రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్ మిలటరీ.. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతోంది. యుద్దం మొదలైన తర్వాత జరుపుకోనున్న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఇరు దేశాలు సుమారు 100 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. రష్యా దాడులు ప్రారంభించిని మొదటి నెలలోనే 115 మంది ఉక్రెయిన్ సైనికులను క్రెమ్లిన్ నిర్బంధించిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు.
వారిలో దాదాపు 50 మంది సైనికులను మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌వర్క్స్ నుంచి రష్యన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండువారాల క్రితం ఊహించని రీతిలో ఉక్రెయిన్ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దాడుల్లో కూర్స్క్ ప్రాంతంలో 115 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడ్డారని తెలిపారు. వారంతా ప్రస్తుతం బెలారస్‌లో ఉన్నారని అయితే తాజాగా యుద్ధ ఖైదీలలో మార్పిడిలో భాగంగా వారికి వైద్య చికిత్స, పునరావాసం అందించటంల కోసం రష్యాకు తీసుకువెళ్లనున్నట్ల పేర్కొంది.
22 ఫిబ్రవరి 2022లో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇది 55వసారి యుద్ధఖైదీల మార్పిడి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంతో సైనికుల మార్పిడి జరిగిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మాకు ప్రతిఒక్కరూ గుర్తున్నారు. అందరీని స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment