Perni Nani: Death Threat To Pawan Kalyan From Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

పవన్‌కు చంద్రబాబు వల్లే ప్రాణహాని: పేర్ని నాని

Published Mon, Jun 19 2023 2:49 PM | Last Updated on Mon, Jun 19 2023 4:36 PM

Perni Nani: Death Threat To Pawan Kalyan From Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రాణహాని అంటూ పవన్‌ కళ్యాణ్‌ సొల్లు కబుర్లు చెబుతున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రాణహాని ఉంటే ఏనాడైనా పోలీసులకు పవన్‌ చెప్పాడా అని ప్రశ్నించారు. ఆయనకు చంద్రబాబు వల్లే ప్రాణహాని ఉందని అన్నారు. పవన్‌ సినిమాల్లో తప్ప బయట ఎవడిని కొట్టలేడని దుయ్యబట్టారు. తన దగ్గర పనిచేసే సిబ్బందిని తప్ప ఎవడ్ని కొట్టలేడంటూ ఎద్దేవా చేశారు. అరాచకంగా పాలించిన చంద్రబాబుని ఏనాడైనా పవన్‌ కొట్టాడా అని నిలదీశారు.

‘లోకేష్‌ అవినీతి పరుడని గతంలో పవన్‌ కల్యాణ్‌ ఆరోపించలేదా?. లోకేష్‌ను గుడ్డలిప్పి కొట్టగలిగాడా. పవన్‌ది రౌడీ మనస్తత్వం.. అందుకే అలా మాట్లాడుతున్నాడు. చంద్రబాబుతో పొత్తు అనగానే పవన్‌ వెనకాల కాపులు తిరగడం మానేశారు. కాపులను మోసం చేయడం  కోసం సీఎం అవుతానని పవన్‌ అంటున్నాడు. ఎన్నికల ముందు చంద్రబాబుతో పవన్‌ కలిసిపోవడం ఖాయం. సీఎం జగన్‌ను ఎదుర్కోవడం​ పవన్‌ కల్యాణ్‌ వల్ల కాదు’ అని పేర్ని నాని పేర్కొన్నారు.
చదవండి: నీకన్నా గట్టిగానే విమర్శించగలను.. పవన్‌పై ద్వారంపూడి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement