online betting
-
పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది. 2024లో జీతం , డివిడెండ్లలో 150 మిలియన్ పౌండ్లను ( రూ.1,500 కోట్లకు పైగా) వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట. అదీ 45 శాతం వేతన కోత తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 2000లో ఒక మామూలు కారు పార్కింగ్ స్థలంలో "బెట్365" (Bet365)అనే ఆన్లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి పైమాటే.ది గార్డియన్ నివేదిక ప్రకారం "బెట్365" కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది. గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు. మార్చి 2024తో ముగిసిన ఏడాది లో సంస్థ పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితోపోలిస్తే 60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన పెరుగుదల.ఆన్లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది. కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్ 1967, సెప్టెంబరు 26న ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లో జన్మించింది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.విమర్శలు, వివాదాలు అయితే ఇంత ప్రాపులర్ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది. పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలతో ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. -
‘సజ్జనార్ సార్.. ఇలాంటి వారిని ఏం చేయలేమా?’
తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగానే కాదు.. పోలీస్ అధికారికానూ సోషల్ మీడియాలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తుంటారు. ఆలోచింపజేసే కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ.. అదే సమయంలో కొన్ని విషయాలపై జనాల్ని అప్రమత్తం చేస్తుంటారు కూడా. తాజాగా.. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు ఆయన కామెంట్ సెక్షన్లోనే చర్చ జరుపుతున్నారు.సజ్జనార్ ఓ వీడియోను పోస్ట్ చేసి ఓ సందేశం ఉంచారు. అందులో.. ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చెబుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అని మెసేజ్ ఇచ్చారు. అయితే.. ఆ వీడియోపై పలువురు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్ చేయలేమా? అని..చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో...!! అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి… pic.twitter.com/ziiiYKZqkc— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 19, 2024ఈ వీడియోలో కుర్రాడు మాత్రమే కాదని.. ఇలాంటి వాళ్లు బోలెడు మంది ఉన్నారని.. అలాంటి వారిని అరెస్ట్ చేయలేమా? అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అలాగే.. ఇలాంటి వారిని స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఆపేయాలని, గట్టి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి.. ముందు ఆ వీడియోలోని వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ట్యాగ్ చేశాడు. అయితే ఆ కామెంట్లకు సజ్జనార్ నుంచి ఏదైనా బదులు వస్తే బాగుండు అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. తెలంగాణ, ఆ మాటకొస్తే.. దేశంలో ఆన్లైన్ జూదాలకు బలైపోతున్నవాళ్లు ఎందరో. అలాంటి ముఠాలను చట్టాలు సైతం కట్టడి చేయలేకపోతున్నాయి. మరోవైపు వాటిని ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకునేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట సోషల్ మీడియా ఫిగర్లు, యూట్యూబర్లు, కొందరు సెలబ్రిటీలు కూడా వీటిని బహిరంగంగానే ప్రమోట్ చేస్తున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయాలని, వాటని ప్రమోట్ చేసేవాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బలంగా కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: పస్రా పట్టింపు లేదా? నగరంలో కొత్త సంస్కృతి! -
విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్ భూతం
-
Tamannaah Bhatia: తమన్నాను ప్రశ్నించిన ఈడీ
గువాహటి: బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్పీజెడ్ టోకెన్ యాప్‌లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాప్ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్‌పై కోహిమా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, బిట్‌కాయిన్ మైనింగ్ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీలు తీసుకున్నారని తేలింది. -
ఆన్లైన్ బెట్టింగ్‌లకు కుటుంబం బలి
సాక్షి,నిజామాబాద్ జిల్లా:జిల్లాలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో శనివారం(అక్టోబర్5) విషాదఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోని అప్పుల పాలు కావడంతో తల్లి తండ్రితో పాటు హరీష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్లైన్లో రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం.ఈ అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు పొలం కూడా అమ్మారని, అయినా అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య -
ఆన్లైన్ బెట్టింగ్ కోసం రూ.2 కోట్లు అప్పు చేసి..
నల్లగొండ క్రైం, పెన్‌పహాడ్: ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. బెట్టింగ్ మాయలో పడి రూ.2 కోట్లు అప్పు చేసి.. తీర్చే మార్గం లేక సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి. నల్లగొండ నెహ్రూగంజ్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తడకమళ్ల సోమయ్య కుమారుడు సాయికుమార్ (28) అప్పు తెచ్చి ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి రూ.2 కోట్లు నష్టపోయాడు. అప్పు లు ఇచ్చిన వారు.. తిరిగి చెల్లించాలని అడగడంతో వారికి సమాధానం చెప్పలేక సాయికుమార్ మనస్తాపం చెంది ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలో దూకాడు. అతని సోదరుడు సతీశ్ అదేరోజు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సాయికుమార్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కాగా సోమవారం సాయికుమార్ మృతదేహం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శివారులో సాగర్ ఎడమ కాల్వలో లభించినట్టు పెన్‌పహాడ్ ఎస్ఐ రవీందర్ తెలిపారు. మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ముగ్గురి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్‌సిటీ ఏరియాలోని యమున అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్‌ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య ! ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్మెన్ పోలీసులు తెలిపాడు. -
బెట్టింగ్ మాయలోపడి.. చివరకు ఇలా!
జడ్చర్ల టౌన్: ఆన్లైన్ బెట్టింగ్ మాయలోపడి ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల మండలం చిన్న ఆదిరాలలో బుధవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లికి చెందిన తిరుపతయ్య (36) భార్య లావణ్య, కుమారుడు, కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడి ఉన్న ఐదెకరాల పొలం, ఓ కారు విక్రయించాడు. సోదరుడు ఇచ్చిన కారు నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లో ఆ కారును సైతం కుదువపెట్టాడు. సంక్రాంతి పండుగకు భార్య, పిల్లలను అత్తగారి ఊరైన కేశంపేట మండలం దత్తాయపల్లికి పంపించి అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 12న కుమార్తె జన్మదినం ఉండటంతో తెలిసిన వారి వద్ద బుల్లెట్ వాహనం తీసుకొని దత్తాయపల్లికి వెళ్లాడు. జన్మదిన వేడుకలు ముగిశాక బుల్లెట్‌ను కేశంపేటలోనే రూ.22 వేలకు కుదువపెట్టి ఆన్లైన్ బెట్టింగ్‌లో పాల్గొని ఆ డబ్బులు పోగొట్టుకున్నాడు. మిత్రుడి సాయంతో ఈ నెల 13న సాయంత్రం 4 గంటలకు మసిగుండ్లపల్లికి వచ్చి గ్రామ సమీపంలోని గుట్ట వద్ద ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇంటికి చేరుకోకపోవడంతో భార్య, కుటుంబ సభ్యులు వెదకడం ప్రారంభించి సమీప గ్రామ సర్పంచ్‌లు, తెలిసిన వారికి సమాచారం ఇచ్చారు. మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం పత్తి చేనులో కూలీకి వెళ్తున్న వారు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ పోలీసులు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ నాగరాజు పంచనామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు. -
మహదేవ్ ప్రమోటర్ల నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎంకి రూ.508 కోట్లు.. ఈడీ సంచలన ఆరోపణలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో నాయకులు ప్రచారంలో దూసుకున్నారు. దీంతో చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారింది తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి సీఎం భూపేష్ బఘేల్ రూ. 508 కోట్లు స్వీకరించినట్లు ఈడీ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహదేవ్ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో భారీ మొత్తంలో నగదు చెలామణి అవుతున్నట్లు తమకు గురువారం సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు ఈ మేరకు హోటల్ ట్రిటన్లతోపాటు భిలాయ్‌లోని మరోచోట ఈడీ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఖర్చు కోసం యూఏఈ నుంచి నగదు తీసుకొస్తున్న అసిమ్ దామ్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆయన కారు, నివాసంపై సోదాలు జరపగా.. రూ.5.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. అయితే ఆ డబ్బును రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెట్టేందుకు మహదేవ్ యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు డెలివరి చేసేందుకు ఉద్ధేశించినట్లు నగదుతో పట్టుబడిన వ్యక్తి తమకు తెలిపినట్లు ఈడీ వెల్లడించింది. అంతేగాక మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లింపులు చేసినట్లు చెప్పారని పేర్కొంది. కాగా చత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహకులు విదేశాల్లో ఉంటూ, ఛత్తీస్‌గఢ్‌లోని తన సన్నిహితులతో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసింది. ఇప్పటివరకు రూ. 450 కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకుంది. మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ఈడీ ఇటీవలే తొలి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ సహా 14 మంది నిందితులుగా ఉన్నారు. -
డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..?
ముంబయి: డ్రీమ్ 11లో రూ.1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ ఎస్ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సోమనాథ్ ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆయన తనకున్న జ్ఞానంతో టీంను ఎంచుకుని డ్రీమ్ 11లో పాల్గొన్నారు. అదృష్టం కలిసివచ్చి రూ.1.5 గెలుచుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి మిఠాయిలు తినిపిస్తూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో విషయం పెద్దదైంది. ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొని పోలీసు శాఖ పరువు తీస్తున్నారంటూ ఉన్నతాధికారులు ఎస్ఐ సోమనాథ్పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎస్ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. ఈ వ్యవహారంలో సోమనాథ్పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రూ.1.5 గెలుచుకున్న ఆనందం ఆవిరైపోయింది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
‘మహాదేవ్’ కేసు: సెలబ్రిటీలకు కంగనా రనౌత్ హెచ్చరిక!
దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖ నటులకు భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రణబీర్ కపూర్, హుమా ఖురేషి, హాస్యనటుడు కపిల్ శర్మతో సహా మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుతో ముడిపడి ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరిపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నిఘా పెట్టింది. ఇదిలా ఉండగా నటి కంగనా రనౌత్ తనను కూడా మహాదేవ్ యాప్ ప్రమోటర్లు చాలాసార్లు సంప్రదించారని, కానీ తాను తిరస్కరించినట్లు తాజాగా పేర్కొన్నారు. "ఈ ఎండార్స్మెంట్ ఒక సంవత్సరం వ్యవధిలో దాదాపు ఆరు సార్లు నాకు వచ్చింది. ప్రతిసారీ అనేక రూ.కోట్లు ఆఫర్ చేశారు. కానీ నేను ప్రతిసారీ నో చెప్పాను. ఇది నయా భారత్, దీనికి అనుగుణంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. లేకుంటే బలవంతంగానైనా మెరుగుపడాల్సి వస్తుంది" అని కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈడీ స్కానర్‌లో ఉన్న ప్రముఖుల గురించిన కథనం స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ రాసుకొచ్చారు. బెట్టింగ్ కేసులో పేరు బయటకు వచ్చిన నటీనటుల్లో కొందరు మహాదేవ్ యాప్‌ను ప్రమోట్ చేయగా, మరికొందరు విదేశాలలో జరిగిన యాప్ ప్రమోటర్ వివాహంలో ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరిలో రస్ అల్-ఖైమాలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్‌లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్‌నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్‌లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్.. స్టార్ హీరో రణ్‌బీర్‌కు షాక్..
ముంబై: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసు బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమయ్యినట్లు ప్రచారం జరగ్గా అదే నిజమైంది. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. మహాదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌కు రణ్‌బీర్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. తాజాగా అతడికి నోటీసులు జారీ చేసిన ఈడీ అక్టోబర్ 6న విచారణకు రావాలని ఆదేశించింది. దుబాయ్‌లో ఉంటూ భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం కాగా సౌరభ్ చంద్రకర్, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’ ప్రమోటర్లు. దుబాయ్‌లో ఉంటూ వారు భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోని ఆరవ అతిపెద్ద నగరమైన రాక్‌లో జరిగింది. ఈ పెళ్లికి ఆయన ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. బంధువులను, సెలబ్రిటీలను దుబాయ్ తీసుకొచ్చేందుకు ప్రైవేట్ జెట్స్ సైతం ఏర్పాటు చేశాడు. పెళ్లికి హాజరైన వారికి షాక్? దీనికి సంబంధించిన చెల్లింపులను హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు ఈడీ షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. బాలీవుడ్ పెద్దలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మహాదేవ్ బుక్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణంపై అనేక రాష్ట్రాల్లో ఈడీ విచారణ జరుపుతోంది. చదవండి: నాకున్న కోరికల్లా ఒక్కటే.. దానికోసం ఎంతవరకైనా, ఎక్కడిదాకానైనా వెళ్తా.. మనోజ్ పోస్ట్ -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్‌లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్‌కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్‌కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్‌ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్
Mahadev App Scam Case మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కాం (ఎంఓబి) కేసు బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో దాదాపు 17మంది బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సన్నద్ధమవుతోంది. బీ-టౌన్ నటుడు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, గాయని నేహా కక్కర్, నుష్రత్ భరుచ్చా, తదితరులకు సమన్లు పంపేందుకు దర్యాప్తు సంస్థ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్ మహదేవ్ బుక్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా కోల్‌కతా, భోపాల్, ముంబై వంటి నగరాల్లో 39 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. రూ.417 కోట్ల డబ్బు, డాక్యుమెంట్లను ఈడీ సీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఎఇలో రస్‌అల్‌ఖైమాలో జరిగిన మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు నటులు , గాయకులు హాజరయ్యారు.టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దడ్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బండా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్, గాయకులు సులీ ప్రముఖులకు ఈడీ షాక్ ఇవ్వనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈడీ సేకరించిన సాక్ష్యం ప్రకారం, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి హవాలా ద్వారా రూ. 112 కోట్లు ముట్టాయి. హోటల్ బుకింగ్‌ల కోసం చెల్లింపు రూ. 42 కోట్లు చెల్లించారు. అంతేకాదు వివాహ బృందంలోని కుటుంబ సభ్యులను నాగ్‌పూర్ నుండి యుఎఇకి తీసుకెళ్లడానికి ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకున్నారు, వివాహంలో పాల్గొనడానికి ముంబై నుండి వెడ్డింగ్ ప్లానర్లు, డ్యాన్సర్లు, డెకరేటర్లు మొదలైన వారిని అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. మహాదేవ్ బుక్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణంపై అనేక రాష్ట్రాల ఈడీ పోలీసు విభాగాలచే విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సౌరభ్ చంద్రకర్ , రవి ఉప్పల్ ప్రమోట్ చేసిన కంపెనీ కొత్త వినియోగదారులను చేర్చుకొని యూజర్ ఐడిలను క్రియేట్చేసి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండర్ చేయడానికి ఆన్లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందని ఈడీ ఆరోపిస్తోంది.బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లోని సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్లో గత ఏడాది సెప్టెంబర్ 18 నాటి పార్టీకి హాజరయ్యేందుకు బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రమోటర్లు రూ.40 కోట్లు చెల్లించారని ఆరోపణలతో కొంతమంది తారలను ఇప్పటికే ఈడీ పరిశీలిస్తోంది. బాలీవుడ్ పెద్దలు రెండు ఈవెంట్లకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల నుండి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్‌కు చెందిన ఒక అసోసియేట్‌తో ఎంఓబి సమన్వయంతో బెట్టింగ్ యాప్‌ను లాంచ్ చేసిందన్న ఆరోపణలను కూడా ఈ విచారణ ధృవీకరిస్తున్నట్లు ఇడి వర్గాలు తెలిపాయి. -
TS Crime News: ఆన్లైన్ ఆటలు ఆడుతున్నారా..! జర జాగ్రత్త..!
కుమరం భీం: నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ బెట్టింగ్ ఆదివాసీ జిల్లా కుమురంభీంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. కఠిన చట్టాలు, పోలీసుల నిఘా ఉన్నా బెట్టింగ్ దందాలకు అడ్డుకట్ట పడటం లేదు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది యువత బానిసలుగా మారుతున్నారు. చివరికి అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, వాంకిడి వంటి ప్రాంతాల్లోని యువత తరచూ నిషేధిత ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్‌లోని ఓ చిట్‌ఫండ్‌లో కలెక్షన్ బాయ్‌గా విధులు నిర్వర్తించే ప్రమోద్‌సింగ్ అనే యువకుడు మూడేళ్లుగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దాదాపుగా రూ.2.60 లక్షల వరకు ఆన్లైన్ గేమ్స్‌లో పోగొట్టుకున్నాడు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఈ ఆదివారం రాత్రి ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. కంపెనీ మేనేజర్లను డబ్బు విషయంలో పక్కదారి పట్టించేందుకు ఈ నెల 21న కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం సమీపంలో తనకు తానే మందు బాటిల్స్‌తో తీవ్రంగా గాయపర్చుకున్నాడు. తనపై ముగ్గురు దాడి చేసి, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. విచారణలో బెట్టింగ్ విషయం బయట పడింది. కౌటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఏడాది నుంచి ఆన్లైన్లో కాక్‌ఫైట్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. చైన్ సిస్టం లాంటి ఈ గేమ్‌లో ఒకరి నుంచి మరొకరు గేమ్ ఆడటం మొదలెట్టారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లపాటు కష్టపడి సంపాదించిన నగదు ఈ గేమ్‌లో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు యువకులు ఏకంగా రూ.1.60 కోటికి పైగానే కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలు జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి ఎలా విస్తరిస్తుందో తెలియజేస్తున్నాయి. నిఘా ఉన్నా.. ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజల చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌తోపాటు మూడు ముక్కలాట పేరుతో ముగ్గులోకి దింపి అందినకాడికి దండుకునే ముఠాలపై గట్టి నిఘా పెడుతున్నారు. వరుస బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అయినా ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. యువకులు, చిరు వ్యాపారులు సైతం బెట్టింగ్ మోజులో పడి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ దందాలు.. ఇప్పుడు జిల్లాలోని అన్ని పల్లెలకూ పాకడం కలవరపెడుతోంది. నేరుగా పరిచయం లేకుండానే సెల్ఫోన్లోనే బెట్టింగ్ యాప్‌లు ఇన్స్టాల్ చేసుకుని యూపీఐ ఐడీలతో నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. రాష్ట్రంలో నిషేధించిన యాప్‌లను వీపీఎన్ సాయంతో లొకేషన్ మారుస్తూ వినియోగిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. కొంత మంది మైనర్లు వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీ ఐ ఐడీల ద్వారా పందెం కాస్తున్నారు. యువత ఈజీ మనీ కోసం కెరీర్‌ను సైతం ఇబ్బందుల్లోకి నెట్టి పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులు దృష్టి సారిస్తేనే.. జిల్లాలో ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ మట్కా ఎక్కువగా సాగుతుంది. ఐపీఎల్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనే రూ.లక్షల్లో చే తులు మారుతుంది. ఈ నెలలో ప్రారంభమ య్యే ఆసియా క్రికెట్ కప్‌తోపాటు అక్టోబర్‌లో స్వదేశంలో మొదలయ్యే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, యువత ను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగిన సమయంలో ఆరా తీయాలి. వారికి కౌన్సెలింగ్ ఇప్పించి అవగాహన కార్యక్రమాలకు పంపించాలి. బెట్టింగ్ నిషేధం.. ఆన్లైన్ బెట్టింగ్ నిషేదం. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ జూదంపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు చేపడుతాం. ఈ విషయమై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. – కరుణాకర్, డీఎస్పీ, కాగజ్‌నగర్ తల్లిదండ్రులు నిఘా ఉంచాలి.. యుక్త వయసు పిల్లలు ముఖ్యంగా 15 నుంచి 25 ఏళ్ల వారిపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఎక్కడికెళ్తున్నారు.. ఎం చేస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోవాలి. బెట్టింగ్‌ల వైపు మరలకుండా ఇతర వ్యాపకాలు ఉండేలా చూడాలి. ఇతరుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో వారికి వివరించాలి. – రామకృష్ణ, డీఎంహెచ్‌వో అత్యాశతో నష్టం తక్కువ సమయంలోనే రూ.లక్షలు సంపాదించాలనే అనే దురాశ యువతను పక్కాదారి పట్టిస్తోంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, కాక్‌ఫైట్, తీన్మార్ పేకాట, ఇతర జూదాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆటల్లో రూ.లక్షలు కోల్పోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న వారు తల్లిదండ్రులకు చెప్పలేక.. అప్పులు తీర్చలేక ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతున్నాయి. మరో దారి లేకపోవడంతో కొంత మంది ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఈ ఆన్లైన్ ఆటలకు బానిసవుతున్న వారిలో 18 నుంచి 28 ఏళ్ల వారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. -
మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠ.. ఉన్నదిపాయే, ఉంచుకున్నది పాయే! జీవితమే!
భారత్‌లో క్రికెట్ అంటే ఒక మతం. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెటే ఎక్కువ మంది అభిమానించే ఆటగా మారిపోయింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. ఇంతవరకు అంతబాగానే ఉన్న బెట్టింగ్ అనే భూతం మాత్రం మనుషుల జీవితాలను ఛిద్రం చేస్తుంది. బెట్టింగ్ మాయలో పడి చిన్న పెద్ద తేడా లేకుండా తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్‌కు బలయ్యేది ఎక్కువగా యువకులే. టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కడంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు పుట్టుగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్క మ్యాచ్ కాకపోతే.. మరో మ్యాచ్ లో అయినా డబ్బులొస్తాయనే ఆశతో అప్పుల మీద అప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత అప్పులు ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరుచూ ఎదోఒక చోట జరుగుతునే ఉంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల సంఖ్యలో బెట్టింగ్‌లు అలవాటు పడి ప్రాణాలను తీసుకుంటున్నారు. మన పక్కరాష్ట్రం తమిళనాడులో కూడా గత మూడేళ్లలో 40 మంది ప్రాణాలను ఈ బెట్టింగ్ భూతం మింగేసింది. ఇది చూస్తే మనం అర్ధం చేసుకోవచ్చు బెట్టింగ్ మనుషులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో. ఇక యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆన్లైన్ బెట్టింగ్, జూద క్రీడలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా కట్టడి చేయాలి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలు ఆన్లైన్ క్రీడలు, బెట్టింగ్‌లను నిషేధించాయి. బెట్టింగ్ భూతానికి బలైన యువకుడు.. తాజాగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడు బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన మణికంఠ సాయికుమార్ (25) క్రికెట్ బెట్టింగ్‌లకు గత కొంత కాలంగా అలవాటు పడ్డాడు. దీంతో బయట అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయి.. అప్పులపాలు అయ్యాడు. దీంతో బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అంది వచ్చినా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇది ఒక్క మణికంట కుటంబంలోనే కాదు.. ఈ క్షోభ చాలా మంది కుటుంబాల్లో నెలకొంటోంది. క్రికెట్‌ను అభిమానించండి తప్పులేదు.. బెట్టింగ్‌లకు మాత్రం అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇకనైన కళ్లు తెరవండి, బెట్టింగ్ మానండి. -
‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్
యావత్ సినీ ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంగా బెట్టింగ్ రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఆస్కార్ అందుకునే హీరో ఎవరు? ఏ సినిమాకి ఆస్కార్ వస్తుంది? తదితర అంశాలపై జోరుగా బెట్టింగ్ సాగిస్తున్నారు. (చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) ఇక ఇండియా నుంచి ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’పై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై నగరాల్లో తిష్టవేసిన బుకీలు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందా? లేదా? అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్లైన్లోనే నడిపిస్తున్నారు. 1:4 నిష్పత్తితో నడుస్తున్న ఈ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. (చదవండి: ఆస్కార్‌కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!) సామాన్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నిర్మాతలు..టెక్నీషియన్స్ కూడా బెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ వేడుక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా..ఆర్ఆర్ఆర్.. నాటు నాటు పాట గురించే చర్చిస్తున్నారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో మరో నాలుగు పాటలతో పోటీ పడుతున్న నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా రాదా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. -
లోన్‌యాప్, క్రికెట్ బెట్టింగ్‌కు రోహిత్ బలి.. నా కొడుకులా మరొకరు కాకూడదంటూ..
సాక్షి, విజయవాడ: లోన్‌యాప్, క్రికెట్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. ఎన్టీఆర్ జిల్లా వేలేరు గ్రామానికి చెందిన రోహిత్ క్రికెట్ బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లలో రుణం తీసుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో తిరిగి చెల్లించలేకపోయాడు. ఓ వైపు లోన్ యాప్ నిర్వాహకులు, మరోవైపు క్రికెట్ బుకీల వేధింపులు తాళలేక రెండు రోజుల క్రితం గడ్డిమందు తాగి రోహిత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో రోహిత్ మృతదేహానికి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై రోహిత్ తండ్రి కోదండరామయ్య మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్ వల్లే నాకొడుకు బలయ్యాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్‌లలో నా కొడుకుని మోసం చేశారు. 4వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించాం. రెండు రోజులు మృత్యువుతో పోరాడి నాకొడుకు మరణించాడు. హనుమాన్ జంక్షన్‌కు చెందిన జోజి సునీల్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేసినట్లు నా కొడుకు చెప్పాడు. లోన్యాప్లో కూడా రూ.2.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. జోజి సునీల్, లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక, మాకు చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నా కొడుకు తెలిపాడు. రాజు అనే వ్యక్తికి 60 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షలు బ్యాంక్ ద్వారా పంపాడు. ఆ డబ్బులు అతనికి ఎందుకు ఇచ్చాడు, ఆ డబ్బులు ఎక్కడవి అనేది తెల్చాలి. నా కొడుకులా మరొకరు కాకూడదు. క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్‌లపై పోలీసులు నిఘా పెట్టాలి. కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రోహిత్ తండ్రి కోదండరామయ్య కోరారు. చదవండి: (Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..) -
బెట్టింగ్ సైట్ల ప్రకటనలొద్దు టీవీ చానళ్లకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బెట్టింగ్ సైట్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ప్రసారంపై కేంద్రం సోమవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. ‘ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను వాటికి సంబంధించిన వార్త వెబ్సైట్లను, వాటి ఉత్పత్తులు/సేవల సంబంధ అంశాలను చూపే వాణిజ్య ప్రకటనల ప్రసారం మానుకోండి’ అని న్యూస్ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం సూచించింది. ఈ మార్గదర్శకాలు, చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ప్రైవేట్ శాటిలైట్ చానళ్లను కేంద్రం హెచ్చరించింది. వార్తలను ప్రచురించే పబ్లిషర్లకు, డిజిటల్ మీడియాకూ ఇదే తరహా సూచనలిస్తూ విడిగా మార్గదర్శకాలను పంపింది. ‘సొంత న్యూస్ వెబ్సైట్ల మాటున కొన్ని బెట్టింగ్ సంస్థలు తమను తాము అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి. బెట్టింగ్ సంస్థల లోగోలే ఆ న్యూస్ వెబ్సైట్లకూ ఉంటున్నాయి. ఈ వెబ్సైట్లు ఏవీ భారత చట్టాలకు లోబడి అధీకృత యంత్రాంగం వద్ద రిజిస్టర్ కాలేదు. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, వార్తలు ప్రసారం చేస్తూ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు పాల్పడుతున్నాయి. వీటిలో కొన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్లు, క్రీడా వార్తల వెబ్సైట్లుగా చెలామణి అవుతున్న విషయంపై వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని అప్రమత్తం చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. -
బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌పై కేంద్రం కన్నెర్ర
Online Betting Ads: మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో బెట్టింగ్ తరహా యాడ్స్ ను ప్రసారం చేయడం నిలిపివేయాలని యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టీ వార్నింగ్ ఇచ్చింది. మనదేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ తెలిపింది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్లైన్ అడ్వటైజ్మెంట్ సంస్థలు, పబ్లిషర్లు బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌తో ఇండియన్ యూజర్లను టార్గెట్ చేయడం నిలిపివేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలిపింది. 2025 నాటికి మార్కెట్ ఎంతంటే! ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్,ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) ప్రకారం..38శాతం వార్షిక వృద్ధితో 2025నాటికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విలువ రూ.1.5లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కేంద్రం తాజా నిర్ణయం త్వరలో పూర్తి స్థాయిలో అమలు కానుంది. దీంతో 4.5 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను శాసిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేసే ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీలకు భారీ నష్టం చేకూరనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆన్లైన్ హార్స్ రేస్ బెట్టింగ్ గుట్టురట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం
గచ్చిబౌలి: చెన్నైలో జరుగుతున్న గుర్రపు పందేలపై నిర్వహిస్తున్న ఆన్లైన్ హార్స్ రేస్ బెట్టింగ్ గుట్టును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మాదాపూర్ డీసీపీ శిల్పవల్లితెలిపిన మేరకు.. శుక్రవారం చెన్నైలో జరిగే గుర్రపు పందేలపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్వోటీ పోలీసులు మాదాపూర్, గుట్టలబేగంపేట్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరి అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీలకు అప్పగించారు. నిందితులు నెల్లూరుకు చెందిన వాకా వెంకటేశ్వర్ రెడ్డి(34), కర్నూల్‌కు చెందిన పందింటి ప్రదీప్(34)గా గుర్తించారు. -
భారీగా డబ్బుల కట్టలు స్వాధీనం.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్
వరంగల్ క్రైం: అతను చదివింది నాలుగో తరగతి. ఆన్లైన్లో అందెవేసిన చేయి. ముంబై బుకీతోపాటు స్నేహితులతో కలసి ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్, మూడు ముక్కలాట నిర్వహణతో రూ.కోట్లు గడించాడు. వీరి చేతిలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయ్యింది. ముంబై కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు, 7 సెల్ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సోమవారం మీడియా సమావేశంలో ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. హనుమకొండ జిల్లా విజయ్‌నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాడు. కానీ వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం కావడంతో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొద్ది మంది స్నేహితులతో కలసి 2016లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా ప్రారంభించాడు. దీని ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడంతోపాటు 2018లో స్నేహితులతో కలసి ఆన్లైన్లో మూడు ముక్కలాటను ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రసాద్‌కు ముంబై కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే అభయ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకీగా మారాడు. భారీగా డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో అటు బెట్టింగ్, ఇటు మూడు ముక్కలాటలో పలువురు వ్యక్తులు ఈ ముఠా చేతిలో మోసపోయారు. చదవండి: Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ హెచ్చరిక.. వారంలో డిమాండ్లు పరిష్కరించాలి, లేదంటే.. లాభాల పంపకంలో ఉండగా.. 2019లో బెట్టింగ్ నేరంపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బయటికి వచ్చాక హైదరాబాద్‌లో తిరిగి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు సులభంగా గుర్తిస్తారని, మళ్లీ హనుమకొండకు మకాం మార్చాడు. అప్పటి నుంచి యథేచ్ఛగా ఆన్లైన్లో బెట్టింగ్, మూడుముక్కలాట నిర్వహణతో భారీగా డబ్బులు సంపాదించి బినామీ పేర్లతో బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమచేశాడు. చదవండి: Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్‌పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ఆ డబ్బుతో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేశాడు. కాగా, ఇటీవల బెట్టింగ్‌లో మోసపోయిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులతో ఈ ముఠాపై కేయూ పోలీస్‌స్టేషన్‌లో రెండు, హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయింది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడైన ముంబై బుకీ అభయ్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు ప్రసాద్ ఇంటికి రాగా, కేయూ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Ameerpet: ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరంగా.. -
Hyderabad: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల సొత్తు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా అతిపెద్ద బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు మియాపూర్, బాచుపల్లి, గచి్చ»ౌలి, మైలార్‌దేవ్‌పల్లిలోని ఏడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి 23 మంది బూకీలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.93 లక్షల నగదు, 14 బెట్టింగ్ బోర్డ్‌లు, 8 ల్యాప్టాప్స్, 247 సెల్ఫోన్లు, 28 స్మార్ట్ఫోన్లు, 4 ట్యాబ్స్, 4 టీవీలు, 2 రూటర్స్, ప్రింటర్, 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2.21 కోట్లు. పరారీలో ఉన్న మెయిన్ బూకీ విజయవాడకు చెందిన మహా అలియాస్ సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇతను బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. వివరాలను మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓటీ) డీసీపీ సందీప్‌లతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం మీడియాకు వివరించారు. విజయవాడకు చెందిన మెయిన్ బూకీ మహా నుంచి లీడ్స్ తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన చింత వేణు(35), కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన గోదవర్తి వెంకటేష్ (32) ఇద్దరు బూకీలుగా అవతారమెత్తి ఏడేళ్లుగా హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్–2021లో మంగళవారం నాటి ముంబై–పంజాబ్ మ్యాచ్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఫ్యాన్సీ లైఫ్, లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫెయిర్ వంటి యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్, లావాదేవీలను నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా నిఘా పెట్టిన పోలీసులు బెట్టింగ్ నిర్వాహకులను మంగళవారం పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి ఆకువీడుకు చెందిన జెళ్ల సురేష్ (33), తిరుమణి మణికంఠ(23), కొల్లాటి మణికంఠ(21), పీ.శ్రీనివాస్(35), దుర్గాప్రసాద్ కొల్లాటి(22), జమ్ము నాగరాజు(36), ఈదర రవి(36), భీమవరం వడువు అజయ్ కుమార్ (27), అట్లూరి రంజిత్ కుమార్(35), జగన్నాథపురంకు చెందిన జయశ్రీనివాస్(29), నల్లజర్లకు చెందిన తూరెళ్ల సాయి(24), గుంటూరు జిల్లా మంత్రిపాలెం రేపల్లె నాగళ్ల రాకేష్(37), తూర్పు గోదావరి మొగిలి కూడురుకు చెందిన సుందర రామరాజు(34), విజయవాడకు చెందిన కునప్పరెడ్డి దుర్గా పవన్ కుమార్(32), కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కోట సాయి నవీన్(25), భద్రాచలం గౌరిదేవిపేట్కు చెందిన రవితేజ(37), బాచుపల్లికి చెందిన కామగాని సతీష్(39), మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మల్లిఖార్జున చారీ(38), కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన బొప్ప వెంకటేష్ (30), గన్ని కల్యాణ్ కుమార్ (30), పత్తిపాటి రాము (32)లను అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ బూకీ మహాతో పాటు చెన్ను భాస్కర్‌రెడ్డి, గుంటూరుకు చెందిన సురేష్, కేపీహెచ్‌బీకి చెందిన పవన్ అలియాస్ ప్రవీణ్, రాయచూర్‌కు చెందిన కే.సుమన్, రామాంజనేయ, ముంబైకి చెందిన నందలాల్ గోరీ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు ముంబై, గోవా, బెంగళూరు, దుబాయ్‌లో కూడా ఉన్నాయని దర్యాప్తులో తేలిందని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాక్‌లో మ్యాచ్.. సిటీలో బెట్టింగ్
సాక్షి, సిటీబ్యూరో: అబుదాబిలోని షేక్ జయీద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్‌లకు నగరంలోని నిజాంపేట్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నడుస్తోంది. ఈ దందాకు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి సూత్రధారి కాగా.. పశ్చిమ గోదావరి వాసులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. సహాయకుల్లో కృష్ణా జిల్లా వ్యక్తి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు దాడి చేసి అయిదుగురు నిందితులను పట్టుకున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం వెల్లడించారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు, ఇతర ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్ఓటీ డీసీపీ సందీప్‌తో కలిసి గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆద్యంతం వ్యవస్థీకృతం.. ► తూర్పు గోదావరి వాసి సోమన్నకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అయిన లైవ్‌లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్–365, బెట్ ఫెయిర్లకు చెందిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ కలిగి ఉన్నాడు. అంతర్జాతీయంగా వీటిని నిర్వహించే వారి నుంచి దీన్ని పొందాడు. వీటిని ఇతగాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జి.సత్యపవన్ కుమార్, యూఆర్ సతీష్ రాజులకు అప్పగించాడు. ► వీరిద్దరూ నగరానికి చేరుకుని నిజాంపేట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ బెట్టింగ్ బోర్డ్, ల్యాప్‌టాప్, టీవీ తదితరాలు ఏర్పాటు చేసుకున్నారు. బెట్టింగ్ బోర్డ్‌లో ఒకేసారి 26 ఫోన్లను కనెక్ట్ చేసే సౌకర్యం ఉంది. అలా అంతమంది పంటర్ల (పందెం కాసేవాళ్లు) ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ బెట్టింగ్ నిర్వహించవచ్చు. హవాలా రూపంలో కీలక లావాదేవీలు.. ► ఈ బోర్డ్ నిర్వహణ కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సీహెచ్ త్రినాథ్, నూజివీడు వాసి ఎన్.భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన జె.ప్రసాద్‌లను ఆపరేటర్లుగా నియమించుకున్నారు. బెట్టింగ్ బాక్స్ ద్వారా వచ్చే కాల్స్ ఆధారంగా ఈ ముగ్గురూ పంటర్లు కోరిన విధంగా యాప్‌లో బెట్టింగ్ కాస్తారు. దీని నిష్పత్తి నిమిష నిమిషానికీ మారిపోతూ ఉంటుంది. ఓడిన వారు నిష్క్రమిస్తుండగా... కొత్త వారు చేరుతూ ఉంటారు. లాభనష్టాలు పంటర్లకు యాప్‌లో కనిపిస్తూ ఉంటాయి. ► ఈ దందాలో లావాదేవీలు మొత్తం ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సోమన్నకు చేరాల్సిన మొత్తం మాత్రం హవాలా ద్వారా పంపిస్తున్నారు. పీఎస్ఎల్ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్ సాగుతోందని సమాచారం అందుకున్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ నేతృత్వంలోని బృందం నిజాంపేటలోని ఫ్లాట్‌పై దాడి చేసింది. సోమన్న మినహా మిగిలిన వారిని అరెస్టు చేసి నగదు, ఉపకరణాలు స్వాధీనం చేసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించింది. చదవండి: స్మగ్లింగ్ ముఠా: కాసుల ఎర.. అమాయకుల చెర