Golam Movie
-
ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో
థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. చాలా సింపుల్ బడ్జెట్‌తో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ తీస్తుంటారు. అలా ఈ ఏడాది రిలీజైన ఓ సినిమానే 'గోళం'. కొన్నాళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే అప్పుడు కేవలం మలయాళంలో మాత్రం స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్‌లో తీసినా సరే స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగా పకడ్బందీగా రాసుకున్నారు. దీంతో ప్రేక్షకులకు మెస్మరైజ్ కావడం గ్యారంటీ. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్సవకండి.'గోళం' విషయానికొస్తే.. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే, జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సంచలనమవుతుంది. ఈ కేసుని కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్లలో ఒకరే ఈ హత్య చేసుంటారని సందీప్ అనుమానం. మరి కిల్లర్‌ని పట్టుకొన్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) -
OTT: మలయాళ మూవీ ‘గోళం’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘గోళం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రపంచంలో ఎన్ని కథలు ఉన్నాయని అడిగితే... ప్రపంచ జనాభా ఎంతమంది ఉంటే అన్ని కథలు ఉన్నాయన్నట్టు... ప్రతి వ్యక్తికి సంబంధించిన జీవితం ఓ సినిమా కథే. కాకపోతే ఆ కథలను ఎంచుకోవడంలోనే ఉంటుంది అసలు ఆయువుపట్టు. ఈ విషయంలో మలయాళ దర్శకులు చాలా ముందుంటారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ వేదికగా వస్తున్న పలు చిత్రాలు మలయాళ దర్శకుల ఆలోచనా పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటిలో ‘గోళం’ ఒకటి. సమ్జాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రకథ ఆయువు పట్టును చివరి వరకూ ప్రేక్షకులు కనిపెట్టలేరు. అంతగా రక్తి కట్టించే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందీ సినిమా. ఈ చిత్రకథ విషయానికొస్తే... ఓ ఆఫీసులో బాస్ అనుకోకుండా బాత్రూంలో చనిపోయినపుడు ఆఫీసులో స్టాఫ్ తప్ప ఇంకెవరూ ఉండరు. దీనిని ఇన్వెస్టిగేట్ చేయడానికి సందీప్ కృష్ట తన టీమ్‌తో ఆఫీస్‌కు వస్తాడు. డే టైమ్ ఆఫీసులో బాస్ ఎలా చనిపోయాడు? హంతకుడు ఎవరు? ఇదే ‘గోళం’ సినిమా. ఇన్వెస్టిగేషన్ ఊహకందని ట్విస్టులతో, ఊహించని క్లైమాక్స్‌తో సాగుతుందీ సినిమా. ఆద్యంతం రక్తి కట్టే ఈ సినిమా చూశాక నేటి ఆఫీసుల్లో రిజిష్టర్ పంచ్ వేసేందుకు ఉపయోగించే మెషీన్‌ను చూడడానికి కూడా భయపడవచ్చు. ఎందుకో ఏమిటో ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘గోళం’ చూసేయండి. ‘గోళం’... వర్త్ టు వాచ్ ఇట్.– ఇంటూరు హరికృష్ణ