ఇటీవల మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా మారాడు. అందుకు కారణం ఒంటరితనాన్ని భరించలేక, నలుగురితో మాట్లాడే అవకాశం కోసం ఇలా ఆటో నడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సదరు టెక్కీ ఆటో నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే బెంగళూరు నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండడంపై బిట్స్ ఫిలానీ పూర్వ విద్యార్ధి హర్ష్ బెంగళూరులోని టెక్కీల పరిస్థితుల గురించి పోస్ట్ చేశారు.
Most techies in Bangalore are pretty lonely. Away from family, no real friends, stuck in traffic, high rents, children not getting good values, peers into status games, cringe tech meet-ups, shoves body with coffee & alcohol, hair-loss, tummies popping out & pays highest taxes.
— harsh (@harshwsingh) July 23, 2024
ఒంటరితనం, పర్సనల్ లైఫ్-ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, శారీరక, మానసిక అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
‘బెంగుళూరులో చాలా మంది టెక్కీలు చాలా ఒంటరిగా ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారికి నిజమైన స్నేహితులు ఉండరు. ట్రాఫిక్ కష్టాలు,భారీగా ఇంటి రెంట్లు,పిల్లలు వారికి గౌరవం ఇవ్వకపోవడం, టెక్ మీట్ అప్‌లు, కాఫీ - ఆల్కహాల్ అధికంగా సేవించడం, ఎయిర్ లాస్ అవ్వడం, పొట్టలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక మొత్తంలో పన్నులు చెల్లించడం వంటి కారణాలు ముడిపడి ఉన్నాయని, అందుకే బెంగళూరులో పనిచేస్తున్న టెక్కీల్ని ఒంటరితనం ఆవహించేస్తోంది అని ట్వీట్ చేశారు.
దీని నుంచి బయటపడాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ద, కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ని 6.94 లక్షల మంది వీక్షించారు. 12వేల మంది లైక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment