15 ఏళ్ల తర్వాత మాస్కోకు విమాన సర్వీస్
ముంబై: ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు 15 ఏళ్ల తర్వాత మాస్కోకు విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ నెల 18న న్యూఢిల్లీ-మాస్కో నాన్ స్టాప్ విమాన సర్వీస్‌ను ఆరంభించామని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రోహిత్ నందన్ తెలిపారు. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ సెక్టర్‌లో విమాన సర్వీస్ కోసం బీ787 డ్రీమ్‌లైనర్‌ను కేటాయించామని, ఆకర్షణీయమైన ఆఫర్లనందిస్తున్నామని వివరించారు. నిర్వహణ కారణాల వల్ల 15 ఏళ్లుగా నిలిపేసిన ఈ సర్వీస్‌ను ఈ ఏడాది మార్చిలోనే ప్రారంభించాలని ప్రయత్నాలు చేశామని పేర్కొన్నారు. ప్రతీ నెలా ఇరు దేశాల మధ్య 10 వేలమంది ప్రయాణిస్తున్నారని రోహిత్ నందన్ వివరించారు.