సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తప్పుడు లెక్కలతో, అసత్య ఆరోపణలతో, అనవసరమైన ప్రసంగాలతో ఎనిమిదో రోజుకి చేరింది. ఓవైపు వైఎస్సార్‌సీపీ బహిష్కరణతో శాసనసభ ఏకపక్షంగా నడుస్తుండగా.. శాసనమండలిలోనైనా కనీసం వైఎస్సార్‌సీపీ అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు పొంతన లేని వివరణలతో నెట్టుకొస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా.. ఇవాళ..
అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయగా.. దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది. అటు శాసనసభలోనూ చంద్రబాబు సైతం వ్యక్తిగత గొప్పలతో సభలో కాలయాపన చేశారు.
ఏపీ అప్పులపై మండలిలో కూటమి ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని ప్రకటించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 2024 జూన్ నాటికి 4,91,734 కోట్లు బడ్జెట్ అప్పులు ఉన్నాయని, కార్పొరేషన్ ల ద్వారా 1,54,797 కోట్లు అప్పులయ్యాయని అన్నారాయన. అదే టైంలో.. గత ప్రభుత్వం 9 లక్షల 74 వేల కోట్లు చేసిందంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. ఆ వెంటనే..
ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘‘ ప్రశ్నోత్తరాల సమయం అంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ, మంత్రి సభలో ఆవు కథ చెప్తున్నారు. అప్పుల పై అన్ని పార్టీల తో కమిటీ వెయ్యండి. అప్పుడు.. ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుస్తాం. అంతే కానీ ఈ ఆరోపణలు సమంజసం కాదు. వాస్తవాలు చెబితే అభ్యంతరం లేదు. మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. మంత్రులు ఏం చెప్తే అది చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలా?’’ బొత్స మండిపడ్డారు.
నేను బుడమేరు బాధితుడ్నే: ఎమ్మెల్సీ రుహుళ్ల
శాసన మండలి బుడమేరు వరదల పై మండలి లో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ.. బుడమేరు కి 4 సార్లు వరద వస్తే 3 సార్లు చంద్రబాబు హయాంలో నే వచ్చింది. బుడమేరు ఆధునికీకరణ కోసం 2014 నుండి 2019 వరకు ఏమైనా ఖర్చు చేశారా?. బుడమేరు వరదల పై కేంద్ర బృందాలు ఎంత నష్టం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసింది, ఎంత ఖర్చు చేశారు..?
ఆపరేషన్ బుడమేరు నెల రోజుల్లో ప్రారంభిస్తాం అన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలి?. నష్టపరిహారం సక్రమంగా చేస్తే బాధితులు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ రాహుళ్ల ప్రసంగిస్తూ.. నేను కూడా వరద బాధితుడిని. వరద వచ్చేముందు ప్రజలు కనీసం ప్రజలను అప్రమత్తం చెయ్యలేదు. అధికారులు ఏం చేస్తున్నారు. సింగ్ నగర్ ప్రజలను ముంచేశారు. మజీద్ వెళ్లి వచ్చే లోపే మా ప్రాంత ప్రజలంతా ముంపుకి గురయ్యారు అని అన్నారు.
అయితే బుడమేరు పరిధిలో ఆంధ్ర జ్యోతి రాధ కృష్ణ పవర్ ప్లాంట్ ఉందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గుర్తు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల లెక్క ఏది?
శాసన మండలి.. ప్రభుత్వ ఉద్యోగ ల భర్తీ పై మండలి లో చర్చ జరిగింది. రాష్ట్రంలో మొత్తం శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో చెప్పడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. ‘‘గత ప్రభుత్వం లో లక్ష 34 వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం.2014 నుండి 2019 మధ్య లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలి’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్రంలో అన్ని శాఖల ఖాళీల పై.మదింపు చేస్తున్నాం. ఇంకా ఖాళీల వివరాలు రావాల్సి ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ వాకౌట్
శాసన మండలి ట్రూ అప్ చార్జీల భారంపై వాడీవేడీ చర్చ జరిగింది. రాష్ట్ర ప్రజల పై విద్యుత్ చార్జీల భారం వేయం అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ట్రూ అప్ చార్జీలు ఎందుకు పెంచుతున్నారు? అని ఎమ్మెల్సీ రవిబాబు ప్రశ్నించారు. దానికి మంత్రి మంత్రి గొట్టిపాటి రవి సమాధానమిస్తూ.. ఈఆర్సీ ఆమోదించిన మేరకు ట్రూ అప్ చార్జీలు పెంచుతున్నామని చెప్పారు. అయితే..
ప్రజలకు చార్జీలు తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఈఆర్సీలో అఫిడవిట్ వెయ్యొచ్చు కదా అని ప్రశ్నించిన బొత్స.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు. ప్రజల పై విద్యుత్ చార్జీలు మోపినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ మండలి నుంచి వాకౌట్ చేసింది.
హామీలపై సమీక్షలు జరుపుతున్నాం: చంద్రబాబు
గత ప్రభుత్వం అప్పులు.. ఈ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘ఇచ్చిన హామీలపై అనునిత్యం సమీక్షలు జరుపుతున్నాం. ఏదీ రాత్రికి రాత్రే సాధ్యం కాదు’’ అని అన్నారాయన. అలాగే.. అధికారం తనకేం కొత్త కాదని.. సీఎం పదవి అంతకంటే కొత్త కాదని చెబుతూ.. నాలుగోసారి సీఎం కావడం అరుదైన అనుభవమని చెప్పారు. గత ప్రభుత్వమే రోడ్లకు గుంతలు పెట్టి వెళ్లిపోయిందని, దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. పోలవరం గేమ్ ఛేంజర్ అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమన్నారు.
బాబు పాలనపై సంతృప్తి: పవన్
విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకు ముందు.. ప్రభుత్వ వ్యవస్థలు వెనకబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. చంద్రబాబు 150 రోజుల పాలన సంతృప్తిగా ఉంది. చంద్రబాబు పాలనపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment