చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం ఉందా?: మంత్రి బొత్స | Minister Botsa Satyanarayana Counter To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం ఉందా?: మంత్రి బొత్స

Published Mon, Jun 19 2023 4:51 PM | Last Updated on Mon, Jun 19 2023 5:19 PM

Minister Botsa Satyanarayana Counter To Pawan Kalyan - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు, పవన్‌ క్యలాణ్‌లపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. పవన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. ఆయనకు ఒక విధానం, ఆలోచన లేదని విమర్శించారు. జనసేన పార్టీనే దొంగల, రౌడీల పార్టీ అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్క టిడ్కో ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయాడని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లు పూర్తయితే ఎందుకు ఇవ్వలేకపోయాడో సమాధానం చెప్పాలని నిలదీశారు. 

చంద్రబాబు వయసుకు తగ్గట్లు మాట్లాడుతున్నారా?. బాబుకు ఇంగిత జ్ఞానం ఉందా? ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ ఏమయ్యింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యిందా? వైఎస్సార్‌ సీపీ మాత్రమే బీసీల పార్టీ. ఏలూరు డిక్లరేషన్‌కు మించి చేసిన పార్టీ వైఎస్సార్ సీపీ. మా ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం. .50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ మాది. 2024 ఎన్నకల్లో మేము ఒంటరిగానే పోటీకి దిగుతా’మని మంత్రి బొత్స పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement