
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ (Mark Shankar Pawanovich) చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో అక్కడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్ వెళ్లనున్నారు.
