్యూట్కి ఎంతటి దుస్థితి! ప్లేస్మెంట్ల కోసం దీనంగా..
ఉద్యోగుల కోసం టాప్ కంపెనీలు క్యూకట్టే ప్రతిష్టాత్మక టెక్ ఇన్స్టిట్యూట్ అది. కానీ ఫ్రెష్ గ్యాడ్యుయేట్ల ప్లేస్మెంట్ల కోసం పూర్వ విద్యార్థుల సాయం కోరాల్సివచ్చింది. ఐటీ, సర్వీస్ రంగాల్లో నియామకాల మందగమనం ఇటీవలి బ్యాచ్ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్ల కోసం దేశంలోని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు తమ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లను సంప్రదించాల్సి వస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నోకి ఈ దుస్థితి పట్టగా ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ (BITS) 2023 బ్యాచ్ విద్యార్థుల ప్లేస్మెంట్ కోసం పూర్వ విద్యార్థుల నెట్వర్క్ నుంచి మద్దతును కోరుతోంది. దేశంలోని మొదటి ఐదు బిజినెస్ స్కూల్స్‌లో ఒకటిగా నిలిచిన ఐఐఎం లక్నో ఇటీవలి బ్యాచ్ గ్రాడ్యుయేట్ల విద్యార్థుల కోసం ప్లేస్మెంట్లను పొందేందుకు తమ పూర్వ విద్యార్థులను సాయం కోరింది. ''దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ విధమైన తిరోగమనాన్ని చవిచూడలేదు. జనవరి 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులను తొలగించడంతో సాంకేతిక రంగం తీవ్రంగా ప్రభావితమైంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖలో అలుమ్ని రిలేషన్స్ డీన్ ఆర్య కుమార్ తెలిపారు. బిట్స్ 2022-23 విద్యా సంవత్సరానికి 89.2 శాతం ఆరోగ్యకరమైన ప్లేస్మెంట్ శాతాన్ని సాధించగలిగిందని, అయితే నియామకాల మందగమనం అప్పటి నుండి మరింత దిగజారిపోయందని బిట్స్ ఆల్ముని డీన్ తన లేఖలో తెలిపారు. "ప్లేస్మెంట్ టీమ్‌లు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ, ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడంలో మన పూర్వ విద్యార్థుల మద్దతును కోరుతున్నారు" అని ఆర్య కుమార్ తన లేఖలో పేర్కొన్నారు, దీనిని మొదట ఎక్స్‌లో ఎడ్టెక్ వ్యవస్థాపకుడు రవి హండా షేర్ చేశారు. అయితే ఈ విషయంలో బిట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. First IIM Lucknow, now BITS Pilani asking alumni to help out with placements. This is the first time I am seeing such groveling after 2008. "help them tide through current crisis" "gentle request to please keep this in mind" "Thanking you very much in advance" pic.twitter.com/TI27X7THk6 — Ravi Handa (@ravihanda) February 22, 2024 -
బిట్స్ పిలానీ విల్ప్తో గ్రీన్కో ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనర్జీ స్టోరేజి సంస్థ గ్రీన్కో తాజాగా బిట్స్ పిలానీలో భాగమైన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (విల్ప్) విభాగంతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం బిట్స్ పిలానీ అందించే వివిధ డిగ్రీ/సరి్టఫికేషన్ ప్రోగ్రామ్‌లలో గ్రీన్కో గ్రూప్ సిబ్బంది చేరవచ్చు. ఇంజినీరింగ్, టెక్నికల్, ఫంక్షనల్, మేనేజ్మెంట్ మొదలైనవి వీటిలో ఉంటాయి. ఎంప్లాయీ ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ విధానంలో భాగంగా తమ ఉద్యోగులను గ్రీన్కో స్పాన్సర్ చేస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే బిట్స్ పిలానీతో భాగస్వామ్యం .. తమ సిబ్బంది నైపుణ్యాలు మరింతగా మెరుగుపడేందుకు తోడ్పడగలదని గ్రీన్కో వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి తెలిపారు. గ్రీన్కో సిబ్బందికి ఉపయుక్తమైన విద్యా కార్యక్రమాలను రూపొందించడంపై దృష్టి పెడుతున్నట్లు బిట్స్ పిలానీ ఆఫ్–క్యాంపస్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ జి. సుందర్ తెలిపారు. -
ఏపీ విద్యార్థులకు లక్కీ చాన్స్.. పెద్ద ఉద్యోగం పక్కా
సాక్షి, అమరావతి: ఇటు ఉన్నత చదువు.. అటు ఉద్యోగం!.. ఒకేసారి రెండు లక్ష్యాలు నెరవేరే చాన్స్.. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో ఎంటెక్ అడ్మిషన్.. నెలనెలా స్టైపెండ్.. కనీసం రూ.5 లక్షలతో జాబ్.. ఇదంతా సాధారణ డిగ్రీతోనే సాకారం కానుంది. యువత నైపుణ్యాలను పెంపొందిస్తూ, ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి. విద్యార్థులు చదువులు పూర్తి చేసి బయటకు రాగానే అవకాశాలను అందిపుచ్చుకునేలా పలు ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో ఏటా ప్లేస్మెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, గూగుల్, బ్లూప్రిజమ్, ఏడబ్ల్యూఎస్ తదితర ప్రముఖ సంస్థలు మన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలూ కల్పిస్తున్నాయి. నేటి అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు ఆయా సంస్థలు కోరుకునే నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్ల భాషా ప్రావీణ్యం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రతిష్టాత్మక సంస్థలు మన విద్యార్ధులకు అవకాశాలు కల్పించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ ‘‘విప్రో’’ విద్యార్ధులకు ఉన్నత చదువుతోపాటు ఉద్యోగం కూడా ఇచ్చేలా ‘వర్క్ – ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ని రాష్ట్ర ప్రభుత్వంతో కలసి అమలు చేసేందుకు ముందుకొచ్చింది. బిట్స్ పిలానీలో ఎంటెక్.. ఆపై ఉద్యోగం వర్క్ – ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా అర్హులైన విద్యార్థులకు విప్రో సంస్థ ఫుల్ టైమ్ జాబ్, ఫుల్ స్పాన్సర్‌షిప్‌తో ‘బిట్స్ – పిలానీ’ (బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో ఎంటెక్ కోర్సు చదివే అవకాశం కల్పిస్తోంది. 2021, 2022, 2023 బ్యాచ్‌లకు చెందిన గ్రాడ్యుయేట్ అభ్యర్ధులకు ఈ అవకాశం కల్పించనున్నారు. బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్లను అర్హులుగా పరిగణించనున్నారు. కంప్యూటర్ సైన్సు, ఐటీ, మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఆయా కోర్సులు పూర్తిచేసిన వారు ఇందుకు అర్హులు. తప్పనిసరిగా 60 శాతం మార్కులు లేదా 6 సీజీపీఏ కలిగి ఉండాలి. బ్యాక్‌లాగ్‌తో ఒకసబ్జెక్టు వరకు అవకాశం కల్పిస్తారు. అయితే 6వ సెమిస్టర్ నాటికి అన్ని బ్యాక్లాగ్ సబ్జెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల కాలపరిమితిలో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ అవకాశం కల్పించనున్నారు. నెలవారీ స్టైఫండ్.. రూ.5 లక్షల ప్యాకేజీతో జాబ్ వర్క్ – ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికైన వారికి ఎంటెక్ చేసే సమయంలో నెలవారీ స్టైఫండ్‌ను విప్రో సంస్థ అందించనుంది. స్టైఫండ్ కింద మొదటి ఏడాది నెలకు రూ.15,488 చొప్పున అందిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.17,553 చొప్పున, మూడో ఏడాది రూ.19,618 చొప్పున ఇస్తారు. నాలుగో ఏడాది నెలకు రూ.23 వేలు చొప్పున చెల్లిస్తారు. కోర్సు పూర్తైన వెంటనే సంస్థలోనే ఉద్యోగాన్ని కల్పిస్తారు. ఎంటెక్‌లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా వేతనాన్ని నిర్ణయిస్తారు. వేతనాల ప్యాకేజీ ఏడాదికి రూ.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. శిక్షణ కాలం 60 నెలలు. ఎంటెక్ విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం జాయినింగ్ బోనస్ కింద రూ.76 వేలు చెల్లిస్తారు. అయితే ఎంపికైన అభ్యర్ధులు మధ్యలో నిష్క్రమించినా, అగ్రిమెంట్‌కు భిన్నంగా వ్యవహరించినా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు రేపే తుది గడువు రాష్ట్రంలోని విద్యార్థుల కోసం మూడు నగరాల్లో ఎంపిక ప్రక్రియ చేపడతారు. అసెస్మెంటు, డిస్కషన్ల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. విప్రో ద్వారా 8,000 మందిని ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి వర్సిటీల రిజిస్ట్రార్లు, ప్రిన్సిపాళ్లపై ఇప్పటికే చర్చించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 2021, 2022 బ్యాచ్ గ్రాడ్యుయేట్లకు ఫిబ్రవరి 23న గుంటూరులో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఉత్తరాంధ్ర అభ్యర్థులకు అసెస్మెంట్, బిజినెస్ రౌండ్లను విశాఖపట్నంలో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో నిర్వహిస్తారు. రాయలసీమ విద్యార్ధులకు ఫిబ్రవరి 28న తిరుపతిలో ఎంపిక ప్రక్రియను చేపడతారు. 2023 బ్యాచ్ విద్యార్ధులకు అసెస్మెంట్, బిజినెస్ రౌండ్ల ఎంపిక ప్రక్రియ మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. తేదీలను తరువాత ప్రకటిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు https://bit.ly//apsche-wipro వెబ్సైట్లో ఫిబ్రవరి 18వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలి. నాస్కామ్, మైక్రోసాఫ్ట్‌తో ఇప్పటికే.. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) ద్వారా విద్యార్థులకు శిక్షణ కోర్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం తర్ఫీదు అందిస్తోంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు నాస్కామ్‌లో సభ్యత్వం కలిగిన 3 వేలకు పైగా సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఒప్పందం చేసుకుని అమల్లోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ ద్వారా వివిధ సర్టిఫికేషన్ కోర్సులను విద్యార్ధులకు ఉచితంగా అందిస్తుండడంతో అంతర్జాతీయ స్థాయి ఉద్యోగావకాశాలు మరింత సులభతరమయ్యాయి. మైక్రోసాఫ్ట్ ద్వారా శిక్షణకు ప్రభుత్వం రూ.32 కోట్లకు పైగా వెచ్చించింది. ఇక సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్, బ్లూప్రిజమ్, ఆల్టరీ ఎక్స్, ఫుల్‌స్టాక్ తదితర సంస్థల ద్వారా లక్షలాది మందికి శిక్షణ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ‘ఉన్నత’ దృష్టి ఫలితమే.. పాఠశాల విద్యను బలోపేతం చేస్తూనే ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అత్యుత్తమ ఫలితాలు ఆవిష్కృతమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని నియమించి ఆ నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో పలు సంస్కరణలను ముఖ్యమంత్రి చేపట్టారు. ఉన్నత చదువులు అభ్యసించే వారికి జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు జగనన్న వసతి దీవెన కింద ఏటాదికి రూ.20 వేల వరకు అందిస్తున్నారు. కరిక్యులమ్‌ను నేటి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చి ఆనర్ కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్‌తోపాటు డిగ్రీ విద్యార్ధులకు కూడా ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. ఇంటర్న్‌షిప్‌కోసం రాష్ట్రవ్యాప్తంగా 27,119 పరిశ్రమలు, ఇతర సంస్థలను కాలేజీలకు అనుసంధానించారు. దీనికోసం ప్రత్యేక పోర్టల్ తెచ్చారు. ఇంటర్న్‌షిప్ సమయంలో పనితీరును అనుసరించి ఆయా సంస్థల్లోనే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో విద్యార్ధులకు ప్లేస్మెంట్లు గతంలో కన్నా భారీగా పెరిగాయి. 2018–19లో 37 వేల ప్లేస్మెంట్లు మాత్రమే ఉండగా 2021–22 నాటికి 42 శాతం వృద్ధి సాధించి 85 వేలకు పెరిగాయి. 2022–23లో 1,20,000 ప్లేస్మెంట్లను సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. -
రూ.1,500 కోట్లతో బిట్స్ మేనేజ్మెంట్ స్కూల్
న్యూఢిల్లీ: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ.. బిట్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీఐటీఎస్‌ఓఎం)ను ప్రారంభించనుంది. ఈ ఏడాది జూలైలో 120 మంది విద్యార్థులతో తొలి బ్యాచ్ మొదలుకానుంది. సెంట్రల్ ముంబైలోని పోవై తాత్కాలిక క్యాంపస్‌లో బోధనా తరగతులుంటాయి. రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.60 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది 2024 నాటికి సిద్ధమవుతుందని బిట్స్ పిలానీ చాన్సలర్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. రెండేళ్ల రెసిడెన్షియల్ బిజినెస్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందించనున్నారు. కోర్స్ ఫీజు రూ. 24 లక్షలు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్శిటీ, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్ ప్రొఫెసర్లతో విద్యా బోధన ఉంటుంది. ‘‘ఎం బీఏ కంటెంట్, డెలివరీ ఫార్మాట్స్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ద్వారా వ్యాపార నమూనాలు, విధానాలు ఎలా మారుతున్నాయో, కొనుగోలుదారులు అవసరాలకు తగ్గ డిజైన్స్ ఎలా పరిష్కరించబడుతున్నాయో అలాంటి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని’’ కుమార్ మంగళం పేర్కొన్నారు. -
బిట్స్ పిలానీ డిప్యూటీ రిజిస్ట్రార్ అనుమానాస్పద మృతి
జైపూర్: బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) డిప్యూటీ రిజిస్ట్రార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన ఆర్సీ డాగర్ బిట్స్ క్యాంపస్‌లోని అతని నివాస గృహంలో ఉరివేసుకుని చనిపోయారు. రాజస్థాన్‌లోని జుంజు జిల్లాలో గురువారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. డాగర్ ప్రస్తుతం యాక్టింగ్ రిజిస్ట్రార్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. డాగర్ మరణం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నామనీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. పనిభారం కారణంగా డాగర్ మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతని సోదరి ఆరోపించారని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందన్నారు. -
నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్ పిలానీ
సాక్షి, హైదరాబాద్: భారత ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్‌ను విధించడంతో అనేక మంది దినసరి కూలీలు, అనాధలు, బిక్షాటన చేసుకునే వారు పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వాలు వీరి ఆకలిని తీర్చడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, దాతలు వచ్చి ఆహారం దొరకని వారికి అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్ వారు క్యాంపస్‌కు సమీపంలో ఉన్న వారికి ఆదివారం నిత్యవసర సరుకులు అందించారు. దాదాపు 450 కుటుంబాలకు సాయాన్ని అందించారు. ఈ విషయం పట్ల మండల ఎంఆర్వో శ్రీగోవర్ధన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్‌పిలానీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. సుందర్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎం. శ్రీనివాసరెడ్డి, రజిని వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న రెండురోజుల్లో అంతైపల్లి, ఫరాహ్‌నగర్ ప్రాంతాల్లో ఇలాంటి డ్రైవ్ నిర్వహిస్తామని వారు తెలిపారు. చదవండి: వారందరికి భోజనాలు పంపిణి చేసిన రెడ్‌క్రాస్ -
బిట్స్ పిలానీకి 7.17 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీకి పూర్వ విద్యార్థులు భారీ సాయం అందించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పారిశ్రామికవేత్త ప్రశాంత్ పాలకుర్తి, ఆయన భార్య అనురాధ బిట్స్ పిలానీకి రూ.7.17 కోట్ల(మిలియన్ డాలర్ల) భారీ విరాళాన్ని ప్రకటించారు. రాజస్తాన్ క్యాంపస్‌లో శుక్రవారం ప్రారంభమైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం( 1978–83 బ్యాచ్) సందర్భంగా ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ ప్రస్తుతం అమెరికా కేంద్రంగా రెఫ్లెక్సిస్ అనే కంపెనీని నడుపుతుండగా, అనురాధ జూజూ ప్రొడక్షన్స్ అనే ఎంటర్టైన్మెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై బిట్స్ పిలానీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.సౌవిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘పాలకుర్తి ప్రశాంత్, అనురాధ దంపతులు అందజేసిన భారీ విరాళాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ నేపథ్యంలో మేం ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బిట్స్ పిలానీని ప్రపంచస్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో భాగంగా రూ.100 కోట్లతో పరిశోధన నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నాం. అంతర్జాతీయంగా పరిశోధన అంశాలపై దృష్టి సారించే ఫ్యాకల్టీతో పాటు పోస్ట్ డాక్టోరల్ ఫెలోస్, రీసెర్చ్ స్కాలర్లను ఆకర్షించేలా బిట్స్ పిలానీని తీర్చిదిద్దుతాం. ఈ గొప్ప ప్రయత్నానికి తమవంతు సహకారం అందించాలని సంస్థ పూర్వ విద్యార్థులను కోరుతున్నాం’ అని తెలిపారు. 200 మంది పూర్వ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రశాంత్ పాలకుర్తి మాట్లాడుతూ..‘ 40 సంవత్సరాల క్రితం మా ప్రయాణం ఇక్కడే (బిట్స్ పిలానీ) మొదలైంది. జీవితంలో ఎదిగేందుకు మాకు ఎంతో సాయం చేసిన ఈ సంస్థకు ఎంతోకొంత తిరిగివ్వాలని భావించాం’ అని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ‘డెజర్ట్ స్ట్రోమ్’ పేరుతో అనురాధ సంగీత విభావరి నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య... హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ప్రశాంత్ పాలకుర్తి తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. అనంతరం బిట్స్ పిలానీ నుంచి గణితం, మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టాలు అందుకున్నారు. తన జూనియర్ అయిన అనురాధను పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత అమెరికాకు వెళ్లి 2001లో రిఫ్లెక్సిస్ సిస్టమ్స్ అనే సంస్థను స్థాపించారు. స్టోర్ల నిర్వహణ, వినియోగదారుల్ని ఆకర్షించడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి రిటైల్ మేనేజ్మెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. నేపథ్య గాయని అయిన అనురాధ జూజూ ప్రొడక్షన్స్ అనే కంపెనీని ఏర్పాటుచేసి సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు. మసాచుసెట్స్ రాష్ట్రం వెస్టన్‌లో ఉంటున్న వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
జియోకు స్టేటస్, కేంద్రం నవ్వుల పాలు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి నవ్వుల పాలైంది. జియో ఇన్స్టిట్యూట్ కనీసం ఏర్పాటు చేయనప్పటికీ ఈ విద్యాసంస్థకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను అందించింది. కనీసం ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఒక్క భవనం లేనప్పటికీ, ఒక్క విద్యార్థి కూడా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ పొందనప్పటికీ, ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను ఎలా కేటాయిస్తారంటూ విమర్శల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ఆరు ఇన్స్టిట్యూట్లకు ‘ప్రఖ్యాత సంస్థ’ స్టేటస్‌ను కేటాయించింది. వాటిలో రెండు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, బిట్స్ పిలానీ, మనిపాల్ ఉన్నత విద్యా అకాడమీతో పాటు జియో ఇన్స్టిట్యూట్ కూడా ఆ స్టేటస్‌ను దక్కించుకుంది. ‘వరల్డ్ క్లాస్’ ఇన్స్టిట్యూషన్లుగా మార్చడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. కానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఈ స్టేటస్ కేటగిరీలో చేర్చడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఇప్పటి వరకు ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేకుండా ఈ స్టేటస్‌ను అందించడం విడ్డూరంగా ఉందని హెచ్ఆర్డీపై మండిపడుతున్నారు. జియో ఇన్స్టిట్యూట్ దీనిలో చేర్చడం మరో బిగ్ స్కాం అని ట్విటర్ యూజర్లంటున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, కనీసం వెబ్సైట్ కూడా లేదని.. అలా ఎలా హెచ్ఆర్డీ ‘ప్రఖ్యాత సంస్థ’ ట్యాగ్‌ను జియో ఇన్స్టిట్యూట్కు ఇస్తుందని మండిపడుతున్నారు. కేవలం ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్టు మాత్రమే నీతా అంబానీ 2018 మార్చి 11న ప్రకటించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభం కావడానికి ఇంకా మూడేళ్లు పడుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు ఎంహెచ్ఆర్డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2018 ర్యాంకింగ్స్ జాబితాలోనే లిస్ట్ కాలేదని, ఎందుకు టాప్ ర్యాంక్ కలిగిన పబ్లిక్ ఇన్స్టిట్యూట్లకు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు పక్కన బెట్టి మరీ జియోకు ఈ స్టేటస్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌ల లాంటి పలు చరిత్రాత్మక ఇన్స్టిట్యూషన్ల కంటే జియో ఇన్స్టిట్యూటే మెరుగైనదని ఎలా నిర్ణయించారని మరో ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సిగ్గుచేటన్నారు. అయితే తమ ఈ నిర్ణయాన్ని హెచ్ఆర్డీ కార్యదర్శి(ఉన్నత విద్య) ఆర్ సుబ్రమణ్యం సమర్థించుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఈ ఇన్స్టిట్యూట్ను ఎంపిక చేశామని చెప్పారు. ఎలా టాప్-క్లాస్ ఇన్స్టిట్యూట్లగా మార్చుకుంటారో తెలుపుతూ వారి ప్లాన్ల వివరాలు అందించాలని కోరామని కూడా చెప్పారు. యూజీసీ(వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీస్) రెగ్యులేషన్స్ 2016 కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటుచేసే అధికార నిపుణుల కమిటీ ఈ ఇన్స్టిట్యూట్లను ఎంపిక చేసింది. -
ఫీజులుంపై బిట్స్ పిలానీ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : బిట్స్ పిలానీ విద్యార్థులు ఫీజుల పెంపునకు నిరసనగా హైదరాబాద్, గోవా, పిలానీ క్యాంపస్‌ల్లో మూకుమ్మడి నిరసనలకు దిగారు. 2018-19 సంవత్సరానికి పెంచిన ఫీజులను తక్షణమే ఉపసంహరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 2011 నుంచి బిట్స్ పిలానీ మూడు క్యాంపస్‌ల్లో ఫీజులను రెట్టింపు చేశారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో ఫీజును ఏకంగా 56 శాతం పెంచిన విద్యాసంస్థ అధికారులు ఆ తర్వాత మరింతగా పెంచారని చెప్పారు. 2011లో రూ 62.400గా ఉన్న ఫీజులు 2017 నాటికి ఏకంగా రూ 1,30,000కు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత, రాబోయే బ్యాచ్‌లకు బిట్స్‌లో విద్య ఖరీదైన వ్యవహారంగా మారిందని విద్యార్ధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత బిట్స్ పిలానీలో 3000 మంది విద్యార్ధులు ఆదివారం శాంతియుత నిరసనలకు దిగగా, వెనువెంటనే గోవా, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్ధులు సైతం వారికి జతకలిశారు. మరోవైపు ‘రోల్‌బ్యాక్‌బిట్స్‌పిలానీఫీహైక్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలోనూ విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేశారు. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం ట్విటర్లో వైరల్ అవుతోంది. ఇక ఫీజులు భరించలేకపోతే డ్రాప్ అవుట్ అవండి అంటూ బిట్స్ పిలానీ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ సర్కార్ ప్రకటన చేశారనే వార్తలపై పలువురు విద్యార్ధులు భగ్గుమంటున్నారు. భారీగా ఫీజులు పెంచడంపై మండిపడుతున్న విద్యార్ధులు ఆన్లైన్ పిటిషన్‌ను కూడా నెట్లో పొందుపరిచారు. బిట్స్ పిలానీ అధికారులు మాత్రం ఇంతజరుగుతున్నా ఇప్పటివరకూ నోరుమెదపలేదు. -
బిట్స్ పిలానీ వీసీగా వీఎస్ రావు
బాధ్యతల స్వీకరణ పిలానీ: బిట్స్ పిలానీ తాత్కాలిక వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ వి. సాంబశివ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బిట్స్ పిలానీలోనే ఎమ్మెస్సీ, పీహెచ్డీ పూర్తి చేసిన ప్రొఫెసర్ రావు జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బీల్ఫెల్డ్ నుంచి ఎడ్యుకేషనల్ ఎకనమిక్స్ అండ్ రీసెర్చ్‌లో పట్టా పొందారు. ఇప్పటిదాకా నాలుగు ద శాబ్దాల కాలంలో బిట్స్ పిలానీలో డీన్ ప్రాక్టీస్ స్కూల్‌గా, డిప్యూటీ డెరైక్టర్‌గా, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. శిక్షణ అవసరాల అంచనా, పాఠ్యాంశాల అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రాజెక్ట్ నిర్వహణ, కర్బన రసాయనశాస్త్రం, డ్రగ్ డిజైన్ సబ్జెక్టుల్లో కూడా ప్రొఫెసర్ సాంబశివ రావు నిష్ణాతులు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), సీఐఐ, ఫిక్కీ స్టేట్ కౌన్సిల్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వంటి విద్యా, పరిశోధక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2013 సంవత్సరంలో ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ సదస్సులో ఉత్తమ విద్యావేత్త అవార్డును అందుకున్నారు. వి. సాంబశివ రావు నేతృత్వంలోని పీహెచ్డీ విద్యార్థులు రాసిన ఎన్నో పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. బోధనతో ‘అభ్యసనాన్ని అద్భుతమైన అనుభవం’గా మార్చినందుకు గాను రావు 2014 సంవత్సరంలో బిట్స్ పూర్వ విద్యార్థుల ప్రపంచ సమావేశంలో ఘనంగా సత్కారం అందుకున్నారు. -
బిట్స్ పిలానీలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
శామీర్‌పేట్(రంగారెడ్డి జిల్లా) : ఆటలు.. పాటలు.. వివిధ అంశాలపై ప్రతిభా పోటీలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. విద్యార్థుల కేరింతలతో శామీర్‌పేట్‌లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ) హైదరాబాద్ క్యాంపస్‌లో కోలాహలం నెలకొంది. పెరల్-15 నాలుగు రోజుల వార్షిక జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యార్థులు సందడి చేశారు. కోక్ స్టూడియో వారిచే అద్వైత క్లాసికల్ ర్యాక్బ్యాండ్, బాల్ రూం డాన్స్(పెరల్ బాల్) ఆడిటోరియంలో మిస్ దీవా ఫ్యాషన్ షో, ఫ్రాగ్లోర్ కంప్యూటర్ గేమింగ్ కాంపిటీషన్, క్లాసికల్ డాన్స్ వర్క్‌షాప్, నేషనల్ జియోగ్రఫీ చానల్ ఫొటోగ్రాఫర్ చంద్రశేఖర్ సింగ్ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ వర్క్‌షాప్, మోనో యాక్టింగ్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభ... బిట్స్ విద్యార్థి రవితేజ తన బృందంతో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ పెరల్-15 ట్రాక్ తోపాటు నిశాంత్, సంతోష్, శశాంక్, ప్రవీణ్, నిఖిల్‌సాయి, జీవన్‌రెడ్డి, చందు, హర్ష, చంద్రజ, నిషాంత్, సమర్, సాయిశ్రీ టీం నాలుగు వారాలు రేయింబవళ్లు కష్టపడి ఏర్పాటు చేసిన ట్రోజన్‌హార్స్, విద్యార్థులు వేసిన వివిధ రకాల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో బిట్స్ డైరెక్టర్ వీఎస్‌రావు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు అఖిల్పొట్లూరి, కార్యదర్శి చరితారెడ్డి, నిర్వాహకులు సౌమ్య, విష్ణుచరణ్, ఇన్చార్జి శ్రీవర్దన్‌రెడ్డి, ప్రదీప్, అర్జున్దేశ్పాండే, భానుతేజ గన్నేని, నాగార్జున, మహేష్, అమీర్చాంద్, ఫణీంద్రనాయుడు, అజయ్‌కుమార్‌రెడ్డి, సుమిత్ చావ్లా, దివేశ్జయ్, అన్వేషిత, దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గర్వంగా ఉంది.. బిట్స్ విద్యార్థులుగా ఉన్నందుకు గర్వంగా ఉంది. వార్షిక కార్యక్రమాల్లో వర్క్‌షాప్‌లో భాగంగా పెరల్ ట్రాక్‌ను తయారు చేయడానికి వారం రోజలు శ్రమించాల్సి వచ్చింది. పెరల్ ట్రాక్‌పై కారును రిమోట్ ద్వారా నడిపించడం ఆనందంగా ఉంది. రవితేజ, బీటెక్ ఫస్టియర్ షేక్స్పియర్ స్ఫూర్తితో.. గతంలో ఎన్నో కాంపిటీషన్స్‌లో పాల్గొని బహుమతులు సాధించాను. బిట్స్ వార్షికోత్సవంలో పెయింటింగ్ వేయడం ఆనందాన్నిచ్చింది. జీవితం అనేది ఒక నాటకం మాత్రమే అన్న షేక్స్పియర్ మాటలను ఆదర్శంగా తీసుకుని మట్టితో మొదలైన మనిషి జీవితం చివరికి మట్టిలోనే కలుస్తుంది అనే థీమ్‌తో ‘సెవంత్ సెన్స్’ పెయింటింగ్ వేశాను. సాయిశ్రీ, బీటెక్ సెకండియర్ పెయింటింగ్ అంటే ఇష్టం.. పేపర్‌పై అక్రాలిక్ కలర్స్‌తో పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. బిట్స్‌లో సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా పెయింటింగ్ వేసేందుకు ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. బిట్స్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం బాగుంది. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగిన వారికి విజయం సాధ్యమవుతుంది. చంద్రజ, బీటెక్ సెకండియర్ మున్ముందు మరిన్ని కార్యక్రమాలు.. గ్రీఫెన్ (గ్రీకు కాలం నాటి దేవుళ్ల పెయింటింగ్ ) చిత్రాన్ని వేయడానికి వారం రోజులు పట్టింది. బిట్స్ విద్యార్థులంతా కలిసి దేశంలోనే అతిపెద్ద వార్షికోత్సవం నిర్వహించడం గర్వంగా ఉంది. వేల సంఖ్యలో వచ్చే విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. మున్ముందు మరిన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తాం. సంజన, బీటెక్ సెకండియర్ సంతోషంగా ఉంది.. ట్రోజన్‌హార్స్ (గ్రీకులు ఓటమి అంచున ఉన్నప్పుడు తమను ఓడించే దేశానికి అందించే కానుక) నమూనాను తయారు చేయడానికి మూడువారాలు పట్టింది. పదిమందితో కష్టపడి రూపకల్పన చేశాం. ఈ సాంస్కృతిక వార్షికోత్సవంలో మా నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. నిశాంత్, బీటెక్ సెకండియర్ -
దీపం వెలిగించాడు!
సొంత విజయంతోనే సంతృప్తి పడకుండా... పేద విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ‘దీపం’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించి సేవారంగంలోకి అడుగుపెట్టాడు కార్తికేయన్. కార్తికేయన్ విజయకుమార్ చెన్నైలో స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో సీనియర్లు బిట్స్ పిలాని గురించి గొప్పగా మాట్లాడుతుండేవారు. అక్కడ చదవాలనే కోరిక అలా మొదటిసారిగా కలిగింది. కేవలం కల కనడానికే పరిమితం కాకుండా దాన్ని నిజం చేసుకున్నాడు కార్తికేయన్. అక్కడ తనకొక విశాల ప్రపంచం పరిచయం అయింది. సీనియర్లు ఎందరో తనకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పేవాళ్లు. ‘‘భవిష్యత్‌లో నేను విజయవంతమైన వ్యాపారిని కావాలి’’ అనుకోవడానికి ఈ మాటలు తోడ్పడ్డాయి. చదువు పూర్తయిన తరువాత తన మిత్రుడితో కలిసి అరవైవేల రూపాయలతో ‘ఎక్సెడోస్’ పేరుతో బిజినెస్ కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు. సంవత్సర కాలంలోనే లాభాలు చేతికందాయి. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఆఫీసు ఉండేది కాదు. రెండు ల్యాప్‌టాప్‌లతో తమ గది నుంచే వ్యాపారాన్ని కొనసాగించేవారు. సంవత్సరం తరువాత మాత్రం వివిధ ప్రాజెక్ట్‌లలో తమ దగ్గర వందమంది ఉద్యోగులు పనిచేశారు. తన విజయంతోనే సంతృప్తిని పడకుండా... పేద విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ‘దీపం’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించి సేవారంగంలోకి అడుగుపెట్టాడు కార్తికేయన్. ‘‘కొందరికి ప్రతిభ ఉన్నా సౌకర్యాలు ఉండవు. వాటిని అందేలా చేస్తే గొప్ప విజయాలు సాధించగలరు’’ అంటాడు కార్తికేయన్. పేద విద్యార్థులకు కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్లలో తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. తన తీరిక సమాయాన్ని వినోదానికో, విహారానికో వెచ్చించకుండా పేద విద్యార్థులతో గడపడానికి వెచ్చించేవాడు. ‘దీపం’కు సంబంధించి మరెన్నో కార్యక్రమాల రూపకల్పనలో తలమునకలై ఉన్నాడు ముప్పైరెండు సంవత్సరాల కార్తికేయన్ విజయకుమార్. -
బిట్స్ పిలానీలో స్నాతకోత్సవం సందడి
-
బిట్స్ ఫిలానీ ఆధ్వర్యంలో10కే రన్
-
నెక్లెస్‌రోడ్‌లో 10కే రన్
-
రూబిక్స్ క్యూబుల రజనీకాంత్
రూబిక్ క్యూబ్ కీ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ ఏమిటి సంబంధం? రూబిక్ క్యూబ్ లాగానే రజనీ స్టయిలిష్ గా ఉంటాడు. కానీ సాల్వ్ చేయడమే కఠినం. బహుశః అందుకేనేమో హైదరాబాద్ లోని బిట్స్ పిలానీ విద్యార్థులు రజనీకాంత్ బొమ్మను రూబిక్ క్యూబ్ లతో తయారు చేసి రికార్డు సృష్టించారు. తమ కాలేజీ యువజనోత్సవం పెర్ల్ - 14 లో అంతర్భాగంగా షామీర్ పేట్ లోని బిట్స్ పిలానీ విద్యార్థులు 14160 రూబిక్ క్యూబ్ లతో రజనీకాంత్ బొమ్మను తయారు చేశారు. తమాషా ఏమిటంటే రజనీ లేటెస్ట్ సినిమా కోచ్చడయాన్ ఒక వైపు రిలీజ్ కి ముందే సంచలనం సృష్టిస్తున్నా, బిట్స్ పిలానీ టెకీలకు మాత్రం రోబో చిత్రంలోని వశీ మాత్రమే నచ్చాడు. అందుకే ప్రొఫెసర్ వశీ బొమ్మను తయారు చేశారు. మొత్తానికి రజనీ మానియా బిట్స్ పిలానీ విద్యార్థుల దాకా పాకింది. నీల్ నితిన్ ముకేశ్, అలోక్ నాథ్ జోక్ లకన్నా చాలా ముందే రజనీ జోక్స్ యూత్ మధ్య హల్చల్ చేస్తూ ఉన్నాయి. -
పర్యావరణ మిత్రుడు
‘‘ఆఖరి చెట్టును కూడా కొట్టేసిన తర్వాత, తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేశాక... చిట్ట చివరి చేపను కూడా పట్టేశాక... అప్పుడు గుర్తిస్తావు నువ్వు... డబ్బును తినలేమని!’’ ఆదిమ రెడ్ ఇండియన్ల సామెత ఇది. ఈ సామెత ఆ యువకుడి ఆలోచనలను ప్రభావితం చేసింది. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోయాక, ప్రపంచమే కలుషితమైపోయాక ఎంత సంపాదించినా సుఖంగా జీవించలేమన్న విషయాన్ని బోధపడేలా చేసింది. ‘నెక్ట్స్ జెన్ సొల్యూషన్’ స్థాపనవైపు అతడిని నడిపించింది. ముంబైకి చెందిన అభిషేక్ హంబద్ (26) బిట్స్ పిలానీలో చదివాడు. అక్కడ హాస్టల్ రూముల్లో... తన స్నేహితులతో జరిపిన చర్చల్లో... పలుమార్లు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రస్తావన వచ్చింది. పర్యావరణానికీ, మనిషి జీవనానికీ ఉన్న ముడిని అప్పుడే అర్థం చేసుకున్నాడు అభిషేక్. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే, భవిష్యత్తులో మనల్ని మనం కాపాడుకోలేమన్న ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. అలాగని కేవలం పర్యావరణ పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేయాలనీ అనుకోలేదు. ముందు ఉపాధిని కల్పించుకోవాలి. ఆ ఉపాధి ద్వారానే తాను అనుకున్నది సాధించాలి. అలా జీవనభృతికి, జీవిత లక్ష్యానికీ ముడిపెట్టాడు. నెక్ట్స్‌జెన్ సొల్యూషన్ సంస్థను స్థాపించాడు. ఎనర్జీ మేనేజ్మెంట్లో అనేక కార్పొరేట్ కంపెనీలకు మార్గదర్శకుడయ్యాడు. కోట్ల టర్నోవర్‌తో యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సమాజహితం కోరుతూనే... నెక్ట్స్‌జెన్ సంస్థ... పెద్ద పెద్ద ఇండస్ట్రీలతోనూ, కంపెనీలతోనూ కలిసి పని చేస్తుంది. ఇంధన వృథాను అరికడుతూ, వాటి నుంచి వెలువడే భయంకరమైన ఉద్గారాలను నియంత్రించడమే దాని పని. ప్రత్యేకించి తమ పని విధానం పర్యావరణానికి ప్రమాదకరం కాకూడదు అని భావించే కంపెనీలతో అభిషేక్ బృందం పనిచేస్తున్నారు. ఇంధన నియంత్రణ, పునరుద్ధరింపదగ్గ వనరులను ఉపయోగించడం వంటి అంశాల గురించి అధ్యయనం చేసి, ఆయా కంపెనీలకు సలహాదారులుగా ఉంటున్నారు. ఫలితంగా పరిశ్రమలకు నిర్వహణ ఖర్చు తగ్గుతోంది. వ్యర్థాలు తగ్గుతున్నాయి. తద్వారా ఉద్గారాల నియంత్రణతో పర్యావరణానికి ఎంతో కొంత మేలు జరుగుతోంది. ‘‘నేను చేసే వ్యాపారం ఉపాధి మార్గంగానే కాకుండా పదిమందికి ఉపయోగపడేలా, సమాజాన్ని ప్రభావితం చేసేదిగా ఉండాలని కలలు కనేవాడిని, అందుకు తగ్గట్టుగా పిలానీలోని బిట్స్ క్యాంపస్ లో చదివిన ఇంజనీరింగ్ నా ఆలోచన తీరుకు ఒక ఆకారాన్ని ఇచ్చింది’’ అంటాడు అభిషేక్. పర్యావరణ కాలుష్యం గురించి అనునిత్యం అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్న ఆందోళనలను గమనించి, ఇంధనవృథా వల్ల తలెత్తబోయే పరిస్థితుల గురించి తెలుసుకొన్నప్పుడు అతడి మనసులో ఒక విధమైన ఆందోళన నిండిపోయేది. అది తన ఒక్కడి సమస్య కాకపోయినా, భవిష్యత్తు తరాల గురించి తలుచుకొంటే భయమేసేది. అందుకే తానేం చేయగలడా అని ఆలోచించేవాడు. ఆ మేధోమథనం గురించి చెబుతూ... ‘‘నేను ఒక సాధారణ బీటెక్ గ్రాడ్యుయేట్గానే కనిపించేవాడిని. చదువు పూర్తి చేయడం, మంచి ఉద్యోగం తెచ్చుకోవడం, ఒక కారు కొని దానికి ‘సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా’ అంటూ ఒక స్టిక్కర్ అతికించుకోవడం... అదే నేను పర్యావరణ పరిరక్షణకై చేసే పెద్ద ఉపకారంగా భావించేవాడిని. ఈ సమయంలో స్నేహితులందరిలోనూ మొదలైన చైతన్యం ‘నెక్ట్స్‌జెన్’కు ఊపిరి పోసింది. 2009లో ఈ కంపెనీ ప్రారంభం అయ్యింది’’ అంటూ తన సుదీర్ఘప్రయాణం గురించి వివరిస్తాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 360 కంపెనీలకు ఇంధన వనరుల నిర్వహణ, నియంత్రణ వంటి విషయాల్లో గైడ్‌గా మారింది నెక్ట్స్‌జెన్. కంపెనీలతో మమేకం కావడంలోనే దాని విజయం దాగివుంది. ‘ఫార్చ్యూన్ 500’ కంపెనీస్ జాబితాలోని పది కంపెనీలతో నెక్ట్స్‌జెన్ కలిసి పనిచేస్తోంది. దాని వ్యవస్థాపకుడిగా అభిషేక్‌కు ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అనేక అవార్డులను తెచ్చిపెట్టింది! నేడు ప్రపంచ వ్యాప్తంగా 360 కంపెనీలకు ఇంధన వనరుల నిర్వహణ, నియంత్రణ వంటి విషయాల్లో గైడ్‌గా మారింది నెక్స్ట్‌జెన్. కంపెనీలతో మమేకం కావడంలోనే దాని విజయం దాగివుంది. ‘ఫార్చ్యూన్ 500’ కంపెనీస్ జాబితాలోని పది కంపెనీలతో నెక్ట్స్‌జెన్ కలిసి పనిచేస్తోంది. -
బిట్స్ పిలానీలో ‘ఆన్లైన్ పరీక్షలు’
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని బిట్స్ పిలానీ (హైదరాబాద్ క్యాంపస్)లో గురువారం నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. బిట్స్ పిలానీ ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజస్థాన్ పిలానీ విద్యార్థులు ఆరోహన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని 11 నగరాల్లో 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో బాగంగా హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌లో గురువారం ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 45 ప్రశ్నలకుగాను 135 మార్కుల ఆన్లైన్ ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. గణితం, భౌతిక, రసాయ శాస్త్రాలతో పాటు ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలను పొందుపర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తులో బిట్స్, ఐఐటీ, ఈఈఈ పరీక్షల్లో పాల్గొనేందుకు ఆన్లైన్ పరీక్షలు ఎంతగానో దోహదపడుతాయని హైదరాబాద్ బిట్స్ క్యాంపస్ సమన్వయకర్త శ్రేష్ఠ చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులను ఎంచుకొని రాజస్థాన్ పిలానీలో జరిగే టెక్నికల్ ఫెస్టుల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులతో పాటు వారి తల్లి లేక తండ్రిని వారి వెంట అనుమంతిస్తామని, వారికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో వలంటీర్స్ తేజస్వి, జశ్వంత్, శశాంత్, లాసియా, కళ్యాణ్, కపిల్, ప్రణీత్ పాల్గొన్నారు. -
గుర్తుకొస్తున్నాయి..!
ఉత్సాహంగా బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: అరే భాయ్.. హౌ ఆర్ యూ.. వేర్ ఆర్ యూ నౌ.. అంటూ ఆత్మీయ పలకరింపులు! మనోడేం మారలేదు.. అంటూ ఆత్మీయ ఆలింగనాలు!! బిట్స్ పిలానీకి చెందిన వివిధ క్యాంపస్‌లలో చదువుకుని ఉన్నత స్థానాలను అలంకరించిన ప్రముఖలంతా కాసేపు స్టూడెంట్స్‌లా మారిపోయారు. నాటి కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. దీనికి బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ వేదికైంది. గతంలో బిట్స్ క్యాంపస్ (పిలానీ, గోవా, దుబాయ్, హైదరాబాద్)లలో చదువుకున్న వారంతా శుక్రవారం బిట్స్ పిలానీ, బిట్స్ అలేమ్నీ అసోసియేషన్ (బిట్సా) ఆధ్వర్యంలో జరిగిన బిట్స్ పిలానీ గ్లోబల్ మీట్‌కు (జీబీఎం-2014) హాజరయ్యారు. వీరిలో కొందరు కంపెనీలకు సీఈవోలు అయితే.. మరికొందరు విదేశీ విశ్వ విద్యాయాల్లో ప్రొఫెసర్లు.. ఇంకొందరు ప్రముఖ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రావు, హిటాచీ కంపెనీ ఆసియా ఛైర్మన్ సలహాదారు రాజురెడ్డి, ఎస్‌క్యూఎల్ స్టార్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ ఫార్మర్ చైర్మన్ అశోక్‌కుమార్ అగర్వాల్, జనరల్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసిన కృష్ణ వావిలాల, విశాఖపట్నం షిప్‌యార్డ్‌లో క్వాలిటీ డివిజన్ మేనేజర్‌గా చేసిన ఎస్వీ రమణయ్య ఇలా అనేక జీబీఎంకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బిట్సా చైర్మన్ రాజురెడ్డి తెలిపారు.