దటీజ్‌ జగన్‌: ఆశ్చర్యానికి గురైన నిర్మాత కోన వెంకట్ | Tollywood Producer Kona Venkat Visit Government School In Bapatla | Sakshi
Sakshi News home page

దటీజ్‌ జగన్‌: బడిని చూసి ఆశ్చర్యానికి గురైన నిర్మాత కోన వెంకట్

Jan 29 2024 5:57 PM | Updated on Jan 29 2024 6:20 PM

Tollywood Producer Kona Venkat Visit Government School In Bapatla - Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సమూల మార్పులను చూసి కోన ఆశ్చర్యపోయారు. విషయం ఏంటంటే.. 

ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్కూల్ వాతావరణం, వసతులు, తరగతి గదులు పరిశీలించారు. నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. స్కూల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు పట్ల తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. బాపట్లలో ని కర్లపాలెంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

కాగా..ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అద్భుతంగా తీర్చిదిద్దింది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement