Oscar Awards 2023: Whether Natu Natu Song Will Get Oscar Or Not, Online Bettings In Crores - Sakshi
Sakshi News home page

Natu Natu Song: ‘నాటు నాటు’కు ఆస్కార్‌ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్‌

Published Sun, Mar 12 2023 6:47 PM | Last Updated on Sun, Mar 12 2023 6:53 PM

Oscars awards 2023: Whether Natu Natu Song Will Get Oscar Or Not, Online Betting RRR Movie - Sakshi

యావత్‌ సినీ ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆస్కార్‌ అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు)  లాజ్‌ ఏంజిల్స్‌ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంగా బెట్టింగ్‌ రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఆస్కార్‌ అందుకునే హీరో ఎవరు? ఏ సినిమాకి ఆస్కార్‌ వస్తుంది? తదితర అంశాలపై జోరుగా బెట్టింగ్‌ సాగిస్తున్నారు.

(చదవండి: వామ్మో.. ఆస్కార్‌ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్‌ ఏంటంటే..)

ఇక ఇండియా నుంచి ఆస్కార్‌ బరిలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, ముంబై నగరాల్లో తిష్టవేసిన బుకీలు.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌కు నామినేట్‌ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వస్తుందా? లేదా? అంటూ బెట్టింగ్‌ వేస్తున్నారు. బెట్టింగ్‌ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే నడిపిస్తున్నారు. 1:4 నిష్పత్తితో నడుస్తున్న ఈ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది.

(చదవండి: ఆస్కార్‌కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!)

సామాన్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నిర్మాతలు..టెక్నీషియన్స్‌ కూడా బెట్టింగ్స్‌ వేస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్‌ బరిలో నిలవడంతో టాలీవుడ్‌ ప్రేక్షకులంతా ఈ వేడుక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా..ఆర్‌ఆర్‌ఆర్‌.. నాటు నాటు పాట గురించే చర్చిస్తున్నారు. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో మరో నాలుగు పాటలతో పోటీ పడుతున్న నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా రాదా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement