Jr NTR And Ram Charan RRR Completely Releasing In Japan, Check Release Date Inside - Sakshi
Sakshi News home page

RRR Japanese Version Release: జపాన్‌ భాషలో ఆర్‌ఆర్‌ఆర్‌

Published Sat, Jun 17 2023 4:31 AM | Last Updated on Sat, Jun 17 2023 12:46 PM

RRR completely released in Japan language - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రం గత ఏడాది మార్చి 25న విడుదలైన విషయం తెలిసిందే. కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెలుగు వెర్షన్‌ని జపనీస్‌ సబ్‌ టైటిల్స్‌తో 2022 అక్టోబరు 21న జపాన్‌లో విడుదల చేశారు. జపాన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిందీ చిత్రం.

ఇంకా అక్కడ ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ చిత్రాన్ని జపాన్‌ భాషలో రిలీజ్‌ చేస్తున్నట్లుగా శుక్రవారం చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ‘‘జపాన్‌ సబ్‌టైటిల్స్‌తో కూడిన తెలుగు వెర్షన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు జూలై 28న ఈ సిని మాను జపాన్‌ భాషలో రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాం’’ అని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement