'నేను మలాల' పుస్తకావిష్కరణ | Writer Uma maheswara rao releases Telugu version of 'I Am Malala' | Sakshi
Sakshi News home page

'నేను మలాల' పుస్తకావిష్కరణ

Published Thu, Aug 20 2015 5:36 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

'నేను మలాల' పుస్తకావిష్కరణ

'నేను మలాల' పుస్తకావిష్కరణ

విజయవాడ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మలాల పుస్తకావిష్కరణ జరిగింది. విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న సిద్ధార్థ మహిళా కాలేజీలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. కాలేజీకి చెందిన దాదాపు 2వేల మంది విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఐయామ్ మలాల' పుస్తకాన్ని ఉమామహేశ్వరరావు అనే రచయిత తెలుగులో 'నేను మలాల' పేరుతో అనువదించారు.

ఈ పుస్తకాన్ని కాలేజీలోని విద్యార్థినుల చేతుల మీదుగా రచయిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మలాల స్ఫూర్తితో మహిళలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న కాకతీయ యూనివర్సీటీ తెలుగు ఫ్రొపెసర్ కాత్యాయనీ విద్మహే కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement