
కామారెడ్డి క్రైం: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఓ యువకుడు.. అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి మున్సిపా లిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవుల సంజయ్ (28)సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజులుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. ఆరు నెలల కిందట అప్పుల విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది.
దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపో యింది. అప్పులు సుమారు రూ. కోటి వరకు చేరుకోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక, జీవితంపై విరక్తి చెంది సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దేవుని పల్లి ఎస్సై రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment