సాక్షి, అమరావతి/కంభాలచెరువు (రాజమహేంద్రవరం)/కడప అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వీరిలో 175 మంది జీవితఖైదీలు స్టాండింగ్ కౌన్సెల్ సిఫార్సుల మేరకు.. మరో 20 మంది ఇతర శిక్షలుపడ్డ ఖైదీలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విడుదల అవుతున్నారు. ఈ మొత్తం ఖైదీలలో 13 మంది మహిళలున్నారు. వీరందరి సత్ప్రవర్తన ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా ఆదివారం ఆదేశాలు జారీచేశారు.
విశాఖపట్నం సెంట్రల్ జైల్ నుంచి 33 మంది, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి 48 మంది, రాజమండ్రి మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి 11 మంది, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి 25 మంది, ఒంగోలు జిల్లా జైల్ నుంచి ఆరుగురు, కడప సెంట్రల్ జైల్ నుంచి 31 మంది, అనంతపురం ఖైదీల వ్యవసాయ కాలనీ నుంచి 15 మంది, కడప మహిళా ఖైదీల ప్రత్యేక జైలు నుంచి ఇద్దరు, పొనుగొండ సబ్ జైలు నుంచి ఇద్దరు.. ధర్మవరం సబ్ జైలు నుంచి ఇద్దరు విడుదల అవుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఏడుగురు, నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఇద్దరు, కడప సెంట్రల్ జైల్ నుంచి ముగ్గురు, అనంతపురం జిల్లా జైలు నుంచి ఒకరు విడుదల అవుతున్నారు.
195 మంది ఖైదీలకు విముక్తి
Published Mon, Aug 15 2022 3:55 AM | Last Updated on Mon, Aug 15 2022 8:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment