
కార్పొరేట్‌ను తలదన్నేలా మౌళిక వసుతులు సమకూరాయి. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇందులో భాగంగానే నాడు– నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా వసతులు కల్పించారు.

పిల్లల చదువుకు కావాల్సిన వస్తువులను విద్యాకానుక పేరుతో అందిస్తున్నారు

పిల్లలు చదువులో రాణించాలంటే ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారం అందిస్తున్నారు







































