Nadu Nedu
-
జగన్ చేసింది నిజం – లోకేశ్ చూసిందే సాక్ష్యం
-
సమాన అవకాశాల... విద్యా విప్లవం
భారతీయ సమాజంలో అసమానతలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశాలు అందరికీ సమానంగా లేకపో వడం. ముఖ్యంగా మంచి విద్యను అభ్యసించే అవ కాశం కొందరికే ఉండటం. దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనివిని ఎరుగని రీతిలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. దీంతో ఎక్కడో కొండ కోనల్లో నివసించే ఆది వాసీ పిల్లలు సైతం పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకుంటు న్నారు. ఇదో విప్లవం. ఈ విప్లవ ఫలితాలు ఇప్పుడి ప్పుడే దృశ్యమానమవుతున్నాయి. కొండబారిడి గిరి జన గ్రామానికి చెందిన బాలిక మనస్విని ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లడం ఇందుకు ఒక ఉదాహరణ.కొండబారిడి ఒక సవర ఆదివాసీ పల్లె. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడి పంతులు భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించి సాయుధ విప్లవం సృష్టించాడు. నేడు అదే గ్రామంలో ఇపుడు చదువుల విప్లవం కూడా మొద లైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నదే కొండ బారిడి. ఆ పల్లెకు చెందిన ఎస్. మనస్విని ఆంగ్లంలో అరుదైన ప్రతిభ చూపడంతో తనతో పాటు మరో 9 మంది విద్యార్థులను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించగా... అక్కడ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల సదస్సులో పాల్గొని వచ్చింది.‘ఏపీలో విద్యావ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యావిధానం, ‘నాడు–నేడు’తో మా స్కూల్ స్వరూపమే మారిపోవడం గురించి వివరించాను. మన ప్రభుత్వం మాలాంటి పేదల చదువు కోసం చేస్తున్న కృషిని తెలుసుకొని వారు ఎంతో ఆశ్చర్య పోయారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్కూల్స్‌లో ఎలా ప్రవేశ పెడుతున్నారు? వాతావరణ మార్పుల ప్రభావం గురించి చెప్పాను. మారుమూల గిరిజన పల్లెకు చెందిన నాకు ఇదొక మరువలేని అనుభూతి’ అని సంతోషంగా చెప్పింది మనస్విని. సింగిల్ పేరెంట్కు చెందిన ఈ ఆదివాసీ బాలిక గుమ్మలక్ష్మిపురం, కేజీబీవీ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే తప నతో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో 44,512 ప్రభుత్వ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించి ముందుకెళుతోంది. ‘అమ్మ ఒడి’ వంటి వినూత్న పథకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్‌ను పెంచాయి. దాదాపు 2,47,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడం ఇందుకు నిదర్శనం.అరకు నుండి డుంబ్రిగుడ వెళ్లేదారిలో జైపూర్ బస్‌స్టాప్ ఎదురుగా కొండల మధ్య ఇంద్రధను స్సులా మెరిసిపోతున్న కోట లాంటి రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల దగ్గర ఆగాం. విశాలమైన ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్న తమ పిల్లలను చూడడా నికి వచ్చిన పేరెంట్స్‌ని పలకరించినపుడు...‘ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో ఈ ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లను మించి మారిపోయాయి. మా పాపను ఈ స్కూల్లో చేర్పించడానికి సీట్లు లేక చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రయత్నం బాగుంద’ని అన్నారు. ‘గిరిజన గ్రామాల్లో బడులను ఏకపక్షంగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ప్రతి పుస్తకాన్నీ బైలింగ్యువల్ పద్ధతిలో... అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రించారు . దీని వల్ల పిల్లలు తెలుగును మర్చిపోకుండా ఇంగ్లిషును నేర్చుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింద’ని పార్వతీపురం మన్యం జిల్లా, చాపరాయి బిన్నిడి పాఠశాల ఉపాధ్యాయుడు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్‌బీలు ఏర్పాటు చేసినట్టు ఆమధ్య ఒక ఆంగ్ల ఛానెల్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం వై.ఎస్. జగన్ చెప్పినపుడు అవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామని, గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని ఒక స్కూల్‌కి వెళ్లాం. అక్కడ విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్స్ ఇచ్చారు. ఆరో తరగతి నుంచి, ఆపై తరగ తుల్లోని ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుండె పనిచేసే విధా నాన్ని డిజిటల్ స్క్రీన్ మీద విద్యార్థులకు టీచర్లు బోధించడం చూశాం. ఇలా ఒక ప్రణాళికా బద్ధంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పులు మొదలై టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపుకు కూడా సర్కారు కృషి చేస్తున్నది. ఏపీ విద్యారంగం సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇందువల్ల సమాన విద్యావ కాశాలకు నోచుకుంటున్నారు బడుగులు. ఇంతకంటే కావలసినదేముంది?శ్యాంమోహన్ వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్మొబైల్: 94405 95858 -
విద్య, వైద్యం, ఉపాధితోనే నిజమైన అభివృద్ధి
భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): భవనాలు నిర్మించడం, కాలువలు తవ్వడమే అభివృద్ధి కాదని.. అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభిస్తేనే నిజమైన అభివృద్ధి అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీసీఆర్ కల్యాణ మండపంలో గురువారం ‘ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన ఉద్యోగానుభవంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే రెండేళ్లు కరోనా విపత్తు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు. మిగిలిన మూడేళ్ల కాలంలో ఒకపక్క పేదలకు సంక్షేమం, మరోపక్క రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు రచించారని తెలిపారు. ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగాయనేందుకు ఉదాహరణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్‌లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. చంద్రబాబు హయాంలో పేదరికం నిష్పత్తి 7.7 శాతం ఉంటే.. జగన్ పాలనలో 4.19 శాతానికి తగ్గిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.78 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 45,975 ప్రభుత్వ పాఠశాలలను రూ.18 వేల కోట్లతో అభివృద్థి చేశారన్నారు. ఓపెన్ మైండ్‌తో చర్చించాలి ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ చైర్మన్, ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే.. జగన్ పాలనలో 2.7 లక్షల ఉద్యోగాలు కల్పించారని వివరించారు. 2018–19 వరకు స్థూల రాష్ట్ర ఉత్పత్తి రూ.7,90,800 కోట్లయితే 2023–24లో రూ.11,66,000 కోట్లు అని చెప్పారు. తలసరి ఆదాయం 2018–19లో రూ.1.54 లక్షల కోట్లు అయితే 2023–24లో రూ.2.20 కోట్లకు పెరిగిందన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. గత పాలనతో పోలిస్తే మన రాష్ట్రంలో పేదరికం 50 శాతం తగ్గిందన్నారు. పేదల పిల్లలు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, మాస్టర్ డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని, దీనిని మేధావులు గుర్తించాలని కోరారు. -
మనసున్న మారాజు.. మత్స్యకారుల్లో వెలుగులు
సాక్షి, విశాఖపట్నం, అచ్యుతాపురం: మత్స్యకారులపై మమకారంతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి పట్ల మరోసారి ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే మత్స్యకారుల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల భృతి, లీటర్‌పై రూ.9 డీజిల్ సబ్సిడీ, 50 ఏళ్లకే పెన్షను, వేట సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల పరిహారం వంటి పలు ప్రయోజనాలను చేకూరుస్తున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటున్నారు. గత నవంబర్ 19 అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. బాధిత బోటు యజమానులకు మూడు రోజుల్లోనే భారీ మొత్తంలో రూ.7.11 కోట్ల పరిహారాన్ని అందజేశారు. ఈ బోట్లపై ఆధారపడ్డ కలాసీలు 400 మంది జీవనోపాధి కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెల్లించారు. ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించడంపై బాధిత మత్స్యకారులు ఎంతగానో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమకు ఈ మేళ్లన్నీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయన్న ఆనందంలో ఉన్నారు. మత్స్యకారులపై మమకారం గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సముద్రంలో మ త్స్యకారుల బోట్లు కాలిపోయినా, మునిగిపోయి నా, తుపాన్లలో దెబ్బతిన్నా పరిహారం సక్రమంగా ఇచ్చేవారు కాదు. ఇచ్చే అరకొర సాయం కూడా ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు భిన్నంగా మత్స్యకారులపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారికొచ్చే కష్టాలపై తక్షణమే స్పందించి ఉదారంగా సాయమందిస్తున్నారు. టీడీపీ హయాంలో మునిగిన, అగ్ని ప్రమాదానికి గురైన, తుపాన్లలో దెబ్బతి న్న బోట్లకు కూడా పరిహారం అందించేలా చూడాల ని బాధిత మత్స్యకారులు తాజా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కోరారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం బాధిత మత్స్యకారులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వివిధ ప్రమాద ఘటనల్లో దెబ్బతిన్న 36 బోట్లకు రూ.1.35 కోట్ల నిధులు విడుదల చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ నిధులు జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమయ్యాయి. జగనన్న ప్రభుత్వం ఆదుకుంది చేపల వేటే నాకు జీవనాధారం. నేను భార్య, ముగ్గురు పిల్లల్ని పోషించాలి. చేపల్ని పట్టి అమ్ముకుంటే వచ్చే సొమ్ము జీవనానికే సరిపోతుంది. వేట నిషేధ సమయంలో అక్కరకొస్తుందని ఆదా చేద్దామనుకుంటే ఎప్పుడూ వీలయ్యేది కాదు. జగనన్న ప్రభుత్వం వేట నిషేధ సమయంలో రూ.10 వేల మత్స్యకార భరోసా అందిస్తోంది. దాంతో నా కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించగలుగుతున్నాను. డీజిల్ కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాను. –గనగళ్ల దేముడు, పూడిమడక గ్రామం, అచ్యుతాపురం మండలం చంద్రబాబు హయాంలో పస్తులే వేటకెళితేనే కడుపు నిండేది. లేకుంటే పస్తులే. చంద్రబాబు హయాంలో మత్స్యకార భృతి ఎప్పుడో ఇచ్చేవారు. అది కూడా రూ.4 వేలు. వేట నిషేధ సమయంలో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సివచ్చేది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకార భరోసా కింద రూ.10 వేల పరిహారం నిషేధ కాలంలోనే ఇవ్వడంతో కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగపడు తోంది. నాకు ఒక బోటు ఉండడంతో సబ్సిడీపై డీజిల్ అందిస్తున్నారు. ఇది నాకు ఎంతో ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది. –చోడపల్లి సింహాచలం, తంతడి గ్రామం, అచ్యుతాపురం మండలం దెబ్బతిన్న బోట్లు 2014–2019 మధ్య కాలంలో మొత్తం 36 బోట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 21 బోట్లు సముద్రంలో మునిగిపోగా, నాలుగు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఐదు నీటి అడుగున చిక్కుకుపోయాయి. మరో ఆరు బోట్లు ఫిషింగ్ హార్బర్లో ప్రమాదాల పాలై పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఇందులో 2014 హుద్‌హుద్ తుపానుకు మునిగిపోయిన రెండు బోట్లకు, 2018 తిత్లీ తుపానులో మునిగిన మూడు బోట్లకు, 2019 పెథాయ్, జావద్ తుపాన్లకు మునిగిపోయిన 11 బోట్లకు టీడీపీ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో దెబ్బతిన్న బోట్లకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాయమందిస్తుండడంపై మనసున్న మారాజు అంటూ సీఎం జగన్‌ను మత్స్యకారులు కొనియాడుతున్నారు. ఆయన రుణం తీర్చుకుంటామని పేర్కొంటున్నారు. -
మా మంచి జగన్ మామయ్య (ఫొటోలు)
-
యునెస్కోలో ‘మన బడి’పై చర్చ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా..తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు–నేడుపై చర్చ జరిగింది. ఈనెల 13న యునెస్కో ఆధ్వర్యంలో ప్యారిస్‌లోని ప్రధాన కార్యాలయంలో ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు ప్రారంభమైంది. 90కి పైగా దేశాల నుంచి 400 మంది విద్యా శాఖ ముఖ్య అధికారులు, స్పెషలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఏపీ ప్రతినిధిగా గురువారం పాల్గొని రాష్ట్రంలో అమలు చేస్తోన్న మనబడి నాడు–నేడుపై వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అసమానతలు లేని అన్ని సదుపాయాలతో సమగ్ర విద్య అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏపీ విద్యా సంస్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేదింటి పిల్లలు చదువుకునే బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, విభిన్న భాషలు మాతృభాషగా ఉన్న విద్యార్థులు కూడా సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు, విద్యార్థులకు ట్యాబ్స్ వంటి అంశాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్నాయని షకిన్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. సమగ్ర విద్య మూలస్తంభాల్లో ‘మనబడి నాడు–నేడు’తో వచ్చిన మార్పు ఒకటి అని యునెస్కో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ వివిఎన్ గైరిస్, ఎడ్యుకేషన్ ఫర్ ఇంక్లూజన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ చీఫ్ జస్టీన్ సాస్ అభివర్ణించినట్లు షకిన్ తెలిపారు. -
ప్రగతి దిశగా బాలికా చదువు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాల అంటే బాలికలకు గతంలో ఓ నరకం.. చదువుకుందామని ఆశ ఉన్నా సదుపాయాలు ఉండేవి కావు. కనీసం టాయిలెట్ కూడా లేని దుస్థితి. కౌమార దశ బాలికల పరిస్థితి మరీ దారుణం. దాంతో చాలామంది 8 లేదా 9 తరగతిలోనే చదువు మానేసేవారు. అత్యధిక బాలికల డ్రాప్ అవుట్స్ కూడా ఈ తరగతుల్లోనే ఉండేవి. ఈ సమస్యను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బాలికలు చదువుల ఆకాంక్షను నెరవేర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను నాడు–నేడు ప్రాజెక్టులో 100 శాతం నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక గదిని అందుబాటులోకి తెచ్చింది. స్కూలు స్థాయిలోనే వారి ఆరోగ్యంపైనా దృష్టిపెట్టి, రక్తహీనత ఉన్న బాలికలకు ఫోలిక్ ఐరన్ మాత్రలను అందిస్తోంది. ఏటా కౌమర దశ బాలికలు 9.74 లక్షల మందికి ‘స్వేచ్ఛ’ పేరిట శానిటరీ న్యాప్కిన్స్ను ఇస్తోంది. ఈ తరహా సేవలు నూరుశాతం అందిస్తున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా గత నాలుగేళ్లుగా బడుల్లో బాలికల సంఖ్య పెరిగింది. ఉత్తీర్ణతలోనూ వారు ముందున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ సాధనలోనూ బాలురు కంటే బాలికలే ముందున్నారు. బాలికలకు నూరు శాతం సదుపాయాలు పాఠశాల స్థాయిలో డ్రాప్ అవుట్స్‌కు ప్రధాన కారణం టాయిలెట్లు, గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా ఉండేవి. దాంతా విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు చాలా ఇబ్బంది పడేవారు. టాయిలెట్ల సదుపాయం లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు. రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు ప్రాజెక్టు ప్రారంభించి ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సరఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 45,137 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటించింది. ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది. దీంతో పాటు బాలికల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. ‘స్వేచ్ఛ’గా చదువుకునేలా.. దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉండేది, పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్‌కు ఇదే కారణంగా ఉండేది. బాలికల డ్రాప్ అవుట్స్‌కు కారణమవుతున్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను బాలికలకు ఉచితంగా అందిస్తున్నారు. 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని 9,74,121 మంది కౌమార బాలికలకు వీటిని అందిస్తోంది. ఇప్పుడు బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. చదువుపై దృష్టి పెట్టడంతో ఫలితాల సాధనలోనూ బాలురను మించిపోయారు. అమ్మఒడి .. జగనన్న గోరుముద్ద చిన్నారుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అమ్మ ఒడి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.15 వేలు క్రమం తప్పకుండా ప్రభుత్వం అందజేస్తోంది. దీనివల్ల విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రోజుకొక మెనూతో మధ్యాహ్న భోజనం చక్కగా అమలవుతోంది. -
AP: మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి : సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్స్పైర్’ పోటీల్లో వారిప్పుడు తమ సత్తా చాటుతున్నారు. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు తమ సైన్స్ ప్రతిభతో ‘జపాన్ సకురా’ పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ముగ్గురు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు వచ్చే మేలో జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 10 నుంచి మూడో స్థానానికి.. నిజానికి.. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు ఎంపికవుతుండడం విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపాధ్యాయుల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్ఓలో ప్రసంగించిన విషయం తెలిచిం దే. ఇప్పుడు అదే స్థాయిలో ఇన్స్పైర్ విద్యారు్థలు జపాన్‌కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతున్నారు. జాతీయ పోటీలకు ఏటా 40 మంది.. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. దీనిద్వారా పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇందుకోసం ఇన్స్పైర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే.. ఆకర్షణీయమైన అంశాలౖపె ప్రాజెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్దస్థాయిలో విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది. ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్ రైట్స్.. గతేడాది గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి. కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునే వారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. రూ.10 వేల ఖర్చుతో తయారుచేసిన ఈ బండిపై ఆకు కూరలు వారంరోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే.. ► చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె. ప్రణయ దాదాపు 15 రోజులపాటు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్‌గా నిల్వచేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. వెల్లుల్లి పేస్టును గోనె సంచికి పూసి తయారుచేసిన ఈ సంచిని నిపుణులు సైతం పరిశీలించి, ప్రణయను అభినందించారు. వెల్లుల్లి ఉన్నచోట బ్యాక్టీరియా చేరదని, రూ.25 ఖరీదుతో చేసిన ఈ బ్యాగ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది. ► ఇక చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి. చరణ్ తేజ బైక్‌పై ప్రయాణించే మహిళలు పడిపోకుండా రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను రూపొందించాడు. ఇలా.. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు తాము ప్రతిరోజూ చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించారు. తమ ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందడంతో పాటు గత నవంబరులో జపాన్ వెళ్లి వచ్చారు. మేలో మరో నలుగురు విద్యార్థులు జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారని స్టేట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్ సదుపాయాలు, బోధనా పద్ధతులు మెరుగుపడ్డాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చెప్పారు. 2022–23 సంవత్సరపు ఇన్స్పైర్ పోటీలు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గతంకంటే ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే మన విద్యార్థులు పెరుగుతారని ఆయన చెబుతున్నారు. -
కార్పొరేట్ స్కూలుకు ధీటుగా విశాఖ మధురానగర్ ప్రభుత్వ పాఠశాల
-
దటీజ్ జగన్: ఆశ్చర్యానికి గురైన నిర్మాత కోన వెంకట్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సమూల మార్పులను చూసి కోన ఆశ్చర్యపోయారు. విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్కూల్ వాతావరణం, వసతులు, తరగతి గదులు పరిశీలించారు. నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. స్కూల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు పట్ల తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. బాపట్లలో ని కర్లపాలెంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా..ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అద్భుతంగా తీర్చిదిద్దింది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది. Very happy and surprised to see a beautiful Government School in Karlapalem which is part of my Hometown Bapatla!! pic.twitter.com/QdwENpKnem — KONA VENKAT (@konavenkat99) January 29, 2024 -
మారిన స్కూలు రూపురేఖలు
-
Visakhapatnam: అరే.. ఇది మన బడేనా!
చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే. ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు “మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు “అరే.. ఇది మనం చదివిన బడేనా’ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వరరావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు. వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాధు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర‡్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే.... గర్వపడుతున్నా.. నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను. – పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్‌లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. –పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట -
AP: ఇదీ మార్పు.. రహదారి రయ్..రయ్..
నాడు ► రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం ► మరమ్మతుల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోని వైనం ► రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లింపు ► 2019 నాటికి రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు ► అప్పుడు భారీ వర్షాలు, మహమ్మారి కోవిడ్ లేదు ► ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు రూ.2,953.81 కోట్లు ► ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.591 కోట్లు ► రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు రూ.4,325 కోట్లే ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.3,160.38 కోట్లు మాత్రమే . ► ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.23,792.19 కోట్లు నేడు ► వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ► ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణం ► ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు మోక్షం ► గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు ► రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ. 7,340 కోట్లు ► పంచాయతిరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ. 5,443.69 కోట్లు ► జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25,304 కోట్లు ► మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.42,236.28 కోట్లు ► మొత్తంగా రోడ్ల నిర్మాణం 7,600 కిలోమీటర్లు -
ఏపీలో ప్రభుత్వ బడికి సరికొత్త శోభ
-
ప్రభుత్వ బడికి సరికొత్త శోభ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ రెండో దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రెండో దశలో భాగంగా 22,217 పాఠశాలల్లో పనులు చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే 2,755 స్కూళ్లలో నూరు శాతం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది. అన్ని పాఠశాలల్లో కొత్త భవనాలతో పాటు తాగునీటి నుంచి ఆట వస్తువుల వరకు నిర్దేశిత 12 వసతులను కల్పిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం సదుపాయాలు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నాడు–నేడు మొదటి దశ కింద ఇప్పటికే దాదాపు రూ.3,700 కోట్లతో 15,715 ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. మొదటి దశలో లేని 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు 2,755 స్కూళ్లలో పనులు నూరు శాతం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. అలాగే మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్ల నిర్మాణం, మరో 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లను పూర్తి చేసింది. 394 పాఠశాలల్లో పెయింటింగ్, తాగునీటి సదుపాయాలు తప్ప ఇతర అన్ని పనులూ పూర్తయ్యాయి. రెండో దశలో చేపట్టిన పనులకు ఇప్పటికే రూ.3,535.44 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. సమున్నతంగా నిలిపేందుకు.. వైఎస్ జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను సమున్నతంగా నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లతో సహా అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్లలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలతో సహా మొత్తం 44,512 స్కూళ్లను నాడు–నేడు పథకం కిందకు తీసుకువచ్చారు. పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో, దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నిరంతర నీటి సరఫరాతో పాటు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి డబుల్ డెస్క్ ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, అదనపు తరగతి గదులు, వంటషెడ్లు, ప్రహరీ వంటి మొత్తం 12 సదుపాయాలను కల్పిస్తున్నారు. -
సరికొత్త దారిలో సర్కారీ చదువులు
ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. అయితే ఈ వర్సిటీల్లో చదివించేందుకు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం. సీటు తెచ్చుకోండి.. రూ.1.25 కోట్లు మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం. జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బెస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగితే వారి బతుకులతో పాటు రాష్ట్ర రూపురేఖలు మార్చే లీడర్ షిప్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు మన పిల్లల్ని చేయిపట్టుకుని మరీ పైకి తీసుకుని పోయే అవకాశాలు ఇస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. దేశ భవిష్యత్‌ను, తల రాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య దాకా 55 నెలల పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేశాం. ఏకంగా రూ.73 వేల కోట్లు విద్యా రంగానికే ఖర్చు చేశానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యా రంగంలోనే కాకుండా వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ప్రతి రంగంలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. 8,09,039 మంది పిల్లలకు మంచి చేసేలా రూ.7,47,920 మంది తల్లుల ఖాతాల్లో రూ.583 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా 27.61 లక్షల మంది పిల్లల పూర్తి ఫీజులు రూ.11,900 కోట్లు చెల్లిస్తూ తల్లిదండ్రులపై భారం పడకుండా ఒక మేనమామలా ఆదుకున్నానని చెప్పారు. పిల్లలపై బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల భారం పడకూడదని వసతి దీవెన ద్వారా అండగా ఉంటూ రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలనే తాపత్రయంతో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మొత్తంగా రూ.16,175 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు, డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలి. అలా ఆ కుటుంబాల తలరాతలు మారాలనే తపనతో అడుగులు వేస్తున్నాం. 2017–18కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజులు రూ.1,777 కోట్లను మనందరి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో సంస్కరణలు ♦ నాడు–నేడుతో బడుల రూపురేఖలను మార్చుతూ ఉన్నత విద్యపై ధ్యాస పెట్టి సంస్కరణలు తీసుకువచ్చి కరిక్యులంలో మార్పులు చేశాం. పిల్లలు ఏం చదువుతున్నారు.. అని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి మీ జగన్ మామ పాలనలోనే జరిగింది. తొలిసారి డిగ్రీలో కూడా ఆన్లైన్ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. ఏకంగా 10 నెలల ఇంటర్న్‌షిప్‌తో జాబ్ ఓరియంటెడ్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేశాం. ♦ మన పిల్లలు ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో చదువులుండాలనే తపనతో అంతర్జాతీయంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, ఎంఐటీ, హార్వర్డ్, ఎల్బీఎస్, ఎల్ఎస్సీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వచ్చేందుకు హైడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యాం. తద్వారా ఆన్లైన్లో ఆ కోర్సులు తీసుకొస్తూ ఏఐని అనుసంధానం చేస్తూ డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ పేద విద్యార్థులు మన పిల్లలు.. ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితేనే వేగంగా ఎదగగలుగుతారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలో భాగమైనప్పుడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ముందు వరుసలో ఉంటాం. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఒక పేజీ ఇంగ్లిష్, ఒక పేజీ తెలుగుతో బై లింగ్వల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా మెరుగైన చదువు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉండే.. రూ.15 వేలు ఆన్లైన్లో చెల్లిస్తే తప్ప రాని బైజూస్ కంటెంట్‌ను మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వ తరగతి.. ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్ రూంలో ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చి డిజిటల్ బోధనను తీసుకువచ్చాం. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు సీబీఎస్ఈతో మొదలై ఐబీ వరకు వెళుతున్న ఈ ప్రయాణం పిల్లలందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దే వరకు సాగుతుంది. 3వ తరగతి నుంచి టోఫెల్ సబ్జెక్ట్‌ను తీసుకువచ్చి క్లాస్ టీచర్ లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేయడం వరకు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వాళ్ల జగన్ మామ ఎంతో తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యా నేను పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. నేను ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో చిన్నప్పటి నుంచి కలగనేదాన్ని. జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టకుండా చదువుకుంటున్నాను. మొత్తం ఫీజు మీరే (సీఎం) కట్టారు. వసతి దీవెన ఎంతో ఉపయోగపడింది. మీ వల్ల అందరం బాగా చదువుకోగలుగుతున్నాం. మీ వల్ల నేను మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఆ క్రెడిట్ అంతా మీదే సార్. – ప్రిన్స్ ఏంజిల్, బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని, నరసాపురం మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారన్నా నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బీటెక్ చదువుతున్నా. నెల్సన్ మండేలా చెప్పినట్టు విద్య అనే ఒక ఆయుధం మాత్రమే మన భవిష్యత్‌ను మారుస్తుంది అన్న మాటను మీరు నిజం చేశారు. మీరు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ వర్సిటీల్లో మాదిరి సిలబస్ తీసుకొచ్చారు. మహిళా సాధికారత, విద్య.. ఈ రెండు జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మీరు ఈ రెండింటినీ సాధించారు. మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్యూ సార్. – నవ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, భీమవరం మార్పును గమనించండి ♦ దేశ భవిష్యత్‌ను మార్చగలిగేది చదువు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి. ఈ రోజు మనందరి ప్రభుత్వం రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. తేడాను మీరే గమనించాలి. చదువు అనేది తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను మార్చాలన్నా, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా, వెనుకబడిన కులాల తలరాతను మార్చాలన్నా, దేశ భవిష్యత్‌ను మార్చాలన్నా.. ఆ శక్తి కేవలం చదువుకే ఉంది. అందుకే 55 నెలల ప్రయాణంలో విద్యా రంగంలో విప్లవాత్మక అడుగులు వేశాం. ♦ నాడు–నేడుతో బడులు బాగుపడిన తీరుతెన్నులు గమనించాలి. ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరుముద్ద మీద ఫోకస్ పెట్టాం. పిల్లలు బాగా చదవాలని, వారిని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ప్రభుత్వ బడులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు తీసుకువచ్చి రూపురేఖలు మార్చుతున్నాం. ♦ ఒక్క విద్యా రంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. కేవలం 55 నెలల కాలంలోనే ఇన్ని మార్పులు జగన్ చేయగలిగినపుడు గత పాలకులు 14 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారో మీరే ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన గుర్తు తెచ్చుకోండి. -
AP: ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్‌లు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలతో ట్యాబ్‌ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. వీటిని ఈ నెల 21న విద్యార్థులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది కంటే మెరుగైన సామర్థ్యం ఉన్న ట్యాబ్‌లను ఎంపిక చేసి, వాటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల పాఠ్యాంశాలను చేర్చారు. గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 5,18,740 ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో పంపిణీ చేసింది. ఈ ఏడాది 4.30 లక్షల ట్యాబ్‌ల పంపిణీకి టెండర్లు పిలవగా శాంసంగ్, ఏసర్, మార్క్ వ్యూ, లావా సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల నుంచి 2.50 లక్షల యూనిట్లు విజయవాడలోని స్టాక్ పాయింట్‌కు చేరాయి. మరో 1.80 లక్షల యూనిట్లు ఈ వారంలో అందనున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ట్యాబ్‌ల్లో అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. వీటిని మంగళవారం ప్రాంతీయ సంయుక్త అధికారుల కార్యాలయాలకు తరలించారు. రెండు, మూడు రోజుల్లో ఇవి ఉన్నత పాఠశాలలకు చేరనున్నట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన కోసం అందిస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ)ను సైతం రెండో దశ నాడు–నేడు పనులు పూర్తయిన స్కూళ్లల్లో బిగించనున్నారు. రెండో దఫాలో 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు ఈ నెల 21 నాటికి స్కూళ్లకు చేరనున్నాయి. మరింత మెరుగ్గా.. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు 8.7 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్, 64 జీబీ ఎస్డీ కార్డు గల ట్యాబ్‌లను అందించారు. వాటిలో అదే తరగతి పాఠ్యాంశాలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఏడాది ట్యాబ్‌ల సామర్థ్యం పెంచడంతోపాటు అదనపు తరగతుల డిజిటల్ పాఠాలను సైతం అప్లోడ్ చేయడం విశేషం. వచ్చే వారం విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లు 8.7 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్డీ కార్డుతో ఉండనున్నాయి. వీటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల బైజూస్ ఈ–కంటెంట్‌ను సైతం అప్లోడ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ యాప్ ‘ఈ–ట్యూటర్’ను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే భవిష్యత్తులో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేసేంత స్పేస్ కూడా ఈ ట్యాబ్‌ల్లో ఉంది. 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు.. గతేడాది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేశారు. ఈ ఏడాది 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను ఈ నెల 21 నాటికి అందుబాటులోకి తేనున్నారు. అన్ని ట్యాబ్‌ల్లో ‘డ్యులింగో’ యాప్ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు, విదేశాల్లో సైతం విజయవంతమైన కెరీర్‌ను అందుకునేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విదేశీ భాషలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులకు కూడా వివిధ భాషల్లో శిక్షణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ అధికారులు హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో విదేశీ భాషలు అందించే యాప్ ‘డ్యులింగో’ను ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇవ్వనున్న ట్యాబ్‌ల్లో ఇన్స్టాల్ చేశారు. గత డిసెంబర్లో ఇచ్చిన 5,18,740 ట్యాబ్‌లతోపాటు ఈ ఏడాది ఇవ్వనున్న 4.30 లక్షల ట్యాబ్‌ల్లోనూ ఈ డ్యులింగ్ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునే వీలుంది. ఉన్నత తరగతులకు కూడా ఉపయోగపడేలా.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులతోపాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు కూడా వీటిని అందిస్తాం. ఇప్పటికే దాదాపు 2.50 లక్షల యూనిట్లు అందాయి. వారంలోగా మొత్తం 4.30 లక్షల ట్యాబ్‌లు స్కూళ్లకు చేరతాయి. ఈసారి ట్యాబ్‌ల సామర్థ్యం పెంచాం. అంతేకాకుండా 8, 9, 10 తరగతుల ఈ–కంటెంట్‌తోపాటు డౌట్ క్లియరెన్స్ యాప్‌ను, ఈ–డిక్షనరీని కూడా అప్లోడ్ చేశాం. కొత్త ట్యాబ్‌ల్లో భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేయొచ్చు. విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు పాత పాఠాలను తొలగించి కొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్య నాడు–నేడు మౌలిక వసతుల కల్పన -
రెండో దశ నాడు-నేడు కార్యక్రమంపై ఈనాడు అక్కసు