Oscars 2023
-
ఎంగేజ్మెంట్ 2004లో.. పెళ్లి 2023లో
Actress Michelle Yeoh Marriage: ప్రస్తుతం ప్రేమకి అర్థం మార్చేశారు. నచ్చినంత కాలం కలిసి తిరగడం, అంతా అయిపోయాక పనికిమాలిన కారణం చెప్పి విడిపోవడం ఇప్పటి యువతలో చాలామందికి కామన్ అయిపోయింది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఈగోకు పోయి గొడవ పడుతున్నారు. కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఓ నటి ఏకంగా ఎంగేజ్మెంట్ జరిగిన 19 ఏళ్లకు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఆలోవర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: అరుదైన వ్యాధి బారిన ప్రముఖ నటి.. అలాంటి పరిస్థితిలో!) ప్రముఖ నటి మిచెల్లా యో చాలా గుర్తింపు తెచ్చుకుంది. 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' అనే సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఈ ఏడాది ఆస్కార్ కూడా గెలుచుకుంది. 60 ఏళ్ల ఈ బ్యూటీ.. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో తన లాంగ్ టైమ్ పార్ట్నర్, ఫెర్రారీ మాజీ సీఈఓ జేన్ టాడ్‌ని గురువారం పెళ్లి చేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా దీనికి వేదికైంది. అయితే ఇది ఆషామాషీ పెళ్లి అయితే కాదు. దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. 2004 జూలై 26న మిచెల్లాకు జేన్ ప్రపోజ్ చేశాడు. ఆమె దీనికి అంగీకారం తెలిపింది. అది జరిగి 6992 రోజులకు అంటే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఇన్నేళ్ల పాటు రిలేషన్లో ఉన్నప్పటికీ ఎందుకో పెళ్లి ఆలోచన రాలేదు. ఫైనల్‌గా ఇప్పుడు సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి విషయాన్ని ఫార్ములా వన్ డ్రైవర్ ఫెలిఫ్ మస్సా బయటపెట్టాడు. తన ఇన్ స్టాలో ఈ జంటతో దిగిన ఫొటోలని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. వీళ్ల ప్రేమ-రిలేషన్-పెళ్లి గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Felipe Massa (@massafelipe) (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!) -
RRR: ఆస్కార్ సభ్యుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయంటే
ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఈ ఏడాదిలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లోని విజేతలను ప్రకటించి వారికి అవార్డులను కూడా అందజేశారు. 95వ ఆస్కార్ వేడుకలలో భాగంగా టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నామినేట్ అయిన.. ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచింది. ఈ సాంగ్‌ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ స్టేజ్ పై అవార్డులు అందుకున్నారు. ఈ పాటకు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ అదిరిపోయే డ్యాన్స్‌తో మెప్పించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప స్థానం టాలీవుడ్‌కు దక్కింది. (ఇదీ చదవండి: 'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్) తాజాగా ఆస్కార్ ప్యానెల్ నుంచి టాలీవుడ్‌కు మరో శుభవార్త అందింది. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, కరణ్ జోహార్లతో పాటు ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సాబు సిరిల్, మణిరత్నం, సెంథిల్ కుమార్, చైతన్య తమహనే, షౌనెక్ సేన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్లకు ఆస్కార్ ప్యానెల్లో చోటు దక్కింది. రాబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాల్లో వీరందరికీ ఓటు హక్కు ఉంటుంది. అకాడమీ సభ్యులు మాత్రమే ఆస్కార్ విజేతలకు ఓటు వేయగలరు. వచ్చే ఏడాది ఆస్కార్ వేడుకలు మార్చి 10న జరగనున్నాయి. కాబట్టి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కీరవాణి కూడా ఓటు వేయనున్నారు. దీనిలో భాగంగా 2023లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో చేరడానికి 398 మంది వ్యక్తుల జాబితాలో దాదాపు డజను మంది భారతీయ కళాకారులు ఉన్నారు, ఇందులో "RRR" చిత్రం యొక్క దిగ్గజ నటుల కాంబో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, MM కీరవాణి,చంద్రబోస్ ఉన్నారు. అస్కార్ బరిలో నిలిచే చిత్రాలకు తెలుగు పరిశ్రమ నుంచి ఈ నలుగురికి మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంటుంది. వీరి సభ్యత్వం లైఫ్ టైమ్ ఉంటుంది. కానీ దర్శకధీరుడు రాజమౌళి ఈ జాబితాలో చోటు దక్కలేదు. (ఇదీ చదవండి: SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!) ఈ జాబితాలోని సభ్యుల గురించి అకాడమీ CEO బిల్ క్రామెర్, అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ ఇలా అన్నారు. 'ఈ కళాకారులు, నిపుణులను మా (ఆస్కార్) సభ్యత్వంలోకి స్వాగతిస్తున్నందుకు అకాడమీ గర్విస్తోంది. వారు సినిమా విభాగాల్లో అసాధారణమైన ప్రతిభతో ప్రపంచాన్ని మెప్పించారు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర అభిమానులపై కీలకమైన ప్రభావాన్ని చూపారు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం అకాడమీలో 10,000 మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. అకాడమీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఏడాది 40 శాతం మంది మహిళలకు చోటు కల్పించారు. ప్రతి ఏడాది విడుదలయై అస్కార్ ప్యానెల్ జాబితాలో ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉండేవారు. కానీ 2023లో మాత్రం ఇతర దేశాలకు చెందిన కళాకారులు ఎక్కువగా ఉండటం విశేషం. We’re proud to announce our newly invited members to the Academy! Meet the Class of 2023: https://t.co/xElbKejirD pic.twitter.com/9IqEmbU6GD — The Academy (@TheAcademy) June 28, 2023 -
రామ్ చరణ్‌కు ప్రభుదేవా బిగ్ సర్ప్రైజ్.. అదేంటంటే!
ఆస్కార్ వేడుకలు ముగించుకున్న రామ్ చరణ్ ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ఇంటికి కూడా చేరుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో శంకర్ దర్శకత్వంలో పనిచేయనున్నారు. తాత్కాలికంగా ఈ సినిమాకు ఆర్సీ15 అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన చెర్రీకి ఘనస్వాగతం లభించింది. ప్రభుదేవా ఆధ్వర్యంలోని ఆర్సీ15 చిత్రబృందం నాటు నాటు స్టెప్పులతో వెల్కమ్ చెప్పింది. అ తర్వాత రామ్ చరణ్‌ను పూలమాలతో సత్కరించింది. (ఇది చదవండి: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ప్రముఖ నటి కూతురు, ఫోటో వైరల్) దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.' ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పలేను. నాకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్సీ15 షూటింగ్‌కి తిరిగి వచ్చినందుకు చాలా గొప్పగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించింది. స్వీటెస్ట్ వెల్కమ్ అంటూ కామెంట్ చేసింది. కాగా.. ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. కాగా.. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC15 పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, జయరామ్, అంజలి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఆర్ఆర్ఆర్ టీంకు ఎంట్రీ ఉచితం కాదట.. రాజమౌళి ఎంత చెల్లించారంటే!
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన 95 ఆస్కార్ వేడుకల్లో టాలీవుడ్ కీర్తిని రెపరెపలాడించిన ఘనత దర్శకధీరుడు రాజమౌళిదే. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అయితే ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. కానీ ఈవెంట్లో పాల్గొనేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఉచితంగా ఎంట్రీ ఇవ్వలేదని సమాచారం. కేవలం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు తెలుస్తోంది. రాజమౌళితో సహా మిగిలిన చిత్రబృంద సభ్యులు కూడా ఈవెంట్లో పాల్గొనేందుకు టికెట్ కొనుగోలు చేయాల్సిందే. ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అలాగే ఈ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కూడా పాల్గొన్నారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లో పాల్గొనేందుకు చిత్రబృందానికి అన్ని టికెట్లను రాజమౌళి కొనుగోలు చేశారు. తాజా నివేదికల ప్రకారం రాజమౌళి ఒక టిక్కెట్ కోసం సుమారు $25 వేల డాలర్లను వెచ్చించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు. అయితే ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళితో సహా చిత్రబృందాన్ని వెనుక వరుసలో కూర్చోబెట్టినందుకు అకాడమీ విమర్శలపాలైంది. అకాడమీ నిర్వాహకుల తీరు పట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డ్ గెలిచిన తర్వాత చిత్రబృందం మార్చి 17న హైదరాబాద్‌కు రాగా ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. కాగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్, పోలీసు అధికారి పాత్రలో రామ్ చరణ్ పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషించారు. -
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
నాటునాటుకు ఆస్కార్.. లాబీయింగ్‌తోనే అవార్డులు: నటుడు
తమిళ సినిమా: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతోపాటు ప్రపంచ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును సాధించి భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. ఆ చిత్రంలోని నాటునాటు పాట ఈ అవార్డును గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా గర్వపడుతోంది. అయితే ఈ అవార్డు విషయంలో కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారివి కాబట్టి అది సహజమే. కాగా తమిళ దర్శకుడు, నటుడు అమీర్ ఆస్కార్ అవార్డుల విషయంలో తనదైన శైలిలో స్పందించారు. ఇంకా చెప్పాలంటే ఆస్కార్ అవార్డునే విమర్శించారు. ఈయన శుక్రవారం సాయంత్రం ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన అమీర్ ఒక భారతీయ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం సంతోషం అన్నారు. అయితే ఆస్కార్ అవార్డు అనేది ఆ దేశంలో అందించే జాతీయ అవార్డు అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఉత్తమ నటుడు అయిన శివాజీ గణేషన్‌కు చివరి వరకు ఎందుకు జాతీయ అవార్డు రాలేదన్నారు. దేవర్ మగన్ చిత్రంలోని ఆయన నటనకు గాను ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారని, అయితే దానిపై స్పందించిన శివాజీ గణేషన్ ఈ అవార్డు వచ్చింది కాదని, ఆ జ్యూరీ సభ్యులను మనవారు పట్టుబట్టి ఇప్పించిన అవార్డు అని పేర్కొన్నారన్నారు. పక్షపాతంలేని ఉత్తమ నటుల అవార్డుల ప్రదానం 30 ఏళ్ల క్రితమే ముగిసిందన్నారు. ఇప్పుడు అందిస్తున్న అవార్డులన్నీ లాబీయింగే కారణం అనే విమర్శలు ఉన్నాయన్నారు. 2007లో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన శివాజీ చిత్రంలోని నటనకు గాను ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేసిందన్నారు. అలాగని రజనీకాంత్ ఉత్తమ నటుడు అని చెప్పగలమా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఎంటర్ టెయినర్ మాత్రమేనని పేర్కొన్నారు. నిజానికి రజనీకాంత్ ఉత్తమ నటన గురించి చెప్పాలంటే ముల్లుమ్ మలరుమ్, ఆరిలిరుందు అరుబదు వరై వంటి చిత్రాలని చెప్పాలన్నారు. ఆ చిత్రాలకు ఎందుకు అవార్డును ఇవ్వలేదని ప్రశ్నించారు. -
ఆస్కార్ గెలిచిన ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్.. స్క్రిప్ట్‌రైటర్ ఈ అమ్మాయే!
‘గరిమ పుర ఎవరు?’ అనే ప్రశ్నకు చాలామంది జవాబు చెప్పలేకపోవచ్చు. ఆస్కార్ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ గురించి తెలియని వారు తక్కువ మంది ఉండవచ్చు. 27 సంవత్సరాల గరిమ ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు స్క్రిప్ట్‌రైటర్... పంజాబ్‌లోని పటియాలాలో పుట్టిన గరిమ హైస్కూల్ చదువు పూర్తికాగానే కళాశాల విద్య కోసం మహారాష్ట్రలోని పుణెకు వచ్చింది. అక్కడే తనకు ప్రపంచ సినిమాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలపై ఆసక్తి ఏర్పడింది. ‘సింబియాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా’లో పట్టా పుచ్చుకున్న తరువాత డాక్యుమెంటరీలపై మరింత ఆసక్తి పెరిగింది. డాక్యుమెంటరీలు తీయాలనుకొని ముంబైలో అడుగుపెట్టిన గరిమ ఒక మీడియా సంస్థలో చేరింది. ‘వృత్తి జీవితం బాగానే ఉందిగానీ తాను వచ్చింది ఇందు కోసం కాదు కదా!’ అని ఆలోచించింది. ఎనిమిది నెలల తరువాత ఉద్యోగాన్ని వదులుకొని స్క్రిప్ట్ రైటర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలు ఫలించి వెబ్‌సిరీస్‌కు రాయడం మొదలుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘లిటిల్ థింగ్స్’ తో రైటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గరిమ. పట్టణ ప్రజల జీవనశైలిపై తీసిన ఈ సిరీస్ కోసం తొలిసారిగా ఇతర రచయితలతో కలిసి పనిచేసింది. ఒంటరిగా కూర్చుని, నిశ్శబ్ద వాతావరణంలో రాసే అలవాటు ఉన్న గరిమ ఇతర రచయితలతో కలిసి చర్చలు చేస్తూ రాయాల్సి వచ్చింది. ‘ఇతరులతో కూర్చొని చర్చిస్తూ రాయడం వల్ల మనల్ని మనం ఎంతో మెరుగు పరుచుకోవచ్చు. ఇలా కూడా ఆలోచించవచ్చా అనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే కలానికి కొత్త మెరుపు వస్తుంది’ అంటుంది గరిమ. 2019లో వైల్ట్‌లైఫ్ డైరెక్టర్ గుంజన్ మీనన్ గరిమను డైరెక్టర్ కార్తికీ గోంజాల్వెజ్కు పరిచయం చేసింది. కార్తికీ దగ్గర ఒక మంచి కథ ఉంది. ఆమె మంచి రైటర్ కోసం వెదుకుతోంది. కట్ చేస్తే... 2020లో గరిమను వెదుక్కుంటూ కార్తికీ వచ్చింది. ఇక అప్పటి నుంచి స్క్రిప్ట్ రైటింగ్ పనుల్లోకి దిగింది గరిమ. అయితే ఇదేమీ కాల్పనిక స్క్రిప్ట్ కాదు. నాలుగు గోడల మధ్య ఏకాంతంగా రాసుకునే స్క్రిప్ట్ కాదు. అడవి దారి పట్టాలి. అనాథ ఏనుగుల కళ్లలోకి చూసి మౌనంగా మాట్లాడాలి. వాటిని సొంత పిల్లల్లా ఆదరించిన దంపతుల మనసు పొరల్లోకి వెళ్లాలి. తెలుసుకున్నదానికి సృజన జోడించాలి. ‘30 ఏళ్లు కూడా దాటని ఈ అమ్మాయి ఇంత పనిచేయగలదా?’ అనే సందేహం ఎప్పుడూ కార్తికీ గోంజాల్వెజ్కు రాలేదు. తనపై కార్తికీ పెట్టిన నమ్మకాన్ని గరిమ వృథా చేసుకోలేదు. స్క్రిప్ట్‌కు జవసత్వాలు ఇచ్చింది. ‘కాలం మారింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పుణ్యమా అని యువతరం చిత్రపరిశ్రమలోకి వెల్లువలా వస్తోంది. ఇప్పుడు ఒకరి సృజనాత్మక శ్రమను దోచుకోవడం అనేది కష్టం. కష్టపడే వారికి విజయం త్వరగా చేరువయ్యే కాలం ఇది’ అంటోంది గరిమ. అలనాటి పుస్తకాల నుంచి తాజాగా విడుదలైన పుస్తకాల వరకు ఎన్నో పుస్తకాలు చదువుతుంటుంది గరిమ. 1973లో వచ్చిన ఎరిక జోంగ్ ‘ఫియర్ ఆఫ్ ప్లైయింగ్’ పుస్తకం అన్నా, అందులో జోంగ్ రాసిన వాక్యం...‘ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. అయితే అరుదైన ప్రతిభ అనేది మనం ఎంత సాధన చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది’ అనే వాక్యం అన్నా ఆమెకు చాలా ఇష్టం. చదవండి: హ్యాపీ పేరెంటింగ్: వసపిట్ట పాఠాలు -
ఆస్కార్ స్టేజీపై మనకు అవమానం.. మరీ ఇంత దారుణమా?
బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటుకు, బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలింగా ద ఎలిఫెంట్ విస్పరర్స్‌కు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? అని ప్రేక్షకాభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన చర్యతో సినీప్రియుల ఆనందం చప్పున చల్లారిపోయింది. ఆస్కార్ అందుకున్న ద ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాతను అకాడమీ దారుణంగా అవమానించిందంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ వివరాలు చూద్దాం.. సాధారణంగా ఆస్కార్ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అంతకు మించి ఎక్కువ సమయం తీసుకుంటే వెంటనే ఆ స్పీచ్‌ను కట్ చేస్తారు. ద ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అవార్డు ప్రకటించిన అనంతరం డైరెక్టర్ కార్తీకి తనకిచ్చిన గడువులోనే స్పీచ్ ముగించింది. అయితే నిర్మాత గునీత్ మోంగా మాట్లాడటం మొదలుపెట్టకముందే సంగీతం ప్లే చేశారు. దీంతో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుతిరిగింది. పోనీ అందరి విషయంలోనూ అకాడమీ ఇలానే ప్రవర్తించిందా? అంటే లేదు. వీరి తర్వాత బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ అవార్డులు తీసుకున్న చార్లెస్ మాక్సీ, మాథ్యూ ఫ్రాడ్లు ఇద్దరూ 45 సెకన్ల కన్నా ఎక్కువసేపు ప్రసంగించినా అభ్యంతరం తెలపలేదు. దీనిపై అమెరికన్ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు నెటిజన్లు సైతం అకాడమీ భారత్‌ను అవమానించిందంటూ ట్విటర్లో మండిపడుతున్నారు. దీనిపై నిర్మాత గునీత్ స్పందిస్తూ.. 'ఆస్కార్ వేదికపై నన్ను ప్రసంగించనివ్వలేదు. ఇది నన్ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే భారత్ నిర్మించిన ఓ షార్ట్ ఫిలింకు ఆస్కార్ రావడం ఇదే తొలిసారి అని సగర్వంగా చాటిచెప్పాలనుకున్నా. కానీ నన్నసలు మాట్లాడనివ్వలేదు. ఇంత దూరం వచ్చి నాకు మాట్లాడే ఛాన్స్ రాలేదని బాధేసింది. దీనిపై జనాలు కూడా ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నట్లు అనిపించింది. ఇండియాకు వచ్చాక నా ఆలోచనలు, సంతోషాన్ని పంచుకుంటున్నాను. నాకు లభిస్తున్న ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చింది.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) The Elephant Whisperers triumphs at the #AcademyAwards - Kartiki Gonsalves and Guneet Monga win the Oscar for Best Documentary Short Subject - the first ever for an Indian Production at the #Oscars.#Oscars95 | @guneetm pic.twitter.com/BYiciGniF7 — santhoshd (@santhoshd) March 13, 2023 -
అర్హత లేని సినిమాలు ఆస్కార్‌కు పంపుతున్నారు: రెహమాన్
ఇన్నాళ్లకు తెలుగు చిత్రపరిశ్రమకు అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్‌ను అమాంతం పట్టుకొచ్చేశాడు కీరవాణి. రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్) సినిమాలోని నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ పాటగా అకాడమీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమాను కూడా నామినేషన్‌కు పంపిస్తారనుకుంటే గుజరాతీ చిత్రం చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపించారు. కానీ అది ఫైనల్ నామినేషన్స్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దీనిపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్కార్‌ను సాధించే సత్తా ఉన్న ఆర్ఆర్ఆర్ను పంపించి ఉండాల్సిందని పలువురూ అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ లెజెండ్ ఎల్ సుబ్రహ్మణ్యంతో మాటామంతీ నిర్వహించాడు రెహమాన్. వీరిద్దరూ సంగీతం గురించి, మారుతున్న టెక్నాలజీ గురించి చర్చించారు. ఇంతలో రెహమాన్ మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కు పంపుతున్నారనిపిస్తుంది. కానీ జస్ట్ చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్హత ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్‌కు పంపించకపోవడం గురించే ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు నెటిజన్లు. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
ఇదెంతో స్పెషల్ గిఫ్ట్.. మా అన్నయ్య ఏడ్చేశాడు: రాజమౌళి
ఆస్కార్ విజయంతో ఆర్ఆర్ఆర్ పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోతోంది. నాటు నాటు పాటకు సంగీతం అందించిన ఎమ్ఎమ్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌ను వేనోళ్ల కొనియాడుతున్నారు. తాజాగా వీరికి ఆస్కార్‌కు మించిన బహుమతి లభించింది. ఆస్కార్ కన్నా గొప్ప బహుమతి ఏముంటుంది అంటారా? కీరవాణి ఎంతగానో ఆరాధించే వ్యక్తి నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. అమెరికన్ సింగర్ రిచర్డ్ కార్పెంటర్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను, ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్‌లను అభినందిస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో రిచర్డ్‌తో పాటు అతడి కుటుంబం అంతా కలిసి శుభాకాంక్షలను పాట రూపంలో వెల్లడించారు. ఈ వీడియోపై రాజమౌళి స్పందిస్తూ.. 'సర్, ఆస్కార్ క్యాంపెయిన్‌లో మా అన్నయ్య ఎంతో కామ్‌గా ఉన్నాడు. ఆస్కార్‌కు ముందు, తర్వాత.. ఎప్పుడూ తన ఎమోషన్స్ బయటపెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఈ వీడియో చూశాడో ఆ క్షణం తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. తనకు తెలియకుండానే చెంపలపై కన్నీళ్లు జాలువారాయి. మీ గిఫ్ట్ మా కుటుంబం అంతా గుర్తుంచుకుంటుంది. థాంక్యూ సో మచ్ అని' కామెంట్ చేశాడు. కీరవాణి ట్విటర్లో ఈ వీడియో షేర్ చేస్తూ.. 'నేను ఊహించని గిఫ్ట్ ఇది. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ ప్రపంచంలో నాకు దక్కిన అత్యంత విలువైన గిఫ్ట్' అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. View this post on Instagram A post shared by Richard Carpenter (@richardcarpenterofficial) https://t.co/va5tOLD1DH This is something I didn’t expect at all ..tears rolling out of joy ❤️❤️❤️ Most wonderful gift from the Universe 🙏 — mmkeeravaani (@mmkeeravaani) March 15, 2023 -
ఆస్కార్ వేడుకల్లో దీపికా పదుకొణె.. దారుణంగా అవమానించారు భయ్యా!
అమెరికా లాస్ ఎంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను విశ్వవేదికపై పరిచయం చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వేడుకల్లో ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంది. కానీ అక్కడి మీడియా తీరు మాత్రం ఆమె అభిమానులకు కోపం తెప్పించేలా చేసింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అక్కడున్న వారిలో దీపికను ఎవరూ చూసిన ఇట్టే గుర్తు పట్టేస్తారు. కానీ కొన్ని మీడియా సంస్థలు దీపికాను గుర్తించడంలో దారుణంగా విఫలమయ్యాయి. దీపికా పేరుకు బదులు మరో నటి కెమిలా ఏవ్స్ పేరును రాశారు. దీపికా పేరు స్థానంలో మరొకరి పేరు రావడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపికా హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ.. ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు. అంతే కాకుండా ఇన్‌స్టాలో 72 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న దీపికాను గుర్తు పట్టకపోవడం దారుణమని అంటున్నారు. ఆ మీడియా సంస్థలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో భారతీయ చిత్రాలకు రెండు అవార్డులు దక్కాయి. టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలిచాయి. um, getty images this is deepika padukone. you appear to have confused her with camila alves. deepika's actually quite famous in her own right - 72 million insta followers and an award-winning career.#Oscar #Oscar2023 pic.twitter.com/0kQPjOce51 — Tarang / तरंग (@tarang_chawla) March 13, 2023 -
ఆస్కార్ వేదికపై దీపికా పదుకొణె.. ఇప్పుడు దాని గురించే చర్చంతా..!
అమెరికా లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సందడి చేసింది. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రస్తావించింది. ప్రపంచ వేదికపై ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంది. దీపికను నటి కంగనా రనౌత్ సైతం మెచ్చుకుంది. విశ్వవేదికపై మనదేశ గొప్పదనాన్ని చాటారని ప్రశంసించింది. అయితే ఈ వేడుకల్లో దీపికా డ్రెస్‌తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ ఫోటోల్లో కనిపించిన టాటూపై అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై దీపిక ధరించిన నలుపు రంగు గౌను అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా డ్రెస్‌తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపిక మెడపై 82°E అని ఉన్న టాటూ కనిపించింది. ఇంతకీ ఆ టాటూకు అర్థం ఏంటా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే టాటూకు 82 డిగ్రీస్ ఈస్ట్ అని అర్థం వస్తుంది. ఇది దీపికా పదుకొణె తన స్కిన్ కేర్ బ్రాండ్ పేరు. ఈ పేరుతో గత కొన్ని నెలలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. దీపిక తన సొంత బ్రాండ్ పేరును టాటూగా వేయించుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ కమిట్మెంట్ అంటే దీపికదే అని కామెంట్స్ చేస్తున్నారు. లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకలో దీపిక తన స్పీచ్‌తో అదరగొట్టింది. ఈ వేదికపై నుంచే ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటును అందరికీ పరిచయం చేసింది. కాగా.. దీపికా ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్ చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో తొలిసారి దీపికా కనిపించనుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ కె'లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్‌తో గూగుల్ సెర్చ్‌లో జూమ్
సాక్షి,ముంబై: 95వ అకాడమీ అవార్డ్స్‌లో సత్తాచాటిన సెన్సేషనల్ సాంగ్ నాటు నాటు హవా ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఆస్కార్ గెల్చుకున్న ఇండియన్ తొలి సాంగ్‌గా రికార్డును కొట్టేసిన తర్వాత గూగుల్‌లో నెటిజన్లు తెగ వెతికేశారట. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని ఈ సూపర్-హిట్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ గెల్చుకున్న తరువాత దీనిపై నెటిజన్ల ఆసక్తి 10 రెట్లకు పైగా పెరిగింది. ఫలితంగా నాటు నాటు సూపర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై సెర్చెస్ 1,105 శాతం పెరిగాయని ఒక నివేదిక బుధవారం వెల్లడించింది. జపనీస్ ఆన్లైన్ క్యాసినో గైడ్ 6తకరకుజీ, గూగుల్ సెర్చ్ ట్రెండ్ డేటాను విశ్లేషించింది. ఇందులో తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే నాటునాటు కోసం ఆన్లైన్లో భారీ క్రేజ్ వచ్చిందనీ, సగటు కంటే 10 రెట్లు శోధనలు పెరిగాయని వెల్లడించింది. టాలీవుడ్ హీరోలు, జూ.ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది. నాటు నాటు ఒక హై-టెంపో రిథమ్, డ్యాన్స్ , స్టెప్పులు గ్లోబల్‌గా విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాపులర్ సింగర్స్ లేడీ గాగా , రిహన్న వంటి సంగీత దిగ్గజాల మనసు కూడా దోచుకుందీ పాట. అంతేనా ఈ సాంగ్ టిక్‌టాక్‌లో ప్రముఖ సంచలనంగా మారింది, గత సంవత్సరం మార్చిలో విడుదలైనప్పటి నుండి 52.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకలో ఆర్ఆర్ఆర్మూవీకిసముచిత గౌరవం లభించిందనీ, అవార్డుతో చరిత్ర సృష్టించిదంటూ 6టకరకుజీ ప్రతినిధి ప్రశంసించారు. కాగా 95వ అకాడమీ ఆస్కార్ వేడుకలో, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎలక్ట్రిఫైయింగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఉర్రూత లూగిపోయారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్ ఒవేషన్‌తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్కు 'ఆస్కార్' పార్టీ ఇచ్చిన రాజమౌళి
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం) ముగిసిన విషయం తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆస్కార్ వేడుకను ఎక్కువమంది వీక్షించారు. 2021లో తక్కువగా దాదాపు 10 మిలియన్ (కోటి మంది) వ్యూయర్షిప్, 2022లో 16.6 మిలియన్ల వ్యూయర్షిప్ నమోదు కాగా ఈ ఏడాది వేడుకను 18.7 (కోటీ 87 లక్షలు) మిలియన్ల మంది వీక్షించారు. గత ఏడాదితో పోల్చితే 12 శాతం ఎక్కువ వ్యూయర్షిప్ నమోదైంది. అయితే ఆస్కార్ వ్యూయర్షిప్ విషయంలో ఇదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే 1998లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని 57 (5 కోట్ల 70 లక్షలు) మిలియన్ల మంది వీక్షించారు. ఈసారి సోషల్ మీడియాలో కూడా ఆస్కార్ వేడుక టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వేడుకకు 27.4 (27 కోట్ల 4 లక్షలు) మిలియన్ల ఇంట్రాక్షన్స్ సోషల్ మీడియాలో నమోదయ్యాయని హాలీవుడ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇటు టెలివిజన్ వ్యూయర్షిప్ రేటింగ్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కాగా ఆస్కార్ ఆవార్డు వేడుక అనంతరం కమిటీ గ్రాండ్‌గా ‘ఆఫ్టర్’ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, దీపికా తదితరులు పాల్గొన్నారు. రాజమౌళి ఇంట్లో పార్టీ ‘‘మేం కచ్చితంగా ఆస్కార్ గెలుస్తామని ముందు నుంచి యూనిట్ అంతా నమ్మకంగా ఉన్నాం. ఆస్కార్ అందుకోవడమా? లేదా ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ను ప్రదర్శించడమా.. ఈ రెండింటిలో ఏ క్షణాలు అపూరమైనవి అని నన్ను అడిగితే... ఎంచుకోవడం నాకు చాలా కష్టం. ‘నాటు నాటు’ పాటను వేదికపై ప్రదర్శిస్తున్నంతసేపు వీక్షకులు క్లాప్ కొడుతూ, సాంగ్ పూర్తయ్యాక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం అనేది నన్ను ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నిలబెట్టినట్లయింది. అలాగే ఆస్కార్ అవార్డు ఆయన్ను (కీరవాణిని ఉద్దేశిస్తూ..) కూడా ఆ శిఖరాగ్రాన నిలబెట్టింది’’ అని పేర్కొన్న రాజమౌళి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ ఆనందంలో లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో ‘ఆర్ఆర్ ఆర్’ టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీని రాజమౌళి భార్య రమ, ఆయన తనయుడు కార్తికేయ హోస్ట్ చేశారు. ఈ పార్టీలో కీరవాణి పియానో ప్లే చేయగా, అక్కడ ఉన్నవారు పాట పాడారు. ఈ సెలబ్రేషన్స్‌ను రామ్ చరణ్ వీడియో తీశారు. ఈ ఫోటోలను ఉపాసన షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో తారక్ కనిపించకపోవడంతో అసలు తను పార్టీకి హాజరయ్యాడా? లేదా? అని ఆలోచిస్తున్నారు అభిమానులు. భారతీయుల మనసు గెలిచిన లేడీ గగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిందని ప్రకటించగానే.. రాజమౌళి ఆనందంతో చప్పట్లు కొట్టి, తన భార్య రమను హత్తుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సినిమాకి సంబంధించినవారిగా ఆ విధంగా ఆనందపడటం సహజం. అయితే అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, యాక్ట్రస్ లేడీ గగా చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో పోటీలో ఉన్న ‘నాటు..’తో పాటు ‘టాప్‌గన్: మ్యావరిక్’ చిత్రం కోసం పాడిన ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటకు లేడీ గగా నామినేషన్ దక్కించుకున్నారు. తన పాటకు కాకుండా ‘నాటు..’కు వచ్చినప్పటికీ చప్పట్లతో అభినందించడం ఆమె సంస్కారానికి నిదర్శనం అని నెటిజన్లు అభినందిస్తున్నారు. సోషల్ మీడియా అండ్ న్యూస్ మీడియా ట్రెండ్స్‌ను విశ్లేషించే అమెరికాకి చెందిన నెట్‌బేస్ క్విడ్ కొన్ని గణాంకాలను వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం (వేడుక జరిగిన సమయంలో..) టాప్ మెన్షన్డ్ యాక్టర్స్ జాబితా తొలి స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాలు వరుసగా రామ్‌చరణ్, కి హుయ్ క్వాన్ (ఉత్తమ సహాయనటుడు), బ్రెండెన్ ఫ్రాసెర్ (ఉత్తమ నటుడు), పెడ్రోపాస్కల్ నిలిచారు. ఇక నటీమణుల విషయానికొస్తే.. మిషెల్ యో (ఉత్తమ నటి) అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో వరుసగా మిచెల్ యో, లేడీ గగా, ఏంజెలా బాసెట్, ఎలిజిబెత్ ఒల్సెన్, జామిలీ కర్టీస్ (ఉత్తమ సహాయ నటి) నిలిచారు. సినిమాల పరంగా తొలి రెండు స్థానాల్లో భారతీయ చిత్రాలు ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్ –ఫీచర్ ఫిల్మ్), ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నిలిచాయి. ఆ తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అర్జెంటీనా 1985’ చిత్రాలు నిలిచాయి. -
రామ్ చరణ్ - ఉపాసన.. ఎక్కడికెళ్లినా ఆ విషయాన్ని మర్చిపోరు!
మెగా హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ జంట సందడి చేసింది. మరికొన్ని నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ కార్యక్రమానికి వెళ్లేముందు ఈ జంట పూజలు చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాకుండా భారతీయ సంప్రదాయ దుస్తులో ఈ జంట వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది మా ఆచారంతో పాటు భారతదేశానికి సంప్రదాయం ఉట్టిపడేలా చేస్తుంది. ఈ రోజును కృతజ్ఞతలు తెలుపుతూ ప్రారంభించడం మనందరికీ చాలా ముఖ్యం. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ ధరించిన దుస్తులపై ఉన్న బటన్లు నిజానికి నాణేలు, వీటిని భారత్ చిహ్నంతో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన ఉపాసన తెలంగాణ కళాకారులు తయారు చేసిన పట్టు చీరలో కనిపించారు. కాగా.. 95వ ఆస్కార్ వేడుకల్లో RRRలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ అవార్డును ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కాగా.. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ జోడిగా నటిస్తోంది. -
ఆస్కార్ గెలిచిన రోజే ఏనుగులు మిస్సింగ్.. షాక్‌లో చిత్రబృందం
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. పూర్తిగా ఇండియాలో నిర్మించిన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ దక్కడం విశేషం. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు, అమ్ము అనే అనాథ ఏనుగు పిల్లలు. ఆ ఏనుగు పిల్లను చేరదీసిన ఆదివాసి దంపతులు బొమ్మన్, బెల్లి. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా చూపించారు. అయితే అవార్డ్ ప్రదానోత్సవం రోజునే విచిత్ర సంఘటన జరిగింది. ఒకవైపు అవార్డ్ వచ్చిందన్న ఆనందంలో ఉంటే.. మరోవైపు ఆ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు అదృశ్యమైనట్లు బొమ్మన్ వెల్లడించారు. కొంతమంది తాగుబోతులు ఏనుగులను తరమడంతో ఆదివారం రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. ఆ ఏనుగుల కోసం బొమ్మన్ ప్రస్తుతం వెతుకడం ప్రారంభించారు. బొమ్మన్ మాట్లాడుతూ..'మద్యం మత్తులో ఉన్న కొంత మంది వ్యక్తులను తరమడంతో ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నేను కృష్ణగిరి ఫారెస్ట్‌లో వెతుకుతున్నా. అవి రెండూ కలిసే ఉన్నాయా.. విడిపోయాయా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటి ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ అవి నాకు కనిపించకపోతే ఫారెస్ట్ రేంజర్‌కు ఫిర్యాదు చేసి నేను నా సొంతూరికి వెళ్తా.' అని అన్నారు. -
ఎట్టకేలకు స్పందించిన అల్లు అర్జున్.. ట్వీట్ వైరల్
ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడం అనేది ఓ కల. ఆ కలను ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి నెరవేర్చాడు. విశ్వవేదిక అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో నామినేషన్ లో ఉండటమే కాకుండా...అవార్డ్ సైతం గెలుచుకుంది. ఈ విషయాన్ని హాలీవుడ్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ఇక రాజమౌళి టీమ్ చరిత్ర సృష్టించటమే కాదు..దేశానికి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ సాధించి పెట్టిందని టీటౌన్ సంబరాలతో మోత మోగిపోయింది. టాలీవుడ్ అగ్రహీరోలతో పాటు..యంగ్ హీరోలందరూ సోమవారమే ట్వీటర్ వేదికగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు విషెస్ తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క రోజు ఆలస్యంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు విషెస్ చెప్పారు. ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అలాగే రామ్ చరణ్ ను లవ్లీ బ్రదర్ అంటూ... ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణం అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డ్యాన్స్ చేసేలా చేశారని పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే ఈ మేజిక్ క్రియేట్ చేసిన రాజమౌళి కి అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు. Big moment for INDIA 🇮🇳. Elated to see a Telugu song shaking at the Oscars . Biggest Congratulations to @mmkeeravaani garu , @boselyricist garu , @premrakchoreo master , brothers @Rahulsipligunj , @kaalabhairava7 , my beloved global stars , my lovely brother @AlwaysRamCharan — Allu Arjun (@alluarjun) March 14, 2023 ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తే.. ఇంత ఆలస్యంగా ట్వీట్ చేస్తారా? అని కొంతమంది నెటిజన్స్ బన్నీపై ఫైర్ అవుతుంటే.. షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల బన్నీ లేట్‌గా స్పందించి ఉంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు బన్నిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాంచరణ్‌ను గ్లోబల్ స్టార్ అంటూ.. అలాగే ఎన్టీఆర్‌ను తెలుగు ప్రైడ్ అంటూ ప్రశంసించడంపై ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. -
ఆస్కార్ వేడుక.. నంబర్‌వన్‌గా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మరో డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ వేడును దాదాపు 18.7 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈవెంట్‌ను లైవ్ ఇచ్చిన ఏబీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే గతేడాదితో ఆస్కార్‌తో పోలిస్తే దాదాపు 12 శాతం ఆడియన్స్ పెరిగినట్లు సమాచారం. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు. అయితే గతంలో జరిగిన కొన్ని వేడుకలతో పోలిస్తే ఇది తక్కువేనని అంటున్నారు. ఇటీవల ఆస్కార్ వేడుకలు వీక్షించే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో గతంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ తర్వాత అత్యధిక మంది చూసే కార్యక్రమంగా ఆస్కార్ నిలిచింది. ఎన్టీఆర్ నంబర్ వన్ ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియాల్లో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలిచారని సోషల్‌మీడియాను విశ్లేషించే నెట్‌బేస్ క్విడ్ తెలిపింది. ఆయన తర్వాత మెగా హీరో రామ్‌చరణ్ ఉన్నారని వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హుయ్ ఖ్యాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టాప్‌లో ఆర్ఆర్ఆర్ అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్ఆర్ఆర్’ నిలిచిందని తెలిపింది. ఆ తర్వాత ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనియా 1985 చిత్రాలు ఉన్నాయి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే, మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్లు వరుసగా ఐదుస్థానాల్లో నిలిచారు. -
అత్యధిక ఆస్కార్స్ గెలుచుకున్న చిత్రమిదే.. పదేళ్ల కష్టానికి ప్రతిఫలం
మిషెల్ యో, స్టెఫానీ, కే హుయ్ క్వాన్, జెన్నీ స్లాట్, జామి లీ కర్టిస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్’. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ గత ఏడాదిæ బాక్సాఫీస్ వద్ద సూపర్ బంపర్‌హిట్ కొట్టింది. 25 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అంతకు నాలుగు రెట్లు అంటే వంద మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. ఇక ఏడు ఆస్కార్ అవార్డులను సాధించిన ఈ చిత్రకథ విషయానికి వస్తే... చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎవిలిన్ క్వాడ్ కుటుంబం అక్కడ లాండ్రీషాపు పెట్టుకుని జీవనం సాగిస్తుంటుంది. వీరు ఒక ప్రపంచంలో జీవిస్తున్నట్లే మరో ప్రపంచంలో వీరిలాంటి వారే ఉంటారు. వీరు ఒకరికొకరు తారసపడినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అన్నదే కథ. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రదర్శకులు డేనియల్ క్వాన్, స్కీనెర్ట్ 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రకథను స్టార్ట్ చేశారు. కానీ షూటింగ్‌కి వెళ్లడానికి పదేళ్లు పట్టింది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం 2022 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. -
60 ఏళ్ల వయసులో ఉత్తమ నటిగా ఆస్కార్.. సరికొత్త చరిత్రకు శ్రీకారం
'కలలు కనండి. నిజం అవుతాయనడానికి నేను ఈ అవార్డును ఓ ప్రూఫ్‌గా చూపిస్తున్నాను. మహిళలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మీ ప్రైమ్ టైమ్‌ను మీరు దాటిపోయారు అంటే నమ్మొద్దు. ఈ అవార్డుని నేను మా అమ్మకు... ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే వారే నిజమైన సూపర్‌హీరోస్. వీరే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండి ఉండేవారు కాదు.మా అమ్మగారికి 84 ఏళ్లు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇప్పుడు మలేసియాలో ఆమె ఈ వేడుకను చూస్తున్నారు. నేను ఈ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నాను (కుటుంబ సభ్యులను ఉద్దేశించి). అలాగే నా కెరీర్ హాంకాంగ్‌లో స్టార్ట్ అయ్యింది. అక్కడ నాకు హెల్ప్‌గా ఉన్నవారికి ధన్యవాదాలు. అలాగే నెవర్ గివప్. డానియల్ డ్యూయో, ఏ 24 షూటింగ్ స్టూడియో, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్..’ నటీనటుల సహాయం లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఈ వేదికపై ఉండేదాన్ని కాదు'. – ఉత్తమ నటి, మిషెల్ యో(కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. అంతేకాదు ఇప్పుడామె వయస్సు 60ఏళ్లు. ) నాకు అవార్డు ఇచ్చిన ఆస్కార్ కమిటీకి, ఇలాంటి ఓ బోల్డ్ ఫిల్మ్‌లో నటించే అవకాశం కల్పించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ‘ది వేల్’ సినిమాలో భాగమైన వారిని గుర్తు చేసుకోకుండా ఉండలేను. బెస్ట్ యాక్టర్‌గా నాకు అవార్డు రావడాన్ని చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నటుడిగా నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నాకు గుర్తింపు వస్తుందా? అని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కేవలం తిమింగలాలు మాత్రమే లోలోతుల్లో ఈదగలవు. సినిమా ఇండస్ట్రీలో నేనూ అంతే. నాకు హెల్ప్‌గా ఉన్న నా కుటుంబ సభ్యలకు ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు బ్రెండెన్ ఫ్రాజెర్ (చెమర్చిన కళ్లతో...) ఈయన కూడా 54 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు.) Michelle Yeoh accepts her #Oscar for Best Actress: "For all the little boys and girls who look like me watching tonight, this is a beacon of hope and possibilities. This is proof that dreams do come true." https://t.co/ndiKiHfmID pic.twitter.com/pQN8nHDhCx — Variety (@Variety) March 13, 2023 -
అంబారీ ఎక్కి ఆస్కార్ వచ్చింది.. తొలిసారి భారత డాక్యుమెంటరీకి..
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిడివి 39 నిమిషాలు. రెండు ఏనుగు పిల్లలు, నీలగరి అడవుల్లో ఉండే ‘కట్టు నాయకర్’ అనే తెగకు చెందిన ఆదివాసీ భార్యాభర్తలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఆ భార్యాభర్తల పేర్లు బొమ్మన్, బెల్లి. ఏనుగు పిల్లల్లో ఒకదాని పేరు రఘు, మరోదాని పేరు అమ్ము. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. అయితే డాక్యుమెంటరీలో ఎక్కువ భాగం రఘతో బొమ్మన్, బెల్లిలకు ఉండే అనుబంధం చూపుతుంది. అయితే నేపథ్యంలో అందమైన అడవులు, వాగులు, ఆదివాసీల క్రతువులు ఇవన్నీ దర్శకురాలు కార్తికి చూపడంతో డాక్యుమెంటరీకి ఒక సంపూర్ణత్వం వచ్చింది. బొమ్మన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఇప్పుడు రఘు, అమ్ములను అటవీ శాఖ వారు ‘ముడుమలై టైగర్ రిజర్వ్’కు మార్చారు. దాంతో రఘుతో ఆ దంపతుల బంధం తెగింది. విఘ్నాలు తొలగిపోయాయి. పూర్తిగా ఇండియాలో నిర్మితమైన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ అందింది. ఇది స్త్రీల ద్వారా జరిగింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది కార్తికి గోంజాల్వేజ్. నిర్మించింది గునీత్ మోంగా. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు అనే అనాథ ఏనుగు పిల్ల. ఆ ఏనుగు పిల్లను సాకిన ఆదివాసి దంపతులు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా వ్యక్తమైంది. అందుకే అంబారీ ఎక్కి వచ్చినట్టుగా మనకు ఆస్కార్ ఘనంగా దక్కింది. ఏనుగులు– మావటీలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కాని వారి మధ్య ఉన్నది ఒక రకమైన ప్రొఫెషనల్ స్నేహం. కాని కొన్ని సందర్భాలలో అనాథలైన ఏనుగు పిల్లలను కాపాడే పని ఆదివాసీలు తీసుకుంటారు. వారిది పెంచిన మమకారం. ఆ మమకారమే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథాంశం. దర్శకురాలు కార్తికీది ఊటి. అక్కడే పుట్టి పెరిగింది. ఊటీకి అరగంట ప్రయాణ దూరంలో ‘తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్’ ఉంది. అక్కడ ఏనుగులను సంరక్షిస్తుంటారు. కార్తికి గోంజాల్వేజ్ చిన్నప్పటి నుంచి ఆ క్యాంప్‌కు వెళ్లి ఏనుగులను చూసేది. ఆ తర్వాత ఆమె పెరిగి పెద్దదయ్యి ఫొటోగ్రాఫర్‌గా మారినా, కెమెరా ఉమన్‌గా తనకున్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇష్టం వల్ల యానిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్‌లో పని చేసినా ఎప్పుడూ తన ప్రాంత ఏనుగుల మీద ఏదైనా ఫిల్మ్ చేయాలని అనిపించలేదు. కాని 2017లో అందుకు బీజం పడింది. అతడు – ఆ ఏనుగు పిల్ల కార్తికి గోంజాల్వేజ్ 2017లో బెంగళూరు నుంచి కారులో ఊటీకి వెళుతోంది. ఊటీ చేరుకుంటూ ఉండగా ఒక మనిషి చిన్న ఏనుగు పిల్లను నడిపించుకుంటూ వెళుతూ ఆమె కంట పడ్డాడు. కార్తికి వెంటనే కారు ఆపి ఈ మనిషి ఈ ఏనుగు పిల్లను ఎక్కడకు తీసుకువెళుతున్నాడు అని వెంబడించింది. వారిద్దరూ దగ్గరిలోని ఏటికి వెళ్లారు. ఆ మనిషి ఆ ఏనుగు పిల్లకు చంటిపిల్లలకు మల్లే స్నానం చేయించాడు. దానితో ఎన్నో కబుర్లు చెప్పాడు. ‘అరె.. ఈ బంధం భలే ఉందే’ అనిపించింది కార్తికికి. అతణ్ణి పలకరించింది. పేరు బొమ్మన్. ఆ ఏనుగు పిల్ల పేరు రఘు. ఆ ఏనుగు పిల్ల ఇటీవలే అనాథ అయ్యింది. పంటలను కాపాడుకోవడానికి పెట్టిన కరెంటు తీగల బారిన పడి రఘు తల్లి మరణించింది. అనాథ అయిన రఘు తల్లి వియోగంతో కృశించి చావుకు దగ్గరగా ఉండగా బొమ్మన్‌కు కనిపించాడు. దానిని ఇంటికి తీసుకెళ్లాడు. బొమ్మన్ భార్య బెల్లి రఘుకు తల్లిలా మారింది. ఆ ముగ్గురు ఒక కుటుంబం అయ్యారు. ఇలాంటి అనుబంధాలు చూపితే మనిషి, జంతువు కలిసి మెలిసి మనుగడ సాగించాల్సిన అవసరాన్ని చూపినట్టు అవుతుందని కార్తికి అనుకుంది. వెంటనే డాక్యుమెంటరీ నిర్మించడానికి నెట్‌ఫ్లిక్స్‌ను సంప్రదించింది. నెట్‌ఫ్లిక్స్ తన కో ప్రొడ్యూసర్‌గా నిర్మాత మోంగాను సంప్రదించింది. అలా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాణం మొదలైంది. ఢిల్లీకి చెందిన గునీత్ దాదాపు పదేళ్లుగా అంతర్జాతీయ దృష్టి పడే సినిమాల నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. ఆమె నిర్మాణ భాగస్వామి అయిన ‘కవి’ (2010) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌లో ఆస్కార్ నామినేషన్ పొందగా, ‘పిరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ (2018) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌గా ఆస్కార్ అవార్డ్ పొందింది. అయితే ‘పిరియడ్’కు పని చేసిన సాంకేతిక నిపుణులు భారతీయులు కారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను తీయాలనుకుంటున్న కార్తికితో పని చేయడం వల్ల ఈసారి పూర్తి భారతీయ నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని గునీత్ భావించింది. అలా వీరిద్దరు కలిసి పూర్తి చేసిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 8, 2022న విడుదలైంది. ఇది డాక్యుమెంటరీ వేవ్ ‘ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నది డాక్యుమెంటరీ వేవ్. ఫీచర్ ఫిల్మ్స్‌లో కన్నా డాక్యుమెంటరీలో భారతీయ దర్శక నిర్మాతలు వినూత్నమైన కథాంశాలను చెబుతున్నారు’ అంటుంది గునీత్. కార్తికి మాట్లాడుతూ– ‘ఏనుగులు ఎంత తెలివైనవో ఎంత భావోద్వేగంతో బంధంతో ఉంటాయో నా డాక్యుమెంటరీలో చూపించాను. ఇక మీదటైనా అవి వేరు మనం వేరు అనుకోకపోతే చాలు’ అంది. ‘నేను తీసే ఫిల్మ్స్ ఇకపై కూడా ఇలాంటి కథాంశాలతో ఉంటాయి’ అన్నారు. చదవండి: ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ -
Natu Natu: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఆస్కార్ ఊరికే రాలేదు..
‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్ చేశారు. పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్ అంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జెలెన్స్కీ ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ అట. సో.. ఆర్ట్ గురించి ఆయనకు అవగాహన ఉండటంతో పాటను చిత్రీకరించేందుకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు..’ పాటను 17 రోజుల పాటు షూట్ చేశారు. సెట్స్‌లో ప్రతి రోజూ 150మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 200మంది సాంకేతిక నిపుణులు ఈ పాట కోసం లొకేషన్లో హాజరయ్యారు. ఇక ఈ పాటలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ‘హుక్ స్టెప్’ గురించి. దాదాపు 80 రకాల స్టెప్స్‌ను కంపోజ్ చేశాక ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అండ్ టీమ్ ఆ స్టెప్‌ను ఫైనలైజ్ చేశారు. ఈ స్టెప్ కూడా ఊరికే పూర్తి కాలేదు. డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు 18 టేక్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య సింక్ రావడానికి ఎక్కువ సమయం పట్టిందట. ఇలా వీరందరి కష్టం ఇప్పడు ఆస్కార్ అవార్డు రూపంలో ఫలించింది. అలాగే ఈ పాట కోసం దాదాపు రూ. 15 కోట్లు అయింది. నిజానికి ఈ పాటను ముందుగా ఇండియాలోనే షూట్ చేయాలనుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లొకేషన్‌ను అనుకున్నారు. కానీ ఆ సమయానికి వర్షాకాలం కావడంతో ఇతర దేశాల్లో తీయాలనుకున్నారు రాజమౌళి. సెట్ అయితే సహజంగా ఉండదని భావించారు. ఆ సమయంలోనే జెలెన్స్కీ భవనం లొకేషన్ రాజమౌళి కంట పడింది. అక్కడే పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ అనుమతులు దొరకవని అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ టీమ్ వల్ల అది సాధ్యమైంది. అలాగే పాట సమయంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు సైడ్ డ్యాన్సర్స్‌కు కూడా రెండు, మూడు కాస్ట్యూమ్స్‌ను రెడీగా ఉంచారు. ఎందుకంటే సాంగ్‌ను దుమ్ములో తీశారు. కాస్ట్యూమ్స్ పాడైతే షూటింగ్ లేట్ అవుతుందని. ఈ సినిమాకు రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ‘ఆర్ఆర్ఆర్’లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్ తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు భారతీయులకు పూర్తి నమ్మకం కలిగింది. – ఎన్టీఆర్ మనం గెలిచాం. మన ఇండియా సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్‌ను ఇంటికి తెచ్చేస్తున్నాం. మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘ఆర్ఆర్ఆర్’ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేనింకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణిగార్లు భారత చలనచిత్రపరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు..’ అనేది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్‌రక్షిత్‌లకు థ్యాంక్స్. నా బ్రదర్ ఎన్టీఆర్, కో స్టార్ ఆలియాభట్‌కు «థ్యాంక్స్. తారక్.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ఈ అవార్డు భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సొంతం. నా భార్య (ఉపాసన)కు ఆరో నెల. మా బేబీయే మాకీ అదృష్టాన్ని తెచ్చిందనుకుంటున్నాను. – రామ్‌చరణ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ..
‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ. క్లాస్, మాస్ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్‌ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ 95వ ఆస్కార్ అవార్డు విశేషాలు తెలుసుకుందాం... అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్‌తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘ నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్‌పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ ఒరిజినల్‌సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్) ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్) ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్) ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) బెస్ట్ సౌండ్: టాప్‌గన్: మ్యావరిక్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) హోస్ట్ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం ఆస్కార్ వేడుక ప్రారంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్ జిమ్మి ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్ను తప్పుపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు హోస్ట్ అయిన జిమ్మీ బాలీవుడ్ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శించారు. డు యూ నో నాటు? ‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కి ఓ ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా పదుకోన్ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్ డ్యాన్సర్స్ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేడుకల్లో భారత్‌కు రెండు కేటగరీల్లో అవార్డులు దక్కాయి. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చింది. అలాగే అందరి దష్టిని ఆకర్షించిన మరో చిత్రం ఒకటుంది. ఆర్ఆర్ఆర్తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ షార్ట్ ఫిలింలో ప్రధాన పాత్రలో కనిపించిన బెల్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఆస్కార్ రావడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఆస్కార్ అంటే ఏంటో తెలియదు ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా ఈ చిత్రంలో నటించిన బెల్లీ భర్త మాత్రం.. తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పింది. అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2023లో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డ్ దక్కించుకుంది. -
RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు: దిల్ రాజు
నేహా, వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్య పాత్ర పోసిస్తున్నారు. ఈ సినిమాతో శివమ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించారు. గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్‌లు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'RRR సినిమాకు ఆస్కార్ ఆవార్డ్‌తో ప్రపంచం వ్యాప్తంగా తెలుగు సినిమాకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రబృందానికి నా ధన్యవాదములు. నా చిన్నతనంలో శివ కృష్ణ సినిమాలు ఆడపడుచు, అనాదిగా ఆడది లాంటి సినిమాలు విపరీతంగా నచ్చేవి. ఇలాంటి చిన్న పిల్లలు సినిమాలు తియ్యాలని ప్రోత్సహిస్తున్న శివ కృష్ణకు ధన్యవాదాలు. చిన్న సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. లిటిల్ సోల్జర్స్, అంజలి సినిమాలు చాలా ఇష్టం. మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర నిర్మాతలు కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్ మాట్లాడుతూ.. 'మేము తీస్తున్న తొలి చిత్రం "లిల్లీ". ఈ సినిమాతో పాటు తమిళంలో రంగోలి సినిమా చేస్తున్నాం. దర్శకుడు శివమ్ చిన్న పిల్లలపై సినిమా చేద్దాం అన్నారు. కథ నచ్చడంతో తనను దర్శకుడుగా పరిచయం చేస్తూ తీశాం. ఈ సినిమాలో సీనియర్ నటులు శివకృష్ణ చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇందులో నటించిన వారందరూ చిన్న పిల్లలు చక్కగా నటించారు. మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.' అని అన్నారు. నటుడు శివకృష్ణ మాట్లాడుతూ..'RRR ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన రాజమౌళి టీమ్‌కు అభినందనలు. ఎన్నో సినిమాలు చేస్తూ ఎంతో మందికి అవకాశాలిస్తున్న దిల్ రాజుకు థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో నా మనువడు వేదాంత్ వర్మ కూడా ఎంతో చక్కగా నటించారు. తనతో పాటు నేహ, దివ్య లు చాలా బాగా నటించారు. ఈ ముగ్గురు ‘లిల్లీ' చిత్రంతో నటులుగా పరిచయం అయినందుకు సంతోషంగా ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ లిల్లీ చిత్రం బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. చిత్ర దర్శకుడు శివమ్ మాట్లాడుతూ..'మన తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి టీంకు ధన్యవాదములు. నేను ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయ్యింది. దిల్ రాజు తన సినిమాల ద్వారా ఎంతోమంది రైటర్స్, దర్శకులకు, కార్మికులకు ఉపాధినిచ్చారు. మా లిల్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా కంట తడి పెట్టకుండా బయటికి పోరు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.' అని అన్నారు.