ఇప్పుడు భారతీయుల గుండెచప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు పాట అంటే అతిశయోక్తి కాదేమో. ఈ విజువల్ వండర్‌కు క్రియ దర్శక దిగ్గజం రాజమౌళి అయితే, కర్త, కర్మలు జూనియర్ ఎనీ్టఆర్, రామ్‌చరణ్, సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ అయ్యారు. ఈ పాట ఇప్పటికే ప్రపంచ సినీ ప్రేక్షకులను ఓలలాడించి, స్టెప్పులు వేయించింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో విజయకేతం ఎగరేసి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవేదికపై ఘనంగా చాటింది. దీంతో పాటు మరో తమిళ డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకుని సత్తా చాటింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్ర రూపకర్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఊహించని ఘనత
భారతీయ సినిమా ఈ రోజు వేడుక చేసుకుంటోంది. ప్రపంచ సినీ చరిత్రలో భారతీయ సినిమా రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని ఊహించని ఘనత సాధించింది. కార్తీకి కన్సాల్వాస్ దర్శకత్వంలో రూపొందిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ అవార్డును గెలుసుకోవడం మహా ఆనందం కలిగిస్తోంది. ఇది పలువురు దర్శకులకు ప్రోత్సాహకరంగా నిలుస్తుంది. అదేవిధంగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకొని సినీ ప్రపంచాన్నే డాన్స్ చేయించింది.
– దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం
హృదయ పూర్వక అభినందనలు
అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ చిత్ర దర్శకురాలు కార్తీకి కన్సాల్వాస్‌లకుé హృదయపూర్వక అభినందనలు. గరి్వంచదగ్గ భారతీయులకు నా సెల్యూట్.
– రాజనీకాంత్, నటుడు
గొప్ప కీర్తి..
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ అవార్డులను తెలుసుకోవడం గొప్ప ఘనత. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి ఇండియన్ పాట నాటునాటు కావడం చారిత్రాత్మకం. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు అభినందనలు. అలాగే ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు. ఆ డాక్యుమెంటరీ చిత్రం దర్శక నిర్మాతలు కార్తీకి కన్సాల్వాస్, గునిత్ మింగిలను ఎంత పొగిడినా తక్కువే.
– సీఎం స్టాలిన్
అంతా ఏనుగులకే చెందుతుంది...
ది ఎలిఫెంట్ విస్పరర్స్ తమిళనాడు, ముదుమలై ఆడవి ప్రాంతంలో సాగే కథా చిత్రం. అక్కడ ఏనుగుల సంరక్షణ శిబిరాలు ఏనుగులను సంరక్షించే బొమ్మన్, బెల్లి దంపతుల నేపథ్యంలో సాగే కథ ఇది. వేర్వేరు ప్రాంతాల్లో తల్లి ఏనుగుతో నుంచి విడిపోయిన రెండు ఏనుగు పిల్లల సంరక్షణ బాధ్యతలను ఈ బొమ్మన్, బెల్లి దంపతులు తీసుకుంటారు. వాటిని సొంత పిల్లలుగా చూసుకుంటారు. కాగా ఈ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడంపై బొమ్మన్, బెల్లి దంపతులు స్పందిస్తూ ఆనదం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘనత అంతా ఆ ఏనుగులకే దక్కుతుందని పేర్కొన్నారు.
తెలుగు సినీ వైభవం విశ్వవ్యాప్తం
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని భాగమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ వైభవం ప్రపంచానికి నేడు తెలిసింది, దర్శక దిగజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాట నేడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు సాధించడం తెలుగోడి విజయం. గీత రచయిత చంద్రబోస్‌కు, సంగీత దర్శకుడు కీరవాణికి, దర్శకుడు రాజమౌళికి, నిర్మాత దానయ్యకు, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్‌కు, ముఖ్యంగా ఆ పాటకు అభినయించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు ధన్యవాదాలు.
– కేతిరెడ్డి జగదీశ్వర్వరెడ్డి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment