
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి అక్కడికి విమాన సర్వీసులు మొదలుపెడుతున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం ప్రకటించింది. తొలి విమానం డిసెంబర్ 30న ప్రయాణించనుంది.
జనవరి 16వ తేదీ నుంచి రోజువారీ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని సంస్థ ఎండీ అలోక్ సింగ్ చెప్పారు. ఇండిగో కూడా జనవరి 6 నుంచి అయోధ్యకు రోజువారీ విమాన సర్వీసులను మొదలు పెట్టనుంది. అయోధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మాణం నెలాఖరులోగా పూర్తవనుంది. దాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment