Oscar Award
-
97వ ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో 207 సినిమాలు
-
ఆస్కార్ కు ట్రై చేద్దాం అంటున్న అల్లు అర్జున్
-
గ్రూప్-3 పరీక్షలో ఆస్కార్, జాతీయ అవార్డ్స్‌పై సినిమా ప్రశ్నలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ అవార్డ్స్ గురించి ఒక ప్రశ్న రాగా.. ఆస్కార్ అవార్డ్స్ గురించి మరో ప్రశ్న రావడం జరిగింది. నవంబర్ 17,18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్ష నిర్వహిస్తుంది. అయితే, ఈ ఆదివారం ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు సినిమా పరిశ్రమ నుంచి ఈ క్రింది ప్రశ్నలు రావడం జరిగింది.1. కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది ?A) ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్B) ఆట్టంC) బ్రహ్మాస్త్ర D) కాంతార2. ఆస్కార్ అవార్డు -2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం 'టు కిల్ ఎ టైగర్' దర్శకుడు ఎవరు ?A) ఆర్. మహదేవన్B) నిఖిల్ మహాజన్C) కార్తికి గొన్సాల్వ్స్D) నిషా పహుజాఆస్కార్ 2024, 70వ జాతీయ ఆవార్డ్స్ ప్రకటన కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ రెండు ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలిసే ఉండవచ్చు. ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం 'ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్'. ఇదీ మరాఠీ చిత్రం. రెండో ప్రశ్నకు జవాబు 'నిషా పహుజా'. రంజిత్ అనే రైతు 13 ఏళ్ల కూతురు సామూహిక అత్యాచారానికి గురైన కేసుపై తీసిన సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
‘లాస్ట్ లేడీస్’ కోసం మహిళలందరూ సపోర్ట్ చేయాలి: కిరణ్ రావు
‘లాపతా లేడీస్’ పేరు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’గా మారిపోయింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంతా, ఛాయా కందం లీడ్ రోల్స్‌లో నటుడు ఆమిర్ ఖాన్ సతీమణి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్ (తప్పిపోయిన మహిళలు అని అర్థం). ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 1న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే వచ్చే ఏడాది అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం నామినేషన్ కోసం ఇండియా అఫీషియల్ ఎంట్రీగా ‘లాపతా లేడీస్’ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. కాగా ‘లాపతా లేడీస్’ అనే హిందీ టైటిల్ అంతగా రిజిస్టర్ కాదేమోనని, ఈ సినిమాకు ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ లేడీస్’ అనే టైటిల్ పెట్టి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే అమెరికాలోని కొన్ని లొకేషన్స్‌లో ‘లాస్ట్ లేడీస్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా కిరణ్ రావ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘లాస్ట్ లేడీస్’ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రం కాబట్టి మహిళలందరూ మా సినిమాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మంచి సందేశాత్మక చిత్రం కాబట్టి ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా కథ విన్న వెంటనే నాకు వినోదాత్మకంగా అనిపించింది. పైగా పలు ముఖ్యమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. మహిళా సాధికారిత, స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాడుతున్న మహిళలకు పురుషులు సపోర్ట్ చేయడం అనే పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఆమీర్‌ఖాన్. -
అస్కార్ బరిలో ఇండియన్ షార్ట్ ఫిలిం
‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ అనే ఇండియన్ షార్ట్ ఫిలిం 2025 ఆస్కార్‌కు అర్హత సాధించింది. చిదానంద S నాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ రేసుకు అర్హత దక్కించుకుందని తాజాగా చిత్ర నిర్మాత తెలిపారు. పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడిన ఈ చిత్రం ఆస్కార్ బరిలో ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లైవ్ యాక్షన్ విభాగంలో తమకు అవకాశం దక్కినట్లు నిర్మాత పేర్కొన్నారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ చిత్రం అవార్డ్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు. ఓ వృద్ధురాలి కోడిని కొందరు దొంగలించడంతో కథ ప్రారంభం అవుతుంది. ఎలాగైనా సరే దానిని కనుగొని ఆ కోడిని తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమెపడే తపనను ఇందులో దర్శకుడు చూపారు. ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సత్తా చాటిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ చిత్రం.. ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకుంటుందని ఆశిస్తున్నారు.మైసూర్‌కు చెందిన నాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే MBBS పూర్తి చేసిన ఆయన సినిమా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తున్నారు. ఆయన నిర్మించిన సినిమా ఆస్కార్‌కు అర్హత సాధించడంతో తన సొంత ఊరు అయిన శివమొగ్గలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత్ నుంచి 'లాపతా లేడీస్' అస్కార్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమిర్‌ఖాన్ మాజీ సతీమణి కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. -
భారత్ నుంచి ఆస్కార్ కోసం నామినేట్ అయిన చిత్రాలు ఇవే
ఆస్కార్ అవార్డుల రేస్‌లో ఈ ఏడాది సౌత్ ఇండియా నుంచి భారీగానే సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు,తమిళ్, మలయాళం నుంచి పలు సినిమాలు ఎంట్రీ కోసం ఊరిస్తున్నాయి. 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలను గుర్తించి వాటిని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈమేరకు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్' ఎంపికైనట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి పలు భాషలకు చెందిన 29 చిత్రాల్లో లా పతా లేడీస్‌ను మాత్రమే ఎంపిక చేశారు.అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు 'కల్కి 2898 ఏడీ,హనుమాన్,మంగళవారం' ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. మలయాళం నుంచి ఆట్టం, ఆడుజీవితం (ది గోట్ లైఫ్),ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ ఇండియా నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే, భారతీయ చిత్ర పరిశ్రమ పంపిన 29 సినిమాల్లో ప్రస్తుతానికి లపతా లేడిస్ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది. 🤞🏼 pic.twitter.com/YgdeaTsTNi— Prasanth Varma (@PrasanthVarma) September 23, 2024 -
సొంతూరు కోసం మంచి మనసు చాటుకున్న చంద్రబోస్
ప్రముఖ సినీ రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో ఆస్కార్ గ్రంథాలయం నిర్మించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో తన గ్రామ ప్రజలు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా చల్లగరిగెలో తనకు దక్కిన గౌరవానికి గుర్తుగా 'ఆస్కార్ గ్రంథాలయం' ఏర్పాటు చేస్తానని చంద్రబోస్ మాట ఇచ్చారు. గ్రామంలో ఇది వరకే ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి రూ. 36 లక్షలతో కొత్త భవనాన్ని ఆయన నిర్మించారు.నేడు జులై 4న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా ఆ గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు. రెండంతస్తులతో అన్ని వసతులతో దానిని ఆయన నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న గ్రామంలోని యువకులకు అవసరమయ్యే అన్నీ పుస్తకాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు.సుమారు 30 ఏళ్ల కెరీర్లో సినీ పాటల రచయితగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు చంద్రబోస్. 860 సినిమాల్లో 3600కిపైగా పాటలు ఆయన రాశారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టిన చంద్రబోస్ అసామాన్యంగా చిత్రసీమలో ఎదిగారు. రాబోవు తరాల కవులకి ఆయన జీవితం, ప్రయాణం ఆదర్శవంతం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన రచించిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. కొండపొలం (2021) సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు ఎస్సార్ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ఆయన అందుకున్నారు. -
రాజమౌళి దంపతులకు ఆస్కార్ నుంచి ఆహ్వానం..
ఆస్కార్.. ఎంతోమంది కలలు గనే ఈ అవార్డు గతేడాది ఇండియన్ సినిమాను వరించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ విభాగంలో అకాడమీ పురస్కారం లభించింది. అంతేగాక ఈ సినిమా టీమ్ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు శిరిల్ గతేడాది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏమ్పీఏఎస్) లో సభ్యత్వం సాధించారు.ఇప్పుడు ఆ జాబితాలో రాజమౌళి దంపతులు చేరారు. దర్శకత్వ కేటగిరీలో జక్కన్న, కాస్ట్యూమ్ డిజైనర్ లిస్టులో ఆయన భార్య రమా రాజమౌళి అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది అకాడమీ.. 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆహ్వానం పంపింది. వీరిలో భారత్ నుంచి రాజమౌళి దంపతులతో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, బాలీవుడ్ నటి షబానా అజ్మీ, సినిమాటోగ్రాఫర్ రవి వర్మ, దర్శకనిర్మాత రీమా దాస్, నిర్మాత రితేశ్ సిద్వానీ తదితరులు ఉన్నారు. సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ సినిమా(#SSMB29) చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by The Academy (@theacademy) చదవండి: ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్! -
బంగారం లాంటి అవకాశం
నేత్ర గురురాజ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. బెంగళూరుకు చెందిన ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. డైరెక్టర్‌గా, రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా... ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ‘చాప్టర్ 1, ఆల్ఫా 27, అస్ట్రాలజర్స్ లక్కీ డే, జాస్మిన్ ఫ్లవర్స్’ వంటి నాలుగు షార్ట్ ఫిలింస్‌కి పని చేశారు నేత్ర. ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి కథ అందించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగా చేశారు. ‘చాప్టర్ 1’లో విద్యార్థినిగా నటించారు. ‘ఆల్ఫా 27’కి కెమెరా, ఎలక్ట్రికల్ డి΄ార్ట్మెంట్లో పని చేశారు. ‘అస్ట్రాలజర్స్ లక్కీ డే’కి దర్శకత్వం వహించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగానూ వ్యవహరించారు. ఈ చిత్రానికి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరూపించుకుంటున్న నేత్ర గురురాజ్ తాజాగా ఆస్కార్ అకాడమీ తరఫున గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కడం చిన్న విషయం కాదు. ప్రపంచ దేశాల్లో సినిమా రంగానికి చెందిన ప్రతిభ గల యువ ఛాయాగ్రాహకులను ఎంపిక చేసి, రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల దగ్గర మెళకువలు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కొన్ని నెలల క్రితం సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేయడానికి లాస్ ఏంజిల్స్ వెళ్లిన నేత్ర ‘జాస్మిన్ ఫ్లవర్స్’తో తన కెమెరా పనితనాన్ని చాటుకున్నారు. అదే ఆమెకు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కేలా చేసింది. బంగారంలాంటి ఈ అవకాశం దక్కించుకున్న నేత్రకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆస్కార్ విజేత మృతి!
హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆస్కార్ అవార్డ్ విన్నర్, చిత్రనిర్మాత ఆల్బర్ట్ ఎస్ రడ్డీ కన్నుమూశారు. అనారోగ్యంతో లాస్ఎంజిల్స్లోని ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆల్బర్ట్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. ది గాడ్‌ఫాదర్, మిలియన్ డాలర్ బేబీ లాంటి చిత్రాలకు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. అల్ రడ్డీ సిట్కామ్ హొగన్ హీరోస్, డ్రామా వాకర్, టెక్సాస్ రేంజర్, ది లాంగెస్ట్ యార్డ్ లాంటి సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన బ్యాడ్ గర్ల్స్ (1994) చిత్రాన్ని కూడా నిర్మించాడు. ముఖ్యంగా మహిళా ప్రధాన పాత్రలతో మొదటి పాశ్చాత్య చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత బేస్ బాల్ కామెడీ ది స్కౌట్ (1994), మటిల్డా (1978) లాంటి కామెడీ ఓరియంటెస్ సినిమాలు నిర్మించారు. వీటితో పాటు డెత్ హంట్, మెగాఫోర్స్ , లాస్సిటర్, లేడీబగ్స్ , ప్రిజనర్స్, మీన్ మెషిన్ , కామిల్లె చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.Adiós al gran Albert S. Ruddy, productor (canadiense de nacimiento) con dos Oscars en su haber: EL PADRINO y MILLION DOLLAR BABY. Repitió con Clint Eastwood en CRY MACHO, y nos regaló (también como guionista y argumentista), entre otras pelis, EL ROMPEHUESOS, de Robert Aldrich. pic.twitter.com/gMlIAOMDjN— Fausto Fernández (@faustianovich) May 28, 2024 -
OTT: వందకు పైగా అవార్డ్స్ కొట్టిన సినిమా ఓటీటీలో.. తెలుగులో స్ట్రీమింగ్
ఆస్కార్ అవార్డు దక్కించుకున్న 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' అనే సినిమా 2023లో విడుదలైంది. ఫ్రెంచ్ లీగల్ డ్రామా చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అవార్డును గెలుచుకున్నది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా అవార్డులను గెలుచుకున్న సినిమాగా ఇది రికార్డుకెక్కింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా రిజనల్ భాషలు అయిన తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సాండ్ర హల్లర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఏడాది బెస్ట్ నటిగా ఆమెకే ఆస్కార్ అవార్డు దక్కుతుందని అందరు భావించారు కానీ తృటిలో అవార్డును మిస్సయింది. ఈ చిత్రంలో సాండ్రా హుల్లర్ తన భర్త మరణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రచయితగా నటించారు. మంచుకొండల్లోని తన ఫ్యామిలీతో ఒంటరిగా సాండ్రా జీవిస్తుంటుంది. తన భర్త అనుమానస్పద రీతిలో అక్కడ మరణించడం. ఆ ప్రాంతంలో సాండ్రా తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమె ఈ హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తుంటారు. ఊహలకు అందని ట్విస్ట్‌లతో నడిచే ఈ కథలో అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఈ నేరం నుంచి సాండ్రా ఎలా బయటపడుతుంది అనేది అసలు కథ. -
తడబడినా భలే గమ్మత్తుగా కవర్ చేసింది ఈ ముద్దుగుమ్మ!
ప్రముఖ ఇంటర్నెట్ సెన్సెషన్ యూట్యూబర్, హాలీవుడ్ నటి లిజా కోశి ఆస్కార్ అవార్డు షో కార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ సడెన్‌గా తడబడి పడిపోయింది. అయితే ఆమె మాత్రం ఆ ఘటనను కవర్ చేస్తూ ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. ఆమె అందరిముందు పడిపోవడాన్ని అవమానంగా భావించకుండా చాలా సమయస్ఫూర్తిగా కవర్ చేసుకుంది. అక్కడున్న వాళ్లంతా ఆమె పడిపోయిందని సహాయం చేసేందుకు ముందుకొచ్చిన వాళ్లనే షాక్‌కి గురి చేసింది. వాళ్లు కూడా కాస్త గందరగోళానికి లోనయ్యారనే చెప్పొచ్చు. ఎందుకుంటే? పడిపోయి దాన్నే స్టైయిలిష్‌గా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నట్లు పెట్టడంతో..వాళ్లు పడిపోలేదా? పొరపడ్డామా? అన్నట్టు సందేహంగా చూడటం వాళ్ల వంతయ్యింది. కోశి ఈ వేడుకల్లో ఎరుపు రంగు ఫుల్ లెంగ్త్ గౌనుతో తళుక్కుమంది. అనుకోని ప్రమాదం జరిగినా ముఖంపై ప్రశాంతతను చెదరనివ్వకుండా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఎంతైన నటి కథ ఆ మాత్రం కవర్ చేయాల్సిందే అంటూ సెటైరికల్ కామెంట్లతో పోస్టులు పెట్టారు. Liza Koshy stuns in red dress at The Oscars 2024 #Oscars #Oscars2024 pic.twitter.com/Y1Xlnowt8A — joe (@vetoedjoe) March 10, 2024 (చదవండి: ఆ ఆటో డ్రైవర్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌కి యూకే టూరిస్ట్ ఫిదా!) -
అంగరంగ వైభవంగా ఆస్కార్స్-2024 వేడుక.. ఈ ఫొటోలు చూశారా?
-
ఆస్కార్-2024 అవార్డుల వేడుక.. విజేతలు వీళ్లే
ప్రపంచ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులంటే అందరికీ గుర్తొచ్చేది 'ఆస్కార్'. ఎప్పటినుంచి దీని గురించి మనకు తెలుసు. కానీ 'ఆర్ఆర్ఆర్'కి గతేడాది రావడంతో దీని గురించి సగటు సినీ ప్రేక్షకుడికి కూడా తెలిసింది. ఇప్పుడు 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు ఎవరు? అలానే ఏయే విభాగాల్లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే..? ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్ ఉత్తమ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్: హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా) ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల్ ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ) ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ ఉత్తమ సౌండ్: ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్) ఉత్తమ ఒరిజనల్ స్కోర్: ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్న్) ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ మూవీ) ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్) ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్) ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ చిత్రం: ఓపెన్ హైమర్ -
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికా లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అకాడమీ అవార్డ్స్ వేడుకలను హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాల్గవ సారి హోస్ట్ చేయనున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఈవెంట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలతో వీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది అవార్డులకు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓపెన్‌హైమర్, బార్బీ, మాస్ట్రో, పూర్ థింగ్స్, అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి పోటీ పడుతున్నాయి. ఇండియా నుంచి పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
OTT: సడన్‌గా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ సినిమా
విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్’. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్లో డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ఇప్పటికే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులో చూద్దాం అనుకున్న ప్రేక్షకుల్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా తెలుగు, తమిళ్ వర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. డిస్నీ + హాట్ స్టార్‌లో నేటి నుంచి ‘12th ఫెయిల్’ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఎందరో యువకులు ప్రేరణ చెందారు. సినిమా విషయానికొస్తే.. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు కూడా పోటీపడనుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమాగా ఇది రికార్డ్‌కెక్కింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతోమంది ఈ సినిమాను చూద్దామనుకున్నారు కానీ హిందీ వర్షన్లో ఉండటంతో వీలు కాలేదు.. ఇప్పుడు తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడ వంటి ప్రాంతీయ భాషలలో డిస్నీ + హాట్ స్టార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సినీ ప్రేక్షకులు ఎంతగానో సంతోషిస్తున్నారు. -
ఆస్కార్ నుంచి '2018' సినిమా ఔట్.. ఆ చిత్రానికి దక్కిన ఛాన్స్
ఆస్కార్ 2024 అవార్డుల కోసం భారత్ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్ ‘2018’ అధికారికంగా ఎంపిక కావడంతో భారతీయ చిత్రపరిశ్రమలోని అందరూ చాలా సంతోషించారు. తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో 2018 సినిమా పేరు లేదు. ఇదే విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. జార్ఖండ్ గ్యాంగ్‌రేప్ ఆధారంగా తీసిన 'టు కిల్ ఎ టైగర్' అనే చిత్రం బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరీలో చోటు దక్కింది. టొరంటో ఫిల్మ్ మేకర్ నిషా పహుజా దీన్ని డైరెక్ట్ చేశాడు. 2018 సినిమా ఆస్కార్ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ మూవీ డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టా ద్వారా తన బాధను వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 88 అంతర్జాతీయ భాషా చిత్రాలు పోటీ పడ్డాయని ఆయన తెలిపారు. కానీ ఫైనల్ చేసిన 15 చిత్రాల్లో 2018 సినిమా స్థానాన్ని దక్కించుకోలేకపోయిందని చెప్పారు. అవార్డు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న అందరినీ ఎంతగానో నిరాశపరిచానని. అందుకు గాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా ఆస్కార్ బరిలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన తెలిపాడు. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో '2018'ని ఎంపిక చేశారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కిన ఈ చిత్రం అందరి అభిమానాన్ని పొందింది. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రియల్స్టిక్గా జరిగిన కొన్న సంగటనల ఆధారం చేసుకుని ఈ కథను వెండితెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమాను భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆస్కార్-96 నుంచి ఈ సినిమా తప్పుకోవడంతో భారతీయ చలనచిత్ర అభిమానుల్లో కొంతమేరకు నిరాశ కలిగింది. View this post on Instagram A post shared by Jude Anthany Joseph (@judeanthanyjoseph) -
ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో...
రామ్ చరణ్‌కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన ‘మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’ జాబితాలో రామ్‌చరణ్‌కి సభ్యత్వం దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను చరణ్‌కి ఈ స్థానం లభించింది. కాగా ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఆ మధ్య విడుదల చేసిన యాక్టర్స్ బ్రాంచ్‌లో తెలుగు నుంచి ఎన్టీఆర్‌కి చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా రామ్‌చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులకు ఈ కమిటీలో చోటు దక్కింది. ‘‘ఈ నటులు వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. వారి కళతో సాధారణ సినిమాతో ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా ఆస్కార్ అకాడమీ ప్రతినిధులు షేర్ చేశారు. కాగా 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. -
రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో రామ్ చరణ్‌కు చోటు దక్కింది. 'వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. అంకితభావంతో బాగా హావభావాలను ప్రదర్శించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) ఇక 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ లిస్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే జూ. ఎన్టీఆర్‌కు అందులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో వారి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో 'గేమ్ ఛేంజర్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీని షూటింగ్ హైదరాబాద్ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేయనున్నన్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో హీరోయిన్గా కియారా అడ్వాణీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2024లో విడుదల కానుంది. -
ఆస్కార్ గెలిచిందని స్థలమిచ్చారు.. ఇప్పుడేమో కూల్చేస్తామంటూ!
2009లో ఆస్కార్ అవార్డ్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం స్మైల్ పింకీ. ఈ చిత్రంలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన పింకీ జీవితం ఆధారంగా మెగాన్ మైలాన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన ఆరేళ్ల పాప పేరు పింకీ సోంకర్. ఆమె తన తండ్రితో కలిసి ఆస్కార్ అవార్డ్‌ను అందుకుంది. ఈ డాక్యుమెంటరీతో దేశ వ్యాప్తంగా పింకీ పేరు మారుమోగిపోయింది. అయితే పింకీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. వీరి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెలో నివసిస్తోంది. అయితే గతంలో ఆస్కార్ అవార్డ్ వచ్చినందుకు పింకీ కుటుంబానికి అధికారులు కొంత భూమిని ఇచ్చారు. ప్రస్తుతం అదే స్థలంలో ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తోంది పింకీ ఫ్యామీలీ. అయితే తాజాగా ఈ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ అధికారులు ఇచ్చిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. యూపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా పింకీ ఫ్యామిలీకి కూడా ఇంటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు నోటీసులిచ్చారు. మీర్జాపూర్ జిల్లా ధాబీ గ్రామంలో చాలామందికి అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఇంటిని నిర్మించామని చెబుతున్నారు. ఆస్కార్ విజేత ఇంటిని కూల్చివేస్తామనడం యూపీతో పాటు దేశంలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. 2008లో స్మైల్ పింకీ డాక్యుమెంటరీలో నటించినప్పుడు ఆ పాప వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం 20 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నారు. ఇప్పుడు 12వ తరగతి చదువుతోంది. మా కుటుంబ అవసరాలు తీర్చేందుకు నాన్న పండ్లు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారని గతంలో పింకీ వెల్లడించింది. -
ఆస్కార్ బరిలో మన 'బలగం'.. టాలీవుడ్ నుంచి ఆ రెండే!
ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. మరోవైపు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు సైతం ఈ అవార్డ్ దక్కింది. ఈ ఏడాది భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ఛెల్లో షో ను పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఎలాంటి అవార్డు లభించలేదు. (ఇది చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుక కోసం అప్పుడే సందడి మొదలైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్-2024 ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ విభాగంలో మన టాలీవుడ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్కార్ ఎంట్రీ కోసం దాదాపు 22 చిత్రాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నైలో వీక్షిస్తున్నారు. ఈ చిత్రాలు చూసిన తర్వాతే ఉత్తమ చిత్రం ఎంపిక చేయనున్నారు. ఆస్కార్ ఎంట్రీకి వచ్చిన సినిమాలివే!! దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా (తెలుగు), బలగం(తెలుగు), ది స్టోరీ టెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 12 ఫెయిల్ (హిందీ), ది కేరళ స్టోరీ, విడుదలై పార్ట్-1 (తమిళం), ఘూమర్ (హిందీ), వాల్వి (మరాఠీ), గదర్-2 (హిందీ), అబ్ థో సాబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లాయక్ (మరాఠీ), రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, జ్విగాటో చిత్రాలు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: రైతుబిడ్డకు 26 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి? స్పందించిన ప్రశాంత్ తండ్రి) బలగం సినిమాకే ఛాన్స్!! ఈ సారి టాలీవుడ్ నాని సూపర్ హిట్ దసరా, చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన బలగం పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాతే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. కాగా.. ఇప్పటికే బలగం చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వరించి సంగతి తెలిసిందే. దీంతో బలగం మూవీ ఆస్కార్ ఎంట్రీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆస్కార్ టార్గెట్ గా తెరకెక్కుతున్న సినిమాలు
-
ఈడెన్‌బర్గ్ కామెడీ అవార్డుని గెలుచుకున్న తొలి భారతీయురాలు!
కామెడీ చేసే స్త్రీలు తక్కువ. దానికి కారణం ఎప్పటి నుంచో స్త్రీల నవ్వు మీద అదుపు ఉండటమే. నవ్వని స్త్రీలు ఎదుటి వారిని ఏం నవ్విస్తారు? థ్యాంక్స్ టు స్టాండప్ కామెడీ. ఇటీవల కొంతమంది స్టాండప్ కామెడీలో పేరు గడిస్తున్నారు. ముంబై కమెడియన్ ఉరుజ్ అష్వాక్ ఏకంగా ఈడెన్‌బర్గ్ కామెడీ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు ఇలా భారతీయులకు రావడం ఇదే మొదటిసారి. ‘ఈడెన్ బర్గ్ కామెడీ అవార్డ్స్’ను కామెడీ ఆస్కార్గా భావిస్తారు. అందువల్ల 28 ఏళ్ల ఉరుజ్ అష్వాక్ 2023 సంవత్సరానికి ‘బెస్ట్ న్యూకమర్’ అవార్డును గెల్చుకోవడం చాలా పెద్ద విషయంగా చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం ఈడెన్‌బర్గ్‌లో జరిగే జూలై, ఆగస్టుల్లో జరిగే ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఒక రకంగా సంప్రదాయ ఫెస్టివల్స్ మీద తిరుగుబాటు లాంటిది. ఇక్కడ ఎంట్రీలు, ఎగ్జిట్లు ఉండవు. ఎవరైనా వచ్చి తమ కళను ప్రదర్శించవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్త కళకారులు భారీగా తరలివచ్చి తమ కళలను ప్రదర్శిస్తుంటారు. వాటిని చూడటానికి జనం పోటెత్తుతారు. ఈ సందర్భంగానే కామెడీ అవార్డ్స్ ఇస్తారు. ఈసారి ఉరుజ్ అష్వాక్ చేసే ‘ఓ.. నో’ అనే షో బెస్ట్ న్యూ కమర్ అవార్డ్ గెల్చుకుంది. భారతీయులలో అందునా స్త్రీలలో ఇలా అవార్డు గెలుచుకున్నవారు ఇంతకు మునుపు లేరు. అబూదాబి నుంచి ఉరుజ్ అష్వాక్ అబూదాబిలో పుట్టి పెరిగి స్వదేశమైన భారత్‌కు తల్లిదండ్రులతో పాటు 12 ఏళ్ల వయసులో తిరిగి వచ్చింది. ఆ తర్వాత చదువంతా ముంబైలో సాగించింది. చిన్నప్పటి నుంచి చాలా మాటకారి అయిన ఉరుజ్ సైకాలజీలో డిగ్రీ చేశాక 2014 నుంచి స్టాండప్ కామెడీ చేయడం మొదలెట్టింది. స్టాండప్ కామెడీ అప్పుడప్పుడే ఒక ఉపాధిగా మారుతున్నా అది మగవాళ్ల వ్యవహారంగానే ఉండింది. అందువల్ల ఆమెకు కంటెంట్ రాసే పని ఎక్కువగా దొరికేది తప్ప షో దొరికేది కాదు. అయినప్పటికీ ఉరుజ్ చిన్నా చితకా సందర్భాలలో దొరికిన సమయంలో నవ్వించే ప్రయత్నం చేసేది. అయితే 2017 కేవలం మహిళా స్టాండప్ కమెడియన్స్ కోసం నిర్వహించిన ‘క్వీన్స్ ఆఫ్ కామెడీ’లో ఉరుజ్ చేసిన కామెడీ విపరీతంగా గుర్తింపు పొందింది. ఇక ఆమె వెను తిరిగి చూళ్లేదు. మైక్రోఫోనే ఆయుధం స్టాండప్ కామెడీ చేసేవాళ్ల దగ్గర మైక్రోఫోన్ తప్ప వేరే ఆయుధం ఉండదు. ఆ మైక్రోఫోన్లో వారు పలికే ప్రతి మాట ఎదురుగా ఉన్న ఆడియెన్స్‌ను వ్యంగ్యంగా, పదునుగా తాకి హాస్యం పుట్టించాలి. అయితే ఇక్కడ మనోభావాలు దెబ్బ తీయకూడదు. అలాగే పిచ్చి జోకులు వేయకూడదు. అలా చేస్తే నవ్వు కాస్త నవ్వుల పాలవుతుంది. అయితే ఉరుజ్ ప్రత్యేకత ఏమిటంటే ఆమె చాలా వేగంగా మాట్లాడుతూ సందర్భానికి తగినట్టుగా పంచ్ వేసి ఆకట్టుకుంటుంది. ఆమెవన్నీ స్వీయ జీవితంలోని సంఘటనలే. వాటినే చెప్తూ నవ్విస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలోని మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో చెప్తే అందరూ భుజాలు తడుముకుంటూ వింటారు. ‘క్యాజువల్ రిలేషన్షిప్స్’ పేరుతో ఈకాలపు స్త్రీ–పురుష సంబంధాలను ఆమె విమర్శించే తీరు ఆలోచింప చేసింది. తనను తాను నాస్తికురాలిగా చెప్పుకునే ఉరుజ్ నిర్బంధ సంప్రదాయాలపై కూడా జోకులు పేల్చడం కద్దు. ‘మర్యాదస్తులను ఒక్కోసారి చిన్నబుచ్చడానికి వెనుకాడను. సరిహద్దుల్లోనే ఉంటే హాస్యం పుట్టదు. గీత దాటాలి’ అనే ఉరుజ్ కత్తి మీద సాము వంటి హాస్యంలో ఒక స్త్రీగా రాణిస్తూ ఉండటం కచ్చితంగా మెచ్చుకోవాల్సిన సంగతి. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
కీరవాణి 'ఆస్కార్'పై కేంద్ర మంత్రి కామెంట్స్
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిని ఆస్కార్ అవార్డు ఆలస్యంగానే వచ్చిందని కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి ఎల్.మురుగన్ అన్నారు. నిర్మాత కేటీ కుంజుమన్ 1993లో నిర్మించిన చిత్రం జెంటిల్మెన్. నటుడు అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం అప్పట్లో సంచల విజయాన్ని సాధించింది. 30 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. దీనికి గోకుల్ కృష్ణ దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్) చేతన్ శీను, నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈచిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం చైన్నె ఎగ్మూర్‌లోని రాజా ముత్తయ్య హాల్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్న ఈ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణిని ఘనంగా సత్కరించారు. కేంద్రమంత్రి మురుగన్ మాట్లాడుతూ.. తమిళ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని అన్నారు. తమిళ ఇండస్ట్రీ ఇలా పేరు తెచ్చుకోవడంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ పాత్ర చాలా ఉందని గుర్తుచేసుకున్నారు. నిర్మాత కుంజుమన్ మంచి చిత్రాలను నిర్మిస్తున్నారని, సంగీత దర్శకుడు కీరవాణి 33 ఏళ్లుగా సంగీత రంగంలో ఉన్నారని అన్నారు. ఆయనకు ఆస్కార్ అవార్డు ఎప్పుడో రావాల్సిందని, ఇప్పుడు కొంచెం ఆలస్యంగా వచ్చిందనే అభిప్రాయాన్ని మురుగన్ వ్యక్తం చేశారు. ఆయన్ని ఆశీర్వదించడానికి తనకు వయస్సు చాలదని చెప్పుకొచ్చారు. జెంటిల్మెన్ సీక్వెల్ చిత్రం ఘనవిజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు) -
ఆల్‌రౌండర్‌గా అందరినీ తనపైపు తిప్పుకున్న శాంతి బాలచంద్రన్
ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చే వాటిలో ముందుండేది సినిమా ఇండస్ట్రీనే. అలా కోలీవుడ్‌లో సినిమాకు అవసరమైన అన్ని విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంటూ ఎదుగుతున్న నటి శాంతి బాలచంద్రన్. ఈమె సమీపకాలంలో నటించిన వెబ్ సిరీస్ స్వీట్ కారం కాఫీ. అమెజాన్ ప్రైమ్ టైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇందులో నివీ పాత్రకు ప్రేక్షకులు, విమర్శల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. (ఇదీ చదవండి: జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు) ఇకపోతే అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుకు పంపబడ్డ జల్లికట్టు చిత్రంలో సోఫియా పాత్రలో నటించిన శాంతి బాలచంద్రన్ నటన ప్రత్యేకంగా నిలిచిపోయింది. అలా వైవిధ్యమైన, ఛాలెంజ్‌తో కూడిన పాత్రల్లో. నటిస్తూ సినీ వర్గాల దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ఈమె నటనతో పాటు రచనా, నాటక రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒబ్లివిన్ అనే సంగీత ఆల్బమ్ ద్వారా గీత రచయితగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఏఆర్ రెహామాన్ విడుదల చేసిన ఈ సంగీత ఆల్బమ్ కు మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం ఒక చిత్రానికి సహ దర్శకురాలిగా పని చేస్తున్నారు. అదే విధంగా నటిగా పలు చిత్రాలు చేతిలో ఉన్నాయని, వాటిగురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని నటి శాంతి బాలచంద్రన్ పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించనున్నట్లు ఈమె చెప్పారు. -
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !
ఆర్ఆర్ఆర్తో పాటు ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులను సంరక్షించే గిరిజన దంపతుల జీవనం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే దీన్ని తెరకెక్కించిన కార్తికి గోంజాల్వెస్ తీరు పట్ల ఇటీవలే ఈ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తే ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయంతోపాటు కలెక్షన్స్‌లోనూ వాటా ఇస్తామని కార్తికి చెప్పిందని బొమ్మన్, బెల్లీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన దంపతులు తమకు డబ్బులు ఇవ్వకుండా దర్శకురాలు మోసం చేసిందని వాపోయారు. అంతే కాకుండా తాము ఖర్చు పెట్టిన కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. (ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!) ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఇప్పటికే గిరిజన దంపతులు దర్శకురాలికి రూ.2 కోట్ల చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు తెలిసింది. ఆస్కార్ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఆమె పురస్కారాలు అందుకున్నారని.. తమకు మాత్రం మొండిచేయి చూపించారంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో బొమ్మన్, బెల్లీ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.2 కోట్ల లీగల్ నోటీసు గురించి తమకు తెలియదని బొమ్మన్ చెప్పినట్లు వెల్లడిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణలపై పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఓ మీడియా ప్రతినిధితో బొమ్మన్ మాట్లాడుతూ..' మా డిమాండ్లు నెరవేరితే కేసును వెనక్కి తీసుకుంటానని నేను చెప్పలేదు. అక్కడ ఏమి జరిగిందో నాకు ఏమి తెలియదు. లీగల్ నోటీసులు పంపినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కార్తీకి నాతో బాగా మాట్లాడారు. అంతే కాకుండా సహాయం చేస్తానని కూడా చెప్పారు. కేసు విషయంలో నేనేం చేస్తా. ఆమె మాకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఉద్యోగం ఇప్పిస్తే చాలు." అని అన్నారు. ఇప్పటికే దీనిపై వివాదం తలెత్తగా.. బొమ్మన్ కామెంట్స్‌తో సీన్ కాస్తా రివర్స్ అయింది. (ఇది చదవండి: మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. -
మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' పేరు వినగానే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై ఈ పేరు మార్మోగిపోయింది. డాక్యుమెంటరీ చిత్రం అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్. (ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే? ) డాక్యుమెంటరీలో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న గిరిజన జంట బొమ్మన్, బెల్లీ. అయితే తాజాగా ఈ జంట దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, చిత్ర నిర్మాణ సంస్థ సిఖ్యా ఎంటర్టైన్మెంట్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆగస్ట్ 4న ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొమ్మన్, బెల్లీ దంపతులు నిర్మాతలు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రీకరణ సమయంలో ఈ జంట.. దర్శకురాలు కార్తికి గోన్సాల్వ్స్‌తో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించారు. దీంతో బొమ్మన్, బెల్లీ సినిమా కోసం వివాహ సన్నివేశం కోసం లక్ష రూపాయలు తాము భరించామని తెలిపారు. ఆ డబ్బులను ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. తన మనవరాలి చదువు కోసం దాచుకున్న రూ. 1 లక్ష ఖర్చు చేసినట్లు బెల్లీ వెల్లడించారు. డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చిన కార్తికి గోంజాల్వెస్ ఆ తర్వాత స్పందించలేదని వాపోయారు. ఆమెను కలిసేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందన లేదన్నారు. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఆస్కార్‌ను తాకడానికి ఒప్పుకోలేదు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత సన్మాన కార్యక్రమంలో బొమ్మన్, బెల్లీ దంపతులు కనీసం అవార్డ్ తాకేందుకు అనుమతించలేదని అన్నారు. ముంబై తిరిగి నీలగిరి రావడానికి కనీసం డబ్బులు కుడా ఇవ్వలేదని వాపోయారు. ఆర్థిక సహాయం కోసం ఆమెను సంప్రదించగా నిరాకరించిందని తెలిపారు. తమకు రెమ్యునరేషన్ కేవలం రూ. 60 మాత్రమే చెల్లించారని తెలిపారు. స్పందించని మేకర్స్ గిరిజన దంపతుల ఆరోపణలపై సిఖ్యా ఎంటర్టైన్మెంట్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఉద్దేశంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఏనుగుల సంరక్షణపై అవగాహన పెంచడం, బొమ్మన్, బెల్లీతో సహా అటవీ శాఖల కృషిని గుర్తించడం తమ ప్రాథమిక లక్ష్యమని తెలిపింది. అంతే ఈ దంపతులు లేవనెత్తిన ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. (ఇది చదవండి: ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: బెల్లీ గతంలో ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. -
ఆస్కార్ కు విక్రమ్ సినిమా..!
-
ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!
కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. వినూత్నమైన కథా నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మాళవిక మోహనన్ కనిపించనుండగా.. పార్వతి, పశుపతి, డేనియల్ కాల్టకిరోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: ఉప్పెన హీరోయిన్‌కు వేధింపులు.. ఏకంగా స్టార్ హీరో! ) అయితే ఈ ఏడాది తమిళంలో తెరకెక్కుతోన్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రమిది. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో తంగలాన్ చోటు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు. అయితే ఆస్కార్ రేసుకు సంబంధించిన ఇంకా ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఈ సినిమాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం కోలార్ గోల్డ్ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!) -
ఆస్కార్ గెలిచిన వీరులతో ఎంఎస్ ధోని
ఐపీఎల్ 2023 సీజన్లో ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదోసారి టైటిల్ కొల్లగొట్టేందుకు ఉవ్విళ్లూరుతుంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 13 పాయింట్లతో ఉన్న ధోని సేన రెండో స్థానంలో కొనసాగుతుంది. కాగా ఇవాళ(బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే తలపడనుంది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారతీయ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్(Elephant Whisperers)' ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమన్, బెల్లీలను, దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్ను ఎంఎస్ ధోని బుధవారం ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కే జెర్సీలను వారికి గిఫ్ట్‌గా బహుకరించాడు. ఇక్కడ విశేషమేంటంటే ధోని జెర్సీ నెంబర్ అయిన '7'తో వారి పేర్లను ముద్రించి కానుకగా అందించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Tudumm 🎬 Special occasion with very special people 💛🐘#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/AippVaY6IO — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 Roars of appreciation to the team that won our hearts! 👏 So good to host Bomman, Bellie and filmmaker Kartiki Gonsalves! 🐘#WhistlePodu #Yellove 🦁💛 — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 చదవండి: ODI WC 2023: హైదరాబాద్‌లో టీమిండియా-పాక్ మ్యాచ్! -
అవార్డు సభలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత కూడా లేరు:నట్టి కుమార్
-
ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే రోజు ఇది
-
ఆస్కార్ వేడుక చేసుకోవడం నాకు చాలా వింతగా ఉంది
-
నాటు నాటు పాట రాయడానికి 19 నెలలు పట్టింది.. చంద్రబోస్
-
అసాధ్యమైన అద్భుతాన్ని సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి రాజమౌళి
-
ఆస్కార్ విజేతలకు అరుదైన బహుమతి ఇచ్చిన సినీ పరిశ్రమ
-
ఆస్కార్ తీసుకునే ముందు రమా రాజమౌళికి ఒక్కటే మాట చెప్పా..
-
ఆస్కార్‌కు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే..
ఆర్ఆర్ఆర్.. భారత సినీచరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం ఇది. ఈ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్‌ను గెలవడంతో యావత్ భారత్ గర్విస్తోంది. అంతేకాదు విశ్వ వేదికలపై గ్లోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలిచిన తొలి భారత చిత్రంగా ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఇక ఆస్కార్ వేడుకలో భాగంగా దర్శక-దీరుడు రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి, చంద్రబోస్, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్‌తో పాటు ఇతర ఆర్ఆర్ఆర్ టీం మొత్తం అమెరికాలో సందడి చేశారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం అయితే చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అకాడమీ అవార్డు వేడుకలో అడుగుపెట్టే అవకాశం రావడమంటే అందని ద్రాక్ష వంటిదే. అలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నా ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య పాల్గొనకపోవడం గమనార్హం. నిజానికి అన్నీ తానై చూసుకోవాల్సిన ఆయన ఆస్కార్ సెలబ్రెషన్స్‌లో భాగం కాకపోవడంతో అందరిలో ఎన్నో అనుమానాలు రేకిత్తించాయి. దీంతో రకరకాల పుకార్లు తెరపైకి వచ్చాయి. రాజమౌళి పూర్తిగా దానయ్యను పక్కన పెట్టారని, అవార్డు కోసం జక్కన్న దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారంటూ రూమర్స్ గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ వార్తలపై దానయ్య స్పందించాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ నిర్మాత ఎవరంటే చెప్పే పేరు డివివి దానయ్యే కదా.. తనకు అంది చాలన్నారు. నాటు నాటుకు ఆస్కార్ రావడం గర్వంగా ఉందన్నారు. అనంతరం ‘ఆస్కార్ అవార్డు వేడుకకు రాజమౌళి నన్ను దూరంగా పెట్టాడు అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఆయన అలాంటి వారు కాదు. తన సినిమా నిర్మాతలకు రాజమౌళి చాలా గౌరవం ఇస్తారు. అలా అవైయిడ్ చేసే వ్యక్తిత్వం రాజమౌళిది కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. నాకు ఇష్టంలేకే నేను వెళ్లలేదు. నేను చాలా సింపుల్‌గా ఉంటాను. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? ఆర్బాటాలు నాకు నచ్చవు. అందుకే ఆస్కార్‌కు దూరంగా ఉన్నా. ఇష్టం లేక ఈ అవార్డు ఫంక్షన్‌కు వెళ్లలేదు. ఈ సినిమాతో నాకు మంచి పేరు రావాలి అనుకున్నా. అది వచ్చింది. నాకది చాలు’ అంటూ వివరణ ఇచ్చారు. అలాగే ఆస్కార్ కోసం రూ. 80కోట్లు పెట్టారనడంలో నిజమెంత? అని ప్రశ్నించగా.. తాను అయితే ఎలాంటి డబ్బు పెట్టలేదన్నారు. మరి రాజమౌళి గారు ఏమైనా పెట్టారా? అనేది మాత్రం తనకు తెలియదంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చాడు. అనంతరం అసలు రూ. 80 కోట్లు ఎలా పెడతారంటూ పుకార్లను ఖండిచాడు. సినిమాకే అంత లాభం ఉండదు.. అలాంటిది రూ. 80కోట్లు ఖర్చు పెట్టడం ఎలా సాధ్యమవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు దానయ్య. -
Ram Charan: ఢిల్లీలో రామ్‌చరణ్‌కు గ్రాండ్ వెల్కమ్ (ఫొటోలు)
-
అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్‌కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే..
ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు అమెరికాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నప్పటి నుంచి మెగా కపుల్ ఎక్కువగా అమెరికాలోనే గడుపుతున్నారు. మార్చి 13న లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ ప్రదానోత్సవ కార్యక్రమానికి భర్త చరణ్‌తో పాటు ఉపాసన కూడా పాల్గొన్ని సందడి చేసింది. ఈ వేడుకలో స్పెషల్ డిజైనర్ చీర, డిఫరెంట్ జువెల్లరి ధరించి ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చదవండి: నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు! ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా చరణ్ అక్కడి మీడియాకు ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్ బిజీగా అయిపోయాడు. నాటు నాటు ఆస్కార్ గెలిచిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ఇండియాకు తిరిగి రాగా.. చరణ్-ఉపాసనలు మాత్రం లాస్ ఎంజిల్స్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఉపాసన లాస్ ఎంజిల్స్‌లో విలాసవంతమైన బంగ్లాను కొన్ని నెలల పాటు రెంట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె గర్భవతిగా ఉన్న కారణంగా అక్కడ అన్ని విధాలుగా కంఫర్ట్ ఉండేందుకు, అలాగే హెల్త్ కేర్‌లో భాగంగా ఇల్లు తీసుకున్నారట. అమెరికా వెళ్లినప్పటి నుంచి చరణ్-ఉపాసనలు ఆ బంగ్లాలోనే ఉంటున్నారట. ఇంకా కొన్ని రోజుల పాటు అదే ఇంట్లో ఉండనున్నట్టు సమాచారం. చదవండి: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్ వీరికి సహాయకులుగా ముగ్గురు సిబ్బందిని ఇండియా నుంచి తీసుకువెళ్లినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలిచిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం ఆ ఇంట్లోనే పార్టీ జరుపుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా వెళ్లిన రాంచరణ్, ఉపాసన చిన్న పెట్టెలో దేవుడి ప్రతిమలకు పూజ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. మార్చి 13న జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో నాటు నాటు సాంగ్ దేశం గర్వించే విధంగా ఆస్కార్ కైవసం చేసుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
హైదరాబాద్ చేరుకున్న తారక్.. ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ హంగామా చూశారా?
ఆస్కార్ అవార్డు సందడి ముగిసింది. ఈ ఏడాది లాస్ ఎంజిల్స్‌లో వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో మన ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. ఇందులో తన తెలుగు సినిమా ఉండటం విశేషం. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు ఆర్ఆర్ఆర్ టీం అంత ఈ వేడుకలో సందడి చేశారు. ఆవార్డు ప్రదానోత్సవం అనంతరం రాజమౌళి టీం అందరికి అమెరికాలో పార్టీ కూడా ఇచ్చాడు. చదవండి: వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలి: వర్మ సంచలన వ్యాఖ్యలు ఇక ఆస్కార్ హంగామ ముగియడంతో ఒక్కొక్కరు ఇండియాకు వచ్చేస్తున్నారు. ఇక ముందుగా తారక్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా నుంచి బయలుదేరిన తారక్ బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. నాటు నాటు ఆస్కార్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తెలుగు గడ్డ మీద తొలిసారి అడుగుపెడుతుండటంతో అభిమానులంత భారీగా ఎయిర్ పోర్ట్‌కు తరలి వచ్చారు. తారక్ చూసి ఫ్యాన్స్ అంత ఆయనను చూట్టిముట్టి కేకలు వేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. #NTR back to HYD fans welcomed in style 😎🐯 @tarak9999 #GlobalStarNTR pic.twitter.com/VYQ2m5rFZE — UK NTR Fans (@UKNTRfans) March 14, 2023 ఎయిర్‌పోర్టులో తారక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్ టీంలో తాను సభ్యుడిని అయినందుకు చాలా గర్వంగా ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటించిన ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మన తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వేదికపై కిరవాణి, సుభాస్ చంద్రబోస్‌లు ఆస్కార్ అవార్డు అందుకోవడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. అదో మధురు జ్ఞాపకం. ఆ మూమెంట్‌ని ఎప్పటికి మరిపోను. ఇదంత ప్రేక్షకుల వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఆర్ఆర్ఆర్ సినిమాను అంతగా ఆదరించి ఈ స్థాయికి తీసుకువెళ్లిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ధన్యవాదాలు’ అంటూ తారక్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్ బాగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ర్యాలీ మధ్య తారక్ సిటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: రాము పరీక్షల్లో ఏం చేశాడంటే.. ఆర్జీవీ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు #WATCH | Telangana: RRR Actor Jr NTR arrived at the Rajiv Gandhi International Airport in Hyderabad. 'Naatu Naatu' song from RRR won the #Oscar for the Best Original Song pic.twitter.com/f5zGfnyk7m — ANI (@ANI) March 14, 2023 Seeing MM Keeravaani & Chandrabose accepting the Oscar award was the best moment. I feel very proud of RRR. I want to thank every Indian for encouraging RRR, this award (Oscar) that we've won has only been possible with the love of the audience & the film industry: Actor Jr NTR pic.twitter.com/jTwLQGceTN — ANI (@ANI) March 14, 2023 -
Oscar Naatu Naatu: నాటునాటు ప్రేమ్‌రక్షిత్.. నాటి నుంచి నేటివరకు (అరుదైన ఫోటోలు)
-
60 ఏళ్ల వయసులో ఉత్తమ నటిగా ఆస్కార్.. సరికొత్త చరిత్రకు శ్రీకారం
'కలలు కనండి. నిజం అవుతాయనడానికి నేను ఈ అవార్డును ఓ ప్రూఫ్‌గా చూపిస్తున్నాను. మహిళలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మీ ప్రైమ్ టైమ్‌ను మీరు దాటిపోయారు అంటే నమ్మొద్దు. ఈ అవార్డుని నేను మా అమ్మకు... ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే వారే నిజమైన సూపర్‌హీరోస్. వీరే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండి ఉండేవారు కాదు.మా అమ్మగారికి 84 ఏళ్లు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇప్పుడు మలేసియాలో ఆమె ఈ వేడుకను చూస్తున్నారు. నేను ఈ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నాను (కుటుంబ సభ్యులను ఉద్దేశించి). అలాగే నా కెరీర్ హాంకాంగ్‌లో స్టార్ట్ అయ్యింది. అక్కడ నాకు హెల్ప్‌గా ఉన్నవారికి ధన్యవాదాలు. అలాగే నెవర్ గివప్. డానియల్ డ్యూయో, ఏ 24 షూటింగ్ స్టూడియో, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్..’ నటీనటుల సహాయం లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఈ వేదికపై ఉండేదాన్ని కాదు'. – ఉత్తమ నటి, మిషెల్ యో(కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. అంతేకాదు ఇప్పుడామె వయస్సు 60ఏళ్లు. ) నాకు అవార్డు ఇచ్చిన ఆస్కార్ కమిటీకి, ఇలాంటి ఓ బోల్డ్ ఫిల్మ్‌లో నటించే అవకాశం కల్పించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ‘ది వేల్’ సినిమాలో భాగమైన వారిని గుర్తు చేసుకోకుండా ఉండలేను. బెస్ట్ యాక్టర్‌గా నాకు అవార్డు రావడాన్ని చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నటుడిగా నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నాకు గుర్తింపు వస్తుందా? అని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కేవలం తిమింగలాలు మాత్రమే లోలోతుల్లో ఈదగలవు. సినిమా ఇండస్ట్రీలో నేనూ అంతే. నాకు హెల్ప్‌గా ఉన్న నా కుటుంబ సభ్యలకు ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు బ్రెండెన్ ఫ్రాజెర్ (చెమర్చిన కళ్లతో...) ఈయన కూడా 54 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు.) Michelle Yeoh accepts her #Oscar for Best Actress: "For all the little boys and girls who look like me watching tonight, this is a beacon of hope and possibilities. This is proof that dreams do come true." https://t.co/ndiKiHfmID pic.twitter.com/pQN8nHDhCx — Variety (@Variety) March 13, 2023 -
Oscar Award: చారిత్రక ఘట్టం
ఇప్పుడు భారతీయుల గుండెచప్పుడు ఆర్ఆర్ఆర్లోని నాటునాటు పాట అంటే అతిశయోక్తి కాదేమో. ఈ విజువల్ వండర్‌కు క్రియ దర్శక దిగ్గజం రాజమౌళి అయితే, కర్త, కర్మలు జూనియర్ ఎనీ్టఆర్, రామ్‌చరణ్, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ అయ్యారు. ఈ పాట ఇప్పటికే ప్రపంచ సినీ ప్రేక్షకులను ఓలలాడించి, స్టెప్పులు వేయించింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో విజయకేతం ఎగరేసి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవేదికపై ఘనంగా చాటింది. దీంతో పాటు మరో తమిళ డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకుని సత్తా చాటింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్ర రూపకర్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఊహించని ఘనత భారతీయ సినిమా ఈ రోజు వేడుక చేసుకుంటోంది. ప్రపంచ సినీ చరిత్రలో భారతీయ సినిమా రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని ఊహించని ఘనత సాధించింది. కార్తీకి కన్సాల్వాస్ దర్శకత్వంలో రూపొందిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ అవార్డును గెలుసుకోవడం మహా ఆనందం కలిగిస్తోంది. ఇది పలువురు దర్శకులకు ప్రోత్సాహకరంగా నిలుస్తుంది. అదేవిధంగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకొని సినీ ప్రపంచాన్నే డాన్స్ చేయించింది. – దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం హృదయ పూర్వక అభినందనలు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ చిత్ర దర్శకురాలు కార్తీకి కన్సాల్వాస్లకుé హృదయపూర్వక అభినందనలు. గరి్వంచదగ్గ భారతీయులకు నా సెల్యూట్. – రాజనీకాంత్, నటుడు గొప్ప కీర్తి.. ఆర్ఆర్ఆర్ చిత్రం, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ అవార్డులను తెలుసుకోవడం గొప్ప ఘనత. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి ఇండియన్ పాట నాటునాటు కావడం చారిత్రాత్మకం. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు అభినందనలు. అలాగే ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు. ఆ డాక్యుమెంటరీ చిత్రం దర్శక నిర్మాతలు కార్తీకి కన్సాల్వాస్, గునిత్ మింగిలను ఎంత పొగిడినా తక్కువే. – సీఎం స్టాలిన్ అంతా ఏనుగులకే చెందుతుంది... ది ఎలిఫెంట్ విస్పరర్స్ తమిళనాడు, ముదుమలై ఆడవి ప్రాంతంలో సాగే కథా చిత్రం. అక్కడ ఏనుగుల సంరక్షణ శిబిరాలు ఏనుగులను సంరక్షించే బొమ్మన్, బెల్లి దంపతుల నేపథ్యంలో సాగే కథ ఇది. వేర్వేరు ప్రాంతాల్లో తల్లి ఏనుగుతో నుంచి విడిపోయిన రెండు ఏనుగు పిల్లల సంరక్షణ బాధ్యతలను ఈ బొమ్మన్, బెల్లి దంపతులు తీసుకుంటారు. వాటిని సొంత పిల్లలుగా చూసుకుంటారు. కాగా ఈ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడంపై బొమ్మన్, బెల్లి దంపతులు స్పందిస్తూ ఆనదం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘనత అంతా ఆ ఏనుగులకే దక్కుతుందని పేర్కొన్నారు. తెలుగు సినీ వైభవం విశ్వవ్యాప్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని భాగమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ వైభవం ప్రపంచానికి నేడు తెలిసింది, దర్శక దిగజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాట నేడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు సాధించడం తెలుగోడి విజయం. గీత రచయిత చంద్రబోస్‌కు, సంగీత దర్శకుడు కీరవాణికి, దర్శకుడు రాజమౌళికి, నిర్మాత దానయ్యకు, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్‌కు, ముఖ్యంగా ఆ పాటకు అభినయించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు ధన్యవాదాలు. – కేతిరెడ్డి జగదీశ్వర్వరెడ్డి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు -
RRR Naatu Naatu Oscars 2023: చెయ్యెత్తి జైకొట్టిన ఆస్కార్
అనుకున్నదే అయింది. ఆశించినది దక్కింది. ప్రతిష్ఠాత్మక అకాడెమీ అవార్డుల (ఆస్కార్) విశ్వ వేదికపై భారతీయ సినిమా వెలుగులీనింది. తెలుగు సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ తొలిసారిగా మన వెండితెరకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో కీర్తి కిరీటధారణ చేసింది. హాలీవుడ్లో సినీ శిఖరమని భావించే ఆస్కార్‌ను పూర్తి స్వదేశీ నిర్మాణంతో అందుకోవాలన్న భారతీయ సినిమా దీర్ఘకాల స్వప్నం నెరవేరింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గానూ మన దక్షిణ భారతీయురాలు అనాథ ఏనుగు సంరక్షణపై తమిళనాట తీసిన చిత్రమే (కార్తికీ గొంజాల్వెజ్ తొలియత్నం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’) ఆస్కార్ సాధించింది. వెరసి కమర్షియల్ సినిమానే కాదు, కదిలించే డాక్యుమెంటరీతోనూ విదేశా లతో పోటీపడగలమని ఒకటికి రెండు ఆస్కార్ ప్రతిమల సాక్షిగా 95వ అకాడెమీ అవార్డుల ప్రకటన నిరూపించింది. ప్రధానంగా అమెరికన్ల వ్యవహారమైన ఆస్కార్ కోటలో మన సినిమా పాగావేసింది. రెండు విభిన్న పార్శా్వలకు ప్రతీకగా, మూడు విభాగాల్లో ఆస్కార్ తుది జాబితాకు నామినేటై, అందులో ఏకంగా రెండింటిలో పురస్కార విజేతగా నిలవడం భారతీయ సినిమా కనివిని ఎరుగని విషయం. ఇది యావద్భారత సినీ ప్రపంచం రొమ్ము విరుచుకొనే సమయం. శతాధిక వసంత భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షర లిఖిత సందర్భం. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి వివిధ భాషల్లో ఏటా 283 ఫీచర్ ఫిల్మ్స్ తీస్తున్న మన భారతీయ చిత్ర పరిశ్రమ ఇవాళ ఏటా 2 వేల సినిమాలకి ఎదిగింది. మూకీల రోజుల్లోనే విదేశాలకు వెళ్ళిన మన సినిమాకు ఉత్తమ విదేశీ చిత్ర విభాగమంటూ 1956లో కొత్త కేటగిరీ పెట్టినప్పటి నుంచి గత 67 వత్సరాలుగా ఆస్కార్ అందని ద్రాక్షపండే. ఇన్నేళ్ళలో మన సినిమాలు మూడే తుది జాబితా దాకా వెళ్ళినా, ఒక్క ఓటుతో అవార్డు మిస్సయిన మదర్ ఇండియా (1957), ఆ తర్వాత మీరా నాయర్ ‘సలామ్ బాంబే’ (1988), ఆమిర్‌ఖాన్ ‘లగాన్’ (2001)– ఏవీ అవార్డు తేలేకపోయాయి. ఇప్పటికి వేరే కేటగిరీలోనైతేనేం ఆ కోరిక తీరింది. ఆస్కార్ మనకు మరీ కొత్త కాదు. విదేశీయులు తీసిన చిత్రాల్లో మనం ఆస్కార్ అందుకోవడం అటెన్‌బరో ‘గాంధీ’ (1982) నుంచి ఉంది. ‘ప్యాసా’, ‘ఆమ్రపాలి’, ‘గైడ్’లకు పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ స్వర్గీయ భానూ అతయ్యా ‘గాంధీ’తో తొలి భారతీయ ఆస్కార్ విజేతయ్యారు. ఆ పైన గౌరవంగా ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని దిగ్దర్శకుడు సత్యజిత్ రాయ్ (1991) అందుకున్నారు. ఇక, భారత్‌లోని పట్టణ ప్రాంత పేదరికంపై విదేశీయులు తీసిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2008) సంగీత దిగ్గజం రెహమాన్‌కు రెండు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్) ఆస్కార్లు తెచ్చింది. పాటకు రెహమాన్‌తో కలసి గీత రచయిత గుల్జార్ గౌరవం పంచుకున్నారు. అదే చిత్రంలో బెస్ట్ సౌండ్ మిక్సింగ్‌కు మరో ఇద్దరితో కలసి రసూల్ పూకుట్టి విజేతగా నిలిచారు. షార్ట్ ఫిల్మ్లకొస్తే – ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో తీయగా 2018లో ఆస్కార్ గెలిచిన షార్ట్ ఫిల్మ్ ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్’కు నిర్మాతల్లో ఒకరు భారతీయ వనిత గునీత్ మోంగా. అయితే, దర్శకురాలు విదేశీయురాలు. ఇలా ఇప్పటిదాకా అన్నీ విదేశీ భాగస్వామ్యంలో మనవాళ్ళు ఎగరేసిన జెండాలు. తొలిసారి పూర్తి స్వదేశీ దర్శక, నిర్మాణాలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘ఎలిఫెంట్’ రెండూ ఆస్కార్లు తేవడం మరువలేని ఘనత. బ్రిటీషు పాలనా కాలపు నేపథ్యంలో వేర్వేరు కాలఘట్టాలకు చెందిన పోరాటయోధుడు అల్లూరి, ఆదివాసీ ముద్దుబిడ్డ కొమురం భీమ్ కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథ ‘ఆర్ఆర్ఆర్’ తెరపై సినిమాటిక్ భావోద్వేగాలకు పరాకాష్ఠ. అసలు చరితను సైతం ఆలోచింప జేయనివ్వని రాజమౌళీంద్రజాలం. కీరవాణి బాణీలో నృత్యప్రధాన గీతం ‘నాటు నాటు’ దేశదేశాల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. దానికి చంద్రబోస్ కూర్చిన తేటతెలుగు మాటలు, ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన స్టెప్పులు, రెండు నెలల కఠోరసాధన– 20 రోజుల షూటింగ్‌తో జూనియర్ ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌ల సమన్వయ నృత్య విన్యాసం – అన్నీ కలిసొచ్చాయి. ఆస్కార్ విజేతల్ని నిర్ణయించే 9 వేల పైచిలుకు సభ్యుల్నీ ఊపేశాయి. భారతదేశం తరఫున ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో అధికారిక ఎంట్రీగా గుజరాతీ ‘ఛెల్లో షో’ వెళ్ళినా, అది తుదిపోరు దాకా చేరుకోనే లేదు. ఆ మాట కొస్తే, గత 21 ఏళ్ళలో ఏ ఇతర భారతీయ ఎంట్రీ తుది 5 చిత్రాల జాబితాలో నిలవలేదు. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ అమెరికన్ డిస్ట్రిబ్యూ టర్ వేరియన్స్ ఫిల్మ్స్– రాజమౌళి బృందం పట్టుదలగా ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ క్యాంపెయిన్‌లో 14 కేటగిరీల్లో సినిమాను ప్రమోట్‌చేసింది. ప్రచారమూల్యం మాటెలా ఉన్నా, చివరకు ఒక కేటగిరీలో ఆస్కార్ కల నిజమైంది. తుది జాబితా నాటికే ‘నాటు నాటు’పై పెరిగిన అంచనాలు ఫలించాయి. పాపులర్ హాలీవుడ్ ఎంట్రీలను పక్కకు నెట్టి మరీ మన ‘నాటు నాటు’ ఈ ఘనత సాధించింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌లూ వరించేసరికి తెలుగు పాటకు విశ్వకీర్తి దక్కింది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ ఈ చారిత్రక ఫ్యాంటసీకి, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ వారి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ రాజమౌళికీ దక్కాయి. ఇంతకన్నా గొప్ప పాటలు, సినిమాలొచ్చాయన్న కొందరి సన్నాయి నొక్కులు సినిమా జోరు, అవార్డుల హోరులో కలసిపోయాయి. ‘ఈ నక్కలవేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పద’ అని ఈ చిత్రంలో ఓ హీరో డైలాగ్. అవును. రాజమౌళి బృందం ఇప్పుడుఅంతర్జాతీయ అవార్డుల కుంభస్థలాన్ని బద్దలుకొట్టింది. పక్కా ప్రణాళికతో అడుగేస్తే అసాధ్యమే లేదని మన ఫిల్మ్ మేకర్స్‌లో నమ్మకం కలిగించింది. వ్యాపారంలోనూ, వ్యవహారంలోనూ కొత్త తలు పులు తెరిచి, కొత్త ఎత్తులు చూపిన మన సినిమాకు స్వాగతం. అందుకు ఇది ఓ శుభారంభం. -
ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేడుకల్లో భారత్‌కు రెండు కేటగరీల్లో అవార్డులు దక్కాయి. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చింది. అలాగే అందరి దష్టిని ఆకర్షించిన మరో చిత్రం ఒకటుంది. ఆర్ఆర్ఆర్తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ షార్ట్ ఫిలింలో ప్రధాన పాత్రలో కనిపించిన బెల్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఆస్కార్ రావడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఆస్కార్ అంటే ఏంటో తెలియదు ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా ఈ చిత్రంలో నటించిన బెల్లీ భర్త మాత్రం.. తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పింది. అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2023లో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డ్ దక్కించుకుంది. -
ఆస్కార్ వేడుకల్లో మలాలా.. ఎందుకో తెలుసా?
అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను ఆస్కార్ అకాడమీ నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈవెంట్లో అందరినీ దృష్టిని ఆకర్షించించింది మాత్రం పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూజఫ్జాయ్. తన భర్త అస్సర్ మాలిక్‌తో కలిసి వేదికపై మెరిసింది. ఇంతకీ ఈ వేడుకకు ఆమె ఎందుకొచ్చింది? అనే ప్రశ్న సినీ ప్రేక్షకుల్లో తలెత్తింది. మలాలాకు ఇప్పటికే నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. మహిళల విద్యకోసం కృషి చేస్తున్న మలాలా విశ్వవేదికపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మహిళా విద్యా కార్యకర్త అయిన ఆమె ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపికైన 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్' అనే షార్ట్ ఫిల్మ్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ నిర్మాత కావడమే కారణం. అందుకే వారికి మద్దతుగా ఆస్కార్ వేడుకలకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది టాలీవుడ్ మూవీకి ఆస్కార్ రావడంతో సినీ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కింది. -
ఆ సినిమాకు ఏకంగా ఏడు ఆస్కార్లు.. తొలి ఆసియా మహిళగా రికార్డు
95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఓ హాలీవుడ్ చిత్రం సత్తా చాటింది. 'ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్'(Everything Everywhere All At Once)అనే హాలీవుడ్ చిత్రం ఏకంగా ఏడు ఆస్కార్లను కైవసం చేసుకుంది. 11 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు వరించాయి. కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ఏడు ఆస్కార్లను సొంతం చేసుకొని సత్తా చాటింది. -
బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా
ధూల్ పేట్లో పుట్టిన కుర్రాడు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న ఇష్టంతో గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ సాంగ్స్ పాడేవాడు. అతని టాలెంట్‌ను గుర్తించిన తండ్రి కుమారుడికి సంగీతం నేర్పించాలని ఓ గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకున్న ఆ కుర్రాడు చిన్న చిన్న సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా మారాడు. అలా ఓ వైపు సంగీతంలో ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్‌లో పనిచేశాడు. తన సింగింగ్ టాలెంట్‌తో శ్రోతలను మైమరిపించేవాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎదిగాడు.. అతడే రాహుల్ సిప్లిగంజ్. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన అతడి ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే వివాదాలు అతనితో ముడిపడి ఉన్నాయి. ఆనాటి నుంచి ఇప్పుటిదాకా సాగిన రాహుల్ విజయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. రాహుల్ సిప్లిగంజ్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన రాహుల్‌కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదట. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్సాంగ్స్ పాడేవాడట. ఇది గమనించిన రాహుల్ తండ్రి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్‌పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్ పాడే అవకాశాలు తలుపుతట్టాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడట.రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అనే టైటిల్ సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో సింగర్‌గా రాహుల్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. మంగమ్మ,పూర్ బాయ్, మాకి కిరికిర', 'గల్లీ కా గణేష్', 'దావత్'.. ఇలా హైదరాబాదీ సంస్కృతి, సంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే 2019లో తెలుగు బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొనడంతో రాహుల్ దశ తిరిగిందని చెప్పొచ్చు. పునర్నవితో లవ్‌ట్రాక్, తన పాటలు, ఎనర్జీ, శ్రీముఖితో గొడవలు ఇలా ఒకటేమిటి అన్ని షేడ్స్ చూపించి యూత్‌లో మాంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సీజన్ విన్నర్‌గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకుళ్లాడు. గల్లీబాయ్ పేరుకు తగ్గట్లేగానే రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన కొన్ని వారాలకే ఓ పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్‌పై బీరు సీసీలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎమ్మెల్యే బంధువులపై రాహుల్, అతని స్నేహితులకు మధ్య జరిగిన గొడవలో బీరుసీసాలతో గొడవ, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వరకు వెళ్లింది. కట్‌చేస్తే.. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ వాడారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు జరిపిన రైడ్‌లో రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 150మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకోగా పలువురు సెలబ్రిటీలతో పాటు రాహుల్ కూడా విచారణను ఎదుర్కున్నాడు. ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్ తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. విశ్వవేదికపై తెలుగోడి సత్తా సగర్వంగా నిరూపించాడు. ఆర్ఆర్ఆర్లోని రాహుల్ పాడిన నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆ బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. -
Oscar Winners 2023: ఆస్కార్ విజేతలు వీరే!
చలన చిత్ర పరిశ్రమలో అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల ప్రదానోత్సవం ఈ సారి మరింత కోలాహలంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిలస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు(ఆర్ఆర్ఆర్)’ పాటకు అస్కార్ లభించింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. ఉత్తమ నటుడిగా ది వేల్ చిత్రానికిగాను బ్రెండన్ ప్రాసెర్, ఉత్తమ నటిగా మిషేల్ యో(ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) నిలిచింది. అస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం : ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు( ఆర్ఆర్ఆర్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఉత్తమ సహాయ నటి: జేమిలీ కర్టీస్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయనటుడు: కే హ్యూ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్(వాకర్ బెర్టెల్మాన్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నవానీ బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ది వేల్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ఉమెన్ టాకింగ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ బెస్ట్ సౌండ్: . టాప్ గన్ మావెరిక్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్ ది వే ఆఫ్ వాటర్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ ఆండ్ ది హార్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ -
అట్టహాసంగా ఆస్కార్ వేడుకలు
-
ఆస్కార్ అకాడమీ సంచలన నిర్ణయం.. 60 ఏళ్ల సంప్రదాయానికి గుడ్‌బై
మరికొన్ని గంటల్లో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేడుక జరగబోతోంది. అయితే ఈ వేడుకపై టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ పేరు విశ్వవేదికపై మార్మోగనుంది. అయితే ఆస్కార్ వేదికపై నడవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. ఎందుకంటే రెడ్ కార్పెట్‌పై నడవడాన్ని అరుదైన అవకాశంగా భావిస్తారు. కానీ ఈ ఏడాది ఆ రెడ్ కార్పెట్ వేదికపై కనిపించకపోవడం ఆశ్చర్యం కలిస్తోంది. 60 ఏళ్ల సంప్రదాయానికి చెక్ అయితే ఈసారి ఆస్కార్ వేడుకల్లో రెడ్ కార్పెట్ కనిపించడం లేదు. తొలిసారి రెడ్ కార్పెట్ కలర్‌ను మార్చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఏడాది షాంపైన్ కలర్లో స్వాగతం పలకనున్నారు. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఈసారి బ్రేక్ చేయడం విశేషం. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. రంగు మార్చడం వెనుక ఉద్దేశంపై ఓ సీరియస్ జోక్ వేసింది అకాడమీ. ఓసారి అదేంటో తెలుసుకుందాం. విల్‌స్మిత్ చెంపదెబ్బే కారణం అయితే గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్కార్ అవార్డు వేడుకల్లో అత్యంత వివాదాస్పద ఘటన విల్‌స్మిత్ చెంపదెబ్బ. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాత క్రిస్‌రాక్ వ్యవహారశైలికి మండిపడ్డ విల్‌స్మిత్ వేదికపైనే ఆయనపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో వేదికపై ఉన్నవారితో పాటు, కోట్లాది మంది అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ ఘటనను గుర్తు చేస్తూ కలర్ మార్చడంపై అకాడమీ వ్యంగ్యంగా స్పందించింది. అయితే ఈ ఏడాది ఆస్కార్ వేడుకకు హోస్ట్‌గా అమెరికన్ కామెడియన్ జిమ్మీ కిమ్మెల్ వ్యవహరిస్తున్నాడు. రెడ్ కార్పెట్ కలర్ మార్పుపై మాట్లాడుతూ. 'గత ఏడాది హాస్యనటుడు క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడంతో ఆస్కార్ అకాడమీ ఒక్కసారిగా ఎరుపెక్కింది. అందుకనే ఈ సంవత్సరం 60 ఏళ్ల సంప్రదాయాన్ని రెడ్ నుంచి షాంపైన్కు మారుస్తున్నాం. దీనివల్ల ఇక అలాంటి చెంపదెబ్బలు ఉండవని భావిస్తున్నాం.' అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అప్పుడు అసలేం జరిగిందంటే.. కాగా గతేడాది విల్ స్మిత్ భార్య హెల్త్ గురించి హాస్యనటుడు క్రిస్ రాక్ జోక్ చేస్తూ మాట్లాడడం వివాదానికి దారితీసింది. దీంతో విల్‌స్మిత్ స్మిత్ కోపం వచ్చి క్రిస్ రాక్‌పై చెంపదెబ్బ వేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అకాడమీ.. విల్ స్మిత్‌పై పదేళ్లు బ్యాన్ కూడా విధించింది. అందువల్లే ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు జరగకుండా అకాడమీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. (ఇది చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) నేనేమీ ఏడవడం లేదు: క్రిస్ రాక్ ఆ సంఘటన ఇప్పటికీ తనని బాధిస్తోందని ఇటీవల క్రిస్ రాక్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ..'ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏడాది కిందట నేను చెంపదెబ్బ తిన్నా. అందరి ముందు విల్ స్మిత్ నన్ను కొట్టాడు. ఆ సంఘటన మిమ్మల్ని బాధించిందా’ అని కొంతమంది నన్ను అడిగారు. ఇప్పటికీ నేను బాధపడుతున్నా. అయితే అందుకు నేనేమీ ఏడవడం లేదు.' క్రిస్ రాక్ చెప్పుకొచ్చాడు. -
ఆస్కార్‌కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ ఆస్కార్ వేడుక. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు ఆస్కార్ బరిలో నిలవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు సినిమాలు పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో ఫైనల్‌కు చేరిన పాటలు మొత్తం ఐదు ఉన్నాయి. వాటిలో ‘నాటు నాటు’తో పాటు 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), 'హోల్డ్ మై హ్యాండ్' (టాప్‌గన్.. మావెరిక్), 'లిఫ్ట్ మీ అప్'(బ్లాక్ పాంథర్), 'దిస్ ఈజ్ ఎ లైఫ్' (ఎవ్రీథింగ్ ఎవీవ్రేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు పోటీలో నిలిచాయి. వీటిల్లో మార్వెల్ సూపర్ హీరో చిత్రం ‘బ్లాక్‌పాంథర్: వకాండా ఫరెవర్’లో రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట, టామ్ క్రూజ్ హీరోగా వచ్చిన ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట.. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో కూడా మన ‘నాటు నాటు’ పాటకు గట్టి పోటీ ఇచ్చాయి. కానీ చివరికీ మన పాటనే విజయం వరించింది. చదవండి: ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? అయితే అస్కార్ బరిలోనూ నిలిచిన ఆ సాంగ్ నాటు నాటు సాంగ్‌కు రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే కాకుండా 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. అమెరికాలో థియేటర్లలోనూ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 14 పాటలతో పోటీపడిన ‘నాటు నాటు’ సాంగ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యాలు సమకూర్చిన ‘నాటు నాటు’ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 81 పాటలు బరిలో నిలవగా ఫైనల్‌గా 15 పాటలు మాత్రమే షార్ట్‌లిస్ట్‌లో చేరాయి. అందులో ‘నాటు నాటు’ పాటకి చోటు దక్కింది. భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన తొలి పాట ఇదే. చదవండి: Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! -
ఆస్కార్ వేదికపై నాటునాటు డ్యాన్స్.. దుమ్ము లేచిపోవాలంతే!
ఆస్కార్ వేడుకల కోసం ప్రపంచమంతా కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తోంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం ఈ వేడుక ప్రారంభం కానుంది. కాగా నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే! ఇందుకోసం అమెరికాలో పాగా వేసిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించింది. అలుపెరగకుండా ప్రచారాల్లో పాల్గొని ఎలాగైనా ఆస్కార్ కొట్టాలన్న కసితో ఉంది. మరోవైపు ఆస్కార్ స్టేజీపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాట పాడనున్న విషయం తెలిసిందే! మరి ఈ పాటకు లైవ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్టెప్పులేస్తారా? అంటే అది కుదరదని తేలిపోయింది. ప్రాక్టీస్ చేసేంత టైమ్ దొరకలేనందున లైవ్ డ్యాన్స్ లేనట్లేనని ఆల్రెడీ తారక్ క్లారిటీ ఇచ్చాడు. అలా అని నాటు నాటు పాటకు డ్యాన్స్ పర్ఫామెన్స్ లేదనుకుంటే పొరపాటే! నటి లారెన్ గొట్లెబ్ నాటు నాటు పాటకు స్టెప్పులేయనున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. 'స్పెషల్ న్యూస్.. ఆస్కార్ వేదికపై నాటునాటుకు డ్యాన్స్ చేయబోతున్నాను. ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన వేదికపై పర్ఫామ్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలలు తెలుపుతున్నారు. కాగా లారెన్ నటి మాత్రమే కాదు, మోడల్, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ కూడా! అమెరికాకు చెందిన ఆమె ఏబీసీడీ: ఎనీ బడీ కెన్ డ్యాన్స్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. బిగ్‌బాస్ ఏడో సీజన్లోనూ గెస్ట్‌గా కనిపించిన ఆమె జలక్ దిఖ్లాజా సీజన్ 6 రన్నరప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Lauren Gottlieb (@laurengottlieb) -
RRR Movie: నీ దగ్గర లెక్కలున్నాయా భరద్వాజ్: కె. రాఘవేంద్రరావు ఫైర్
'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిందని, అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్లకు గానూ అంతగా ఖర్చు పెడుతున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆ 80 కోట్లు తనకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడతామంటూ తమ్మారెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలో తనపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముకుల నుంచి సైతం విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఇదే విషయంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. మిత్రుడు భరద్వాజకి అంటూ మొదలు పెట్టిన ఆయన తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి, అంతేగాని 80 కోట్లు ఖర్చు చేశారు అనడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా..? హాలీవుడ్ దర్శకులు స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా డబ్బు తీసుకొని 'ఆర్ఆర్ఆర్'చిత్రం గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా..? అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. pic.twitter.com/wy5FcWjs0W — Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023 -
ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే.. ఎప్పుడంటే!
సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్. ప్రతి ఏటా అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సినిమాలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రెటీలంతా అమెరికాకు క్యూ కడుతున్నారు. ఈసారి మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంత ఈ అవార్డు కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: కేజీయఫ్ వివాదంపై స్పందించిన డైరెక్టర్, సమర్థించుకుంటూనే క్షమాపణలు.. ఈ క్రమంలో వారందరిని సర్ప్రైజ్ చేసే ప్రకటన బయటకు వచ్చింది. ఈ ఏడాది జరిగే 95వ ఆస్కార్ అవార్డు ఈవెంట్‌ను లైవ్‌లో చూసే అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫ్లాం డిస్నిప్లస్ హాట్‌స్టార్ అస్కార్ అవార్డు ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. నిన్న సోమవారం దీనిపై హాట్‌స్టార్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇది మార్చి 13న ఉదయం 5:30 గంటల నుంచి హాట్‌స్టార్ లైవ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు ఈ సందర్భంగా తెలిపింది. కాగా ఆస్కార్స్ వేడుక వచ్చే ఆదివారం (మార్చి 12, భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున) జరగనుంది. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? ఈ సారి అకాడెమీ అవార్డులు ఇండియన్స్‌కు మరింత ఆసక్తి రేపుతోంది. దీనికి కారణం మన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ కావడమే. ఈ పాటకు ఆస్కార్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఇదే వేదికపై ఈ పాట లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. దీనికితోడు ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకోనే అవార్డు ప్రజెంటర్లలో ఒకరిగా వ్యవహరించనుంది. ఈ వేడుకల్లో ఆమె ఓ అవార్డును ప్రజెంట్ చేయనుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా నిలవడం విశేషం. Movies are dreams you can never forget. Come celebrate the dream makers at the 95th Oscars🎥#Oscars95 Streaming on March 13, 5:30 AM. pic.twitter.com/UaZmse9Tif — Disney+ Hotstar (@DisneyPlusHS) March 6, 2023 -
ఆస్కార్ లైవ్‌లో నాటునాటు పాట.. అగ్గిరాజేసుడే ఇగ!
మరికొద్ది రోజుల్లో ప్రపంచమే ఎదురు చూస్తున్న ఆస్కార్ సినీ వేడుక జరుగబోతోంది. ఈసారి అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ మీదే ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులతో మోత మోగించిన ఈ మూవీ ఆస్కార్‌ను ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాట బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే! తాజాగా ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ చెప్పింది ఆస్కార్ టీమ్. ఈ నెల 12న జరగబోయే 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాటను లైవ్‌లో పాడనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంకేముంది... మన సింగర్లు స్టేజీపై అగ్గిరాజేయడం ఖాయం. వీరి పాటకు అక్కడున్నవాళ్లకు ఊపు రావడమూ తథ్యం. అంత పెద్ద వేదికపై పాడటం, అది కూడా తెలుగు పాట కావడం గర్వించదగ్గ విషయం. ఈ విషయంపై రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ.. 'ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫామెన్స్.. కచ్చితంగా ఇవి నా జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి' అని సంతోషం వ్యక్తం చేశాడు. Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars. Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs — The Academy (@TheAcademy) February 28, 2023 This is going to be unforgettable moment in my life🔥🔥😎 https://t.co/Me1sCKSMxY — Rahul Sipligunj (@Rahulsipligunj) February 28, 2023 చదవండి: మా నాన్న కంటే నా భార్యకే ఎక్కువగా భయపడతా: మంచు విష్ణు -
ఆస్కార్ ఈవెంట్ కోసం యూఎస్ పయనమైన రామ్ చరణ్ (ఫొటోలు)
-
SS Rajamouli: ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను నాకు కావాల్సింది అదే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక కాకపోవడం అనేది కాస్త నిరుత్సహపరిచిందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ఆన్లైన్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విధంగా స్పందించారు. ‘‘మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో నిరాశ చెందాను. ‘ఆర్ఆర్ఆర్’కు ఆఫీషియల్ ఎంట్రీ లభిస్తే బాగుండేదన్నట్లుగా విదేశీయులు సైతం అనుకుంటున్నారు. అయితే మా సినిమాకు ఎందుకు అధికారిక ఎంట్రీ లభించలేదు? అని పదే పదే ఆలోచిస్తూ ఉండే మనస్తత్వాలు కావు మావి. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. అయినా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు వంటి అంశాల గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఈ విషయంపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. ఇక దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపిన ‘ఛెల్లో షో’ (గుజరాతీ ఫిల్మ్, ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రానికి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఇండియన్ సినిమాయే’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటునాటు’ సాంగ్‌కు ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం లభించింది. ఇక గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ కాగా, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు మరో ఎనిమిది ఇండియన్ చిత్రాలు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్ ఈ నెల 24న వెల్లడికానున్నాయి. అవార్డ్ ఫంక్షన్ మార్చిలో జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. డబ్బు కోసమే... డబ్బు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఓ దర్శకుడిగా నేను సినిమాలు తీస్తాను. విమర్శకుల ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను. ‘ఆర్ఆర్ఆర్’ ఓ కమర్షియల్ ఫిల్మ్. బాక్సాఫీస్ వద్ద నా సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయితే నేను హ్యాపీ. అవార్డ్స్‌ను బోనస్‌లా భావిస్తాను. అయితే ఓ సినిమా కోసం పడిన కష్టానికి గుర్తింపు లభిస్తే నాకు, నా చిత్రబృందానికి సంతోషం అనిపిస్తుంది’’ అని కూడా పేర్కొన్నారు రాజమౌళి. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తర్వాతి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రామ్‌చరణ్‌కు షారూక్ ఖాన్ విజ్ఞప్తి
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ కావడాన్ని కొనియాడారు. దీనిపై స్పందిస్తూ మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ఇండియాకు తీసుకొస్తే తాకేందుకు తనకు అవకాశమివ్వాలని షారూక్ విజ్ఞప్తి చేశారు. షారూక్ తన ట్వీట్లో రాస్తూ..' మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ధన్యావాదాలు. మీ ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ఇండియాకు తీసుకొస్తే.. ఆ అవార్డును తాకేందుకు నాకు అవకాశమివ్వండి' అంటూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్తో పాటు కాంతార, ది కశ్మీర్ ఫైల్స్, గంగుభాయ్ కతియావాడి ఆస్కార్ బరిలో నిలిచాయి. ఈ ఏడాది మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా.. బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. ఎన్నో వివాదాల అనంతరం ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!! (Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! ) Love you. — Shah Rukh Khan (@iamsrk) January 10, 2023 -
ఆస్కార్-2023 బరిలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్
-
ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’
ఈ ఏడాది వచ్చి పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఒకటి. ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఇక ఈ చిత్రానికి ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. అంతేకాదు ఈ మూవీ ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచిన సంగతి తె లిసిందే. తాజాగా ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ మరింత ముందకు దూసుకేళ్లింది. ఇందులోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి షార్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే ఉత్తమ ఇంటర్నేషనల్ ఫ్యుచర్ ఫిలింగా లాస్ట్ ఫిలిం షో నిలిచింది. దీఇనితో పాటు బెస్ట్ డాక్యుమెంటరి ఫీచర్ అల్ థట్ బ్రీత్స్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా ది ఎలిఫెంటా విస్పర్స్ సినిమాలు ఈ షార్ట్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! శాంతనుకు శ్రుతి బ్రేకప్ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
తెలంగాణ స్టార్టప్‌కు ఎకో ఆస్కార్
లండన్: పర్యావరణ ఆస్కార్గా పేరొందిన ప్రతిష్టాత్మక ఎర్త్‌షాట్ ప్రైజ్ తెలంగాణలో ఏర్పాటైన అంకుర సంస్థ ‘ఖేతి’కి దక్కింది. పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటూ సన్నకారు రైతుల సాగు ఖర్చును తగ్గించి, దిగుబడి, ఆదాయం పెంచుకునేందుకు ఈ సంస్థ సాయమందిస్తోంది. అందుకు గాను ‘ప్రొటెక్ట్, రీస్టోర్ నేచర్’ విభాగంగా ఈ అవార్డును అందుకుంది. పురస్కారంతో పాటు పది లక్షల పౌండ్ల బహుమతి సొంతం చేసుకుంది. ఖేతి అనుసరిస్తున్న ‘గ్రీన్‌హౌజ్ ఇన్ ఏ బాక్స్’ విధానానికి ఈ అవార్డ్‌ను ఇస్తున్నట్లు ఎర్త్‌షాట్ ప్రైజ్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ యువరాజు విలియం వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ఖేతి సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కప్పగంతుల కౌశిక్ పురస్కారం అందుకున్నారు. ‘‘మా పద్ధతిలో రసాయ నాల వాడకమూ అతి తక్కువగా ఉంటుంది. పంటకు నీటి అవసరం ఏకంగా 98% తగ్గుతుంది! దిగుబడి ఏకంగా ఏడు రెట్లు అధికంగా వస్తుంది. ‘గ్రీన్‌హౌజ్’ కంటే ఇందులో ఖర్చు 90 శాతం తక్కువ. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. మళ్లీ పంట సాగుకు, పిల్లల చదువు తదితరాలకు వాడుకోవచ్చు.’’ అని ఆయన వివరించారు. -
అఫీషియల్: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్, 15 విభాగాల్లో క్యాంపెయిన్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో జక్కన్న రూపొందించి ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది. చదవండి: ‘ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాల్సిందే’.. అయోధ్య ప్రధాన పూజారి ఆగ్రహం దీంతో అంతా షాకయ్యారు. ఆర్ఆర్ఆర్ను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపకపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమయ్యింది. దీంతో అమెరికాలో ఆర్ఆర్ఆర్ను డిస్ట్రిబ్యూట్ చేసిన వేరియల్స్ ఫిలిం సంస్థ ఆర్ఆర్ఆర్ను ఆస్కార్ నామినేషన్స్‌కు పరిశీలించాలని అకాడెమీని కోరింది. ఇదిలా ఉంటే రీసెంట్గా ఆర్ఆర్ఆర్ లాస్ ఎంజెల్స్‌లో వారం రోజుల పాటు ప్రదర్శించబడిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ అకాడమీ రూల్స్ ప్రకారం.. ఏ సినిమా అయినా ‘లాస్ ఏంజెల్స్’లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో వారం పాటు ప్రదర్శించబడితే ఆస్కార్ అవార్డుల పోటీలో నిలవొచ్చు. ఈ క్రమంలో ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ (For Your Consideration) కింద 15 విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ను చిత్ర బృందం క్యాంపెయిన్ చేస్తోంది. చదవండి: యూట్యూబ్ ద్వారా బిగ్‌బాస్ గంగవ్వ నెల సంపాదన ఎంతంటే ఈ విషయాన్ని రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆయన ట్వీట్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కోసం క్యాంపెయినింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. బెస్ట్ మోషన్ పిక్చర్: డివివి దానయ్య, బెస్ట్ డైరెక్టర్ : ఎస్ఎస్ రాజమౌళి, బెస్ట్ యాక్టర్ : జూ. ఎన్టీఆర్ , రాంచరణ్ .. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగన్ , బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు , బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : కీరవాణి, బెస్ట్ ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ , బెస్ట్ సౌండ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ బరిలో క్యాంపెయిన్ చేస్తోంది. ❤️🔥🙏 #RRRforOscars https://t.co/83MUH5QuMH — S S Karthikeya (@ssk1122) October 6, 2022 -
ఆస్కార్ నామినేషన్ చిత్రం ‘ఛెల్లో షో’ ట్రైలర్ విడుదల
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మనదేశం తరఫున ఆస్కార్ నామినేషన్ పోటీకి గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’) ఎంపికైన విషయం తెలిసిందే. భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్ నలిన్ (నలిన్ కుమార్ పాండ్య) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాయ్‌కపూర్ ఫిల్మ్స్, ఆరెంజ్ స్టూడియో సమర్పణలో సిద్ధార్థ్ రాయ్ కపూర్, ధీర్ మోమయ్య, పాన్ నలిన్, మార్క్ డ్యూలే నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘మా నాన్న నన్ను కొట్టారు. నేను సినిమా చూడటానికి వెళ్లానని’, ‘భవిష్యత్ స్టోరీ టెల్లర్స్దే’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఇక ‘లాస్ట్ ఫిల్మ్ షో’ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. సినిమాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ (భవిన్ రాబరి) ఎలా ఫిల్మ్‌మేకర్ అయ్యాడు? అన్నదే చిత్ర కథ. -
హాలీవుడ్ సంస్థతో రాజమౌళి కీలక ఒప్పందం.. అందుకేనా?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో(సీఏఏ)తో ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీకి నోచుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ఛెల్లో షోను ఎంపిక చేసిన కొద్ది రోజులకే రాజమౌళి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఎంట్రీలో చుక్కెదురైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పదివారాలు ట్రెండ్ అయిన నాన్ హాలీవుడ్ చిత్రంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలవలేకపోయింది. అమెరికా కాలిఫోర్నియా హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న సీఏఏ ఏజెన్సీ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ రంగాల్లో పలు రకాల సేవలందిస్తోంది. (చదవండి: ఆస్కార్ బరిలో గుజరాతీ ఫిల్మ్ ఛెల్లో షో) గుజరాతీ చిత్రం ఛెల్లో షోను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ చేయడంతో దేశవ్యాప్తంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. కొంతమంది సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్కు మద్దతుగా పోస్టులు కూడా చేశారు. ఈ నిర్ణయంపై కొందరు టాలీవుడ్ నటులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్ఆర్ఆర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ వేరియెన్స్ ఫిల్మ్స్ సంస్థ సైతం మద్దతు తెలిపింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కేటగిరీలో ఈ చిత్రాన్ని పరిగణించాలని అభ్యర్థించింది. ఆస్కార్ ఎంట్రీకి ఆర్ఆర్ఆర్ ఎంపిక కాకపోవడంపై హాలీవుడ్ డైరెక్టర్ ఆడమ్ మెక్కే కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రాల విభాగంలో నామినేట్ చేయాల్సిందిగా మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. -
ఆర్ఆర్ఆర్పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్ కౌంటర్
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అన్నివర్గా ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల వసూళు చేసి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ మూవీపై కొందరు బ్రిటిష్ నెటిజన్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను తక్కువ చేసిన చూపించారంటూ విమర్శలు రావడంతో తాజాగా వాటిపై స్పందించారు జక్కన్న. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. ఈ సినిమాలో బ్రిటిషన్లని విలన్లుగా చూపించినంత మాత్రాన బ్రిటిషర్స్ అందరూ విలన్స్ అయిపోరని, ఒకవేళ అందరూ అలాగే అనుకుంటే బ్రిటన్‌లో ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించేది కాదంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ‘స్క్రీన్‌పై ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వచ్చే గమనిక(డిస్ల్కైమర్) అందరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అనేది ఓ సినిమా కథ మాత్రమే. పాఠం కాదు. ఈ విషయం సినిమాలో నటించిన నటీనటులందరికీ తెలుసు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా విషయం అర్థమై ఉంటుంది. అయితే.. ఓ స్టోరీ టెల్లర్గా ఈ విషయాలన్నీ అవగాహన ఉంటే.. వేరే విషయాల గురించి ఆలోచన చేసే అవసరం లేదు’ అంటూ రాజమౌళి వివరణ ఇచ్చారు. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! ఒక ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ సినిమాను.. సినిమాగానే చూడాలని, అప్పుడే దాన్ని ఎంజాయ్ చేయగలుగతారంటూ జక్కన్న సూచించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ నామినేషన్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ను ఆస్కార్స్‌కు పంపకుండా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతి చిత్రం ఛైలో షోను నామినేట్ చేయడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే అమెరికాలో ఆర్ఆర్ఆర్ను డిస్ట్రిబ్యూట్ చేఇసన వేరియల్స్ ఫిలిం సంస్థ ఆర్ఆర్ఆర్ ఆస్కాన్ నామినేషన్స్‌కు పరిశీలించాలని ఆకాడమిని కోరింది. అన్ని కేటగిరీలకు సంబంధించి ఓటింగ్ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తోంది. -
Oscars 2022: రిజ్ అహ్మద్.. ఆస్కార్ పట్టేశాడు
Oscars 2022: కిందటి ఏడాది మిస్ అయితే ఏంటి.. ఈ ఏడాది ఆస్కార్‌ను పట్టేశాడు రిజ్ అహ్మద్. పాక్-బ్రిటన్ సంతతికి చెందిన 39 ఏళ్ల రిజ్ అహ్మద్ ‘ది లాంగ్ గుడ్‌బై’ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌కుగానూ (Best Live Action Short Film) కేటగిరీలో ఆస్కార్ అందుకున్నాడు. దర్శకుడు అనెయిల్ కారియాతో ఈ అవార్డును స్వీకరించాడు రిజ్ అహ్మద్. 94వ అకాడమీ అవార్డుల వేడుక ఈ ఉదయం(సోమవారం) అట్టహాసంగా మొదలయ్యింది. ఈ ఈవెంట్లో తన తొలి ఆస్కార్‌ను అందుకున్నాడు రిజ్ అహ్మద్. మల్టీ టాలెంటెడ్‌గా పేరున్న రిజ్.. కిందటి ఏడాది ‘సౌండ్ ఆఫ్ మెటల్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు కూడా. కానీ, సీనియర్ నటుడు ఆంటోనీ హోప్కిన్స్కు అవార్డు దక్కింది. విశేషం ఏంటంటే.. ది లాంగ్ గుడ్‌బైలో అనెయిల్ కారియాతో పాటు రిజ్ అహ్మద్ సహకారం ఉంది. రిజ్ కో క్రియేటర్. ఇక తన అవార్డు విన్నింగ్ స్పీచ్‌లో ఉక్రెయిన్ సంక్షోభంపై రిజ్ అహ్మద్ ప్రసంగించాడు. ఇది విభజిత కాలం. ఇందులో ‘మనం’, ‘వాళ్లు’ లేరని గుర్తు చేయడమే కథ పాత్ర అని నమ్ముతాం. అక్కడ ‘మనం’ మాత్రమే ఉంది. కానీ, ఇది తమకు చెందినది కాదని భావించే ప్రతి ఒక్కరి కోసం. అలాగే శాంతి కోసం అంటూ ప్రసంగించాడు రిజ్ అహ్మద్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆస్కార్ తుది జాబితాలో ‘కూళాంగల్’ ఉంటుంది: విఘ్నేష్
సాక్షి, చెన్నై: కూళాంగల్ చిత్రం ఆస్కార్ అవార్డుల తుది జాబితాలో ఉంటుందనే నమ్మ కాన్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ వ్యక్తం చేశారు. ఈయన, నటి నయనతార కలిసి రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కూళాంగల్. ఇక ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పీఎస్.వినోద్ రాజ్‌కు.. దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. కాగా, చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకుంది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డుల ఎంపికకు నామినేట్ అయ్యింది. ఈ ఏడాది విదేశీ చిత్రాల కేటగిరీలో భారతదేశం తరఫున నామినేట్ అయిన చిత్రం కూళాంగల్. ఆస్కార్ అవార్డుల తుది జాబితాలో తమ చిత్రం ఉంటుందనే నమ్మకాన్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. చదవండి: చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్.. ఫిబ్రవరిలో షూటింగ్ -
ఆస్కార్ 2022కి వెళ్లనున్న నయనతార మూవీ
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘ఆస్కార్’. ఒక్కసారైనా ఈ అవార్డుని సాధించాలని ప్రతి ఫిల్మ్ మేకర్ కోరుకుంటారు. అలాంటి ఫేమ్ ఉన్న ఈ అవార్డు కార్యక్రమం మార్చి 2022న లాస్ ఎంజెల్స్‌లో జరగనుంది. ఈ అవార్డుకి అంతర్జాతీయ చలనచిత్ర కేటగిరీ తమిళ చిత్రం ‘కూజాంగల్’ ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లదగ్గ మొత్తం 14 సినిమాలను వీక్షించింది. అందులో ఈ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పీఎస్ వినోద్‌రాజ్ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నిర్మించారు. విదేశి ఉత్తమ మూవీ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌కి పోటీపడుతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఈ చిత్ర నిర్మాత విఘ్నేష్ షేర్ చేసుకున్నాడు. ‘‘అండ్ ది ఆస్కార్స్ గోస్ టు..’ అనే పదం వినేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాం. ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ ఫిల్మ్ మేకర్ తెలిపాడు. చదవండి: ప్రియుడితో కలిసి దేవాలయాలను సందర్శించిన నయనతార There’s a chance to hear this! “And the Oscars goes to …. 🎉🎉🥰🥰🥰🥰 “ Two steps away from a dream come true moment in our lives …. ❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰#Pebbles #Nayanthara @PsVinothraj @thisisysr @AmudhavanKar @Rowdy_Pictures Can’t be prouder , happier & content 💝 pic.twitter.com/NKteru9CyI — Vignesh Shivan (@VigneshShivN) October 23, 2021 -
హీరో సూర్యకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : సూపర్‌స్టార్
చెన్నై: కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ నటుడు సూర్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూరరై పోట్రు చిత్రం, కథానాయకుడిగా చేసిన సూర్య గురించి మాట్లాడారు. ‘నేను ఇటీవల సూరరై పోట్రు చిత్రం చూశాను. అందులో నటనకు సూర్యకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అందుకు ఆయన అర్హుడు. నేను కలిసిన అరుదైన నటుల్లో సూర్య ఒకరు. చాలా నిజాయితీ గల వ్యక్తి’ అని అన్నారు. కాగా నటుడు సూర్య నటించి నిర్మించిన చిత్రం సూరరై పోట్రు ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. -
ఎనిమిదోసారి మిస్.. లైట్ తీస్కో భయ్యా..!
తొలిసారి ఓటమి నిరాశ. రెండోసారి నిరుత్సాహం. మూడోసారి నిస్పృహ. నాలుగోసారి నిర్లిప్తత. గ్లెన్ క్లోజ్ వరుసగా ఏడుసార్లు ఓడిపోయారు!! 74 ఏళ్ల అమెరికన్ నటి గ్లెన్. తన 36 ఏళ్ల వయసు నుంచి ఆస్కార్ కి నామినేట్ అవుతూ వస్తున్నారు. మొన్నటి ఆస్కార్ లో ఎనిమిదో ఓటమి! మనసుకు ఎలా ఉంటుంది? గ్లెన్ కు ఎలానూ లేదు. పైగా డాన్స్ చేశారు! ‘నేమ్ దట్ సాంగ్’ అనే ఆస్కార్ సరదా రౌండ్ కార్యక్రమంలో ‘ద బట్’ అనే ముప్పై ఏళ్ల క్రితం నాటి పాపులర్ సినిమా పాటకు స్టెప్ లు వేసి మరీ రైట్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే ఒక అంతర్లీన సందేశం కూడా. ‘లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో’ లాంటి సందేశం! ఈ పరంపర పరాజిత అసలైన ఆస్కార్ విజేత అని ట్విట్టర్ నిన్నటి నుంచీ గ్లెన్స్ కి క్లాప్స్ కొడుతూనే ఉంది. గ్లెన్ క్లోజ్‌కు ఈసారి కూడా ఆస్కార్ చేజారింది! ఆ తర్వాతి కేటగిరీలోని అవార్డులు ప్రకటిస్తున్నప్పుడు డాల్బీ థియేటర్లో ఆమె ఓ వైపున మౌనంగా కూర్చొని ఉన్నారు. అప్పటికి ఆమె తన ఎనిమిదో గెలుపును కూడా కోల్పోయి కొన్ని నిమిషాలైనా కాలేదు కనుక ఆ మాత్రం మౌనంగా ఉండటం సహజమే. ముప్పై ఎనిమిదేళ్లుగా గ్లెన్ ఆస్కార్‌కి నామినేట్ అవుతున్నారు, విజేత కాలేకపోతున్నారు. ఈ ఏడాది ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ చిత్రానికి ‘ఉత్తమ సహాయ నటి కేటగిరీ’లో నామినేట్ అయ్యారు. ఆమెకు కాకుండా అవార్డు మరొకరికి వచ్చింది. బహుశా ఆ క్షణంలో.. ‘అండ్ ది అవార్డ్ గోస్ టు’ అనే మాట ఆమె అభిమానులకు ‘అండ్ ది అవార్డ్ నాట్ గోస్ టు..’ అని వినిపించి ఉండాలి. అయితే గ్లెన్ మౌనంగా ఉన్నారు తప్పితే బాధగా లేరు! ఆ విషయం కొద్దిసేపటికే ఆమె తన కుర్చీ లోంచి లేచి, ఎంతో ఎనర్జిటిక్‌గా వేసిన స్టెప్పులను చూశాక ప్రపంచానికి తెలిసింది. ‘స్కూల్ డేజ్’ (1988) అనే హాలీవుడ్ చిత్రంలోని ‘ద బట్’ అనే పాటకు గ్లెన్ చేసిన డ్యాన్స్ అది. ఫంక్ గోగో సాంగ్. యంగ్‌స్టర్స్ మాత్రమే వేయగలరు. అలాంటిది.. డెబ్బై అయిదేళ్ల దరిదాపుల్లో ఉన్న గ్లెన్ కూడా వేశారు! ఆస్కార్ థియేటర్ దద్దరిల్లింది. ట్విట్టర్ బ్లాస్ట్ అయింది. సోషల్ మీడియా ‘ఓయమ్మో’ అని క్లాప్స్ కొట్టింది. ఇంకెక్కడి అపజయం. గ్లెన్ని వదిలిపెట్టి పారిపోయింది. లాస్ ఏంజెలిస్‌లోని డోల్బీ థియేటర్లో సోమవారం జరిగిన ఆస్కార్ వేడుకల సరదా సమయంలో ‘ద బట్’ పాటకు డాన్స్ చేస్తున్న పరాజిత గ్లెన్ క్లోజ్. ఆస్కార్ వేడుక పూర్తిగా విజేతలదే అన్నట్లు ఉండదు. మధ్యలో కొన్ని సరదా రౌండ్లు కూడా ఉంటాయి. గెలుపు ఓటములకు నిమిత్తం లేకుండా.. నామినేట్ అయిన వారందరినీ ఉత్సాహపరిచే క్విజ్‌ల వంటివి అవి. సోమవారం విజేతల ప్రకటన అయ్యాక అమెరికన్ నటుడు లిల్ రెల్ హౌరీ చిన్న పోటీ పెట్టాడు. ‘ఆ పాటేమిటో చెప్పుకోండి’ అని. డీజే ఆ పాటను స్కీన్‌పై ప్లే చేశాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న గ్లెజ్ క్లోజ్ ఉత్సాహం గా పైకి లేచి.. ‘యా, దటీజ్.. ద బట్’ అని చెబుతూ.. అక్కడిక్కడే ‘ద బట్’ డ్యాన్స్‌ని వేసి చూపించారు. థియేటర్లో ఒక్కసారిగా ఆస్కార్ విజేతలు, పరాజితులు కలిపిపోయి ఆమె డాన్స్‌కు ఊగిపోయారు. ఎప్పటి పాట! ఇప్పటికీ అదే ఎనర్జీ! గ్లెన్ కూడా ఎప్పటి నటి! ఇప్పటికీ అదే స్పిరిట్. ‘ద బట్’ పాట ఉన్న ‘స్కూల్ డేజ్’ విడుదల అవడానికి ఐదేళ్ల ముందే 1983లో గ్లెన్ తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. అప్పటికి ఆమె వయసు 36 ఏళ్లు. ఇప్పటికి ఎనిమిదిసార్లు నామినేట్ అయ్యారు. ఏనాడూ విజేత కాలేదు. ఈ ఏడాది ఆమె అపజయం ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు ఉన్న ఒక పరాజితుని రికార్డుని సమం చేసింది. ఆ పరాజితుడు పీటర్ ఓటూల్. ఆయనా అంతే. తన జీవితకాలంలో ఎనిమిదిసార్లు ఆస్కార్‌కి నామినేట్ అయినా ఒక్కసారి అవార్డు పొందలేకపోయారు. ‘స్కూల్ డేజ్’ చిత్రంలోని ‘ద బట్’ సాంగ్ విజయానికి మెట్లెప్పుడూ పైకే ఉంటాయనేం లేదు. ఓటమి సంభవించినప్పుడు ఒక్క మెట్టయినా మానసికంగా కిందికి దిగకపోవడం కూడా విజయమే. ఎనిమిదోసారి కూడా ఆస్కార్‌ను పొందలేకపోయినప్పటికీ గ్లెన్ ఏ మాత్రం నిరుత్సాపడకపోగా, చేజారిన గెలుపును మనుసులోకి చేరనివ్వలేదు. ఆస్కార్ వేడుకలకు ఒక అతిథిగా మాత్రమే వచ్చి కూర్చున్నంత నిలకడగా ఉన్నారు. అవార్డు రాలేదని తెలిశాక కూడా కొంచెమైనా డౌన్ అయిపోలేదు. అందుకే నెట్ యూజర్లు ఆమెను ‘అసలైన ఆస్కార్ విజేత’గా అభినందిస్తున్నారు. నాలుగుసార్లు ఉత్తమ నటిగా, నాలుగుసార్లు ఉత్తమ సహాయనటిగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు గ్లెన్. ది వరల్డ్ ఎకార్డింగ్ టు గార్ప్ (1983), ది బిగ్ చిల్ (1984), ది నేచురల్ (1985), ఫ్యాటల్ అట్రాక్షన్ (1988) డేంజరస్ లయజన్స్ (1989), ఆల్బర్ట్ నాబ్స్ (2012), ది వైఫ్ (2019), ఈ ఏడాది (2021) హిల్బిల్లి ఎలిజీ చిత్రాలకు గ్లెన్ నామినేషన్ సాధించారు. ఫ్యాటల్ అట్రాక్షన్, డేంజరస్ లయజెన్స్, ఆల్బర్ట్ నాబ్స్, ది వైఫ్ చిత్రాలకు ఉత్తమ నటిగా, మిగతా నాలుగు చిత్రాలకు ఉత్తమ సహాయక నటిగా నామినేట్ అయ్యారు. ఈసారీ తనకు అవార్డు రాకపోవడంపై గ్లెన్ ప్రత్యేకంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. అయితే గ్లెన్.. ‘ద బట్’ పాటకు డ్యాన్స్ చేయడం ఈ ఏడాది అస్కార్ టాప్ మూమెంట్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. -
20 ఏళ్ల తర్వాత ఆస్కార్ బరిలోకి మనదేశ సినిమా!
వాషింగ్టన్: అకాడమీ అవార్డులంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతుంటాయి. గత 2002లో లగాన్ తరువాత ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రం ఆస్కార్ 2021లో ఇండియా నుంచి పోటీపడుతోంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్ మూవీ పోటీపడుతుండడంతో ఈసారి అకాడమీ పండుగ మనవారికీ ఆసక్తిగా మారింది. ఈ ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్‌లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది. అవార్డుల వేడుకలను తిలకించడమే...అవార్డుల వేడుకకు ఇంకా కొద్ది రోజులే మిగిలిన వేళ ఈ అకాడమీ అవార్డులలో పోటీపడుతున్న చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే... ►ద వైట్ టైగర్: లగాన్ తరువాత ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ కాబడ్డ చిత్రమిది. రాజ్‌కుమార్ రావు, ప్రియాంక చోప్రా లాంటి తారాగణం ఉన్న ఈ చిత్రంలో సామాన్యుని జీవితం ఒడిసిపట్టారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, పారాసైట్ల సమ్మేళనంలా కనిపిస్తుందీ చిత్రం. ► ద పాధర్ : ఫ్లోరియన్ జెల్లర్ ప్లే లీ పీరీ ఆధారంగా తీర్చిదిద్దారు. వయసు మీద పడిన తండ్రి నెమ్మదిగా అన్నీ మరిచిపోతుండటం... ఈ నేపథ్యంలో కనిపించే భావోద్వేగాలు. ఆంథోనీ హోప్కిన్స్ ప్రదర్శనకు పరాకాష్ట అనతగ్గ రీతిలో ఉంటుందిది. ► జుడాస్ అండ్ ద బ్లాక్ మెసయ్య : చారిత్రాత్మక బయోపిక్ ఇది. దర్శకత్వం మొదలు, చిత్ర నటీనటుల ఎంపిక, నటన, స్క్రిప్ట్... ప్రతిఒక్కటీ అద్భుతమే ! ► మంక్ : డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశేషమేమిటంటే ఈ చిత్ర స్క్రీన్‌ప్లేను ఆయన తండ్రి జాక్ ఫించర్ తీర్చిదిద్దడం. ఇటీవలనే ఆయన మరణించారు. ► మినారీ: లీ ఇసాక్ రచనదర్శకత్వం వహించిన కొరియన్అమెరికన్ ఫ్యామిలీ చిత్రమిది. స్ఫూర్తిదాయక కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. రోజువారీ సగటు అమెరికన్ జీవిత గాథను ఇది వెల్లడిస్తుంది. ►నోమడ్ల్యాండ్ః అందాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమది. ఓ సంక్షోభంలో అన్నీ కోల్పోయిన 60ఏళ్ల వయసులోని మహిళ జీవిత ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. ► ప్రామిసింగ్ యంగ్ ఉమెన్: ఊహాతీత సంఘటనలతో కూడిన కథనం ఈ చిత్రబలం. ఓ అమ్మాయి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలతో సాగుంది. అద్భుతమైన అభినయం, దర్శకత్వాల కలయిక ఈ చిత్రం. ► సౌండ్ ఆఫ్ మెటల్: తన వినికిడి శక్తిని కోల్పోవడం ప్రారంభించిన ఓ హెవీ మెటల్ డ్రమ్మర్ జీవితంపై దృష్టి సారించిన చిత్రమిది. ఈ సినిమా ఆద్యంతం భావోద్వేగాలతో, వాస్తవికంగా సాగుతుంది. ఈ సినిమాలో కధానాయకుడు ఫీలయ్యే అనేక భావాలను మనమూ ఫీలయ్యేంతగా మనల్ని లీనం చేసుకుంటుంది. రిజ్ అహ్మద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ► ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7: కోర్ట్ రూమ్‌లో సంభవించే ఆసక్తికర అంశాలను అద్భుతంగా చిత్రీకరించిన వైనం ఆకట్టుకుంటుంది. కొన్ని దశాబ్ధాల క్రితం 1969లో నిజంగా చికాగోలో జరిగిన ఓ ఉదంతం ఆధారంగా తీసిన చిత్రమిది. -
‘ఆస్కార్ నటితో మీకు పోలికా.. ప్లీజ్ బ్రేక్ తీసుకొండి’
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై కంగనా తనదైన రీతిలో స్పందిస్తారు. నచ్చనివారిని డైరెక్ట్‌గానే విమర్శిస్తారు. ట్రోల్స్‌ని అస్సలే పట్టించుకోరు. తాజాగా కంగనా తనని తాను హాలీవుడ్ స్టార్ నటి మెర్లీ స్ట్రీప్, ప్రముఖ ఇజ్రాయిల్ నటి గాల్ గాడోట్‌లతో పోల్చుకుంటూ.. వారి కంటే తానే ఎంతో మంచి నటని.. కావాలంటే తన కంటే గొప్ప నటిని భూమ్మీద మరొకరిని చూపించగలరా అంటూ ట్విట్టర్ వేదికగా సవాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజనులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రకరకాల మీమ్స్ తయారు చేసి ఆమెను ట్రోల్ చేశారు. ‘‘అసలు మెరిల్ స్ట్రీప్‌తో నీకు పోలికేంటి.. ఆమె 3 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.. 21 సార్లు ఆస్కార్ బరిలో నిలిచారు... మరి మీరు ఎన్ని ఆస్కార్లు సాధించారంటూ’’ ట్రోల్ చేశారు నెటిజనులు. ఈ విమర్శలపై కంగనా విరుచుకుపడ్డారు. ‘‘ఆస్కార్ అనేది కేవలం అమెరికన్ సినిమాలకు మాత్రమే ఇచ్చే అవార్డు. ఆ లెక్కన చూసుకుంటే.. మెరిల్ స్ట్రీప్ ఎన్ని జాతీయ అవార్డులు, పద్మ పురస్కారాలు సాధించారు. ఇప్పటికైనా మారండి.. బానిస మనస్తత్వం నుంచి బయటపడి.. ఆత్మ గౌరవంతో మెలగండి’’ అని సూచిస్తూ ట్వీట్ చేశారు. అయితే కంగనా వాదన నెటజనులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ‘‘అసలు సెన్స్ ఉందా మీకు.. మీరు సోషల్ మీడియాలో హైపర్ యాక్టీవ్‌గా మారారు. మీ బుర్ర పనిచేయడం లేదనుకుంటాను. ప్లీజ్ మేడం.. కొద్ది రోజుల పాటు బ్రేక్ తీసుకుని సోషల్ మీడియాకు దూరంగా ఉండండి’’ అంటూ సూచిస్తున్నారు నెటిజనులు. చదవండి: ఆమె డీఎన్ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ కంగనా ఇరవై అయిదు కోట్ల ఫైట్! -
ఆస్కార్ నటి చేదు జ్ఞాపకాలు
పేరొస్తే పేరుతో పాటు కొన్ని నెత్తి మీదకు వస్తాయి. నువ్వెలా ఉండాలో అందరూ చెప్పేవాళ్లే అవుతారు. ‘నువ్వలా ఎందుకు ఉండవు?’ అని అందరూ అడిగేవాళ్లే అవుతారు. ముఖ్యంగా సినిమాల్లో పేరొచ్చిన వాళ్లకు ఈ ‘పేరు బరువు’ మోయలేనంతగా, వదిలించుకోవాలన్నంతగా ఉంటుంది. కేట్ విన్స్లెట్ కూడా కొన్నాళ్లు ఆ బరువును మోశారు. మీడియా ఆమెపై మోపిన బరువు అది! ‘‘మీడియా నా జీవితాన్ని నరకప్రాయం చేసింది. అస్సలు దయలేకుండా ప్రవర్తించింది. ఆఖరికి నా నీడను కూడా వెంటాడి, దాక్కోడానికి నాకొక చోటు లేకుండా చేసింది. నా నుంచి నేను పారిపోవాలన్నంతగా నన్ను వెంటాడింది’’ అని గురువారం ‘డబ్ల్యూ.టి.ఎఫ్.’ అనే అమెరికన్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన వాయిస్ ఇంటర్వ్యూలో చెప్పారు కేట్. టైటానిక్ చిత్రం తెచ్చిన పేరుతో మీడియా ధోరణి వల్ల తను దాదాపుగా ఒక దుర్భరమైన బతుకునే బతికినట్లు కేట్ చెప్పారు. సినిమాకు బ్రేక్ వస్తే ఎవరైనా సంతోషిస్తారు. కేట్ విన్స్లెట్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్య వచ్చిన బ్రేక్‌లో మీడియా కంటపడకుండా సంతోషమైన జీవితాన్ని వెతుక్కున్నారు. ఈ బ్రిటిష్ నటిని చెత్త చెత్త ప్రశ్నలు అడిగి, కల్పించిన ఆరోపణలు, విమర్శలతో వేధించింది బ్రిటన్ మీడియానే! బ్లాక్ బస్టర్ మూవీ ‘టైటానిక్’ 1997లో విడుదలైంది. అందులో హీరోయిన్ కేట్ విన్స్లెట్. ఫస్ట్ డే ఫస్ట్ షోతో ఆమెకు ఉత్తర అట్లాంటిక్ సముద్రమంత ఫాలోయింగ్ వచ్చేసింది. టైటానిక్‌లో ఉత్తమ నటిగా ఆస్కార్‌కు కూడా ఆమె నామినేట్ అయ్యారు. టైటానిక్‌కి ముందు ఐదు చిత్రాల్లో నటించారు కేట్. టైటానిక్ తర్వాత దాదాపు నలభై చిత్రాల్లో నటించారు. అయితే నేటికీ టైటానిక్కే ఆమె ఐడెంటిటీ. తన 21 ఏట జేమ్స్ కామెరూన్ చిత్రం టైటానిక్‌లో నటించిన కేట్ ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో జేమ్ కామెరూన్దే అయిన ‘అవతార్ 2’ లో నటిస్తున్నారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. విడుదలకు ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. కరోనా బ్రేక్ రాకపోయుంటే ఈ ఏడాది (2021) డిసెంబర్లో విడుదలకు రెడీ అవుతూ ఉండేది. అవతార్ 2 లో అండర్ వాటర్ సీన్ కోసం కేట్ ఏడున్నర నిముషాల పాటు నీటి అడుగున ఊపిరి బిగబట్టి ఉన్నారని 2019లో కామెరూన్ మెచ్చుకోలుగా చెప్పారు. అయితే మీడియా విసిగింపులతో తను చాలాసార్లు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం ఊపిరిని బిగబట్టి ఉన్నానని అంటారు కేట్! ∙∙ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఫలానా టార్చర్ అని మీడియా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కేట్. తనకు వ్యక్తిగత జీవితం లేకుండా చేశారని మాత్రం పలుమార్లు చెప్పారు. ఒక ఆస్కార్‌ను (‘ది రీడర్’ చిత్రంలో ఉత్తమ నటిగా), ఆరు ఆస్కార్ నామినేషన్లను గెలుచుకున్న కేట్.. టైటానిక్ చివరి సన్నివేశంలో హీరో డికాప్రియో ఇచ్చిన సపోర్ట్‌తో రాత్రంతా నీళ్లపై తేలుతూ ఎలాగైతే ప్రాణాలు కాపాడుకుంటుందో, మీడియా నుంచీ తనను తను అలాగే కాపాడుకుంటూ వచ్చింది. అయితే నిజ జీవితంలో తనే తన హీరో. ప్రస్తుతం భర్త, ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఉన్న కేట్కు టైటానిక్‌తో ఆమె సంపాదించిన పేరు ప్రతిష్టలు ఏమంత సంతోషాన్నివ్వలేదు. ‘‘ఆ సినిమా రిలీజ్ తర్వాత నేను ‘పర్సనల్ ఫిజికల్ స్క్రూటినీ’కి గురయ్యాను’’ అని పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు కేట్. ఆ ఫిజికల్ స్క్రూటినీకి కారణం టైటానిక్‌లో కొన్ని క్షణాల పాటు కేట్ కళాత్మకంగానే అయినా, ‘న్యూడ్’గా కనిపించడం. కేట్ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా చివరికి ఆ సీన్ దగ్గరికే వచ్చే ఆగేవి వాళ్ల ఆరాలు. కథలో భాగమైన ఆ ఇరవై ఏళ్ల అనాచ్ఛాదిత దేహాన్ని ప్రశ్నలతో ఆస్వాదించడం మొదలుపెట్టేవారు. ‘ఏంటమ్మాయ్.. బొత్తిగా సిగ్గు లేకుండా..’ అని విమర్శించిన ప్రేక్షకులూ ఉన్నారు. ‘సిగ్గు లేకుండా’ అనే మాట కేట్‌ని బాధించలేదు కానీ, నిర్భయంగా మీద చెయ్యి వేయడానికి చొరవ చూపిన వారిని దూరంగా ఉంచినందుకు అహం దెబ్బతిని తనపై వారు రాసిన సిగ్గు లేని రాతలు ఆమెను క్రుంగదీశాయి. ‘‘పేరు రావడానికి ప్రతిఫలం ఇదే కనుకైతే అసలు పేరు గురించి ఆలోచించి ఉండేదాన్నే కాదు’’అని కేట్ ఆవేదనగా అన్నారు. ఎప్పుడో పదిహేనేళ్ల వయసులో, తనకన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన నటుడు స్టీఫెన్ ట్రైడర్తో ఆమెకున్న రిలేషన్‌ని కూడా తవ్వి తీసేవారు. నివ్వెరపోయేవారు కేట్. స్టీఫెన్ ఆమె గురువు. ఆమె జీవితంపై అతడి ప్రభావం ఎంతగానో ఉంది. 1997లో స్టీఫెన్ బోన్ క్యాన్సర్‌తో మరణించారు. అతడి అంత్యక్రియలకు వెళ్లేందుకు ఆస్కార్ ఆహ్వానాన్ని కూడా పక్కన పెట్టేశారు కేట్. సరే, ఈ గతమంతా ఎలా ఉన్నా.. ‘అమోనైట్’ కేట్ తాజా చిత్రం. అందులో నాయిక పాత్ర. ఆ పాత్ర ఆస్కార్‌కు నామినేట్ అవొచ్చని, అయితే బాగుండునని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. -
ఆస్కార్ బరిలోకి ‘జల్లికట్టు’
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఉత్తమ అంతర్జాతీయ భాషా చిత్రాల కెటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ సినిమా ఆస్కార్ బరిలోకి ఎంపిక కావడం విశేషం. 14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్, టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించారని, అందకే ఈ సినిమాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జల్లికట్టు కథేంటి లిజో జోస్ పెలిసెరి దర్శకత్వంలో ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోసే, సబుమోన్ అబ్దుసామద్ శాంతి బాల చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో.. ఓ కుగ్రామంలో ఓ దున్న సృష్టించిన విన్యాసాలను అద్భుతంగా చూపించారు. కేరళలోని ఓ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలందరికి గొడ్డు మాంసం అంటే ఇష్టం. గొడ్డుమాంసం లేనిదే వారికి ముద్ద దిగదు. ఆంటోనీ అనే వ్యక్తి ఉరందరికి బీఫ్ సరఫరా చేస్తుంటాడు. అతను తెచ్చి అమ్మె అడవి దున్న మాంసం అంటే అక్కడి వాళ్లందరికి పిచ్చి. అలా ఓరోజు.. అడవి దున్న ని కబేళాకి తరలించి, దాని మాంసం విక్రయిద్దాం అనుకునేలోపు.. అది తప్పించుకుంటుంది. అడవిని ధ్వంసం చేస్తూ, మనుషుల్ని గాయపరుస్తూ.. దాగుడుమూతలు ఆడుతుంది. దాన్ని పట్టుకునేందుకు ఊరంతా ఏకమై తిరుగుతారు. ఎలాగైనా దాన్ని చంపి మాంసం తలా ఇంత పంచుకోవాలనుకుంటారు. మరి ఆ దున్న వారికి దొరికిందా? ఈలోపు ఏం జరిగింది? ఎంత నష్టపరచింది? అన్నదే కథ. -
ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అతైయా ఇక లేరు
భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా (91) ఇక లేరు. గురువారం ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా భాను అతైయా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్లు భాను కుమార్తె రాధికా గుప్తా తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మెదడులో ఓ ట్యూమర్ ఉన్నట్టు కనుగొన్నారు. మూడేళ్లుగా ఆమె శరీరంలో సగభాగం చచ్చుబడిపోవడంతో మంచానికే పరిమితం అయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించారు భాను అతైయా. 1983లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారామె. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అందుకున్నారు భాను. గురుదత్ తెరకెక్కించిన ‘సీఐడీ’ (1956)తో కెరీర్ ప్రారంభించి సుమారు వంద సినిమాలకు పైనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘ఆమ్రపాలి’ చిత్రానికి వైజయంతి మాలకు, ‘గైడ్’లో వహీదా రెహమాన్‌కు, ‘సత్యం శివం సుందరం’లో జీనత్ అమన్‌కు ఆమె చేసిన కాస్ట్యూమ్స్‌కి బాగా పేరొచ్చింది. ‘లేకిన్, లగాన్’ చిత్రాలకు జాతీయ అవార్డులను అందుకున్నారు భాను. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడారామె... ‘‘ఆస్కార్ వేడుకలో కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లు ‘అవార్డు మీకే వస్తుంది’ అన్నారు. కానీ నేను మాత్రం నా పని నేను సరిగ్గా చేశాను. గాంధీజీ పేరుకి, స్వాతంత్య్ర ఉద్యమానికి న్యాయం చేశాను. అది చాలు అని మాత్రమే అనుకున్నాను. అవార్డు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి’’ అని ఆ ఇంటర్వ్యూల్లో చెప్పారు భాను. 2012లో అవార్డును భద్రపరచడానికి ఆస్కార్ అవార్డు అకాడమీకే అవార్డును తిరిగి ఇచ్చారు భాను. ఆమె రచించిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్’ పుస్తకం విడుదల సమయంలో ‘‘సినిమాకు కాస్ట్యూమ్స్ చాలా ప్రధానం. కానీ భారతీయ సినిమా కాస్ట్యూమ్స్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అన్నారు భాను. దాదాపు 50 ఏళ్ల పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వందకు పైగా సినిమాలు చేశారు భాను అతైయా. 2004లో ‘స్వదేశ్’ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. భాను మృతి పట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భాను అతైయా అంత్యక్రియలు ముంబైలోని చందన్ వాడీ స్మశాన వాటికలో జరిగాయి. -
ఆస్కార్ అవార్డును సీటు కింద దాచిపెట్టాడు
లాస్ ఏంజెల్స్ : హాలీవుడ్ డైరెక్టర్ టైకా వైటిటి చేసిన ఒక చిలిపి పని ఇప్సుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో జోజో రాబిట్ సినిమాకు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో టైకా వైటిటి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా అవార్డు కార్యక్రమం మధ్యలో తైకా వెయిటిటి తన అవార్డ్‌ను తన ముందున్న సీటు కింద దాచిపెట్టాడు. దీనిని గమనించిన హాలివుడ్ నటి బ్రీ లార్సన్ తన ఫోన్ కెమెరాలో బంధించి ట్విటర్లో షేర్ చేశారు. అయితే తైకా ఈ పని చేస్తుండగా తనకు తెలియకుండానే బ్రీ లార్సన్ కెమెరాకు చిక్కాడు. ఆ తర్వాత తన చేతిలో ఏ అవార్డు లేదంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. అయితే ఇదంతా లార్సన్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన నెటిజన్లు' టైకా వెయిటి! మీ చిలిపి పని బాగుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. Academy Award Winner @TaikaWaititi 💗 pic.twitter.com/PpZl1PhX8y — Brie Larson (@brielarson) February 10, 2020 -
‘పారాసైట్’కి ఆస్కార్ అవార్డుల పంట
లాస్ఏంజెల్స్ : దక్షిణ కొరియా చిత్రం పారాసైట్‌కు ఆస్కార్ అవార్డుల పంట పండింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్ విభాగాల్లో అస్కార్ అవార్డులను దక్కించుకుంది. ముందు నుండి ఎన్నో అంచనాలని పెంచుకున్న పారాసైట్ చిత్రం ఆస్కార్ కిరీటం దక్కించుకోవడం విశేషం. మేకింగ్‌తో పాటు కంటెంట్లోను హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఈ సినిమాను తెరకెక్కించారు. డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేదకుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. పేద, ధనిక అంతరాల వలన సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయో పారా సైట్ అనే చిత్రం ద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. చదవండి : ఆస్కార్ విజేతలు వీరే లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డ్ వేడుకలో పారాసైట్ చిత్రంతో పాటు జోకర్, 1917 చిత్రాలు కూడా తమ హవాను చూపాయి. జోకర్ చిత్రానికి గాను హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇక 1917 సినిమా మూడు విభాగాల్లో (విజువల్ ఎఫెక్ట్, సౌండ్ మిక్సింగ్, సినిమాటోగ్రఫీ) అవార్డులను ఎగరేసుకుపోయింది. -
ఆస్కార్ 2020 విజేతలు వీరే
లాస్ఏంజెల్స్ : 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ఏంజెల్స్లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న ఈ వేడకకు ప్రముఖ హాలీవుడ్ తారాగణమంతా హాజరై సందడి చేసింది. జోకర్ సినిమా హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్గా టాయ్‌స్టోరీ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ-4, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాంగ్ జాన్ హో (పారాసైట్), బెస్ట్ లైవ్‌యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా ద నైబర్స్ విండో నిలువగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే తైకా వెయిటిటి(జోజో రాబిట్) కు దక్కింది. ఉత్తమ చిత్రం : పారాసైట్ ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్) ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి) ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్ ( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ) ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్) ఉత్తమ సంగీతం : జోకర్ (హిల్దార్) బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : పారాసైట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : బాంబ్ షెల్ ఉత్తమ డాక్యుమెంటర్ షార్ట్ ఫీచర్ : అమెరికర్ ఫ్యాక్టరీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్) బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్: టాయ్ స్టోరీ 4 బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : అమెరికన్ ఫ్యాక్టరీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : బాంగ్ జూన్ హో( పారాసైట్) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గర్ల్) బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ : హెయిర్ లవ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ : 1917 ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : 1917 బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)