
సాక్షి, బెంగళూరు: ఇద్దరూ పెద్ద కంపెనీల్లో టెక్కీలు, కావలసినంత జీతం వస్తుంది, విలాసవంతమైన జీవితం ముందుంది. కానీ భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్‌లో ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
11 నెలల కిందటే పెళ్లి
భర్త అభిషేక్ వివాహేతర సంబంధం తట్టుకోలేక భార్య శ్వేత (27) ప్రాణాలు తీసుకుంది. 11 నెలల క్రితమే వీరిద్దరికి వివాహం జరిగింది. శ్వేత ఐబీఎం కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. అభిషేక్ టీసీఎస్ కంపెనీలో ఐటీ ఇంజనీరు. పెళ్లికి ముందు అభిషేక్‌కు ఓ యువతితో సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా అనైతిక బంధాన్ని కొనసాగించాడు. ఈ విషయంపై పలు సందర్భాల్లో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. రాజీ పంచాయతీల తరువాత దంపతులు కలిసే ఉంటున్నారు.
అయితే అభిషేక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మోసపోయానని విరక్తి చెందిన శ్వేత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తిచేశారు. తరువాత అల్లుని అక్రమ సంబంధం గురించి తెలిసిన అత్తమామలు అతనితో పాటు కుటుంబ సభ్యుల మీద బుధవారం రామ్మూర్తి నగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment