
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆఫర్
కీవ్: రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు, ఇరుదేశాల్లో ఉన్న మొత్తం ఖైదీల మార్పి డికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయి న్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌పైకి రష్యా దండయాత్ర మొదలెట్టి సోమవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని కీవ్ నగరంలో జరిగిన సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడారు.
యుద్ధాన్ని ముగించే ప్రయ త్నంలో భాగంగా యుద్ధ ఖైదీల మార్పిడిని ఆయన ప్రతిపాదించారు. ‘ రష్యా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఉక్రేనియన్లను విడుదల చేయాలి. మా జైళ్లలోని రష్యన్లను మేం విడుదలచేస్తాం. యుద్ధ ఖైదీలందరినీ మార్పిడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. యుద్ధాన్ని ఇలా న్యాయబద్ధమైన మార్గంలో ముగిద్దాం’’ అని జెలెన్‌స్కీ అన్నారు. తమ దేశానికి నాటో సభ్యత్వం ఇస్తే ఉక్రెయిన్ అధ్యక్ష పదవి నుంచి వెంటనే వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
ఉక్రెయిన్ మూడేళ్ళ ప్రతిఘటనను, సైనికుల పోరాటపటిమ, వీరత్వాన్ని జెలెన్‌స్కీ ప్రశంసించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో 2024 అక్టోబర్‌లో రష్యా, ఉక్రెయిన్ చెరో 95 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర బదిలీ ప్రక్రియ ఇప్పటికి 58సార్లు జరిగింది. గత సెప్టెంబర్‌లో ఇరు దేశాలు 103 మంది ఖైదీలను విడుదల చేశాయి. భద్రతా సాయానికి బదులుగా కీలకమైన సహజ వనరులను సమకూర్చడంపై అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment