
మాస్కో: ఉక్రెయిన్‌కు రష్యా ఝలక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ప్రతిపాదనను మాస్కో వర్గాలు తోసిపుచ్చాయి శాంతి ఒప్పందంలో భాగంగా.. భూభాగాల పరస్పర మార్పిడికి సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు తమ దేశం ఏనాటికీ అంగీకరించబోమని రష్యా ప్రకటించింది.
ఇది ఎన్నటికీ జరగదు. రష్యా తన భూభాగాన్ని మార్పిడి చేసే అంశాన్ని ఎన్నడూ చర్చించలేదు.. చర్చించబోదు కూడా అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా భూభాగాల్లో అడుగుపెట్టిన ఉక్రెయిన్ బలగాలను తరిమి కొట్టడం లేదంటే నాశనం చేస్తుందని పేర్కొన్నారాయన.
రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచి పెట్టాలని జెలెన్‌స్కీ షరతు విధించారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ నడుస్తున్న వేళ.. కీవ్‌పై రష్యా బలగాలు డ్రోన్ దాడులు జరపగా ఒకరు మరణించారు.
మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో.. శాంతి చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని జెలెన్‌స్కీ కోరుతున్నారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment