అమెరికాలోని లాస్ ఎంజిల్స్ జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేడుకల్లో భారత్‌కు రెండు కేటగరీల్లో అవార్డులు దక్కాయి. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్‌లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చింది. అలాగే అందరి దష్టిని ఆకర్షించిన మరో చిత్రం ఒకటుంది. ఆర్ఆర్ఆర్‌తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'.
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ షార్ట్ ఫిలింలో ప్రధాన పాత్రలో కనిపించిన బెల్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఆస్కార్ రావడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్.
ఆస్కార్ అంటే ఏంటో తెలియదు
ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా ఈ చిత్రంలో నటించిన బెల్లీ భర్త మాత్రం.. తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పింది.
అసలు కథేంటంటే..
తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2023లో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డ్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment