
సాక్షి,విజయవాడ : అదనపు కట్నం కోసం అత్తింటి అరళ్లు వేగలేకపోతున్నా న్యాయం చేయాలని ఓ బాధితురాలు హోంమంత్రి, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేని అర్జించింది. వాళ్లు పట్టించుకోకపోవడంతో తనకు ఇక చావే శరణ్యమనుకుంది. కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకి ఏం జరిగిందంటే?
విజయవాడలో ఆడపిల్లలు పుట్టారని కారణంగా చూపిస్తూ సుభాషిణి అనే మహిళను అత్తమామలు, భర్త, మరిది వేధింపులకు గురి చేసేవారు. ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. సుభాషిణి తన కుమార్తె (మైనర్)తో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం కోసం నా భర్త , అత్తమామలు, మరిది వేధిస్తున్నారు. నా భర్తను ఏడాది నుంచి మా ఇంటికి రానివ్వడం లేదు. నన్ను వదిలించుకోవడానికి గతంలో పిచ్చెక్కిందని పిచ్చాసుపత్రిలో చేర్పించారు.
జనసేన కార్యాలయం చుట్టూ పది సార్లు తిరిగా. పవన్ కళ్యాణ్‌ను ఓ అన్నలా భావించా. న్యాయం జరుగుతుందనుకుని జనసేన కార్యాలయం చుట్టూ తిరిగా. ఓ పవన్ అభిమానిగా న్యాయం జరుగుతుందని నేను ఆశించా. ఆయన అపాయింట్‌మెంట్ కోసం ఎంతో ప్రయత్నించా ..దొరకనివ్వలేదు. ఫ్యామిలీ మ్యాటర్‌లో మేం ఇన్వాల్వ్ అవ్వమన్నారు. న్యాయం కోసం హోంమంత్రి అనితను కలిశా. అక్కడ న్యాయం జరగలేదు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ... నా సమస్య తీర్చమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు అప్పగించారు.
బోండా ఉమా నా సమస్య తీర్చమని విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి దగ్గరకు పంపించారు. విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి నన్ను బెదిరించి .. తీవ్ర దూర్భషలాడారు. మేం ఉన్నంత వరకూ నీకు న్యాయం జరగదని చక్రవర్తి బెదిరించారు. నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాం’ అని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment