Moscow
-
బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ మృతి
మాస్కో: రష్యా రాజధానిలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో రష్యా ఆర్మీ సీనియర్ జనరల్ మృత్యువాతపడ్డారు. ఆర్మీ అణు, జీవ, రసాయన భద్రతా విభాగం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్(54) మంగళవారం కార్యాలయానికి వెళ్లేందుకు తన నివాసం ఆవరణలోని కారు వద్దకు రాగా ఆ పక్కనే స్కూటర్లో అమర్చిన బాంబు పేలింది. ఘటనలో కిరిల్లోవ్తోపాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక తమ సీక్రెట్ సర్వీస్(ఎస్‌బీయూ) హస్తముందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. సోమవారం జనరల్ కిరిల్లోవ్‌పై పలు నేరారోపణలను సంధించిన ఎస్‌బీయూ, మరునాడే ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ముందుకు సాగుతున్న వేళ తాజా పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయి న్లో రష్యా పాల్పడు తున్న దారుణాల్లో కిరిల్లోవ్ కీలకంగా ఉన్నారంటూ కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ ఆర్మీపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి కిరిల్లోవ్ ఆదేశాలే కారణమని సోమవారం ఎస్‌బీయూ ఆరోపణలు చేసింది. ‘కిరిల్లోవ్ యుద్ధ నేరస్తుడు, తమ న్యాయబద్ధమైన లక్ష్యం’ అంటూ వ్యాఖ్యానించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో 4,800 పర్యా యాలకుపైగా రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు ఎస్‌బీయూ ఆరోపిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన క్లోరోపిక్రిన్ అనే విష వాయువును ఉక్రెయిన్ బలగాలపై రష్యా ప్రయోగించినట్లు అమెరికా అంటోంది. ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.తగు రీతిలో ప్రతీకారం తప్పదుజనరల్ కిరిల్లోవ్‌ను చంపేందుకు స్కూటర్లో అమర్చిన బాంబును రిమోట్‌తో పేల్చినట్లు గుర్తించామని రష్యా అధికారులు చెప్పారు. రష్యా దీనిని ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఉక్రెయిన్ను తగు రీతిలో దండిస్తామని ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ స్పందిస్తూ..సైనిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఉక్రెయిన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. ఆ దేశ సైనిక, రాజకీయ నాయకత్వం ప్రతీకార చర్యలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ ఇటువంటి దాడుల్లో పలువురు రష్యా ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వీటికి ఉక్రెయినే కారణమని రష్యా నిందించింది.🛑Breaking🛑Senior Russian General Igor Kirillov, head of Russia’s NBC defense forces, killed in a scooter bomb explosion in Moscow (Dec 17). pic.twitter.com/Zn9hhzuz3D— Taymur Malik (@Taymur918) December 17, 2024 -
సిరియా సంక్షోభం.. అసద్ కుటుంబానికి అండగా పుతిన్
మాస్కో: తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని విడిచివెళ్లిపోవడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. ఇదే సమయంలో ఆయన విమాన ప్రమాదంలో మరణించారనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అసద్ రష్యాలో ఉన్నట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. రష్యా మీడియా ప్రకటనలో ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.సిరియాలో తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో సిరియా అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా విమానంలో బయలుదేరారు. అనంతరం, ఆయన విమానం ఆచూకీ తెలియకపోవడంతో ప్రమాదానికి గురైనట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై మొదట రష్యా స్పందిస్తూ.. అసద్ చనిపోలేదని క్లారిటీ ఇచ్చింది. అనంతరం, అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పుకొచ్చాయి. ఈ ప్రకటనలో అసద్.. రష్యాలో సురక్షితంగా ఉన్నారని తెలిసింది.ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ సిరియాను వీడారని రష్యా పేర్కొంది. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయానికి వచ్చారని, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది.BREAKING: 🇸🇾🇷🇺 Bashar al-Assad and his family are in Moscow, Russia and have been granted asylum. pic.twitter.com/7vO9SBMoGA— BRICS News (@BRICSinfo) December 8, 2024 -
అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా
న్యూయార్క్: ఉత్తర కొరియాకు చెందిన 3 వేల మంది సైనికులు రష్యాకు వెళ్లి డ్రోన్లు, ఇతర పరికరాలపై శిక్షణ పొందుతున్నారని దక్షిణ కొరియా వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కొరియా వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉత్తర కొరియాకు సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో భాగంగా రష్యా ఆర్మీలో చేరితే సైనిక చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్‌తో పోరాటాని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్దతు పొందితే అది క్రెమ్లిన్ బలహీనతకు సంకేతమని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రష్యన్లు, ఉత్తర కొరియన్లు ఇక్కడ ఏమి చేయాలని నిర్ణయించుకుంటారో మేము చూస్తాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో చేరాలని నిర్ణయించుకుంటే చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం. సైనికులు ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు ఓడలో ప్రయాణించారు. రష్యన్ సైనిక శిక్షణా కేంద్రాలున్న ప్రాంతాలు వెళ్లారు. అయితే.. ఉత్తర కొరియా సైనికులు రష్యన్ మిలిటరీతో కలిసి యుద్ధంలోకి పాల్గొంటాయో లేదో స్పష్టత లేదు. ఉత్తర కొరియా సైనికులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉక్రేయిన్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పశ్చిమ రష్యాకు వెళ్లవచ్చ. ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి గురించి తెలియజేశాం. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటే.. రష్యాలో పెరుగుతున్న నిరాశ, బలహీనతకు సంకేతం అవుతుంది’’ అని అన్నారు. ఉత్తర కొరియా ఇప్పటివరకు 3వేల మంది సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా తెలుపుతోంది. ఇటీవల 1500 మంది సైనికులను ఉత్తర కొరియా రష్యాకు తరలించినట్లు దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. మరోవైపు.. రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించటం గమనార్హం.చదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇటీవల ఉక్రెయిన్ సైన్యం రష్యాపై దాడిని పెంచింది. ఉక్రెయిన్ మిలటరీ.. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతోంది. యుద్దం మొదలైన తర్వాత జరుపుకోనున్న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఇరు దేశాలు సుమారు 100 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. రష్యా దాడులు ప్రారంభించిని మొదటి నెలలోనే 115 మంది ఉక్రెయిన్ సైనికులను క్రెమ్లిన్ నిర్బంధించిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. వారిలో దాదాపు 50 మంది సైనికులను మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌వర్క్స్ నుంచి రష్యన్ దళాలు తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రెండువారాల క్రితం ఊహించని రీతిలో ఉక్రెయిన్ సైన్యం తమ సరిహద్దుల్లోని భూభాగాల్లోకి చొచ్చుకువచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ దాడుల్లో కూర్స్క్ ప్రాంతంలో 115 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌కు పట్టుపడ్డారని తెలిపారు. వారంతా ప్రస్తుతం బెలారస్లో ఉన్నారని అయితే తాజాగా యుద్ధ ఖైదీలలో మార్పిడిలో భాగంగా వారికి వైద్య చికిత్స, పునరావాసం అందించటంల కోసం రష్యాకు తీసుకువెళ్లనున్నట్ల పేర్కొంది. 22 ఫిబ్రవరి 2022లో యుద్దం మొదలైనప్పటి నుంచి ఇది 55వసారి యుద్ధఖైదీల మార్పిడి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంతో సైనికుల మార్పిడి జరిగిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘మాకు ప్రతిఒక్కరూ గుర్తున్నారు. అందరీని స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. -
Russian President Vladimir Putin: అతని కోసం ఎందాకైనా...!
2024 ఆగస్టు 1. మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం. అప్పుడే లాండైన విమానం నుంచి 8 మంది ప్రత్యేక భద్రత మధ్య బయటికి వచ్చారు. వారిలో ఒకరిని రిసీవ్ చేసుకునేందుకు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే విమానాశ్రయం దాకా వచ్చారు. సదరు ‘వీఐపీ’కి షేక్‌హాండ్ ఇచ్చి మరీ సాదరంగా స్వాగతించారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం. 2019 ఆగస్టు. జర్మనీ రాజధాని బెర్లిన్. చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయానికి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ పార్కు. సైకిల్‌పై వస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. తన ముందు నడుస్తున్న మాజీ చెచెన్ రెబెల్ జెలీంఖాన్ ఖాన్గోష్విలిని టపీమని కాల్చేశాడు. చుట్టుపక్కల వాళ్లు షాక్ నుంచి తేరుకునే లోపే క్షణాల్లో మాయమైపోయాడు. సైకిల్‌ను పక్కనే ఉన్న నదిలో పారేశాడు. విగ్గు తీసి, నీట్‌గా షేవ్ చేసుకుని ఎవరూ గుర్తించలేనంతగా రూపం మార్చుకున్నాడు. విధి వక్రించి ప్రత్యక్ష సాక్షులు గుర్తించడంతో కాసేపటికే పట్టుబడి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. – నాడు జర్మనీలో జీవితఖైదుకు గురైందీ, నేడు మాస్కోలో పుతిన్ నుంచి ఘనస్వాగతం అందుకున్నదీ ఒక్కడే. అతనే... వదీం క్రషికోవ్. పేరుమోసిన రష్యా హిట్‌మ్యాన్. జెలీంఖాన్ ఒక్కడినే కాదు, రష్యాకు కంట్లో నలుసుగా మారిన వాళ్లెందరినో క్రషికోవ్ వెంటాడి వేటాడాడు. విదేశీ గడ్డపై ఇలాంటి అసైన్మెంట్లను సైలెంట్‌గా పూర్తి చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. రష్యా గూఢచర్య సంస్థ ఎఫ్ఎస్బీలో చేరిన కొన్నాళ్లకే టాప్ రేటెడ్ హిట్‌మ్యాన్‌గా పేరు సంపాదించాడు. ముఖ్యంగా పుతిన్‌కు అత్యంత ఇషు్టనిగా మారాడు. అందుకే అతన్ని విడిపించుకోవడాన్ని ఆయన సవాలుగా తీసుకున్నారు. జెలీంఖాన్ హత్యతో తనకు సంబంధమే లేదని విచారణ పొడవునా క్రషికోవ్ బుకాయించినా, అది అతని పనేనని పుతిన్ అధికారికంగానే అంగీకరించారు. క్రషికోవ్‌ను ‘గొప్ప దేశభక్తుని’గా అభివరి్ణంచారు. అతని కోసం సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికాతో చరిత్రలోనే అతి పెద్ద ఖైదీల మారి్పడికి కూడా అంగీకరించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, మాజీ మెరైన్ పౌల్ వీలన్, రష్యా అసమ్మతివాది వ్లాదిమిర్ కారా ముర్జా సహా 16 మందిని వదిలేశారు. బదులుగా అమెరికా, జర్మనీ, పశ్చిమ దేశాల నుంచి క్రషికోవ్తో పాటు 8 మంది రష్యన్లను విడిపించుకున్నారు. వారిలో మరో ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లున్నారు. తద్వారా, విదేశాల్లో ఇలాంటి ఆపరేషన్లు చేసే క్రమంలో దొరికిపోయినా అధ్యక్షుడు తమను కాపాడి తీరతారని నిఘా విభాగం ఏజెంట్లకు ధీమా ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆశించింది కూడా అదేనని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే’.. రష్యాలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
మాస్కో : ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యా సైన్యానికి సహాయకులు భారత పౌరులు ఉన్నారని, వారిని వెంటనే స్వదేశానికి పంపించాలని కోరారు. మోదీ విజ్ఞప్తితో పుతిన్ భారతీయుల్ని స్వదేశానికి పంపించేందుకు అంగీకరించారు. దీంతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియాకు వెళ్లే ముందు మాస్కోలోని డయాస్పోరా వేదికగా భారతీయుల్ని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. 👉నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు. భారత నేల సువాసనతో ఇక్కడికి వచ్చాను. 140 కోట్ల మంది భారతీయుల ప్రేమతో ఇక్కడికి వచ్చాను.👉భారత్ జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది.👉డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డ్లను సృష్టించాం. 👉దేశం మరుతోందని ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది.👉ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం.👉పదేళ్లలో 3౦వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్లు చేశాం👉పదేళ్లలో ఎయిర్ పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తాం.👉గత పదేళ్లలో జరిగిన అభివృద్ది ట్రైలర్ మాత్రమే👉దేశాభివృద్దిలో 140 కోట్ల భారతీయుల కృషి ఉంది. 👉సవాలు..సవాళ్లు నా డీఎన్ఏలో ఉన్నాయి. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్దిపై ప్రపంచమే ఆశ్చర్యపోయింది.👉ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ 15 శాతం సహకరిస్తోందన్న మోదీ.. 2014కి ముందు అంధకారంలో ఉంది. 👉ఐసీసీ వరల్డ్ టీ20లో భారత్ విజయాన్ని మీరు ఘనంగా జరుపుకున్నారు. విజయమే అంతిమ లక్ష్యం. భారత యువత చివరి క్షణం వరకు పట్టు వదలదు. 👉ప్రతి భారతీయుడు దేశాన్ని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారతదేశ విజయాల గురించి ఎన్నారైలు గర్వంగా మాట్లాడుతున్నారు. 👉ఈ రోజు భారత్ చంద్రుని భాగంలోకి చంద్రయాన్ పంపింది. మరే ఇతర దేశం ఆ స్థాయికి చేరుకోలేదు.👉ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను భారత్ కలిగి ఉంది. 👉డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రగామిగా కొనసాగుతోంది.👉భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.👉సరిగ్గా నెల రోజుల క్రితం నేను మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. నా మూడో టర్మ్‌లో మూడింతల శక్తితో పని చేస్తానని ఆ రోజు ప్రతిజ్ఞ చేశాను' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
భారతీయులకు భారీ ఊరట.. మోదీ పర్యటనతో పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీలో భారతీయులు సైతం పనిచేస్తున్నారు. ఇటీవల యుద్ధ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికులు జరిపిన దాడిలో రష్యా ఆర్మీలో పని చేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించారు.అయితే రష్యా పర్యటనలో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చించారు. అనంతరం తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా అంగీకరిస్తున్నట్లు పుతిన్ చెప్పారంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఏజెంట్ల చేతిలో మోసంకొంతకాలం క్రితం విదేశాల్లో భారీ మొత్తంలో జీతాలు చెల్లిస్తామంటూ పలువురు ఏజెంట్లు సుమారు 12 మంది భారతీయుల్ని మోసపూరితంగా హద్దులు దాటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యా ఆర్మీకి సహాయంగా పంపించారు. రష్యా ఆర్మీ ధరించిఅందుకు ఊతం ఇచ్చేలా ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్, హర్యానాలకు చెందిన వారు రష్యా ఆర్మీ ధరించి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న వీడియోలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో ఎక్కువ శాలరీ వస్తుందనే ఆశతో ఏజెంట్లను ఆశ్రయిస్తే వాళ్లు తమని అక్రమంగా రష్యా ఆర్మీలోకి జాయిన్ చేయించినట్లు తెలిపారు. వేరే గత్యంతరం లేక రష్యా ఆర్మీలో పని చేస్తున్నామని, తమని రక్షించమని కోరుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోపై కేంద్రం స్పందించింది. అక్రమంగా రష్యా ఆర్మీలో పనిచేస్తున్న రక్షించేలా పుతిన్‌ను సంప్రదిస్తామని హామీ ఇచ్చింది. తక్షణ చర్యల్లో భాగంగా పౌరుల్ని మోసం చేస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. రష్యాలో భారత్ దౌత్య విజయంతాజా పర్యటనలో మోదీ రష్యా ఆర్మీలో భారతీయుల అంశంపై పుతిన్ చర్చించడం, అందుకు ఆయన భారతీయుల్ని విడుదల చేసేందుకు విముఖత వ్యక్తం చేయడం రష్యాలో భారత్ దౌత్య విజయం సాధించినట్లైంది. -
రష్యా పర్యటనలో ప్రధాని మోదీ (ఫోటోలు)
-
రష్యాలో మోదీకి ఘన స్వాగతం.. హిందీ పాటకు డ్యాన్స్‌లతో..
మాస్కో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ రష్యాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ రాక సందర్భంగా రష్యన్ డ్యాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దాండియా, గర్భా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలికింది.ఇక, మాస్కోలో ల్యాండ్ అయిన తర్వాత మోదీ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ట్విట్టర్లో..‘మాస్కో దిగాను. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా భవిష్యత్ సహకార రంగాలలో మన దేశాల మధ్య బలమైన సంబంధాలు మన ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. Landed in Moscow. Looking forward to further deepening the Special and Privileged Strategic Partnership between our nations, especially in futuristic areas of cooperation. Stronger ties between our nations will greatly benefit our people. pic.twitter.com/oUE1aC00EN— Narendra Modi (@narendramodi) July 8, 2024 ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక, మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఇక, రష్యా పర్యటనను ముగించుకుని మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. PM Modi was greeted with a heartfelt welcome by the Indian community in Moscow, Russia. pic.twitter.com/attIdUeuzP— Chandrajiban Chakma (@Chandrajiba4BJP) July 8, 2024 PM Modi received a warm reception and a Guard of Honour upon his arrival in Moscow, Russia. pic.twitter.com/oM2NtUO1mW— Chandrajiban Chakma (@Chandrajiba4BJP) July 8, 2024 -
రష్యా టూర్‌కు బయలుదేరిన ప్రధాని
న్యూఢిల్లీ: మూడో టర్ములో ప్రధాని మోదీ రెండో విదేశీ టూర్ మొదలైంది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటన కోసం సోమవారం(జులై 8) ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. మూడు రోజుల పాటు రెండు దేశాల్లో ప్రధాని పర్యటన సాగనుంది. Over the next three days, will be in Russia and Austria. These visits will be a wonderful opportunity to deepen ties with these nations, with whom India has time tested friendship. I also look forward to interacting with the Indian community living in these countries.…— Narendra Modi (@narendramodi) July 8, 2024 పర్యటనలో భాగంగా భారత్, రష్యా 22వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాకక్షిక చర్చలు జరపనున్నారు. రష్యాలో నివసిస్తున్న భారతీయులను ప్రధాని కలవనున్నారు. అనతరం అక్కడి నుంచి ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనుండటం విశేషం. -
ప్రపంచానికి మాస్కో పాఠం
ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. శుక్రవారం రాత్రి మాస్కో సమీపంలో క్రిక్కిరిసిన మాల్‌లోకి వచ్చి, ఓ సంగీత కార్యక్రమ హాలులోని జనంపై నలుగురు తీవ్రవాదులు జరిపిన విచక్షణారహితమైన దాడి ప్రపంచ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో కనివిని ఎరుగని ఈ స్థాయి దాడిలో దాదాపు 140 మందికి పైగా అమాయకులు ప్రాణాలు విడిస్తే, కొన్ని పదుల మంది గాయాల పాలయ్యారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ అయిదోసారి ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే ఈ దుశ్చర్య జరగడం గమనార్హం. యథేచ్ఛగా కాల్పులు జరిపి, భవనాన్ని తగులబెట్టిన దుండగులకు ఉక్రెయిన్‌తో లింకుందని రష్యా గూఢచర్య సంస్థల మాట. అయితే, 2022 నుంచి రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ మాత్రం తమకు సంబంధం లేదని ఖండించింది. కాగా, ఈ దాడి తామే చేసినట్టు తీవ్రవాద ‘ఐఎస్ఐఎస్’(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) శాఖ అయిన ‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరసాన్ ప్రావిన్స్’ (ఐఎస్ఐఎస్–కె) ప్రకటించడంతో కొత్త చర్చకు తెర లేచింది. జనబాహుళ్యం ప్రాంతాల్లో ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ప్రమాదం ఉందని అమెరికా మార్చి 7 నాటికే హెచ్చరించింది. అయినా, రష్యా పెడచెవిన పెట్టింది. అలా ఈ దాడులు మాస్కో స్వీయ భద్రతా వైఫల్యానికి అద్దం పట్టడమే కాక, ఆ దేశానికి తలవంపులయ్యాయి. మాస్కో శివారులోనే తీవ్ర వాదులు చులాగ్గా దాడి చేస్తుంటే, ఉక్రెయిన్‌పై యుద్ధంతో తీరిక లేని రష్యాకు తగిన ప్రత్యేక దళాలు అందుబాటులో లేకుండా పోయాయనే మాటా వినిపిస్తోంది. అయినా సరే, దేశంలో అసమ్మతిపై ఉక్కుపాదం మోపి, ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతంపైగా ఓట్లు తెచ్చుకొని, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రజామోదం ఉందని చెప్పుకుంటున్న రష్యా పాలకులు ఇప్పటికీ తప్పుడు దిశ వైపు చూస్తుండడం ఆశ్చర్యకరం. స్వయంకృతమని భావిస్తున్న తీవ్రవాద ముప్పుకూ పాశ్చాత్య ప్రపంచాన్నే నిందిస్తుండడం విచిత్రం. రెండు దశాబ్దాల పైగా ఉత్తర కాకసస్, చెచెన్యాలలో తీవ్రవాదంపై రష్యా తలపడుతోంది. సిరియా – ఇరాన్‌లతో దాని స్నేహం, మధ్యప్రాచ్యంలో దాని తీవ్రవైఖరి సరే సరి. ఇస్లామిజమ్ అణచివేతకూ దిగింది. దానికిప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విశ్లేషణ. నిజానికి, ఇరాక్, సిరియా దేశాల యుద్ధక్షేత్రాల్లో అసలైన ఐఎస్ఐఎస్ చాలా వరకు ఓటమి పాలైంది. అయితే, ఆ మాతృసంస్థ తాలూకు రక్తసిక్త వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న ‘ఐఎస్ ఐఎస్ –కె’ పడగ విప్పి, బుసలు కొడుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి పనిచేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్న ఈ వర్గం నిదానంగా తన విషవృక్షపు ఊడలను విస్తరిస్తోంది. ఇప్పటికే అటు అఫ్గానిస్తాన్‌లోనూ, ఇటు పాకిస్తాన్‌లోనూ అది అనేక దాడులు జరిపింది. ఈ జనవరిలో సైతం ఇరాన్‌లోని కెర్మాన్‌లో ఇరానియన్ జనరల్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా అది జరిపిన బాంబు దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా మాస్కో దాడితో ఈ తీవ్రవాద గ్రూపు భౌగోళికంగా తన పరిధిని విస్తరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2015 నాటి సిరియా అంతర్యుద్ధంలో రష్యా సేనలు అక్కడి అధ్యక్షుడు బషర్ అల్–అసద్ ఏలుబడిని సమర్థిస్తూ, ఐఎస్ వర్గానికి వ్యతిరేకంగా నిలిచాయి. సిరియాలో ప్రస్తుతం సద్దు లేనందున ‘ఐఎస్ఐఎస్–కె’ సారథ్యంలోని తీవ్రవాదులు అక్కడ తమ ఓటమికి ఇప్పుడిలా దాడి రూపంలో రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఉండవచ్చు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో మునిగిన పుతిన్ ఈ తాజా తీవ్రవాద దాడిపై స్పందించే తీరు రానున్న రోజుల్లో ప్రపంచ శక్తి సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయం. అసలు దాడికీ, ఉక్రెయిన్‌కూ సంబంధం ఉందన్న రష్యా మాట నమ్మశక్యంగా లేకపోగా, మధ్య ఆసియా ప్రాంతానికి విస్తరించాలని ‘ఐఎస్ఐఎస్–కె’ పడుతున్న ఆరాటానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. తజిక్ వర్గాల్లో ఈ తీవ్రవాద వర్గానికి ఆకర్షణ పెరుగుతోందనీ, ఈ ప్రాంతానికి విస్తరించే సత్తా దానికి ఉందనీ జనవరిలోనే ఐరాస భద్రతా మండలి తన నివేదికలో హెచ్చరించడం గమనార్హం. గత రెండు దశాబ్దాల్లో వివి«ద రకాల తీవ్రవాద ఘటనలు చూసిన మాస్కో కళ్ళు తెరిచి నిద్ర నటించడం మానాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శుష్క ఆరోపణలు మానేసి, సమస్య అసలు మూలాలపై దృష్టి పెట్టాలి. సొంత పెరట్లోనే ఈ తీవ్రవాద వర్గంతో పోరాటం చేస్తున్న అఫ్గానిస్తాన్ పాలకులతో కలసి కార్యాచరణ చేపట్టాలి. రష్యా ఘటన సాక్షిగా ఇప్పుడు కావాల్సిందల్లా... తీవ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ఒక స్పష్టమైన అవగాహన, అంగీకారం. అంతర్జాతీయంగా ఐఎస్ఐఎస్–కె ఊడలు మరింత లోతుగా దిగక ముందే వివిధ ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. మునుపు ఐఎస్‌ను మట్టి కరిపించడానికి కలసికట్టుగా కాలు కదిపినట్టే ఇప్పుడూ ముందుకు కదలాలి. ఐఎస్ఐఎస్–కె బలంగా వ్యతిరేకించే అఫ్గాన్ తాలిబన్‌తో అంతర్జాతీయ సమాజం సైతం సమన్వయం చేసుకోవాలి. సొంత గడ్డపై ఐఎస్ఐఎస్–కె, టీటీపీ లాంటి తీవ్రవాదుల కార్యకలాపాలను అనుమతించడం వల్ల చివరకు తమ దేశంతో పాటు, ఈ ప్రాంత భద్రతకే ప్రమాదమని అఫ్గానిస్తాన్ కూడా గ్రహించాలి. అందుకే, ఆ దేశం, దాని పొరుగునున్న ఈ తీవ్రవాద విషసర్పం కోరలు పీకే పనిలో ముందు వరుసలో నిలవాలి. ఇరాన్, చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు కలిసొచ్చి, ప్రాంతీయంగా ముప్పుగా పరిణమిస్తున్న ఈ తీవ్రవాద భూతాన్ని నిర్వీర్యం చేయాలి. ఏకాగ్ర దృష్టితో సునిశితమైన కార్యాచరణకు దిగితేనే ఫలితాలుంటాయి. అప్పుడే అసువులు బాసిన అమాయకుల పక్షాన నిలిచి, దోషులను వెంటాడి వేటాడగలం. పొంచివున్న సరికొత్త తీవ్రవాద వర్గపు ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడగలం. -
మాస్కో దాడి: ‘ఐసిస్ హస్తముందని అమెరికా నమ్ముతుందా?’
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ మారణహోమంలో ఇప్పటివరకు 137కు మంది మృతి చెందారు. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. అయితే దారుణాకి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అమెరికా సైతం బహిరంగంగా ధృవీకరిస్తూ ప్రకటనలు చేయటం గమనార్హం. అయితే అమెరికా ప్రకటనలపై తాజాగా రష్యా స్పందించింది. ఉక్రెయిన్, ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమిర్ జలెన్స్కీని రక్షించటం కోసమే అమెరికా.. ఈ దాడిని ఐసిస్పైకి నెడుతోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా అన్నారు. తాను అమెరికా వైట్ హౌస్‌ను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నిజంగా ఈ దాడికి పాల్పండింది ఐసిస్ అని మీరు (అమెరికా) ఖచ్చితంగా చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే అభిప్రాయం మీద అమెరికా ఉండగలదా? అని నిలదీశారు. గతం మధ్య ప్రాచ్య దేశాలకు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా జోక్యం చేసుకోవటం వల్ల రాడికల్, ఉగ్రవాదుల అధిపత్యం పెరిగిందని మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ క్రీయాశీలకంగా ఉండటాని అమెరికా జోక్యమే కారణమన్నారు. ఇలా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషేధమని తెలిపారు. నియంత్రణ వైఖరితో ప్రపంచాన్ని ఉగ్రవాదులకు మద్దతుగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఉక్రెయిన్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడానికి అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించి అమెరికా చేస్తున్న వ్యాఖ్యలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే.. కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పుతిన్ ఆరోపణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందిస్తూ.. మాస్కో మారణహోమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు తమకు లేదన్నారు. -
మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ఉగ్రవాదులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం(మార్చి 24) వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్‌కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్‌కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఇదీ చదవండి.. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం -
USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ‘ఒబామా ఐసిస్ ఫౌండర్. ఐసిస్ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్’ అని వీడియోలో ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్ స్పందన అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్ మాట్లాడిన వీడియో కాదని తేలింది. ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. Big Statement By Donald Trump. He said, "Obama is the fuckin founder of ISIS. I'll never let you go Obama "#Russia #Moskau #MoscowAttack pic.twitter.com/4dRJRY5Phu — Umair Ali (@UmairAli_7) March 23, 2024 ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్‌కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్‌కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్‌ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్‌లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్‌లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్‌ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్‌స్‌్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్‌కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్‌తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
మాస్కో మారణకాండలో 115 చేరిన మృతుల సంఖ్య, 11 మంది అరెస్ట్
రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్రాకస్ సిటీ కన్టర్ట్ హాల్లో శుక్రవారం ఐసిస్ తీవ్రవాదులు ఒడిగట్టిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 115 చేరింది. 145 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి 11 మందిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రషన్స్ శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్‌స్టెయిన్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తులు పారిపోయారని.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో కారును వెంబడించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల కారులో పిస్టల్, అసాల్ట్ రైఫిల్‌కు సంబంధించిన మ్యాగజైన్, తజకిస్థాన్‌కు చెందిన పాస్‌పోర్ట్‌లు లభించాయని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కాలినడకన సమీపంలోని అడవిలోకి పారిపోయారని పేర్కొన్నారు. అనంతరం వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా పశ్చిమ మాస్కోలోని కాన్సర్ట్ హాల్లోకి దుండగులు విరుచుకుపడి కాల్పులు జరిపిన జరిపిన సంగతి తెలిసిందే. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. చదవండి: మాట మార్చిన మాల్దీవులు.. భారత్ ఎప్పుడూ మిత్రుడే అంటూ.. -
మాస్కోలో ఉగ్రదాడి.. రష్యాకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లో ఐసిస్ ఉగ్రసంస్థ పాల్పడిన ఘాతుకాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. రష్యాకు, అక్కడి ప్రజలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ‘మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మా ఆలోచనలు, ప్రార్ధనలు ఎప్పటికీ వారి కోసం ఉంటాయి. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సైనిక దుస్తుల్లో కన్సర్ఠ్ హాల్లోకి చొచ్చుకొని వచ్చిన దుండగులు.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ భయంకర ఘటనలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. చదవండి: మాస్కో దాడులు: ముందే హెచ్చరించిన అమెరికా ! We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the victims. India stands in solidarity with the government and the people of the Russian Federation in this hour of grief. — Narendra Modi (@narendramodi) March 23, 2024 -
మాస్కో ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన అమెరికా !
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించే అవకాశాలున్నట్లు ముందే హెచ్చరించామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఆడ్రియెన్ వాట్సన్ వెల్లడించారు. ‘ఈ నెల మొదట్లో అమెరికా ప్రభుత్వానికి మాస్కో ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అందింది. ప్రజలు గుమిగూడి ఉన్న ప్రదేశాల్లో ఈ దాడి జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో వెంటనే రష్యాలో ఉన్న అమెరికాన్లకు అడ్వైజరీ కూడా జారీ చేశాం. డ్యూటీ టు వార్న్ పాలసీ కింద ఇదే విషయాన్ని రష్యా ప్రభుత్వంతోనూ పంచుకున్నాం’అని వాట్సన్ తెలిపారు. మాస్కో శివార్లలో ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు గ్రెనేడ్ కూడా విసిరారు. ఈ కాల్పుల్లో 62 మంది మృతి చెందగా మరో 100 మంది దాకా గాయపడ్డారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
Russia: మాస్కోలో ఐసిస్ భారీ ఉగ్రదాడి
మాస్కో: రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా, వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు. మాస్కో శివారులోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో సైనిక దుస్తుల్లో కాన్సర్ట్హాల్లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థకాక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటికొచ్చాయి. Horrifying visuals of the terror attack coming out of Moscow. The carnage is unimaginable. Devastating to say the least. This world needs peace and sanity. pic.twitter.com/sWFc4mTjVK — Supriya Shrinate (@SupriyaShrinate) March 22, 2024 The scary footage where people are running during the attack.#Moscou #Moskou #CrocusCityHall #Moscow #Russia #terrorist pic.twitter.com/gJchCa8zrU — Reality Talks (@RealityTallk) March 23, 2024 Very sad to hear what happened in #Moscow Praying for them 💔 pic.twitter.com/UUMcl9RsmI — Follow Back (@FzlMah) March 22, 2024 దాడి సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు. దాడి మా పనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ISIS-Islamic State of Iraq and Syria) మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
పుతిన్ ప్రేమలో పడ్డారా? ఆమెతో సన్నిహితంగా!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక మిస్టరీగా ఉంటుంది. 71 ఏళ్ల పుతిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. అయతే తాజాగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకంటే 32 ఏళ్ల చిన్న వయస్సు గల ఎకటెరినా మిజులినాతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తోంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. 39 ఏళ్ల ఎకటెరినా మిజులినాతో పుతిన్ ప్రేమాయానం కొనసాగిస్తున్నారని ఓ కథనాన్ని ప్రచురించింది. ఎకటెరినా మిజులినా ఒక చరిత్రకారిణి. రష్యా అనుకూల సేఫ్ ఇంటర్నెట్ లీగ్ సంస్థకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను సెన్సార్ చేస్తూ ఉంటుంది. రష్యాకు వ్యతిరేకంగా ఆన్లైన్ వ్యాపించే వ్యతిరేకమైన కంటెంట్‌ను నిషేధిస్తుంది. ఎకటెరినా మిజులినా.. 69 ఏళ్ల సెనేటర్ ఎలెనా మిజులినా కుమార్తె. ఎలెనా మిజులినాకు అధ్యక్షుడు పుతిన్ బలమైన మద్దతుదారు అనే పేరుంది. ‘అందమైన బార్బీ బొమ్మలాంటి ఆకర్షించే రూపాన్ని కలిగిన ఉన్న మిజులినా అధ్యక్షుడు పుతిన్ పట్ల అభిమానం, విధేయత కలిగి ఉంటారు. ఎకటెరినా మిజులినా.. అధ్యక్షుడు పుతిన్‌కు సరైన జోడి. పుతిన్ అభిరుచికి అనుగుణంగా ఎకటెరినా ఉంటుంది’అని రష్యన్ మానవ హక్కుల కార్యకర్త ఓల్గా రొమానోవా ఉక్రెయిన్ న్యూస్ చానెల్‌కు తెలిపారు. మిజులినా.. 2004లో లండన్ విశ్వవిద్యాలయం కళా చరిత్ర, ఇండోనేషియా భాషలో పట్టభద్రులయ్యారు. 2017లో సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌లో చేరడానికి ముందు చైనాను సందర్శించే అధికారిక రష్యన్ ప్రతినిధుల బృందానికి అనువాదకురాలిగా పనిచేశారు. రహస్య ప్రేయసి అలీనా కబయేవా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఓ రహస్య ప్రేయసి ఉందని, ఆమె పేరు అలీనా కబయేవా అని, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్ నడిచింది. అలీనా కబయేవా.. గతంలో జిమ్నాస్ట్‌గా ఉండేది. పుతిన్ విడాకుల తర్వాత ఆయనతో చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్‌గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్ చూపిస్తోందని వార్తలు వచ్చాయి. చదవండి: Vladimir Putin Secret Lover: పుతిన్ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది? -
Russia-Ukraine War: మాస్కోపై డ్రోన్ల దాడి
మాస్కో: మాస్కో లక్ష్యంగా డజన్ల కొద్దీ డ్రోన్లతో ఉక్రెయిన్ ఆదివారం దాడికి యత్నించినట్లు రష్యా ఆరోపించింది. శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి రష్యా 60కి పైగా డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆదివారం మాస్కో పరిసర ప్రాంతాలపైకి దూసుకొచి్చన 24 వరకు ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది. మాస్కోలోని మూడు వేర్వేరు చోట్ల జరిగిన డ్రోన్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని గవర్నర్ ఆండ్రీ ఒవొబియెవ్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన ఉన్న తుల నగరంలోని 12 అంతస్తుల అపార్టుమెంట్‌ను ఒక డ్రోన్ ఢీకొట్టగా ఒకరు గాయపడినట్లు సమాచారం. -
సుదీర్ఘ అంతరిక్షయాత్ర చేసి సురక్షితంగా భూమికి
మాస్కో: నాసాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, రోస్కోస్మొస్‌కు చెందిన మరో శాస్త్రవేత్త సుదీర్ఘ అంతరిక్ష యాత్రను ముగించుకుని క్షేమంగా భూమికి చేరారు. వీరు ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్ సోయుజ్ ఎంఎస్-23 కజకిస్తాన్‌లోని జెజ్‌కజ్‌గాన్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రోస్కోస్మొస్ వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్ రూబియో సెప్టెంబర్ 21, 2022లో సోయుజ్ ఎంఎస్-23 స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు చేరిన విషయాన్ని రోస్కోస్మొస్, నాసా సంస్థలు ధృవీకరించాయి. రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిముషాలు గడిపినట్లు ప్రకటించగా నాసా తమ వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూబియో 371 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. వాస్తవానికి వీరు ఆరు నెలల క్రితమే భూమికి చేరుకోవాల్సి ఉండగా చిన్న ఉల్క తాకిడికి స్పేస్‌క్రాఫ్ట్‌లో లీక్ చోటుచేసుకోవడంతో అది సాధ్యపడలేదు. సిబ్బంది లేకుండా మాస్కో మరో రాకెట్ పంపడంతో దానిలో ముగ్గురు వ్యోమగాములు తిరుగుప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 27, 2023కి భూమికి చేరుకొని కజకిస్తాన్‌లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. #SoyuzMS23Landing@roscosmos cosmonauts and commander of the Soyuz-MS23 spaceship 👨🏻🚀Sergey Prokopyev is out from the spacecraft. pic.twitter.com/vHbeOpSBr4 — The Space Pirate🥷🏻👨🏻🚀 💫🪐🚀 (@TheSpacePirateX) September 27, 2023 🇺🇸🇸🇻 | El astronauta Frank Rubio, estadounidense de origen salvadoreño, se vio obligado a quedarse en órbita debido a una falla en su nave. Ahora, tras 371 días y 5.963 vueltas alrededor de la Tierra, su nave ha aterrizado y reunirá con su familia. pic.twitter.com/VezH1FHdV4 — El Salvador Avanza (@SvAvanza) September 27, 2023 ఇది కూడా చదవండి: USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు -
రష్యాలో భారీ పేలుడు.. 35 మంది మృతి
మాస్కో: ఒకపక్క ఉక్రెయిన్‌తో జరుగుతున్న ఒకపక్క ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో రష్యా తలమునకలై ఉండగా అంతలోనే మరో ఊహించని విపత్తు ఎదురైంది. కాకసాన్ రిపబ్లిక్ అఫ్ దగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. దగెస్తాన్ రిపబ్లిక్‌లోని ఓ గ్యాస్ స్టేషన్లో సంభవించిన భారీ పేలుడులో 35 మంది చనిపోగా మరో 115 మంది క్షతగాత్రులయ్యారు. దగెస్తాన్ రాజధాని మఖాచ్కాలా శివారులో సోమవారం రాత్రి ఈ పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో 16 మంది చిన్నారులు సహా 65 మందిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొదటగా కారు రిపేరు షెడ్డులో ప్రారంభమైన మంటలు సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు పాకడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు వివరించారు. ఇటీవలి కాలంలో రష్యాలో సంభవించిన అతిపెద్ద పేలుడు ఘటన ఇదే. Dozens of people were killed in Russia's Dagestan region after a fire started at an auto repair shop on a highway and spread to a nearby gas station, officials said https://t.co/u8pA5Iyopa pic.twitter.com/GvHMhlYGMy — Reuters (@Reuters) August 15, 2023 ఇది కూడా చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే -
క్రిమియాలో 20 డ్రోన్లు కూల్చివేశాం: రష్యా
కీవ్: ఆక్రమిత క్రిమియాపై డ్రోన్ల దాడిని తిప్పికొట్టినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ప్రయోగించిన సుమారు 20 డ్రోన్లను కూల్చివేసినట్లు శనివారం రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇందులో 14 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేయగా మరో ఆరింటిని జామర్లు నిర్వీర్యం చేశాయని వెల్లడించింది. ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ స్పందించలేదు. వరుసగా మూడు రోజులుగా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులు జరగడంతో రష్యా అప్రమత్తమైంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతానికి చెందిన ఉరోజ్హయిన్ అనే గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా శనివారం ప్రకటించుకుంది. ఖర్కీవ్, జపొరిజియా ప్రాంతాలతోపాటు, అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణం క్రివ్విరిహ్ల్లో జరిగిన రష్యా బాంబు దాడుల్లో ఇద్దరు చనిపోగా మరో 16 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ యంత్రాంగం తెలిపింది.