remission
-
Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్‌లో పెట్టాం. పరి్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది. -
‘బిల్కిస్’ దోషులకు... శిక్ష తగ్గింపు చెల్లదు
న్యూఢిల్లీ/దాహోద్: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఆమెపై అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో 11 మంది దోషులకు శిక్షా కాలం తగ్గిస్తూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. వారు రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ మేరకు 251 పేజీల తీర్పు వెలువరించింది. ఓ మహిళపై ఇంతటి క్రూర నేరాలకు పాల్పడ్డ కేసుల్లో శిక్ష తగ్గింపునకు అసలు ఆస్కారమెలా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి జాతి, మత విశ్వాసాలతో నిమిత్తం ఉండకూడదని స్పష్టం చేసింది. ‘‘శిక్ష తగ్గింపు (రెమిషన్) గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న మతిలేని నిర్ణయం. ఈ విషయంలో దోషులతో ప్రభుత్వం పూర్తిగా కుమ్మక్కైంది. వారి విడుదల కోసం అన్నివిధాలా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది’’ అంటూ కడిగి పారేసింది. ‘‘సుప్రీంకోర్టులో రెమిషన్ పిటిషన్ సందర్భంగా దోషులు ఈ కేసులో వాస్తవాలను దాచారు. తద్వారా అత్యున్నత న్యాయస్థానాన్నే ఏమార్చారు. తద్వారా రెమిషన్‌పై పరిశీలనకు ఆదేశాలు పొందారు’’ అంటూ ఆక్షేపించింది. ఆ తీర్పు కూడా చెల్లుబాటు కాబోదని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును బాధితురాలితో పాటు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. బానో స్వస్థలంలో ఆమె బంధుమిత్రులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జైలుకు వెళ్లిన అనంతరం రెమిషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం దోషులకు ఉంది. గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు గుజరాత్లో 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం మత ఘర్షణలు చెలరేగడం తెలిసిందే. ఆ సందర్భంగా మిగతా బిల్కిన్ బానో ఉదంతం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి అయిన 21 ఏళ్ల బిల్కిస్‌పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురుతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేసింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ 2008లో తీర్పు వెలువరించింది. దీన్ని బాంబే హైకోర్టు కూడా సమరి్థంచింది. 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాక తమను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు 2022 మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించాలన్న కోర్టు ఆదేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దాని సిఫార్సు ఆధారంగా మొత్తం 11 మందికీ రెమిషన్ మంజూరు చేయడంతో 2022 ఆగస్టు 15న వారంతా విడుదలయ్యారు. దీనిపై బిల్కిస్ తీవ్ర ఆవేదన వెలిబుచి్చంది. రాజకీయ పారీ్టలతో పాటు అన్న విర్గాలూ వారి విడుదలను తీవ్రంగా తప్పుబట్టాయి. గుజరాత్ ప్రభుత్వ చర్యపై దేశమంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. వారి విడుదలను సుప్రీంకోర్టులో బిల్కిస్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 11 రోజుల వాదనల అనంతరం 2023 అక్టోబర్ 12న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రెమిషన్‌ను కొట్టేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ జరిగి దోషులకు శిక్ష పడింది మహారాష్ట్రలో గనుక వారికి రెమిషన్ ప్రసాదించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్ష తగ్గించిందంటూ తప్పుబట్టింది. రెమిషన్ నిర్ణయాన్ని కొట్టేసేందుకు ఈ ఒక్క ప్రాతిపదికే చాలని పేర్కొంది. ‘‘2022లో సుప్రీంకోర్టుకు వెళ్లిన నిందితులు కేసులో వాస్తవాలను దాచి ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించి పునఃసమీక్షకు తీర్పును పొందారు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా వారితో కుమ్మకైంది’’ అంటూ ఆక్షేపించింది. ‘‘రెమిషన్ కోసం దోషుల్లో ఒకరు 2019లోనే గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా మహారాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందిగా సూచించింది. 2020లోనూ మరో పిటిషన్ పెట్టుకున్నా కొట్టేసింది. దాంతో దోషి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. రెమిషన్ ఇవ్వొద్దంటూ సీబీఐతో పాటు సీబీఐ ప్రత్యేక జడ్జి కూడా సిఫార్సు చేశారు. ఈ వాస్తవాన్ని సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టారు’’ అంటూ మండిపడింది. రెమిషన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ బానో నేరుగా సుప్రీంకోర్టులో పిల్ వేయడం ఆరి్టకల్ 32 ప్రకారం సబబేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘శిక్ష విధించాల్సింది ప్రతీకార దృష్టితో కాదు. నేరం పునరావృతం కాకుండా చూసేందుకు. దాంతోపాటు దోషుల్లో మార్పు తెచ్చేందుకు’’ అన్న గ్రీకు తత్వవేత్త ప్లేటో సూక్తిని జస్టిస్ నాగరత్న ప్రస్తావించారు. శిక్ష తగ్గింపు నిర్ణయానికి కూడా దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. దోషుల హక్కులతో పాటు బాధితుల హక్కులనూ పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. బాక్సు తీర్పుపై స్పందనలు... ‘‘బానో అవిశ్రాంత పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అన్యాయంపై, బీజేపీ సర్కారు అహంకారంపై ఆమె సాధించిన విజయమిది. ఎన్నికల లబ్ధి కోసం నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్నదెవరో, న్యాయానికి పాతరేస్తున్నదెవరో సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి తేటతెల్లమైంది’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ఇది సాహసోపేతమైన తీర్పు. ఇందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు’’ – తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ‘‘బానోకు కేంద్రం తక్షణం క్షమాపణలు చెప్పాలి’’ – మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘‘మహిళలపై జరిగే అన్యాయాలను జాతి సహించబోదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది’’ – బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత -
‘బిల్కిస్ బానో దోషుల్ని ఎలా రిలీజ్ చేస్తారు?’
ఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఇవాళ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషుల్ని ఎలా విడుదల చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది సుప్రీంకోర్టు. 2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబాన్ని ఊచ కోత కోశారు కొందరు. అయితే ఈ కేసుకు సంబంధించిన 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కలిపి ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసులో దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. అలాంటప్పుడు 14 ఏళ్ల శిక్షాకాలం ముగియగానే వాళ్లను ఎలా విడుదల చేశారు?. ఇతర ఖైదీలను అలాంటి ఉపశమనం ఎందుకు ఇవ్వలేకపోయారు?. సత్ప్రవర్తన వీళ్లు మాత్రమే కనబర్చారా?.. ప్రత్యేకించి ఈ కేసులోనే దోషుల్ని విడుదల చేయడంలో అంతర్యం ఏంటి? అని గుజరాత్ ప్రభుత్వాన్ని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. బిల్కిస్ దోషుల కోసం జైలు సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం అందించాలని కోర్టు ఆదేశించింది. గోద్రా కోర్టులో విచారణ జరగకున్నా.. అభిప్రాయాన్ని ఎందుకు కోరారని కూడా ప్రశ్నించింది. అయితే ప్రశ్నలకు వివరణ కష్టతరమని, సుప్రీం కోర్టులో ఇందుకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉందని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. దోషుల చట్టప్రకారమే విడుదల జరిగిందని, 1992 పాలసీ ప్రకారం రెమిషన్ కింద ముందస్తుగా వాళ్లను విడుదల చేసిందని, విడుదలకు వాళ్లు అన్ని విధాల అర్హత కలిగి ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం తరపున నుంచి సమగ్ర సమాచారం సేకరించి కోర్టు ముందు ఉంచుతామని ఆయన విన్నవించారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లో ఈ కేసు విచారణ జరగడం కష్టతరం అవుతుందన్న ఉద్దేశంతో.. మహారాష్ట్ర కోర్టు(సీబీఐ కోర్టు)లో విచారణ జరిపించారు. సీబీఐ కోర్టు వాళ్లకు /జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేసింది. కానీ, ఈ కేసులో 11 మంది దోషుల్ని గతేడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇక బిల్కిస్ బానో తరపు న్యాయవాది శోభా గుప్తా వాదిస్తూ.. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం దోషి రాధేశ్యామ్ 15 సంవత్సరాల 4 నెలల శిక్షా కాలం పూర్తి చేసుకోవడంతో.. రెమిషన్ ఇచ్చే అంశం పరిశీలించాలని సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి చెప్పింది. కానీ, ప్రతిగా గుజరాత్ ప్రభుత్వం దోషులందరినీ విడుదల చేసిందని శోభా వాదించారు. దోషుల్ని విడుదల చేయాలని ప్రతిపాదించిన ప్యానెల్ కమిటీ.. ‘‘సంప్రదాయ బ్రహ్మణులైన ఆ 11 మంది పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవివంచారని.. సత్ప్రవర్తన కారణంగానే వాళ్లను విడుదల చేయాలని తాము సూచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు దోషుల విడుదల గురించి తనకు ఎలాంటి సమాచారం అందించలేదన్న అభ్యంతరాలపై బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై ఆగష్టు 24వ తేదీన విచారణ జరగనుంది. ఇదీ చదవండి: నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది? -
Bilkis Bano Case: సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఢిల్లీ: బిలిస్క్ బానో రేపిస్టుల విడుదలకు సంబంధించిన ఫైల్స్ సమర్పించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన తరుణంలో.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్ని సవాల్ చేస్తూ సమీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోపు ఇవాళ సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పదకొండు మందిని ఎందుకు రిలీజ్ చేశారో స్పష్టం చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. మార్చి 27వ తేదీన సుప్రీం కోర్టు ‘ఇదొక భయంకరమైన ఘటన’ అని, నిందితుల్ని రెమిషన్ మీద ఎందుకు విడుదల చేశారో వివరణ ఇస్తూనే.. ఆ రిలీజ్‌కు సంబంధించిన ఫైల్స్‌ను సమర్పించాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే.. 11 మంది దోషుల శిక్ష ఉపశమనానికి సంబంధించిన పత్రాలను సమర్పించకూడదని గుజరాత్ ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని ఇంతకు ముందు సుప్రీంకు స్పష్టం చేసింది. అంతేకాదు ఒక సాధారణ హత్య కేసులో ఎలాగైతే దోషులకు రెమిషన్ కింద ముందస్తు విడుదల చేస్తామో.. అలాగే ఈ కేసులోనూ చేశామంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఇవాళ రెమిషన్ ఇవ్వడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో.. దోషులను ముందస్తుగా ఎందుకు రిలీజ్ చేసిందో తెలపాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ‘‘ఇవాళ ఈమె. రేపు మరొకరు. దేశంలోని నా సోదర సోదరీమణులకు ఏమి జరుగుతుందో అనే ఖచ్చితమైన ఆందోళన కలుగుతోంది’’ అని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. అయితే.. గుజరాత్, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్.. సుప్రీం ఆదేశాలపై రివ్యూ పిటిషన్‌కు ఆలోచన చేస్తున్నామని, అది దాఖలు చేయాలా వద్దా అన్నది పూర్తిగా నిర్ణయించలేదని కోర్టుకు తెలిపారు. వెంటనే.. బిల్కిస్ బానో కేసు ఘోరమైన నేరమన్న బెంచ్, రెమిషన్ ప్రకటించేముందు మరో వైపు కూడా ఆలోచించాల్సి ఉండాల్సిందని, ఇది సరైన పద్ధతి కాదని గుజరాత్ ప్రభుత్వం తీరును తప్పు బట్టింది. ఫైల్స్ గనుక కోర్టుకు సమర్పించకపోతే.. అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు అంతా పక్కాగా చేసినప్పుడు.. భయపడాల్సిన అవసరం ఏముందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక గర్భవతిని(బిల్కిస్ బానో) గ్యాంగ్ రేప్ చేశారు. మరికొందరిని చంపేశారు. అలాంటప్పుడు ఈ కేసును సాధారణమైన హత్య కేసుగా పోల్చడానికి వీల్లేదు. యాపిల్స్‌ను బత్తాయిలతో పోల్చలేం.. అలాగే ఇంతటి మారణకాండను సింగిల్ మర్డర్‌గా పోల్చడానికి వీల్లేదు. నేరాలు అనేవి సాధారణంగా సమాజానికి, కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. అసమానతలను సమానంగా చూడలేము అని కోర్టు అభిప్రాయపడింది. ఇవాళ బిల్కిస్.. రేపు ఇంకెవరో?. అది మీరైనా కావొచ్చు.. నేనైనా కావొచ్చు. రెమిషన్ ఇవ్వడానికి గల కారణాలను చూపించకపోతే, ఫైల్స్ సమర్పించపోతే.. న్యాయవ్యవస్థ తన స్వంత తీర్మానాన్ని తీసుకోవలసి ఉంటుందని గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. బిల్కిస్ బానో కేసులో పదకొండు మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు అభ్యర్థనలను మే 2వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. నోటీసు అందుకోని దోషులందరూ తమ ప్రత్యుత్తరాలు పంపాలని ఆదేశించింది. -
బిల్కిస్ బానో దోషుల విడుదల.. సుప్రీం నోటీసులు
ఢిల్లీ: బిల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి పదకొండు మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయడంపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దోషుల విడుదలపై గురువారం గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గుజరాత్ నిబంధనల ప్రకారం, దోషులు ఉపశమనం పొందేందుకు అర్హులా కాదా?. ఉపశమనాన్ని మంజూరు చేసేటప్పుడు దరఖాస్తును ఎలా పరిగణనలోకి తీసుకున్నారో చూడాల్సి ఉందంటూ అంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండువారాల పాటు వాయిదా వేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది. ఈ విడుదలపై బాధితురాలితో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగానూ గుజరాత్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్కిస్ బానో తరపున న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పదకొండు మంది విడుదలను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇదీ చదవండి: నాలుక కోస్తా.. ఎమ్మెల్యేకు వార్నింగ్ లెటర్ కలకలం -
Bilkis Bano Case: వారి విడుదల దేనికి సంకేతం?
గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపైనా, ఆమె కుటుంబం పైనా సామూహిక లైంగిక దాడి, హత్యాచారం కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. ఆ ఖైదీలకు మనువాదులు స్వాగత సత్కారాలు చేయడం సభ్య సమాజానికి పుండు మీద కారం చల్లినట్టయ్యింది. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంలో మనువాద మూకల దాడులను తప్పించు కోవడానికి ప్రయత్నించిన ముస్లిం కుటుంబాన్ని పొలాల్లో వేటకుక్కల్లా వేటాడారు. ఒకే కుటుంబంలో ఏడుగురిని క్రూరంగా చంపేశారు. తల్లీ బిడ్డలను లైంగిక దాడి చేసి హత్య చేశారు. అదే ఘటనలో లైంగిక దాడికి గురైన ఐదు నెలల గర్భవతి బిల్కిస్ బానో చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. బిల్కిస్ బానో సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసింది. ఈ కేసు విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ముందు జాగ్రత్తలో భాగంగా గుజరాత్ నుంచి మహారాష్ట్రకు కేసు బదిలీ అయింది. సీబీఐ కోర్టు ఆరేళ్ల విచారణ తర్వాత నేర నిర్ధారణ చేసి 2008 జనవరి 21న ఈ అమానవీయ కాండలో పాల్గొన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది. దీనిని ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయి. వచ్చే ఏడాది గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. విడుదలకు నిర్ణయం తీసుకునే క్రమంలో 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు పట్టించుకోలేదు. సీబీఐని సంప్రదించలేదు. సలహాలు తీసుకోలేదు. ఈ ఖైదీల విడుదలను మూక దాడులు చేసే విచ్ఛిన్నకర, ఉన్మాద శక్తులకు భరోసా కల్పించే చర్యల్లో భాగంగా చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలను నయానో భయానో లొంగదీసి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నమే ఇది. జైలు నుంచి విడుదలైన ఉన్మాద మూకను విశ్వహిందూ పరిషత్ వాళ్లు, ఇతర మనువాదులు పూలమాలలతో స్వాగతించారు. సన్మానాలు చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళలతో రాఖీలు కట్టించారు. స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఎర్రకోట నుంచి ఏలికలు నారీ శక్తి గురించి ప్రగల్భాలు పలుకుతున్న సమయంలోనే ఈ నేరస్థుల విడుదల దేనికి సంకేతంగా నిలుస్తోంది? (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) ఇప్పటికే ఆరు వేల మంది పౌరులు, మహిళ సంఘాలు, హక్కుల కార్య కర్తలు సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. ‘న్యాయం పట్ల మహిళల విశ్వాసాన్ని పెంపొందిస్తూ 11 మంది దోషులకు రెమిషన్ రద్దుచేయాలనీ, వారిని తిరిగి జైలుకు పంపాల’నీ ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని బిల్కిస్ బానో కలలో కూడా ఊహించి ఉండదు. బాధితురాలి ప్రాణాలకు, ప్రశాంతతకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే ‘నా ఒక్క దాని కోసమే కాదు, న్యాయ స్థానాల్లో న్యాయం కోసం పోరాడు తున్న మహిళలందరి కోసం... ప్రశాంతంగా, నిర్భయంగా జీవించే నా హక్కును తిరిగి ఇవ్వాలి’ అని వేడుకుంటోంది. ఆమె కోరిక అత్యాశ అవుతుందేమో!? – మామిండ్ల రమేష్ రాజా తెలంగాణ కార్యదర్శి, సీపీఐ(ఎమ్ఎల్) లిబరేషన్ -
‘బిల్కిస్ బానో’ దోషుల విడుదలపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు. సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా తేలిన వారిని విడుదల చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. బిల్కిస్ బానో కేసు దోషుల రెమిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లాల్, రాప్ రేఖ వర్మలు. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అపర్నా భట్. 14 మంది హత్య, గర్భిణీపై అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషులను విడుదల చేయటాన్ని సవాల్ చేసినట్లు కపిల్ సిబాల్ పేర్కొన్నారు. ఈ పిల్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అంతకు ముందు.. సుమారు 6వేల మంది హక్కుల కార్యకర్తలు, చరిత్రకారులు దోషుల విడుదలను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
ఇక భయంతో బతకాల్సిందేనా?: బిల్కిస్ బానో ఆవేదన
తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను రెమిషన్ కింద విడుదల చేయడంపై బిల్కిస్ యాకూబ్ రసూల్ అలియాస్ బిల్కిస్ బానో స్పందించారు. న్యాయవ్యవస్థ పట్ల తనకున్న నమ్మకాన్ని ఈ నిర్ణయం చెదరగొట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తనను మోసం చేసిందని, ఆ నిర్ణయం బాధించిందని, ఇంతకాలం అభద్రతాభావంతో బతికిన తాను ఇకపైనా భయంభయంగా బతకాల్సిందేనా? అంటూ ప్రశ్నిస్తున్నారామె. ‘‘న్యాయస్థానాలు పవిత్రమైనవి నమ్మాను. కానీ, ఏ మహిళకైనా న్యాయపరిధిలో ఇలాంటి ముగింపు దక్కుతుందా?. నేను వ్యవస్థను నమ్మాను. అందుకే గాయంతోనే జీవించడం నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. నా ఈ బాధ, అస్థిరమైన విశ్వాసం నా ఒక్కదానిదే కాదు.. న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి స్త్రీది అని ఆమె పేర్కొన్నారు. ఇది అన్యాయం. నా భద్రత, బాగోగుల గురించి పట్టింపులేదన్నట్లు గుజరాత్ ప్రభుత్వం వ్యవహరించింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలిని సంప్రదించాలన్న స్పృహ గుజరాత్ ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం. గుజరాత్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే.. భయాందోళనలు లేకుండా మనశ్శాంతిగా బతికే నా హక్కును నాకు ఇవ్వమని. నన్ను, నా కుటుంబానికి రక్షణ కల్పించమని అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. జైల్లో ఉన్నా భయంగానే.. బిల్కిస్ బానో పోరాటం పద్దెనిమిదేళ్ల పైనే కొనసాగింది. ఈ సమయంలో ఆమె ఒక చోట స్థిరంగా ఉండలేదు. దోషుల కుటుంబాల నుంచి హాని పొంచి ఉండడంతో అజ్ఞాతంలో కొన్నాళ్లు, ఆపై క్రమంతప్పకుండా ఇళ్లను మారుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు నిందితుల విడుదలతో ఆమెలో మరింత ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది శోభా గుప్తా చెప్తున్నారు. నిందితుల విడుదల వ్యవహారంపై న్యాయ పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారామె. గుజరాత్ వీహెచ్‌పీ ఆఫీస్‌లో సన్మానం అందుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు దోషులు బిల్కిస్ బానో కేసు 2002 గుజరాత్ గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో.. దాహోద్ జిల్లా లింఖేధా మండలం రంధిక్పూర్లో.. మూక దాడులు జరిగాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చడంతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బిల్కిస్ బానోస్ కుటుంబంపైనా దాడి జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ కుటుంబ సభ్యులు ఏడుగురిని(బిల్కిస్ మూడేళ్ల కూతురిని సహా) హతమార్చారు. ఆ సమయానికి బిల్కిస్ వయసు 21 ఏళ్లు. ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడింది బిల్కిస్, ఓ వ్యక్తి, మూడేళ్ల ఓ చిన్నారి మాత్రమే. ఈ కేసులో 2008, జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బిల్కిస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును సుప్రీంకోర్టు అహ్మదాబాద్ నుంచి బాంబే హైకోర్టుకు బదలాయించింది. ఇది అత్యంత అరుదైన కేసని, ప్రధాన నిందితులైన జశ్వంత్‌భాయ్, గోవింద్‌భాయ్, రాధేశ్యాంలకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. అయితే.. కింది కోర్టు ఇచ్చిన జీవిత ఖైదు తీర్పును సమర్థించి బాంబే హైకోర్టు. 1992 పాలసీ ప్రకారం.. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో నిందితులను రెమిషన్ కింద విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. దీంతో దేశం మొత్తం భగ్గుమంది. రేపిస్టులు.. నరహంతకులను విడుదల చేయడంపై రాజకీయ నేతల దగ్గరి నుంచి సామాన్యుల దాకా సోషల్ మీడియాలో గుజరాత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రెమిషన్ పాలసీ 2014 ప్రకారం.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదు. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం దోషులకు 2008లో శిక్ష పడిందని, ‘సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం 1992 పాలసీ ప్రకారం’ వాళ్ల విడుదల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని విడుదల చేశామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇదీ చదవండి: అసలు ‘బిల్కిస్’ దోషుల విడుదలకు కేంద్రం అనుమతి ఉందా? -
మోదీగారు.. మహిళలంటే గౌరవం ఉంటే గనుక..!: కేటీఆర్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను.. రెమిషన్ ఆదేశాల కింద గుజరాత్ సర్కార్ విడుదల చేయడంపై దేశం భగ్గుమంటోంది. గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుండగా.. విపక్షాలు, మేధోవర్గం ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఏకీపడేస్తున్నాయి. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రియమైన మోదీగారు.. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడడం నిజమే అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకోండి. పదకొండు మంది రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వపు ఆదేశాలను రద్దు చేయించండి. ఈ దేశాలు వెగటు పుట్టించేవిగా ఉన్నాయి. మీరు జోక్యం చేసుకుని చిత్తశుద్ధి చూపించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు కేటీఆర్. Dear PM @narendramodi Ji, If you had really meant what you spoke about Respecting women, urge you to intervene & rescind the Gujarat Govt remission order releasing 11 Rapists 🙏 Sir, it is nauseating to put it mildly & against MHA order. Need you to show sagacity to the Nation — KTR (@KTRTRS) August 17, 2022 అంతేకాదు.. సార్.. ఐపీసీ, సీఆర్పీసీలో రేపిస్టులకు బెయిల్ దొరక్కుండా ఉండేందుకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, బలమైన చట్టాలతోనే న్యాయవ్యవస్థ పటిష్టంగా, వేగంగా పని చేస్తుందని మరో కొనసాగింపు ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్. ఇదీ చదవండి: మోదీ పాతికేళ్ల లక్ష్యాలు భేష్..: కేటీఆర్ -
న్యాయం కోసం..
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమిళరాసన్’. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రెమిసెస్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారు. పెప్సి శివ సమర్పణలో ఎస్.కౌసల్య రాణి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తమిళంలో విడుదలవుతోంది. కాగా ఈ చిత్రాన్ని ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో రావూరి వెంకటస్వామి అదేరోజు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.కౌసల్య రాణి, రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సత్యం, న్యాయం, ధర్మం కోసం హీరో ఎలా పోరాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. ‘విక్రమ్ రాథోడ్’ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. యస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఆలపించిన ‘కన్నా దిగులవకు.. తొడున్నా నీ కొరకు...’ అనే పాట మా సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. కె.జె. యేసుదాస్గారు కూడా మా చిత్రంలో పాడడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ఆర్.డి.రాజశేఖర్. -
400 మంది ఖైదీలకు క్షమాభిక్ష: ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద 400 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాడింగ్ కమిటీ ఆమోదం మేరకు జీవో నెంబర్ 9 ను విడుదల చేసినట్టు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. -
'జీవితఖైదు పడినా క్షమాభిక్ష పెట్టొచ్చు'
న్యూఢిల్లీ: జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీల ను శిక్ష తగ్గించి, విడుదల చేసేందుకు రాష్ట్రాల కున్న అధికారాలపై నిరుడు విధించిన స్టేను సుప్రీంకోర్టు గురువారం తొలగించింది. జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు కొన్నిషరతులతో కూడిన అనుమతిని రాష్ట్రాలకిచ్చింది. ఆ షరతుల ప్రకారం.. * సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణజరిగి,శిక్షఅనుభవిస్తున్న ఖైదీలకు.. * టాడా వంటి కేంద్ర చట్టాల కింద దోషులుగా తేలిన వారికి.. * లైంగికపరమైన ఘోర నేరాలైన హత్యాచారం(అత్యాచారం+ హత్య) చేసినవారికి.. * కనీసం 14 ఏళ్లు జైలుశిక్ష అనుభవించని ఖైదీలకు.. జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలని స్పష్టంగా పేర్కొన్న ఖైదీలకు.. * 20 నుంచి 25 ఏళ్లంటూ శిక్షాకాలాన్ని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నవారికి.. శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేయకూడదు. వారి విషయంలో రాష్ట్రాలకున్న ‘శిక్ష తగ్గింపు’ అధికారం వర్తించదు. ఈ ఆదేశాలు మాజీ ప్రధాని రాజీవ్ హంతకుల విడుదలకు సంబంధించిన పిటిషన్‌కు వర్తించబోవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ పిటిషన్‌పై తామివ్వనున్న తుది తీర్పు ప్రకారం నడుచుకోవాలని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగానే గత సంవత్సరం.. జీవిత ఖైదీల శిక్ష తగ్గింపు, విడుదలకు సంబంధించి రాష్ట్రాలకున్న అధికారాలపై సుప్రీం స్టే విధించింది. మరణ శిక్ష మేలు కదా! ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితాంతం జైళ్లో ఉంచడం కన్నా.. ఆ దోషులకు మరణ శిక్ష విధించడం మంచిది కదా అని పేర్కొంది. ‘మనమంతా ఏదో ఆశతో జీవిస్తాం. జీవితాంతం జైల్లోనే మగ్గాల్సిన ఖైదీలకు ఆశలుండవు. మరి వారిని జైళ్లో ఉంచడంలో అర్థమేముంది? వారికి మరణశిక్ష విధించండి.. అదే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చనిపోయేవరకు జైళ్లో ఉంచ డం వెనుక హేతువు ఏంటని కేంద్రాన్ని ప్రశ్నిం చింది. ‘తప్పు చేసిన వారిలో మార్పును తీసుకువచ్చే శిక్షాస్మృతిని మనం ఆచరిస్తున్నాం. జీవి తాంతం జైళ్లోనే ఉండాల్సిన ఖైదీ తాను మారాలని ఎందుకనుకుంటాడు?’ అని ప్రశ్నించింది. -
'జీవితఖైదు పడినా క్షమాభిక్ష పెట్టొచ్చు'