‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమిళరాసన్’. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రెమిసెస్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారు. పెప్సి శివ సమర్పణలో ఎస్.కౌసల్య రాణి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తమిళంలో విడుదలవుతోంది. కాగా ఈ చిత్రాన్ని ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో రావూరి వెంకటస్వామి అదేరోజు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్.కౌసల్య రాణి, రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సత్యం, న్యాయం, ధర్మం కోసం హీరో ఎలా పోరాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. ‘విక్రమ్ రాథోడ్’ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. యస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఆలపించిన ‘కన్నా దిగులవకు.. తొడున్నా నీ కొరకు...’ అనే పాట మా సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. కె.జె. యేసుదాస్‌గారు కూడా మా చిత్రంలో పాడడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ఆర్.డి.రాజశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment