ప్రజలకు అర్థమైంది.. బాబు, పవన్‌కు థ్యాంక్స్‌: బొత్స | YSRCP MLC Botsa Satyanarayana Satirical Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

ప్రజలకు అర్థమైంది.. బాబు, పవన్‌కు థ్యాంక్స్‌: బొత్స

Published Mon, Dec 9 2024 1:44 PM | Last Updated on Mon, Dec 9 2024 3:08 PM

YSRCP MLC Botsa Satyanarayana Satirical Comments On CBN Govt

సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు అని కామెంట్స్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్ వర్షాలు కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈనెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తాము. తగ్గిస్తామని చెప్పి కరెంట్ చార్జీలు కూటమి ప్రభుత్వం పెంచింది. ఆరు స్లబ్స్‌లో చార్జీల భారం ప్రజలపై మోపింది. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి వెంటనే చెల్లించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్‌ఈలకు వినతి పత్రం సమర్పిస్తాం.

కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు. ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారు. వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషం. సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోం మంత్రికి లేఖల రాస్తాను. లేనిపోని ఆరోపణల కారణంగా దేశం పరువుపోతుంది కదా?. టీడీపీ హయాంలో వేసిన సిట్ బహిర్గతం చేయాలి. ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాలి.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చూపించారు. నాడు-నేడు ద్వారా స్కూల్స్‌లో మిగతా పనులను పూర్తి చేస్తామని చెబితే బాగుండేది. ధాన్యం కొనుగోలుపై పరుచూరి బ్రదర్స్‌లా నాదెండ్ల మనోహర్ మాట్లాడటం సరికాదు, వాస్తవాలు మాట్లాడాలి’ అంటూ సూచనలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement