థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. చాలా సింపుల్ బడ్జెట్‌తో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ తీస్తుంటారు. అలా ఈ ఏడాది రిలీజైన ఓ సినిమానే 'గోళం'. కొన్నాళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే అప్పుడు కేవలం మలయాళంలో మాత్రం స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల‍్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)
సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్‌లో తీసినా సరే స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగా పకడ్బందీగా రాసుకున్నారు. దీంతో ప్రేక్షకులకు మెస్మరైజ్ కావడం గ్యారంటీ. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్సవకండి.
'గోళం' విషయానికొస్తే.. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే, జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సంచలనమవుతుంది. ఈ కేసుని కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్లలో ఒకరే ఈ హత్య చేసుంటారని సందీప్ అనుమానం. మరి కిల్లర్‌ని పట్టుకొన్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment