హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద 400 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాడింగ్ కమిటీ ఆమోదం మేరకు జీవో నెంబర్ 9 ను విడుదల చేసినట్టు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.