swap
-
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్ మిలటరీ.. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతోంది. యుద్దం మొదలైన తర్వాత జరుపుకోనున్న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఇరు దేశాలు సుమారు 100 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. రష్యా దాడులు ప్రారంభించిని మొదటి నెలలోనే 115 మంది ఉక్రెయిన్ సైనికులను క్రెమ్లిన్ నిర్బంధించిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. వారిలో దాదాపు 50 మంది సైనికులను మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌వర్క్స్ నుంచి రష్యన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండువారాల క్రితం ఊహించని రీతిలో ఉక్రెయిన్ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దాడుల్లో కూర్స్క్ ప్రాంతంలో 115 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడ్డారని తెలిపారు. వారంతా ప్రస్తుతం బెలారస్లో ఉన్నారని అయితే తాజాగా యుద్ధ ఖైదీలలో మార్పిడిలో భాగంగా వారికి వైద్య చికిత్స, పునరావాసం అందించటంల కోసం రష్యాకు తీసుకువెళ్లనున్నట్ల పేర్కొంది. 22 ఫిబ్రవరి 2022లో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇది 55వసారి యుద్ధఖైదీల మార్పిడి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంతో సైనికుల మార్పిడి జరిగిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మాకు ప్రతిఒక్కరూ గుర్తున్నారు. అందరీని స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. -
స్వాప్ పద్ధతిలో ఒకేసారి ఇద్దరికి కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు ‘స్వాప్’పద్ధతిలో ఒకే సమయంలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు బ్లడ్ గ్రూపుల మధ్య కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం దాతలు, స్వీకర్తలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు బుధ వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలు డెక్కన్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాయక్, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ పవన్‌కుమార్, కిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్‌లు వెల్లడించారు. సింగరేణి కాలరీస్ ఉద్యోగి బిల్ల మల్లయ్య జన్యు సంబంధ మూత్ర పిండాల సమస్యతో బాధపడు తున్నాడు. చికిత్స కోసం ఆయన ఇటీవల డెక్కన్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా, పరీక్షించిన వైద్యులు కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతిందని, మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కార మని సూచించారు. కిడ్నీ దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నా కిడ్నీ లభించలేదు. దీంతో మల్లయ్య(బ్లడ్ గ్రూప్–బి)కు కిడ్నీ ఇవ్వడానికి భార్య పద్మ(బ్లడ్ గ్రూప్–ఎ) అంగీకరించింది. అయితే, స్వీకర్త, దాతల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం చికిత్సకు అడ్డంకిగా మారింది. ఇదే సమయంలో కిమ్స్‌లో కరీంనగర్‌కు చెందిన బానోతు రాజు(బ్లడ్ గ్రూప్–ఎ)ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఆయన భార్య సునీత బ్లడ్‌గ్రూప్–బిగా తేలింది. ‘స్వాప్’ (రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో ఇద్దరు వేర్వేరు బ్లడ్‌గ్రూప్‌ల మధ్య అవయవమార్పిడి చికిత్స)పద్ధతిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు భావించారు. ఆ మేరకు జీవన్‌దాన్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. దీనికి సుమారు ఆరునెలలు పట్టింది. సునీత నుంచి సేకరించిన కిడ్నీని డెక్కన్ ఆస్పత్రిలోని మల్లయ్యకు అమర్చగా, పద్మ నుంచి సేకరించిన కిడ్నీని బానోతు రాజుకు కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా అమర్చారు. రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో జరుగుతున్న ఈ ప్రక్రియను స్వైప్‌లో వీక్షిస్తూ చేశారు. ఈ తరహా చికిత్స దక్షిణాదిలో ఇదే మొదటిదని డాక్టర్ నాయక్ వెల్లడించారు. -
థామస్ కుక్-స్టెర్లింగ్ హాలిడేస్ విలీనం
ముంబై: పర్యాటక సేవలు అందించే థామస్ కుక్ (ఇండియా), స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ ఇండియా విలీనం కాబోతున్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 870 కోట్లు ఉంటుందని, ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి కాగలదని థామస్ కుక్ (టీసీఐఎల్) సంస్థ వెల్లడించింది. కొంత నగదుగాను, మరికొంత మేర షేర్ల రూపంలోనూ దశలవారీగా ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. తొలిదశలో స్టెర్లింగ్ మేనేజ్మెంట్ టీమ్ సహా ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి సుమారు 23 శాతాన్ని థామస్ కుక్ రూ. 176 కోట్లకు కొనుగోలు చేస్తుంది. ఈ షేర్హోల్డర్లలో స్టెర్లింగ్ చైర్మన్ సిద్ధార్థ మెహతా, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కూడా ఉన్నారు. అలాగే, ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ కోసం రూ.187 కోట్లు, ఓపెన్ ఆఫర్ కోసం మరో రూ. 230 కోట్లు టీసీఐఎల్ వెచ్చిస్తుంది. మొత్తం మీద టీసీఐఎల్కి చెందిన ప్రతి 120 షేర్లకు.. స్టెర్లింగ్ సంస్థకి చెందిన 100 షేర్లు లభిస్తాయి. ఈ పరిణామాల దరిమిలా రెండు సంస్థల సగటు విలువ రూ.3,000 కోట్ల పైచిలుకు ఉంటుందని టీసీఐఎల్ ఎండీ మాధవన్ మీనన్ తెలిపారు. విలీనం తర్వాత స్టెర్లింగ్ సంస్థ కనుమరుగైనా బ్రాండ్ మాత్రం కొనసాగుతుందని వివరించారు. ఈ డీల్‌తో దేశవ్యాప్తంగా తమకున్న రిసార్ట్స్.. థామస్ కుక్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని మీనన్ పేర్కొన్నారు. థామస్ కుక్ కొన్నాళ్ల క్రితమే బెంగళూరుకు చెందిన ఐక్య అనే సంస్థలో 74 శాతం వాటాలను రూ. 256 కోట్లకు కొనుగోలు చేసింది. థామస్ కుక్ మాతృ సంస్థ ఫెయిర్‌ఫ్యాక్స్ హోల్డింగ్స్. దీని చైర్మన్ అయిన ప్రేమ్ వత్స హైదరాబాదీ కావడం గమనార్హం. సుమారు నెలన్నర రోజులుగా ఈ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రేమ్ వత్స భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగానే స్టెర్లింగ్‌తో ఒప్పందం ఖరారై ఉంటుందని సమాచారం. మరోవైపు, స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ 1987లో ఏర్పాటైంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లోని రిసార్ట్స్‌లో 1,512 గదులు ఉన్నాయి.