telugu version
-
ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో
థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. చాలా సింపుల్ బడ్జెట్‌తో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ తీస్తుంటారు. అలా ఈ ఏడాది రిలీజైన ఓ సినిమానే 'గోళం'. కొన్నాళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే అప్పుడు కేవలం మలయాళంలో మాత్రం స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్‌లో తీసినా సరే స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగా పకడ్బందీగా రాసుకున్నారు. దీంతో ప్రేక్షకులకు మెస్మరైజ్ కావడం గ్యారంటీ. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్సవకండి.'గోళం' విషయానికొస్తే.. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే, జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సంచలనమవుతుంది. ఈ కేసుని కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్లలో ఒకరే ఈ హత్య చేసుంటారని సందీప్ అనుమానం. మరి కిల్లర్‌ని పట్టుకొన్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) -
పోటీ లేదులే..
‘కొత్త ఊరిలో తోపు మనమే.. పోటీ లేదులే... కొట్టలేరులే..’ అంటూ సాగే పాట ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం లోనిది. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందిన మలయాళ యాక్షన్ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘హల్లా మచారే’ పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, కృష్ణ కాంత్ సాహిత్యం సమకూర్చారు. ఎల్వీ రేవంత్, సింధూజ శ్రీనివాసన్ పాడారు. -
జపాన్ భాషలో ఆర్ఆర్ఆర్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం గత ఏడాది మార్చి 25న విడుదలైన విషయం తెలిసిందే. కాగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్‌ని జపనీస్ సబ్ టైటిల్స్‌తో 2022 అక్టోబరు 21న జపాన్‌లో విడుదల చేశారు. జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందీ చిత్రం. ఇంకా అక్కడ ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ చిత్రాన్ని జపాన్ భాషలో రిలీజ్ చేస్తున్నట్లుగా శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘‘జపాన్ సబ్‌టైటిల్స్‌తో కూడిన తెలుగు వెర్షన్ ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు జూలై 28న ఈ సిని మాను జపాన్ భాషలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
Rudhrudu: కనిపెట్టాలి.. కొట్టాలి!
‘‘కూర్చున్న చోటే స్కెచ్ వేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటకు లాక్కొచ్చాడంటే వాడెంత తోపై ఉంటాడు’’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్. దర్శక–నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ‘ఠాగూర్’ మధు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఒకడి జీవితంలో ఏవేవి జరగకూడదో అవన్నీ రుద్ర జీవితంలో జరిగాయి’, ‘మావ.. మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతోంది రా.. మనమే వెతకాలి. మనమే కనిపెట్టాలి. మనమే కొట్టాలి’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు లారెన్స్. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్‌ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్‌కుమార్ అతని లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కష్టాలు మొదలవుతాయి. అయినప్పటికీ దృఢంగా నిలబడి, క్రిమినల్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చిరంజీవి సమర్పణలో హిందీ చిత్రం.. తెలుగులో..
పాత్రకు తగిన ఆహార్యం, నటనతో మెప్పిస్తాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. 57 ఏళ్ల వయసులో ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు ఈ మూవీ హిందీలో మాత్రమే వస్తున్నట్లు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా రాబోతుంది. ఈ తెలుగు వెర్షన్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారు. చిరంజీవి సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా' తెలుగులో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా చిరంజీవి తెలిపుతూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఈ చిత్రాన్ని అమీర్‌ఖాన్‌తో కలిసి తన నివాసంలో చిరంజీవి స్పెషల్‌గా వీక్షించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిరుకి నచ్చి తెలుగులో విడుదల చేస్తానని అమీర్ ఖాన్ కోరారు. అందుకు అమీర్ ఖాన్ కూడా అంగీకారం తెలపడంతో తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు చిరు. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. నా ప్రియమిత్రుడు అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెలుగు వెర్షన్లో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది' అని చిరంజీవి ట్వీట్ చేశారు. చదవండి: చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో Feel very privileged to present the Telugu version of my dear friend #AamirKhan ‘s wonderful emotional roller coaster #LaalSinghChaddha Our Telugu audiences are surely going to love him ! pic.twitter.com/Tb2apAaJrz — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022 Fascinating how a chance meeting & a little chat with my dear friend #AamirKhan @Kyoto airport - Japan, few years ago led to me becoming a part of his dream project #LaalSinghChaddha Thank You #AamirKhan for the exclusive preview at my home.Heartened by your warm warm gesture! pic.twitter.com/hQYVZ1UQ5m — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022 -
'అరబిక్ కుతు' తెలుగు వెర్షన్ వచ్చేసింది.. విన్నారా..!
Telugu Version Of Arabic Kuthu Halamithi Habibo From Beast Released: తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్కు మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన 'అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ ఎంత క్రేజ్ సంపాందించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో 260 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు తాజాగా ఈ సాంగ్‌కు తెలుగు వెర్షన్ వచ్చింది. ఇప్పటివరకు తమిళ్లో అదరగొట్టిన ఈ పాట తెలుగులోనూ అలరించనుంది. కోలీవుడ్ సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అనిరుధ్, జోనితా గాంధీ ఆలపించారు. ఈ తెలుగు వెర్షన్‌కు శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించగా తమిళ వెర్షన్లో హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించారు. ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. భాష, ఆ పదాలు అర్థం కాకపోయినా పదాల క్యాచీగా ఉండటం, విజయ్, పూజా హెగ్డె స్టెప్పులు, సంగీతానికి ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. -
న్యాయం కోసం..
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమిళరాసన్’. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రెమిసెస్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారు. పెప్సి శివ సమర్పణలో ఎస్.కౌసల్య రాణి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తమిళంలో విడుదలవుతోంది. కాగా ఈ చిత్రాన్ని ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో రావూరి వెంకటస్వామి అదేరోజు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.కౌసల్య రాణి, రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సత్యం, న్యాయం, ధర్మం కోసం హీరో ఎలా పోరాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. ‘విక్రమ్ రాథోడ్’ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. యస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఆలపించిన ‘కన్నా దిగులవకు.. తొడున్నా నీ కొరకు...’ అనే పాట మా సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. కె.జె. యేసుదాస్గారు కూడా మా చిత్రంలో పాడడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ఆర్.డి.రాజశేఖర్. -
షకీలా కష్టాలతో...
నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో శుక్రవారం ఈ సినిమాని విడుదల చేయగా, జనవరి 1న యుఎఫ్ఓ మూవీస్ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘షకీలా’ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ట్రైలర్లో చూపించారు. ‘‘బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది. సినిమా థీమ్, మంచి సందేశానికి వారి నుండి ప్రశంసలు లభించాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత: సదీప్ మలాని, కెమెరా: సంతోష్ రాయ్ పతజే. -
ఓటీటీ తీసుకురావడం గర్వంగా ఉంది
‘‘ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలా డిజిటల్ ఇండస్ట్రీ కూడా ఒకటి.. దాన్ని తెలుగుకు తీసుకొచ్చినందుకు, అది కూడా పూర్తిగా తెలుగు భాషలో తీసుకురావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు హీరో అల్లు అర్జున్. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘ఆహా’ ఓటీటీ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘రెండు మూడేళ్ల కిందట.. రాత్రి ఒంటి గంట, రెండు గంటలైనా నాన్న (అల్లు అరవింద్) టీవీ షోలు చూస్తుండేవారు. ఈ మధ్య మీరు సినిమాలకంటే టీవీ షోలే ఎక్కువగా చూస్తున్నారు? అంటే.. బాగుంటున్నాయి.. వీటిని తెలుగుకి తీసుకురావాలి అన్నారు?. తెలుగులో ఓటీటీ కల్చర్ సాధ్యపడుతుందా? అన్నాను. కొన్ని రోజుల తర్వాత.. ‘మై హోమ్’ గ్రూప్ రామ్ జూపల్లిగారు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది.. తను నాకు మంచి ఫ్రెండ్. మేమందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఓటీటీ ఐడియా వచ్చింది. నేను చాలా గర్వపడాల్సిన సమయమిది.. మా నాన్నగారు ఐదు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో హిట్స్ సాధించారు.. అయితే ఈ ఓటీటీ మాత్రం చాలా ప్రత్యేకం. ఈ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌కి సంబంధించింది.. అందుకే ఇండస్ట్రీలో కంటెంట్‌పై బాగా పట్టున్న ‘దిల్’ రాజుగారితో భాగస్వామ్యం అయ్యాం. ఓటీటీ అంటే యంగ్ మైండ్‌సెట్ ఉండాలి, యంగ్‌స్టర్ ఉండాలనుకున్నప్పుడు నాకు విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు.. తనతో మాట్లాడాం. భాగస్వామ్యం అయ్యాడు. ‘ఆహా’ తెలుగులో నంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 8న ‘ఆహా’ని లాంచ్ చేశాం. ఉగాది నుంచి ఉగాది వరకు సుమారు 50షోలు చేయాలనుకున్నాం. ‘ఆహా’లో ‘కంటెంట్ మేనేజ్మెంట్ బోర్డ్’ చీఫ్ క్రియేటివ్ అడ్వైజర్‌గా వంశీ పైడిపల్లిని తీసుకున్నాం. ‘సామ్ జామ్’ అనే ఆసక్తికరమైన షోని సమంత చేస్తున్నారు.. ఈ షోకి అన్నీ తానై దర్శకురాలు నందినీరెడ్డి వెనకుండి నడిపిస్తున్నారు. ఈ దీపావళికి మరో మూడు షోలు రానున్నాయి’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘జూపల్లి రామేశ్వరరావుగారు, అరవింద్‌గారు, రామ్.. ‘ఆహా’లో నన్నూ భాగస్వామ్యం కావాలని కోరారు. సినిమాలతో నేను తీరిక లేకుండా ఉంటున్నాను. దీంతో నా కుమార్తె, నా అల్లుడు ‘ఆహా’లో జాయిన్ అయ్యారు. ‘ఆహా’ స్టార్ట్ అయిన తొమ్మిది నెలల్లో కోవిడ్ టైమ్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లను అలరిస్తోంది. అరవింద్‌గారు ఏది మొదలు పెట్టినా దాన్ని సాధించే తీరుతారు. ఈ ‘ఆహా’ ద్వారా తెలుగును భారతదేశం మొత్తం తీసుకెళతారనడంలో సందేహం లేదు’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సూపర్ హీరో శక్తి
తమిళ నటుడు శివ కార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘హీరో’. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కోటపాడి రాజేష్ నిర్మించారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ విలన్‌గా నటించారు. ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ‘‘శక్తిమాన్ సీరియల్ చూస్తూ సూపర్ హీరో కావాలని కలలు కంటాడు హీరో. మరి సూపర్‌హీరో అయ్యాడా? సమాజంలో అతను తెచ్చిన మార్పు ఏంటి? అనే కథతో తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా స్వరకర్త. -
ఆటకైనా.. వేటకైనా రెడీ
సల్మాన్‌ఖాన్ హీరోగా ‘దబాంగ్’ సిరీస్‌లో తెరకెక్కిన చిత్రం ‘దబాంగ్ 3’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటించారు. అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రేపు విడుదల కానుంది. సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ సౌజన్యంతో సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ ‘దబాంగ్ 3’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక బుధవారం జరిగింది.ఈ వేడుకకు హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ అతిథులుగా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘వెంకీమామ.. అంటే వెంకటేష్‌గారు.. నాకు పాతికేళ్లుగా స్నేహితులు. రామ్‌చరణ్ నాన్నగారు చిరంజీవి నాకు చాలా క్లోజ్. రామ్‌చరణ్ నాకు తమ్ముడులాంటివాడు. చరణ్ కూడా నాకు క్లోజే. ఈ సినిమాలో హీరోగా నా స్థాయిని పెంచేలా నటించారు కన్నడ నటుడు సుదీప్. ‘దబాంగ్ 3’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అంటూ చిత్రంలోని ‘ఆటకైనా.. వేటకైనా రెడీ’ అనే డైలాగ్ చెప్పారు. వెంకటేష్- ‘‘దబాంగ్ 3’లో సల్మాన్ డైలాగ్స్ మామూలుగా లేవు. సల్మాన్‌ను ప్రేమించే అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను ’’ అన్నారు వెంకటేష్. రామ్‌చరణ్- ‘‘సల్మాన్‌భాయ్ నుంచి ఎన్ని నేర్చుకుంటున్నానో వివరించడానికి ఒక వేదిక, కొన్ని మాటలు సరిపోవు. సల్మాన్, సుదీప్, వెంకటేష్‌గారు, చిరంజీవిగారు.. ఇలాంటి సూపర్ స్టార్లు అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ కాదు... క్రమశిక్షణ గురించి చెబుతున్నాను. వీరి నుంచి మా తరం క్రమశిక్షణను నేర్చుకుంటాం. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలిచిన సల్మాన్‌ఖాన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘దబాంగ్ 3’ మన తెలుగు సినిమాలానే ఉంటుంది. థియేటర్లో చూసి ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయాలి’’ అన్నారు ప్రభుదేవా. ‘‘సల్మాన్గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు సుదీప్. ‘‘ఇది మా అందరికీ చాలా ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సోనాక్షీ సిన్హా. ‘‘ఈ చిత్రంలో ‘హుడ్ హుడ్, గుభాళించనే’ అనే పాటలు రాసే అవకాశం ఇచ్చిన సల్మాన్, ప్రభుదేవాగార్లతో పాటు సంధానకర్తగా వ్యవహరించిన రాజేశ్వరీ సుధాకర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘‘జీవితంలో కండలు పెంచాలనే కోరిక ఉండేది. అది తీరలేదు. కానీ కండల వీరుడికి పాట రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇందులో ‘ఊ కొడితే, తొలిగా తొలిగా..’ అనే పాటలు రాశాను. ప్రభుదేవా, వీవీవీ రాయుడుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి జగదీష్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రియల్టీకబర్.కామ్
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలోని తాజా వార్తలు, కథనాలు, ప్రాజెక్ట్‌లు, ట్రెండ్స్ వంటివి ఎప్పటికప్పుడు పాఠకులకు అందించేందుకు రియల్టీకబర్.కామ్ సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని స్థిరాస్తి రంగ సమాచారాన్ని తెలుగులో అందించడమే దీని ప్రత్యేకత అని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ దేశాల్లోని తెలుగు పాఠకులు సులువుగా చదువుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశీయ నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నివేదికలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అన్ని రకాల అంశాలతో కూడిన కథనాలను అందిస్తామని తెలిపారు. -
పండక్కి పేట లేనట్టే
రజనీకాంత్ సినిమా అంటే హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్, చెన్నైలోని టీ నగర్లో ఏకకాలంలో రిలీజ్ కావాల్సిందే. అది రజనీ క్రేజ్. అదేనండీ.. అక్కడా ఇక్కడా అన్ని ఏరియాల్లోనూ ఆయన బొమ్మ పడాల్సిందే. తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్‌కి అంత క్రేజ్ ఉంది. ‘బాబా’ (2002) నుంచి దాదాపు రజనీకాంత్ ప్రతి సినిమా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కావడం ఆనవాయితీ అయ్యింది. కానీ ఈసారి పండక్కి (సంక్రాంతికి) ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’) లేనట్టే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం ‘పేట్టా’. సన్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ కథానాయికలు. ఈ సినిమాను తమిళంలో పొంగల్‌కి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ తెలుగులో సంక్రాంతికి ఈ చిత్రం విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ సంక్రాంతి సీజన్‌కు బాలకృష్ణ ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేశ్, వరుణ్‌తేజ్ ‘ఎఫ్2’(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రాలు రిలీజ్ కానున్నాయి. థియేటర్స్ ఇబ్బంది అవుతుందనో లేక మరేదైనా కారణమో కానీ ‘పేట’ను జనవరి 25 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం తెలుగు ఆడియో గురువారం రిలీజ్ అయింది. కాగా ఈ చిత్రం తెలుగు విడుదల హక్కులు సి. కల్యాణ్ పొందారని వార్త వచ్చింది. అది నిజం కాదని కల్యాణ్ స్పష్టం చేశారు. -
దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు
– తెలుగులో అనువదించిన దివ్యాంగుల చట్టం–2016 పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ కర్నూలు: దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో దివ్యాంగుల జేఏసీ సభ్యులు ఎస్పీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దివ్యాంగుల చట్టం–2016 తెలుగు అనువాద పుస్తకాన్ని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల జేఏసీ నాయకులు మధుబాబు, గోపాల్, అభిలాష్, వినోద్, లీలప్ప తదితరులు మాట్లాడుతూ.. తమకు రక్షణ కల్పించి కించపరిచేలా మాట్లాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని ఎస్పీని కోరారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దివ్యాంగుల చట్టం–2016 పుస్తకాన్ని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపిస్తానని, దివ్యాంగులకు భద్రత కల్పించేలా సిబ్బందికి సూచనలిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల చట్టం–2016లో వారి రక్షణకు పొందుపరచిన కొన్ని ముఖ్యాంశాలు... సెక్షన్ 92 ప్రకారం వికలాంగులను కించపరచినా, అవమానించినా, భయపెట్టినా, మాన మర్యాదలు భంగపరచినా, పెత్తనం చేసినా, లైంగిక దాడి చేసినా, లైంగికంగా వాడుకున్నా, గాయపరచినా, భావజాలంపై దాడి చేసినా, సహాయ పరికరాన్ని ధ్వంసం చేసినా ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష. సెక్షన్ 7/4 ఎ, బి, సి, డి ప్రకారం వికలాంగులపై వేధింపులు, హింస, దోపిడీ, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే చట్టప్రకారం తీసుకునే బాధ్యతల నుంచి పోలీసు అధికారి తప్పించుకునే అవకాశం లేదు. సెక్షన్ 20/5 ప్రకారం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వికలాంగులకు న్యాయం, హక్కుల కోసం ప్రభుత్వం అధిక మద్దతు ఇవ్వాలి. సెక్షన్ 29హెచ్ సైగల భాషలో అనువాదంతో సబ్‌టైటిల్స్‌తో టీవీ కార్యక్రమాలు రూపొందించి బధిరులు పాల్గొనేటట్లు చూడాలి. -
సింగం-3 విడుదల వాయిదా!
హీరో సూర్య ప్రతిష్ఠాత్మకంగా తీసిన సింగం-3 తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పడింది. గురువారం ఉదయం విడుదల కావాల్సిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మార్నింగ్ షో పడలేదు. మధ్యాహ్నానికి సినిమా విడుదల అవుతుందని సినిమాకు సంబంధించినవాళ్లు, థియేటర్ల యజమానులు చెబుతున్నారు. యముడు-3 పేరుతో తెలుగులో రావాల్సిన ఈ సినిమా విడుదలపై ముందు నుంచి అనుమానాలున్నా, తమిళంలో మాత్రం సినిమా యథాతథంగా విడుదల అయ్యింది. తెలుగులో ఎందుకు రాలేదన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. (చదవండి : సింగం 3 షూట్లో 99.2% వేస్ట్ ) సూర్య సరసన శ్రుతిహాసన్ నటించిన ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. మొదటి రెండు భాగాల్లో చేసిన అనుష్క.. ఈ సినిమాలో కూడా కొనసాగింది. మొదటి భాగంలో అనుష్క మాత్రమే ఉండగా, రెండో భాగంలో అనుష్క, హన్సిక ఇద్దరూ నటించారు. ఇప్పుడు మూడో భాగంలో శ్రుతి - అనుష్క ఇద్దరు టాప్ హీరోయిన్లు చేయడం విశేషం. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తొలిరోజు చూసే అదృష్టం ఉంటుందో లేదో తెలియడం లేదు. సంబంధిత వార్తలు చదవండి వేటకు సిద్ధమైన 'సింగం' సింగం ముందుకు దూకడానికే! -
తెలుగులో 7న వస్తున్నవీరప్పన్
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం ఈ నెల 7వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం తమిళం, కన్నడంలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. కాగా ఈ నెల ఏడో తేదీన కిల్లింగ్ వీరప్పన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వర్మ ట్విట్ చేశారు. కాగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే తెలుగు వెర్షన్ మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయినట్లు సమాచారం. అందువల్లే చిత్ర నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
'నేను మలాల' పుస్తకావిష్కరణ
విజయవాడ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మలాల పుస్తకావిష్కరణ జరిగింది. విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న సిద్ధార్థ మహిళా కాలేజీలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. కాలేజీకి చెందిన దాదాపు 2వేల మంది విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఐయామ్ మలాల' పుస్తకాన్ని ఉమామహేశ్వరరావు అనే రచయిత తెలుగులో 'నేను మలాల' పేరుతో అనువదించారు. ఈ పుస్తకాన్ని కాలేజీలోని విద్యార్థినుల చేతుల మీదుగా రచయిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మలాల స్ఫూర్తితో మహిళలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న కాకతీయ యూనివర్సీటీ తెలుగు ఫ్రొపెసర్ కాత్యాయనీ విద్మహే కూడా పాల్గొన్నారు.