Air Services
-
వైజాగ్‌పై చంద్రబాబు సర్కారు శీతకన్ను!
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక రాజధానిగా భాసిల్లుతూ.. నిన్నటిరవకు కార్యనిర్వాహక రాజధానిగా ఎదిగిన విశాఖపట్నం నగరాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఓ పక్క విశాఖపై చాలా ప్రేమ ఉందని చెబుతూనే, మరోపక్క ఈ మహా నగరం అభివృద్ధిని అడ్డుకుంటోంది. అన్ని రకాల సౌకర్యాలను విశాఖపట్నం ప్రజల నుంచి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆర్బీఐ రీజనల్ కార్యాలయం ఏర్పాటవుతుందన్న తరుణంలో దాన్ని విజయవాడకు పట్టుకుపోయిన చంద్రబాబు సర్కారు.. చివరకు విమాన సర్వీసులనూ తరలించేస్తోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందుకొస్తుంటే.. ఆ సర్వీసులను విజయవాడ నుంచి నడపాలంటూ ఒత్తిడి తెస్తోంది. దీంతో ఎటూ తేల్చుకోలేక విమానయాన సంస్థలు అసలు ఏపీ నుంచి సర్వీసులు నడపాలా వద్దా అన్న సందిగ్ధంలో పడుతున్నాయి. స్లాట్లపై నౌకాదళం ఆంక్షలతో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వివక్షతో విశాఖ విమానాశ్రయం అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రయాణికులతో పాటు కార్గోలోనూ అపారమైన వృద్ధి సామర్థ్యం ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం మానేసి.. కొత్త సర్వీసుల్ని కూడా విజయవాడకు మళ్లిస్తోంది. ఎమిరేట్స్‌పై ఒత్తిడి? మిడిల్ ఈస్ట్ దేశాలకు సర్వీసులు నడిపేందుకు విశాఖ ఉత్తమ ప్రాంతంగా విమానయాన సంస్థలు భావిస్తుంటాయి. వివిధ దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ అవకాశాలు కూడా వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎమిరేట్స్ కూడా ఏపీ నుంచి దుబాయ్‌కు సర్వీసు నడిపేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌పోర్టులను అధ్యయనం చేసింది. విశాఖే అనుకూలంగా ఉందని భావించింది.అయితే.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నుంచి కాకుండా విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్టు) నుంచి దుబాయ్‌కి సర్వీసు నడపాలంటూ ఈ ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి షార్జాకు ఓ సర్వీసు నడుపుతోంది. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు రెండో సర్వీసు నడిపినా ఆక్యుపెన్సీకి అవకాశం లేదు. అయినా విశాఖపై కక్ష సాధింపుతో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ నుంచే నడపాలని అంటుండటంతో ఎమిరేట్స్ సంస్థ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం ఇలాగే ఒత్తిడి చేస్తే పూర్తిగా సర్వీసు రద్దు చేసే అవకాశం కూడా ఉందని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమిరేట్స్ సంస్థ పరిస్థితిని చూసిన ఇతర సంస్థలు ఏపీ నుంచి సర్వీసులు నడపడానికి వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో దుబాయ్‌కి విజయవంతంగా సర్వీసుకోవిడ్–19కి ముందు విశాఖ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ దుబాయ్‌కు ఏడేళ్ల పాటు సర్వీసుని నడిపింది. 80 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ సర్వీసు నడిచింది. ఇప్పుడూ ఇదే విధమైన డిమాండ్ ఉన్నప్పటికీ, దుబాయ్ సర్వీసును ప్రభుత్వం అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 180 సీటర్ ప్యాసింజర్ విమానానికి 2 టన్నుల కార్గోని కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ సర్వీసు విశాఖ నుంచి నడిస్తే 100 శాతం ఆక్యుపెన్సీతో పాటు రొయ్యలు, ఔషధాలు, దుస్తులు, ఇతర కార్గో ఎగుమతులకు కూడా అవకాశం ఎక్కువ ఉంది. ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు కార్గో అదనపు ఆదాయాన్నిస్తుంది. అందువల్ల విదేశీ సర్వీసులకు వైజాగ్ పూర్తి అనుకూలమని విమానయాన సంస్థలు భావిస్తున్నా, ప్రభుత్వం మోకాలడ్డడంపై విమర్శలు వస్తున్నాయి. -
మంచు ముద్దయిన కశ్మీరం!
శ్రీనగర్: కశ్మీర్లో శనివారం భారీగా మంచు కురిసింది. దీంతో స్థానికులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా సాధారణ జనజీవనానికి మాత్రం అవరోధం ఏర్పడింది. కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఒక మోస్తరు నుంచి భారీగా మంచు కురుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో, రైలు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మంచు కారణంగా కశ్మీర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. శనివారం సాయంత్రం కల్లా 90 శాతం వరకు ఫీడర్లలో సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అననుకూల వాతావరణం కారణంగా కశ్మీర్ విశ్వవిద్యాలయం శనివారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. శ్రీనగర్–సోనామార్గ్ హైవేపై రాకపోకలు నిలిచిపోవడంతో చిక్కుకుపోయిన పర్యాటకులకు గుండ్‌లోని మసీదులో స్థానికులు ఆశ్రయం కల్పించారు. సోనామార్గ్ నుంచి శుక్రవారం తిరుగుపయనమైన పంజాబ్‌కు చెందిన సుమారు డజను మంది శుక్రవారం రాత్రి మసీదులోనే గడిపారని స్థానికులు తెలిపారు. అదేవిధంగా, గండేర్బల్ జిల్లా కంగన్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులకు స్థానిక కుటుంబం ఆశ్రయం క ల్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దక్షిణ కశ్మీర్‌పై ఎక్కువ ప్రభావం దక్షిణ కశ్మీర్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో రెండడుగుల మేర మంచు కురిసిందని అధికారులు వివరించారు. బారాముల్లా జిల్లాలో 4 నుంచి 9 అంగుళాల మేర మంచు నమోదవగా గుల్మార్గ్లో 15 అంగుళాల మంచు కురిసింది. పుల్వామాలో 10 నుంచి 15 అంగుళాలు, పొరుగునే ఉన్న కుల్గామ్‌లో 18 నుంచి 25 అంగుళాలు, షోపియాన్‌లో 6 నుంచి 10 అంగుళాల మంచు పేరుకుపోయింది. శ్రీనగర్‌లో 8 అంగుళాల మేర మంచు కురియగా, పొరుగునే ఉన్న గందేర్బల్లో 7 అంగుళాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతం సోనామార్గ్‌లో 8 అంగుళాల మేర మంచు నమోదైందని అధికారులు చెప్పారు. పర్యాటక పట్టణం పహల్గామ్లో శనివారం 18 అంగుళాల మేర మంచు కురిసింది. అనంత్‌నాగ్ జిల్లాలో అత్యధికంగా 17 అంగుళాల హిమపాతం నమోదు కాగా శ్రీనగర్–లేహ్ రహదారి వెంట ఉన్న జోజిలాలో 15 అంగుళాలు, బుద్గాం జిల్లాలో 7 నుంచి 10 అంగుళాల మేర మంచు నమోదైంది. మైనస్‌కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు శ్రీనగర్‌లో గురువారం రాత్రి మైనస్ 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం రాత్రికి తీవ్రత తగ్గి మైనస్ 1 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుంది. స్కయింగ్కు పేరున్న ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్లో మైనస్ 5 డిగ్రీలు, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపున్న పహల్గామ్లో మైనస్ 2.8 డిగ్రీలుగా ఉంది. కశ్మీర్‌కు ముఖద్వారం వంటి క్వాజీగుండ్లో కనీస ఉష్ణోగ్రత మైనస్ 0.6 డిగ్రీలుగా నమోదవగా, పంపోర్ ప్రాంతంలోని కుగ్రామం కొనబాల్లో మైనస్ 1.5 డిగ్రీలుగా రికార్డయింది. కశ్మీర్ లోయలో అతి తీవ్రమైన చలికాలం ‘చిల్లాయ్–కలాన్’ఈ నెల 21 నుంచి మొదలైంది. దాదాపు 40 రోజులపాటు భారీగా మంచు కురియడంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా మైనస్ స్థాయికి పడిపోతాయి. జనవరి 30వ తేదీకల్లా ఈ తీవ్రత తగ్గుముఖం పట్టనుంది. అయితే, చలి గాలులు మాత్రం మరో 40 రోజుల వరకు కొనసాగుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి జమ్మూ–శ్రీనగర్ 44వ నంబర్ జాతీయ రహదారిని మంచు కారణంగా అధికారులు మూసివేశారు. నవ్యుగ్ టన్నెల్ వద్ద అతి భారీగా మంచు కురుస్తుండటంతో యంత్రాలతో మంచు తొలగింపు పనులకు అంతరాయం కలుగుతోందని ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. వాతావరణం మెరుగుపడి, రోడ్లు క్లియర్ అయ్యేదాకా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వాహనదారులను వారు కోరారు. పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో అధికారులు ముందు జాగ్రత్తగా బనిహాల్–బారాముల్లా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. ట్రాక్‌ను క్లియర్ చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు. రన్‌వేను క్లియర్ చేసే పనులు చేపట్టామని, వాతావరణం అనుకూలిస్తేనే విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి మొదలవుతాయన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం కోసం వైమానిక సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రాల్లోని ప్రధాన రహదారులు, ఆస్పత్రులకు దారి తీసే రోడ్లపై మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మంచు కారణంగా అంతర్గత రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. వాహనాలు జారుతున్నందున మంచులో డ్రైవ్ చేయడం కష్టసాధ్యమే కాదు, ప్రమాదకరమని హెచ్చరించారు. -
Hyderabad: ఫ్లైట్.. రైట్ రైట్
సాక్షి, సిటీబ్యూరో: ఫ్లైట్ కనెక్టివిటీ విస్తరిస్తోంది. హైదరాబాద్ నుంచి మరిన్ని కొత్త నగరాలకు విమాన సరీ్వసులు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి 7 ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ నగరాలకు సైతం కనెక్టివిటీ క్రమంగా పెరుగుతోంది. దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ముఖ ద్వారం కావడంతో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఎప్పటికప్పు డు ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్త నగరాలకు సరీ్వసులను విస్తరించేందుకు పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 10 రోజుల్లోనే 7 కొత్త సరీ్వసులు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన సరీ్వసులు అందుబాటులో ఉన్నాయి. గత నెలలో కేవలం 10 రోజుల్లో 7 కొత్త సరీ్వసులను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రాజ్‌కోట్, అగర్తలా, జమ్మూ, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా నగరాలకు సరీ్వసులు అందుబాటులోకి వచ్చాయి. కొత్త సర్వీసుల్లో ఆక్యుపెన్సీ సైతం సంతృప్తికరంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. రాజ్‌కోట్‌కు ప్రతిరోజూ ఫ్లైట్ సర్వీసును ఏర్పాటు చేశారు. అగర్తలాకు వారానికి 3 సర్వీసులు నడుస్తున్నాయి. జమ్మూ కశీ్మర్‌కు ప్రారంభించిన విమాన సర్వీసులకు పర్యాటకుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి జమ్మూకు వారానికి మూడు సర్వీసుల చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో డొమెస్టిక్ కనెక్టివిటీ 69 నుంచి 76 నగరాలకు పెరిగినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. నిత్యం 60 వేల మంది ప్రయాణం.. 👉 ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 60 వేల మంది దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగిస్తుండగా.. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, కోల్‌కతా నగరాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. 👉 గోవా, విశాఖ, కొచ్చిన్, తిరుపతి, అహ్మదాబాద్ నగరాలకు సైతం హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అయోధ్యకు పెరిగిన భక్తులు.. బాలరాముడు కొలువుదీరిన అయోధ్య రామజన్మభూమి ఆలయానికి నేరుగా రాకపోకలు సాగించేందుకు విమాన సరీ్వసులు లేకపోవడంతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. రైళ్లలో రద్దీ, సుదీర్ఘమైన ప్రయాణ సమయంతో ఒక్క అయోధ్య పర్యటనకే కనీసం మూడు నాలుగు రోజుల పాటు కేటాయించాల్సి వచ్చేది. మందిరం ప్రారంభించిన తర్వాత అన్ని వైపుల నుంచి భక్తుల రద్దీ పోటెత్తింది. కానీ ఇందుకనుగుణంగా ప్రయాణసదుపాయాలు మాత్రం విస్తరించలేదు. గత నెల 27వ తేదీ నుంచి సరీ్వసులు ప్రారంభమయ్యాయి. అయోధ్యతో పాటు భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రయాగ్‌రాజ్‌కు కూడా గత నెలలోనే విమాన సరీ్వసులు ప్రారంభమయ్యాయి. పర్యాటకుల డిమాండ్ ఎక్కువగా ఉన్న ఆగ్రాకు సైతం గత నెల 28 నుంచి సరీ్వసులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ విస్తరణ..హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం 18 అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 15 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా జర్మనీకి సరీ్వసులు ప్రారంభమయ్యాయి. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సర్వీసులు వారానికి 5 చొప్పున హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే బ్యాంకాక్, రియాద్, జెడ్డా, తదితర నగరాలకు సర్వీసులు పెరిగాయి. ఈ ఏడాది చివరి వరకు మరిన్ని నగరాలకు కొత్తగా సరీ్వసులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, డల్లాస్, మెల్బోర్న్, సిడ్నీ, పారిస్, ఆమ్స్టర్డ్యామ్ తదితర నగరాలకు కొత్తగా సరీ్వసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం దుబాయ్, సింగపూర్, అబుదాబి, లండన్ నగరాలకు ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. -
ముంబై–విజయవాడ విమాన సర్విస్ ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)కు ఎయిరిండియా విమాన సర్వీస్ శనివారం ప్రారంభమైంది. ముంబై నుంచి 148 మంది ప్రయాణికులతో ఎయిర్‌బస్ ఎ320 విమానం సాయంత్రం 5.45 గంటలకు విజయవాడ చేరుకుంది. ఈ విమానానికి ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళం వాటర్ కానన్‌తో ఘన స్వాగతం పలికింది. తొలుత విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లో ఎయిరిండియా సంస్థ ముంబై విమాన సర్విస్ ప్రారం¿ోత్సవ వేడుక నిర్వహించగా.. ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. ముంబై–విజయవాడ మధ్య విమాన సర్విస్లు నడిపేందుకు ఎయిరిండియా ముందుకురావడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో కోల్‌కతా, వారణాసి, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంకకు విమాన సర్విస్లు నడపాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ఢిల్లీకి మరో రెండు సర్వీస్‌లు నడపాలని ఇండిగో, విస్తారా సంస్థలను కోరినట్లు తెలిపారు. అనంతరం విజయవాడ నుంచి విమానం 131 మంది ప్రయాణికులతో రాత్రి 7.10 గంటలకు ముంబైకి బయలుదేరివెళ్లింది.సీఐఎస్ఎఫ్కు గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యతజూలై 2వ తేదీ నుంచి అమలు విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) కట్టుదిట్టమైన కేంద్ర బలగాల భద్రత వలయంలోకి వెళ్లనుంది. ఇప్పటివరకు రాష్ట్ర పోలీస్ శాఖలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఈ ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యతను చూస్తోంది. జూలై రెండో తేదీ నుంచి ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు అప్పగించనున్నారు. ఈ మేరకు విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఎయిర్‌పోర్టుకు 2017, మే మూడో తేదీన అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు లభించింది. అప్పట్లోనే ఎయిర్‌పోర్టు భద్రత బాధ్యతను సీఐఎస్ఎఫ్కు అప్పగించేందుకు ప్రయత్నించారు. సరైన వసతి సదుపాయాలు లేవనే కారణంతో సీఐఎస్ఎఫ్ అధికారులు ఇక్కడికి వచ్చేందుకు నిరాకరించారు. అయితే, ఎయిర్‌పోర్టులో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, భద్రత ప్రమాణాల దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సీఐఎస్ఎఫ్తో జరిపిన సంప్రదింపులు సఫలీకృతమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతను జూలై రెండో తేదీ నుంచి సీఐఎస్ఎఫ్కు అప్పగిస్తూ విమానాశ్రయం డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీఐఎస్ఎఫ్ దళానికి వసతి కోసం ప్రస్తుతం ఉన్న బ్యారక్‌లను, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పాత క్వార్టర్స్‌ను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై ఎయిర్‌పోర్టు భద్రత పూర్తిగా సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. -
హైదరాబాద్ - అయోధ్య విమానాలు బంద్
హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీస్‌ను స్పైస్‌జెట్ ఈ నెల 1 నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ మార్గంలో విమాన సేవలను కంపెనీ రెండు నెలల క్రితం ప్రారంభించింది. వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్‌జెట్ విమానాలు నడిపింది. అయితే ప్రస్తుతం తగినంత గిరాకీ లేకపోవడంతో, ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.స్పైస్‌జెట్ అయోధ్యకు తన మొదటి విమానం SG 611 ఏప్రిల్ 2న ప్రారంభించింది. ఇది ఆ రోజు ఉదయం 10.45 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి 12:45 గంటలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో SG 616 అయోధ్య నుంచి 1 గంటకు బయలుదేరి 3:25 pmకి తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. ఈ విధంగా వారంలో మూడు సార్లు స్పైస్‌జెట్ ఈ సర్వీస్ కొనసాగించింది.మార్చి 31న, అప్పటి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి, హైదరాబాద్, అయోధ్యలను అనుసంధానించాలని అభ్యర్థిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రికి రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ - అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసు లేకపోవడం భక్తులకు ఓ సవాలుగా మారిందని పేర్కొన్నారు.ఫిబ్రవరి నాటికి స్పైస్‌జెట్ ఎనిమిది భారతీయ నగరాలను అయోధ్యకు సర్వీస్ ప్రారంభించింది. ప్రస్తుతం స్పైస్‌జెట్ అహ్మదాబాద్, ఢిల్లీల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలను నడుపుతోంది. అయోధ్య రామమందిరం ప్రారంభమైన తరువాత వేగంగా పుంజుకున్న పర్యాటకం క్రమంగా క్షిణించింది. దీంతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గింది. స్పైస్‌జెట్ తన సర్వీసులను కూడా తగ్గించింది. -
విదేశాలకు ఆకాశ ఎయిర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ సరీ్వసులు నడిపేందుకు రెడీ అయింది. ముంబై నుంచి దోహాకు తొలి అంతర్జాతీయ సర్వీ సు మార్చి 28న ప్రారంభం కానుంది. వారంలో నాలుగు నాన్–స్టాప్ ఫ్లైట్స్ నడుపనుంది. 2022 ఆగస్ట్ 7న ఆకాశ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభించింది. కంపెనీ వద్ద బోయింగ్ 737 మ్యాక్స్ రకం 23 విమానాలు ఉన్నాయి. 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు 2024 జనవరిలో ఆర్డర్ ఇచి్చంది. -
Vizag : పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
విశాఖపట్నం: పొగమంచు కారణంగా విశాఖ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. విశాఖపట్నం నుంచి వేర్వేరు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుంటున్నా.. వాతావరణం అనుకూలించక కొన్ని సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం.. మరో రెండు రోజులు ఉండనున్న దృష్ట్యా మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రద్దు అయిన ఫ్లైట్ వివరాలు: 1) 6E6336/5309 VOBL-VOVZ-VOBL 2) 6E626/783 HS-VOVZ- HS 3) 6E5176/2776 DP-VOVZ-DP. ఈరోజు రద్దయిన విమానాల వివరాలు... 1) బెంగళూరు నుంచి..విశాఖపట్నం. విశాఖ టు బెంగళూర్.. 6E6336/5309 VOBL-VOVZ-VOBL 2) హైదరాబాద్. టు. విశాఖపట్నం. విశాఖ టు. హైదరాబాద్.. 6E626/783 HS-VOVZ- HS 3) ఢిల్లీ. టు. విశాఖపట్నం అండ్ ఢిల్లీ.. 6E5176/2776 DP-VOVZ-DP. -
ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి అక్కడికి విమాన సర్వీసులు మొదలుపెడుతున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం ప్రకటించింది. తొలి విమానం డిసెంబర్ 30న ప్రయాణించనుంది. జనవరి 16వ తేదీ నుంచి రోజువారీ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని సంస్థ ఎండీ అలోక్ సింగ్ చెప్పారు. ఇండిగో కూడా జనవరి 6 నుంచి అయోధ్యకు రోజువారీ విమాన సర్వీసులను మొదలు పెట్టనుంది. అయోధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణం నెలాఖరులోగా పూర్తవనుంది. దాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. -
రైళ్లు, విమానాల రాకపోకలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాన్ ప్రభావంతో మంగళవారం కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రూట్లలో పరిమితంగా సర్విసులను పునరుద్ధరించారు. ముంబయి మీదుగా చెన్నైకి వెళ్లే కొన్ని రైళ్లను ఇతర మార్గాల్లో మళ్ళించారు. ఈ నెల 8వ తేదీ వరకు వివిధ మార్గాల్లో సుమారు 120 రైళ్లను రద్దు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాన్ తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకొంటే రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, భువనేశ్వర్, కోల్‌కతా, తదితర ప్రాంతాలకు వెళ్లే రైలు మార్గాల్లో వరదల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలపై వరదనీటిని తొలగించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రాత్రింబవళ్లు విధులను నిర్వహిస్తున్నారని వివరించారు. రాకపోకలు నిలిచిన రైళ్ళు ఇవే: కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్–తాంబరం, సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి. సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె. చెన్నై–హైదరాబాద్, సింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రమ్ తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ రూట్లో రైలు సర్విసులు పునరుద్ధరణ: తిరుపతి–సికింద్రాబాద్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–గూడూరు రూట్లలో కొన్ని సర్విసులను పునరుద్ధరించినట్లు అధికారులు పేర్కొన్నారు. తుపాన్ కారణంగా రద్దయిన రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులు రైళ్ల పునరుద్ధరణకు అనుగుణంగా తిరిగి తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 20 విమాన సర్విసులు రద్దు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 20 దేశీయ విమాన సర్విసులు నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, రాజమండ్రి, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు బయలుదేరే విమానాలను వాతావరణ ప్రభావం కారణంగా అధికారులు రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావలసిన విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు రైళ్లతో పాటు విమానాలు కూడా రద్దవడంతో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. -
విశాఖకు కొత్త విమాన సర్వీసులు
స్పైస్ జెట్ నడపనున్న విమానాల సంఖ్య : 5 ఎప్పటి నుంచి : జనవరి ఎక్కడెక్కడకు...: హైదరాబాద్, కోల్‌కతా,జార్సిగుడలకు డైలీ చెన్నై, బెంగళూరుకు వారంలో మూడు,నాలుగు రోజులు ఇండిగో నడపనున్న విమానాలు : 2 ఎప్పటి నుంచి : నవంబరు 15 నుంచి కోల్‌కతాకు, 16 నుంచి బెంగళూరుకు.. ఎక్కడెక్కడకు...: కోల్‌కతా, బెంగళూరులకు డైలీ సర్వీసులు సాక్షి, విశాఖపట్నం: విశాఖకు కొత్త విమాన సర్వీసులు రానున్నాయి. ఒకవైపు ప్రయాణికుల రద్దీ అధికమవుతుండడం, మరోవైపు పరిపాలనా రాజధాని కానుండడంతో విమానయాన సంస్థలు విశాఖ వైపు ఆసక్తి చూపుతున్నాయి. విశాఖపట్నానికి స్పైస్ జెట్ ఐదు, ఇండిగో సంస్థ రెండు విమాన సర్వీసులు నడపడానికి అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ విమానాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలతో పాటు ఒడిశాలోని జార్సిగుడ ఎయిర్‌పోర్టుకు కూడా నడపడానికి సంబంధిత సంస్థలు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. వీటిలో స్పైస్ జెట్ హైదరాబాద్, కోల్‌కతా, జార్సిగుడలకు డైలీ, చెన్నై, బెంగళూరులకు వారంలో మూడు, నాలుగు రోజులు చొప్పున నడపనుంది. అలాగే ఇండిగో సంస్థ కోల్‌కతా, బెంగళూరులకు రోజూ తమ విమానాలను నడపాలని నిర్ణయించింది. స్పైస్ జెట్ సంస్థ జనవరి నుంచి విశాఖకు తమ సర్వీసులను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇండిగో సంస్థ నవంబర్ 15 నుంచి కోల్‌కతాకు, 16 నుంచి బెంగళూరుకు నడపనుంది. కోల్‌కతా సర్వీసు సాయంత్రం 6.55 గంటలకు, బెంగళూరు సర్వీసు ఉదయం 10.30 గంటలకు బయలుదేరనుంది. కాగా ఈ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల రద్దీ కోవిడ్‌కు ముందు పరిస్థితికి చేరుకుంటోంది. కోవిడ్‌కు ముందు ఏటా 2.85 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యకు దానికి చేరువలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకు అది 3 మిలియన్లకు చేరుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిసారిగా జార్సిగుడకు.. ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జార్సిగుడకు విమాన సర్వీసులు లేవు. తొలిసారిగా స్పైస్ జెట్ సంస్థ పారిశ్రామిక ప్రాంతమైన జార్సిగుడకు విమాన సర్వీసును నడపాలన్న నిర్ణయం తీసుకుంది. విశాఖ–జార్సిగుడల మధ్య ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉందన్న అంచనాతో స్పైస్ జెట్ తమ విమానాన్ని నడపడానికి ముందుకొచ్చింది. శ్రీలంక–విశాఖల సర్వీసు పునరుద్ధరణ మరోవైపు శ్రీలంక–విశాఖల మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసుమళ్లీ పునరుద్ధరణ కానుంది. 2017లో కొలంబో–విశాఖ మధ్య శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే కోవిడ్ సమయంలో ఈ సర్వీసు రద్దు అయింది. త్వరలోనే ఆ విమాన సరీ్వసును పునరుద్ధరించనున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విశాఖ నుంచి సింగపూర్‌కు ఒకే ఒక్క అంతర్జాతీయ విమాన సర్వీసు నడుస్తోంది. గతంలో బ్యాంకాక్, దుబాయ్‌లకు కూడా ఇక్కడ నుంచి నడిచేవి. త్వరలో కొలంబో సర్వీసును కూడా పునరుద్ధరిస్తే ఈ ఎయిర్‌పోర్టు నుంచి రెండు అంతర్జాతీయ సర్వీసులు నడిచినట్టవుతుంది. -
కొత్త మార్గాల్లో స్టార్ ఎయిర్ సర్వీసులు - ధరలు ఇలా!
బెంగళూరు: హైదరాబాద్–నాగ్‌పూర్–అజ్మీర్ రూట్లో సెప్టెంబర్ 30 నుంచి విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు సంజయ్ ఘొడావత్ గ్రూప్‌లో భాగమైన స్టార్ ఎయిర్ తెలిపింది. ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించిన ఆర్సీఎస్–ఉడాన్ స్కీములో భాగంగా తమకు లభించిన 40 రూట్లలో ఇవి కూడా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్–నాగ్‌పూర్–అజ్మీర్ (కిషన్‌గఢ్) ఎకానమీ టికెట్టు ధర రూ. 5,499గా, బిజినెస్ క్లాస్ టికెట్టు రేటు రూ. 10,999గా ఉంటుంది. హైదరాబాద్–నాగ్‌పూర్ రూట్లో టికెట్ల రేట్లు వరుసగా రూ. 3,499 .. రూ. 8,999గా ఉంటాయి. -
సాంకేతిక సమస్యతో యూకేలో నిలిచిన విమానాలు
లండన్: సాంకేతిక సమస్య కారణంగా యూకేకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి ఇతరదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో, వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బ్రిటిష్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో సమస్య ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో భద్రతా నిర్వహణ కోసం ట్రాఫిక్‌పై నియంత్రణలను విధించినట్లు యూకే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తెలిపింది. అయితే, సమస్యకు కారణం, ఎప్పటివరకు పరిష్కారమవుతుందనే విషయం సంస్థ తెలపలేదు. సమస్యను సాధ్యమైనంత త్వరంగా పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు కృషి చేస్తున్నారని తెలిపింది. యూకే గగనతలాన్ని మాత్రం మూసివేయలేదని స్పష్టతనిచ్చింది. -
Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి
న్యూఢిల్లీ: కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలంటూ విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు .. పైలట్లు ..ఇతర సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు, నిధులు .. వర్కింగ్ క్యాపిటల్, లీజుదార్లతో ఒప్పందాలు తదితర వివరాలు అందులో పొందుపర్చాలని డీజీసీఏ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళికను సమీక్షించిన తర్వాత డీజీసీఏ తగు నిర్ణయం తీసుకోవచ్చని వివరించాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 2న స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా మే 3, 4 తారీఖుల్లో రద్దు చేసిన విమాన సేవలను ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించింది. ఈలోగా సర్వీసుల నిలిపివేతపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో మారటోరియం వ్యవధిని ఉపయోగించుకుని పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలంటూ గో ఫస్ట్ తన సమాధానంలో కోరింది. మరోవైపు లీజుదార్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గో ఫస్ట్ దివాలా పరిష్కార పిటిషన్‌ను అనుమతించాలని ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మే 22న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
మార్చి 26 నుంచి విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ముందుకురా వడంతోపాటు ప్రయాణ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్ 72–600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలుదేరి మూడు గంటలకు షిర్డీ చేరుకుంటుంది. అలాగే షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుతుందని ఇండిగో ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్ ధర రూ.4,246గా, షిర్డీ నుంచి ఇక్కడికి రూ.4,639గా నిర్ణయించారు. ఇప్పటివరకు షిర్డీ వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ సర్వీస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విజయవాడ నుంచి షిర్డీకి సుమారు 2.50 గంటల్లోనే చేరుకోవచ్చని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. -
ప్రయాణికులతో కళకళ
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) ప్రయాణికులతో కళకళలాడుతోంది. ఒకప్పుడు రోజుకు 56 దేశీయ విమాన సర్వీసులు, సగటున 3,300 మంది ప్రయాణికులతో కళకళలాడింది. కోవిడ్ కారణంగా మూడేళ్లుగా తగ్గుముఖం పట్టిన ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఆరునెలల్లో దేశీయంగా ప్రయాణికుల వృద్ధి గణనీయంగా నమోదవుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున 2,600 మందికిపైగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా సర్వీసులు పెంచడంతోపాటు కొత్త రూట్లలో సర్వీసులు అందుబాటులోకి వస్తే మరింత వృద్ధి సాధించే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 9 నెలల్లో 6,94,293 మంది ప్రయాణికుల రాకపోకలు ఈ విమానాశ్రయం నుంచి 2019–20లో రికార్డు స్థాయిలో దేశీయంగా 11,30,583 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అనంతరం కోవిడ్ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులతోపాటు ప్రయాణికుల రద్దీ తగ్గుముఖం పట్టడంతో ఆ సంఖ్య 2020–21లో 5,07,215 మందికి చేరుకుంది. 2021–22లో ప్రయాణికుల సంఖ్య 6,25,131 మందికి పెరిగింది. గతేడాదితో పోలిస్తే 2022–23లో తొలి తొమ్మిది నెలల్లోనే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ కాలంలో 6,94,293 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. నెలకు సగటున 77 వేలమందికిపైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశీయంగా రాకపోకలు సాగించారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు ప్రయాణికుల ట్రాఫిక్ పదిలక్షల మందికి చేరువయ్యే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడికి రోజుకు సుమారు 18 విమానాలు వస్తుండగా, 18 విమానాలు వెళుతున్నాయి. న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి, కడపకు డొమెస్టిక్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకు సర్వీసులు పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. గతంలో నడిపిన ముంబై, వారణాసి సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు షిర్డీకి సర్వీసులు నడపాలని కోరుతున్నారు. ఈ సర్వీసుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నుంచి పౌరవిమానయాన శాఖకు, ఎయిర్‌లైన్స్ సంస్థలకు కూడా ప్రతిపాదనలు వెళ్లాయి. -
హైదరాబాద్ టు బాగ్దాద్
శంషాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా బాగ్దాద్ వెళ్లేందుకు విమాన సర్వీసు ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.17 గంటలకు ‘ఫ్లై బాగ్దాద్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఐఎఫ్–462 టేకాఫ్ తీసుకుని తొలి విమానం బయలుదేరింది. హైదరాబాద్–బాగ్దాద్‌ల మధ్య వారానికి రెండు రోజులు ఈ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇక బాగ్దాద్ నుంచి వచ్చేవిమానం ప్రతి ఆదివారం ఉదయం 11.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మంగళవారం బాగ్దాద్ నుంచి వచ్చే విమానం ఉదయం 9.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు ఉదయం 10.55 కు ఇక్కడి నుంచి బాగ్దాద్ బయలుదేరుతుంది. పెరుగుతున్న మెడికల్ టూరిజం ఏటా ఇరాక్ నుంచి 10 శాతానికి పైగా మెడికల్ టూరిస్టులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని పర్యాటక మంత్రిత్వశాఖ చెబుతోంది. అంతేగాక ఇరాక్‌లోని బాగ్దాద్, కర్బలా ప్రాంతాలకు కూడా మనదేశం నుంచి పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించారు. -
ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480
ముంబై: రెండున్నరేళ్ల విరామం తర్వాత రాజధాని నగరం ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ-సిమ్లా మధ్య సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి ప్రతిరోజు ఈ సర్వీసు ఉంటుందని వెల్లడించింది. కేవలం రూ. 2,480 పరిచయ ధరను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఉదయం 6.25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 7.35 గంటలకు సిమ్లా జుబ్బర్హట్టి విమానాశ్రయానికి చేరుకుని తిరిగి 8 గంటలకు ఢిల్లీకి చేరుకుని 9.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని సంస్థ తెలిపింది. న్యూఇండియాను అనుసంధానించే క్రమంలో టైర్-2/టైర్-3 పట్టణాల మధ్య ఆయా సిటీ హబ్‌లతో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీని అందించే ప్రయత్నంలో ఢిల్లీ-సిమ్లా విమానాలను ప్రారంభించామని అలయన్స్ ఎయిర్ తెలిపింది. ఇది ఉత్తర భారతదేశంలో కనెక్టివిటీని విస్తరింప జేస్తుందని అలయన్స్ ఎయిర్ డిప్యూటీ ఇంజనీర్ యష్ వర్ధన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 6నుంచి ప్రతీ రోజూ విమానాలు నడుస్తాయన్నారు. కాగా ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ తొలిసారిగా 2017 జూలైలో విమానాన్ని నడిపింది. ఆ తర్వాత పలు కారణాలతో ఈ సర్వీసును నిలిపివేసింది. -
రివ్వున ఎగిరిపోతున్నారు..
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సంక్షోభం ఎదుర్కొన్న విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోంది. రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తిరుపతి, విశాఖపట్నం ఎయిర్‌పోర్టుల ద్వారా సాగిన ప్రయాణికుల రాకపోకల్లో దాదాపు 50 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది అక్టోబర్ నుంచి ఆంక్షలు లేని విమానయానానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రయాణికుల రాకపోకలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులైన విశాఖ, తిరుపతి, రాజమండ్రి, విజయవాడలలో ప్రతి చోటా వృద్ధి నమోదైంది. 2020–21తో పోలిస్తే.. 2021–22లో సాగిన ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి తిరుపతిలో 77 శాతం వృద్ధి నమోదవ్వగా.. విశాఖలో 45 శాతం, రాజమండ్రిలో 35, విజయవాడలో 23 శాతం వృద్ధి నమోదైంది. విశాఖ నుంచి అత్యధికంగా 16.10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. సర్వీసుల పెంపు, కార్గోలోనూ జోరు.. ప్రయాణికుల రాకపోకల్లోనే కాకుండా.. విమాన సర్వీసులు, కార్గో రవాణాలో కూడా ఎయిర్‌పోర్టులు పుంజుకున్నాయి. సర్వీసుల పెంపులోనూ తిరుపతి 43 శాతంతో ముందంజలో ఉండగా.. విశాఖ 28 శాతం వృద్ధి సాధించి రెండోస్థానంలో నిలిచింది. అత్యధిక విమాన సర్వీసులు నడుస్తున్న ఎయిర్‌పోర్టుగా మాత్రం విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులతో కలిపి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 2021–22లో మొత్తం 14,852 విమానాలు రాకపోకలు సాగించాయి. కార్గో సర్వీసుల్లో విశాఖ ఎయిర్‌పోర్టు 13 శాతం వృద్ధితో మొదటిస్థానంలో నిలిచింది. -
మే 3 నుంచి ఢిల్లీకి ఎయిరిండియా సర్వీస్
విమానాశ్రయం (గన్నవరం): సాంకేతిక కారణాల వల్ల 2 నెలలుగా నిలిచిపోయిన ఎయిరిండియా ఉదయం విమాన సర్వీస్‌ను మే 3వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ విమాన సర్వీస్‌కు సంబంధించి టికెట్ల బుకింగ్‌ను కూడా ఆ సంస్థ ప్రారంభించింది. ఈ విమానం ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 8.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.15 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుతుంది. జూన్ నుంచి ఈ సర్వీస్‌ను వారానికి 7 రోజుల పాటు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే న్యూఢిల్లీ–విజయవాడ మధ్య గతంలో రోజుకు 3 విమాన సర్వీస్‌లు నడిచేవి. కోవిడ్ ప్రభావం వల్ల సాయంత్రం విమాన సర్వీస్‌ను పూర్తిగా రద్దు చేశారు. 2 నెలలు క్రితం ఉదయం సర్వీస్ నిలిచిపోగా, ప్రస్తుతం రాత్రి సర్వీస్ మాత్రమే నడుస్తోంది. దీనివల్ల టికెట్ల రేట్లు గణనీయంగా పెరగడంతో పాటు ఇక్కడి నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎయిరిండియా సంస్థ ఉదయం సర్వీస్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
Covaxin : కేంద్రం ప్రకటన.. గల్ఫ్ వెళ్లేవారికి భరోసా
హైదరాబాద్: కోవాగ్జిన్ తీసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న వారికి భరోసా కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కోవాగ్జిన్ టీకా కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జులై 20న రాజ్యసభలో తెలిపారు. తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కోవాగ్జిన్ గుర్తింపుపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. సందేహాలు ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలలో కోవిషీల్డ్ కే గుర్తింపు ఉంది. డబ్ల్యూహెచ్ఓ అనుమతి వస్తేనే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి గల్ఫ్ దేశాలు అనుమతించే అవకాశం ఉంది. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న వారు తాము గల్ఫ్ దేశాలకు ఎప్పుడు వెళ్తామో ఏమో అనే సందేహాంలో ఉన్నారు. ఇప్పటికే నెలల తరబడి వర్క్‌కు దూరంగా ఉన్నామని,.. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులు పాలవుతామని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కేంద్రం చేసిన ప్రకటన వారికి భరోసా కలిగించింది. ఇలాగైతే కష్టం కోవిడ్ ఫస్ట్‌వేవ్ ముగిసిన తర్వాత గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న చాలా మంది భారతీయులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు సెలవులపై ఇంటికి వచ్చారు. వీరిలో చాలా మంది డిసెంబరు నుంచి మార్చి మధ్యలో ఇండియాకు చేరుకున్నారు. అయితే ఆ తర్వాత కోవిడ్ సెకండ్‌వేవ్ మొదలవడంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంతలో ఏప్రిల్ 25 నుంచి భారత్ - గల్ఫ్ దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే జులై 25 నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వార్తలు వస్తుండటంతో తిరిగి పనులకు వెళ్లేందుకు గల్ఫ్ కార్మికులు సిద్ధమవుతున్నారు. -
జూలై 20 నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్
విమానాశ్రయం (గన్నవరం): గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్ఇండియా సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా జూలై 20 నుంచి ఒమాన్ దేశ రాజధాని మస్కట్‌కు డైరెక్ట్ విమాన సర్వీస్‌ను ఎయిర్ఇండియా ప్రారంభించనుంది. ఎయిర్‌బస్ ఎ–321 విమానం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఒమాన్ దేశ కాలమానం ప్రకారం మస్కట్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని ఎయిర్ఇండియా వర్గాలు తెలిపాయి. వారంలో ఒక రోజు మాత్రమే నడిచే ఈ సర్వీస్‌కు సంబంధించి ఆ సంస్థ ఇప్పటికే ప్రయాణ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు టిక్కెట్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. -
విమానాలకు ఎదురుగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విమానయాన రంగానికి కోవిడ్ దెబ్బ గట్టిగానే తగిలింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2020–21లో రాష్ట్ర విమాన ప్రయాణికుల్లో ఏకంగా 57 శాతం క్షీణత నమోదైంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2020–21లో కోవిడ్ వల్ల విమాన సర్వీసులపై ఆంక్షలు ఉండటంతో ప్రయాణికులు స్వేచ్ఛగా ఎగరలేకపోయారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టుల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2019–20లో ఈ 5 ఎయిర్‌పోర్టుల నుంచి 51.65 లక్షల మంది ప్రయాణించగా.. అది 2020–21లో 22.27 లక్షలకు పరిమితమైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 34.10 కోట్ల నుంచి 11.53 కోట్లకు పడిపోయింది. రాష్ట్రంలోని ఐదు విమానాశ్రయాల నుంచి గతేడాది కేవలం 29,874 విమానాలు మాత్రమే ఎగిరాయి. అంతకుముందు ఏడాది 57,680 సర్వీసులతో పోలిస్తే 48.21 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల సంఖ్య 25.87 లక్షల నుంచి 11.96 లక్షలకు పరిమితమయ్యాయి. దేశీయ విమానయాన రంగం మెల్లగా కోలుకుంటోంది అనుకుంటున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఏడాది కూడా విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడిచే అవకాశాలు కనిపించడం లేదని విమానయాన సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. విశాఖకు ఆగిపోయిన విదేశీ విమానాలు.. రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నప్పటికీ.. కేవలం విశాఖకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తుండేవి. 2019లో విజయవాడ నుంచి సింగపూర్‌కు ఒక ఆరు నెలల పాటు వీజీఎఫ్ కింద విమాన సర్వీసులు నడిపారు. ఆ తర్వాత ఆ స్కీం ఆగిపోవడంతో.. విజయవాడకు అంతర్జాతీయ సర్వీసులు ఆగిపోయాయి. కోవిడ్ వల్ల అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఉండటంతో.. విశాఖకు వచ్చే విదేశీ విమానాల సంఖ్య భారీగా పడిపోయింది. 2019–20లో విశాఖకు 1,885 అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 89కి పరిమితమయ్యింది. గతంతో పోలిస్తే కేవలం 5 శాతం విదేశీ విమానాలు మాత్రమే గాలిలోకి ఎగిరాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య 95 శాతం క్షీణించి.. 1,43,535 నుంచి 7,581కి పడిపోయింది. విజయవాడకు విదేశీ విమానాల జోరు.. విజయవాడకు 2020–21లో భారీగా విదేశీ విమానాలు వచ్చి వాలాయి. 2019–20లో కేవలం సింగపూర్ నుంచి 52 సర్వీసులు నడవగా.. 2020–21లో ఏకంగా 40కిపైగా దేశాల నుంచి 560కి పైగా విదేశీ విమాన సర్వీసులు నడిచాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా 5,032 నుంచి 72,478కి పెరిగింది. లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమాన సర్వీసులు నడిపింది. మన రాష్ట్రానికి వచ్చే వారికోసం అత్యధిక సర్వీసులు విజయవాడ విమానాశ్రయానికి వచ్చాయి. -
నేడు కర్నూలు ఎయిర్‌పోర్టు ప్రారంభం
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 11.45 గంటలకు ముఖ్యమంత్రి కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ముందుగా జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.18కి ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. 12.22 గంటలకు ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడినుంచి తాడేపల్లి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా.. బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు. -
కర్నూలు ఎయిర్‌పోర్టుకు డీజీసీఏ అనుమతులు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కీలకమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులొచ్చాయి. విమాన సర్వీసులు ప్రారంభించడానికి అనుమతిస్తూ జనవరి 15న డీజీసీఏ ఉత్తర్వులిచ్చినట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఓర్వకల్లు విమానాశ్రయంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, వేగంగా నిధులు మంజూరు చేయడంతో స్వల్ప కాలంలోనే కీలకమైన అనుమతులు పొందగలిగినట్టు ఆయన తెలిపారు. గతేడాదే విమానాశ్రయ అభివృద్ధికి రూ.150 కోట్లు ఖర్చు చేయడం సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కర్నూలు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి మరింత పరుగులు పెట్టడంతో పాటు, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. ఎయిరొడ్రోమ్ లైసెన్స్‌తో పాటు, ఇతర అనుమతులు తీసుకురావడంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీఏడీసీ ఎండీ వీఎన్ భరత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ కృషిని మంత్రి గౌతమ్‌రెడ్డి కొనియాడారు. డీజీసీఏ జారీ చేసిన అనుమతి పత్రం -
చైనాకు గట్టి కౌంటరిచ్చిన భారత్..!
న్యూఢిల్లీ : చైనా పౌరులను భారత్ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి. కాగా గతంలో కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తరుణంలో భారత్ చైనాతో విమాన సర్వీసులను నిలిపివేసింది. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం పలు దేశాలతో భారత్ 2ఎయిర్ బబూల్స్’ తెరచడంతో ఆ దేశాల్లో నివసించే చైనా పౌరులు వ్యాపార, ఉద్యోగ పనుల కోసం భారత్ రావడానికి అవకాశం ఏర్పడింది. దీంతో చైనా పౌరులు భారతదేశంతో ఎయిర్ బబుల్ ఉన్న దేశాల ద్వారా పర్యాటక వీసాలను మినహాయించి నిర్దిష్ట రకాల వీసాలపై ఇండియకు రాకపోకలను కొనసాగిస్తున్నారు. నవంబర్ నుంచి భారత పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా చైనా కూడా నిషేధం విధించింది. కరోనా కారణంగా భారత్ సహా విదేశీ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ అప్పటికే మంజూరు చేసిన వాటిని రద్దుచేసింది. ‘చైనా రాయబార కార్యాలయం / కాన్సులేట్లలో పైన పేర్కొన్న వర్గాలకు వీసా లేదా నివాస అనుమతులకు సంబంధించి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయబోం’ అని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం నవంబర్ 5న తన వెబ్సైట్లో పేర్కొంది. చదవండి: 2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి మరో వైపు చైనా పౌరులు తమ విమానాల్లో భారత్‌లోకి ప్రయాణించవద్దని గతవారం రోజులుగా స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలు చెబుతున్నాయి. టూరిస్ట్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేయగా.. వ్యాపార, ఇతర విభాగాలకు చెందిన విదేశీ వ్యక్తులను నాన్-టూరిస్ట్ వీసాలపై అనుమతిస్తోంది. ఐరోపాలోని ఎయిర్ బబూల్స్ దేశాల నుంచి చాలా మంది చైనీయులు భారత్‌కు వస్తున్నట్టు విమానయా సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారత్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్న చైనా పౌరులకు బోర్డింగ్ నిరాకరించడానికి కారణం చెప్పడానికి తమకు లిఖితపూర్వకంగా ఏదో ఒక ఉత్తర్వులు ఇవ్వాలని కొన్ని విమానయాన సంస్థలు అధికారులను కోరుతున్నాయి. అయితే ఇటీవల చైనాలోని వివిధ ఓడరేవులలో భారతీయులు చిక్కుకున్నప్పుడు, వారిని తమ తీరంలో దిగడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య ఓడల్లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది భారతీయ సిబ్బంది స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చైనా పాల్పడుతున్న చర్యలకు ధీటుగా సమాధానం చెప్పాలని భావిస్తోన్న భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా -
బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!
సాక్షి, ముంబై: బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ విజృంభింస్తుడటంతో కేంద్రప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి విమాన సేవలను నిలిపివేసింది. కానీ, అంతకు ముందే అంటే సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ముంబైకి ఐదు విమానాలు వచ్చాయని తెలిసింది. అందులో సుమారు వేయి మందికిపైగా ప్రయాణికులు వచ్చి ఉండవచ్చని సమాచారం రావడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో బీఎంసీ తలమునకలైంది. వీరంతా నేరుగా తమ ఇళ్లకు వెళ్లకుండా వారం రోజులపాటు హోటల్ గదులలో బస చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కరోనా పరీక్షలు నిర్వహించి ఎలాంటి వైరస్ సోకలేదని నిర్ధరణ అయితే అప్పుడు ఇంటికి పంపిస్తారని బీఎంసీ వర్గాలు తెలిపాయి. 8 ఆస్పత్రుల్లో టీకా నిల్వ.. కరోనా టీకా మందు త్వరలో అందుబాటులోకి రానుందని సంకేతాలు రావడంతో బీఎంసీ పరిపాలన విభాగం ఏర్పాట్లు చేసే పనులు మరింత వేగవంతం చేసింది. టీకా మందు తీసుకునేందుకు పరేల్‌లోని కేం, సైన్‌లోని లోకమాన్య తిలక్, ముంబై సెంట్రల్‌లోని నాయర్, బాంద్రాలోని బాబా, విలేపార్లేలోని కూపర్, ఘాట్కోపర్లోని రాజావాడి, శాంతకృజ్లోని వి.ఎన్.దేశాయ్, కాందివలిలోని అంబేడ్కర్ ఇలా ఎనిమిది ఆçస్పత్రులను ఎంపిక చేసింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయని బీఎంసీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేంద్రాలలో టీకా మందు ఇచ్చేందుకు వైద్య రంగంలో నిపుణులైన 40 మంది వైద్యులను నియమించనున్నారు. వీరందరికి బీఎంసీకి చెందిన ఆరోగ్య అధికారి డాక్టర్ శీలా జగ్తాప్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు బీఎంసీ ఆస్పత్రి డాక్టర్ రమేశ్ బార్మల్ అన్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్రం జారీ చేసిన నియమావళి ప్రకారం టీకా మందు తొలుత ఎవరికివ్వాలో మెబైల్ ఫోన్లో సందేశాలు పంపించేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. అందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది తీరికలేకుండా పనిచేస్తున్నారు. అంతేగాకుండా ట్రాఫిక్ పోలీసులను కూడా సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో భారీ మాత్రలో నిల్వచేసిన కోల్డ్ స్టోరేజ్‌ల నుంచి కరోనా టీకా ఆస్పత్రులకు తరలించేందుకు ట్రాఫిక్ పోలీసుల సాయం తీసుకోనున్నారు. ట్రాఫిక్ జామ్‌లో టీకా మందు తీసుకెళ్లే అంబులెన్స్‌లు చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కోల్డ్ స్టోరేజ్‌ల నుంచి టీకా మందు బయటకు తీసిన తరువాత నిర్ణీత సమయంలోపు కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యం కాకుండా సకాలంలో టీకా మందు సంబంధిత కేంద్రాలకు చేరుకునేలా ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. 15 రోజుల క్వారంటైన్.. బ్రిటన్‌లో కొత్త వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి ముంబై వచ్చిన ప్రయాణికులు నేరుగా జనాల్లోకి వెళ్లకుండా వారం లేదా పక్షం రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అందుకు నగరంలోని వివిధ హోటళ్లలో రెండు వేల గదులు సిద్ధంచేసి ఉంచింది. ఇందులో వేయి గదులు ఫోర్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, మిగతా గదులు కొన్ని స్టార్ హోటళ్లలో ఉన్నాయి. హోటళ్లలో బస ఖర్చులు స్వయంగా ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ స్పష్టం చేశారు. సోమవారం కంటే ముందు ముంబైకి చేరుకున్న వారి వివరాలు సేకరిస్తున్నామని చహల్ అన్నారు. ఒకవేళ ముంబైలో ఉన్నట్లు సమాచారం ఉంటే వెంటనే వారింటికెళ్లి పరీక్షలు నిర్వహించి చేతికి స్టాంప్ వేస్తామని ఆయన అన్నారు. అంతకు ముందు విమానాశ్రయంలోనే ప్రాథమిక పరీక్షలు జరుగుతాయి. అందులో లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులను కోవిడ్ లక్షణాలుంటే వారిని విలేపార్లేలోని సెవన్ హిల్స్ ఆస్పత్రిలో, యూరప్ లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలో ఉన్న జీ.టి.ఆస్పత్రిలో చేర్పిస్తామని చహల్ తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా వార్డులు కేటాయించామని స్పష్టంచేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని, అలాగే ముంబైకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
కొత్త కరోనా భయంతో మళ్లీ ఆంక్షలు
31వరకు నిషేధం హమ్మయ్య... కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది. మాస్క్ కాస్త పక్కకు పెట్టి ఊపిరిపీల్చుకోవచ్చు.. అనుకునేలోపే.. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. కరోనా కంటే వేగంగా దూసుకొస్తోంది. ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను ఈ వైరస్ ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్ ఇప్పటికే డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. దీంతో పలు దేశాలు యూకే నుంచి రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్‌లో కొత్త వైరస్ నేపథ్యంలో భారత్ బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చినవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్‌లో ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌కు పంపిస్తామని ప్రకటించింది. బ్రిటన్ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని డీజీసీఏ ఆదేశించింది. ►కొత్త తరహా వైరస్‌పై కేంద్రం అప్రమత్తంగా ఉంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిమిషానికి 1,850 కోట్లు నష్టం సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1.78 లక్షల కోట్లకు దిగివచ్చింది. రాష్ట్రంలో అలర్ట్ బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రం అప్రమత్తమైంది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షలు చేసిన తర్వాతే పంపాలనినిర్ణయించింది. -
వేసవి నుంచి మళ్లీ జెట్ ఎయిర్ సర్వీసులు!
ముంబై, సాక్షి: వచ్చే వేసవి సీజన్ నుంచి ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే జాతీయ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నుంచి కంపెనీ టేకోవర్‌కు లైన్ క్లియర్‌కావడంతో డీజీసీఏ, పౌర విమానయాన శాఖ(ఎంసీఏ) నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. భారీ రుణాలు, నష్టాల కారణంగా 2019 నుంచి కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికలకు ఇటీవల ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా ఇకపైన కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలలో జెట్ ఎయిర్వేస్ లిస్టింగ్‌ను కొనసాగించేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశాలకు కనెక్టివిటీ వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి సర్వీసులు ప్రారంభంకావచ్చని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్రణాళికను నవంబర్ 5న ఎన్సీఎల్టీకి కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం అందజేశాయి. బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ తదితర సంస్థల మధ్య పోటీలో రూ. 1,000 కోట్ల ఆఫర్ ద్వారా జెట్ ఎయిర్వేస్ను కల్రాక్ క్యాపిటల్ గెలుచుకుంది. కాగా.. ఇప్పటికే ఎన్సీఎల్టీ నుంచి అనుమతులు పొందడంతో ఎంసీఏ, డీజీసీఏల నుంచి క్లియరెన్స్‌ల కోసం కంపెనీ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. షేరు జోరు కంపెనీ పునరుద్ధరణకు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ గత రెండు నెలల్లో నిరవధికంగా బలపడుతూ వచ్చింది. ఈ బాటలో నవంబర్ 5కల్లా ఎన్ఎస్ఈలో రూ. 79ను అధిగమించింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరంది. తదుపరి అక్కడక్కడే అన్నట్లుగా కదులుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ షేరు 1 శాతం బలపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
గగనయానం షురూ
గన్నవరం/విశాఖపట్నం: లాక్డౌన్ కారణంగా విమానాశ్రయాల్లో రెండు నెలలుగా నిలిచిపోయిన పౌర విమాన సర్వీసులు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. దీంతో గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడాయి. బెంగళూరు నుంచి ఉదయం 7.20 గంటలకు 78 మంది ప్రయాణికులతో తొలి విమానం గన్నవరానికి చేరుకుంది. అనంతరం 8.20 గంటలకు బెంగళూరు నుంచి 49 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం వచ్చింది. ప్రయాణికులు టెర్మినల్‌లోకి ప్రవేశించగానే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు జిల్లాల వారీగా స్పందన వెబ్సైట్లో వివరాలు నమోదు చేశారు. అనంతరం రూట్ల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయాణికులను ఆయా జిల్లాల్లోని హోం క్వారంటైన్‌కు తరలించారు. ► కృష్ణా జిల్లాకు చెందిన 48 మంది ప్రయాణికులకు స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం హోం క్వారంటైన్ నిమిత్తం స్వస్థలాలకు పంపించారు. ► చెన్నై, ఢిల్లీ నుండి వచ్చిన ప్రయాణికులను మాత్రం ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ► ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు మాస్కులు, ఆరోగ్యసేతు యాప్ ఉన్నవారిని మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించారు. ► విశాఖకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నుంచి 3 ఇండిగో, ఎయిర్ ఆసియా నుంచి ఒక విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 581 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. అవే విమానాల్లో విశాఖ నుంచి 450 మంది ఆయా ప్రాంతాలకు వెళ్లారు. ► వచ్చిన ప్రయాణికులందరికి విమానాశ్రయంలోనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సుల్లో అక్కయ్యపాలెంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారి చిరునామాలు, ఇతర వివరాలు తీసుకొని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. -
పాక్ మీదుగా రయ్రయ్
న్యూఢిల్లీ: ఎట్టకేలకు పాకిస్తాన్ గగనతలాన్ని అందుబాటులోకి తెచ్చింది. భారత్, పాకిస్తాన్ల మధ్య విమానయాన సేవలను మంగళవారం పునరుద్ధరించింది. బాలాకోట్ దాడుల అనంతరం దాదాపు నాలుగున్నర నెలల తర్వాత అన్ని పౌర విమానాలను తమ భూభాగంలోకి అనుమతించింది. ఈ మేరకు పాకిస్తాన్ విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విమానయాన సేవలను పునరుద్ధరించనున్నట్లు భారత్ పేర్కొంది. ఇరు దేశాల గగనతలాలపై విమానాలు తిరిగేందుకు ఎలాంటి ఆంక్షల్లేవని భారత పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు చాలా మేలు కలుగుతుందని పేర్కొంది. పాకిస్తాన్ గగనతలాన్ని మూసేయడంతో విమానాలను దారి మళ్లించడం ద్వారా రూ.491 కోట్ల నష్టాలను చవిచూసిన ఎయిరిండియా విమాన సంస్థకు కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్‌కు ఉన్న 11 గగనతలాల్లో కేవలం రెండింటినే అందుబాటులో ఉంచింది. అయితే తన గగనతలంపై విధించిన తాత్కాలిక ఆంక్షలను భారత్ ఎత్తేసింది. దీనివల్ల వాణిజ్య విమానయాన సంస్థలకు పెద్దగా లాభం చేకూరలేదు. పాకిస్తాన్ గగనతలాన్ని మూసేయడంతో జూలై 2 వరకు స్పైస్‌జెట్ రూ.30.73 కోట్లు, ఇండిగో 25.1 కోట్లు, గోఎయిర్ రూ.2.1 కోట్లు నష్టపోయినట్లు జూలై 3న రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. -
ఉద్రిక్తతల ఎఫెక్ట్ : పలు విమానాలు రద్దు
దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గగనతల ఉద్రికత్తలు, కఠిన నిబంధనలతో పలు విమాన సంస్థలు ఇప్పటికే అనేక సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించాయి. సివిల్ ఎయిర్ ట్రాఫిక్ కారణంగా జెట్ ఎయిర్వేస్, గోఎయిర్, ఇండిగో, స్పైస్ జెట్ పలు సర్వీసులను రద్దు చేశాయి. శ్రీనగర్, అమృత్సర్, డెహ్రాడూన్, జమ్మూ, చండీగఢ్, ఇతర విమానాశ్రయాల మూసివేత కారణంగా తాత్కాలికంగా సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ పరిణామాలకనుగుణంగా ప్రయాణికులు వ్యవహరించాలని విజ్ఙప్తి చేశాయి. ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే తమ రిజర్వేషన్లను అప్డేట్ చేసుకోవచ్చని గోఎయిర్ ప్రకటించింది. ఇందుకు టోల్ ఫ్రీ నెంబరు 18602 100 999ను ట్వీట్ చేసింది. #9WUpdate As per instructions from Delhi ATC regarding airport closure, flight operations to/from Amritsar, Srinagar, Jammu & Leh have been suspended until further notice. We request our guests check their flight status before proceeding to the airport https://t.co/q3TCmCPN0Q— Jet Airways (@jetairways) February 27, 2019#6ETravelAdvisory : Due to airspace closure, flights to and from Srinagar, Jammu, Chandigarh, Amritsar and Dehradun have been temporarily suspended. To opt for cancellations or alternate options click on Plan B https://t.co/ofwzjniT1l— IndiGo (@IndiGo6E) February 27, 2019#Update: Due to airspace restriction, flights to/from Dehradun (DED) & Jaisalmer (JSA) are affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/VkU7yLjrw0.— SpiceJet (@flyspicejet) February 27, 2019 -
ఇండో-పాక్ విమాన సర్వీసులకు విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇరు దేశాల మధ్య విమాన ప్రయాణాల రాకపోకలకు విఘాతం ఏర్పడింది. కొన్ని విమానాలు అర్థంతరంగా వెనుతిరగగా, మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. జమ్మూ కశ్మీర్‌లోని పలు విమానాశ్రయాల నుంచి ప్రయాణీకుల రాకపోకలను నిలిపివేసి కేవలం ఎయిర్‌బేస్‌లుగా వాటిని వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలోనూ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు విమానాశ్రయంలో చిక్కుకున్నారు.మరోవైపు పాకిస్తాన్ సైతం లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియోల్‌కోట్, ఇస్లామాబాద్ విమానాశ్రయాల నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలను నిలిపివేసింది. -
కస్టమ్స్ ఖర్చూ మేమే భరిస్తాం
సాక్షి, అమరావతి: నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు అల్లాడుతున్నా పన్నులు తగ్గించి ఆదుకోవడానికి ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించడానికి రాయితీల మీద రాయితీలు ప్రకటిస్తోంది. విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడపడానికి ఏ సంస్థ కూడా ఆసక్తి చూపకపోవడంతో ఖాళీగా ఉన్న సీట్ల నష్టాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) కింద తామే భరిస్తామంటూ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ వీజీఎఫ్ కింద ఆరు నెలల కాలానికి రూ.18 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడంతో వారానికి రెండు సర్వీసులు నడపడానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ముందుకొచ్చింది. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి అవసరమైన కస్టమ్స్ విభాగం వ్యయాన్ని కూడా తాము భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. క్టసమ్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసే యూనిట్‌కు అద్దె చెల్లింపులకు నెలకు రూ.2 లక్షలు వరకు అవుతుందని అంచనా వేశామని, విమాన సర్వీసులు తక్షణం ప్రారంభించాలన్న లక్ష్యంతో ఇలా ఆరు నెలలకు రూ.12 లక్షల వరకు చెల్లించాలని నిర్ణయించినట్లు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని, ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ అద్దె ఎవరు చెల్లించాలన్న దానిపై ఏఏఐ, కస్టమ్స్ విభాగం మధ్య వివాదం తలెత్తింది. 2009 నుంచి మారిన నిబంధనల ప్రకారం కస్టమ్స్ విభాగం ఏర్పాటుకు సంబంధించిన వ్యయాన్ని ఆ శాఖే భరించాల్సి ఉంది. కానీ, విజయవాడలో వారానికి రెండుసార్లు చొప్పున ఆరు నెలల పాటు మాత్రమే వీజీఎఫ్ కింద సర్వీసులు నడుపుతుండడంతో కస్టమ్స్ విభాగం ఈ వ్యయాన్ని భరించడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించాలంటూ పౌర విమానయాన శాఖ మంత్రికి ప్రభుత్వం లేఖ రాయడంతోపాటు ఏఏఐకి కస్టమ్స్ వ్యయాన్ని తామే భరిస్తామంటూ కూడా ప్రతిపాదనలు పంపింది. 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 25వ తేదీలోగా సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో నెల రోజుల వరకు సర్వీసులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
72 ఏళ్ల క్రితమే ఆకాశాన హజ్‌కు..
1946, అక్టోబర్ 22. ఆ రోజు మంగళవారం నగరమంతా సందడిగా ఉంది. జంట నగరాల నుంచి బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 6 గంటల నుంచే జనం వస్తున్నారు. ఉదయం 9 గంటలకు విమానాశ్రయం జనసంద్రంగా మారింది. హైదరాబాద్‌లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ.. దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించిన రోజు. దేశంలోనే తొలిసారి హజ్ యాత్రకు వెళ్లేందుకు విమానం సిద్ధమైంది.ఉదయం 10 గంటలకు 18 మంది యాత్రికులతో డకోటా డీ–3 విమానం గాలిలోకి ఎగిరింది. అలా దేశంలోనే తొలిసారి హజ్ యాత్రకు దక్కన్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ విమానానికి పైలెట్లుగా కెప్టెన్ కాక్స్, మునిషీ, రేడియో ఆపరేటర్‌గా నాసిర్, ఫ్లైట్ ఇంజనీర్‌గా లార్డ్ వ్యవహరించారు. మంగళవారం నుంచి హజ్ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ 1400 ఏళ్ల క్రితమే... 1400 ఏళ్ల క్రితం నుంచే వివిధ దేశాల నుంచి సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ ఆరాధనల కోసం ముస్లింలు వెళుతున్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన బహుమనీలు, కుతుబ్ షాహీలు, ఆసిఫ్‌జాహీల కాలం నుంచే ముస్లింలు హజ్‌కు రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. 72 ఏళ్ల క్రితం దేశంలోనే తొలిసారి హైదరాబాద్ సంస్థాన ప్రజలు విమానంలో యాత్రకు వెళ్లారు. 1946లో ఒక విమానంలో 18 మంది వెళ్లగా, ప్రస్తుతం 25 విమానాల్లో దాదాపు 8 వేల మంది వెళుతున్నారు. హకీంపేట్ రన్‌వే నుంచి.. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎక్కడ నుంచి కూడా హజ్‌కు విమాన సర్వీసులు లేవు. 1947లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రెండోసారి విమానం హజ్ యాత్రకు వెళ్లింది. అయితే యాత్రికుల సంఖ్య ఎక్కువ కావడం, బేగంపేట్ విమాన రన్‌వే తక్కువగా ఉండడంతో హకీంపేట్‌లో విమాన రన్‌వే అనుకూలంగా ఉండడంతో అక్కడి నుంచి హజ్ యాత్రకు బయలుదేరినట్లు ఇంటాక్ తెలంగాణ కో కన్వీనర్ అనురాధ తెలిపారు. ఆగుతూ.. హజ్ యాత్రకు.. హైదరాబాద్ నుంచి హజ్ యాత్రికుల విమానాలు నేరుగా సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లేవి కావు. ఇంధనం ఇబ్బందులుండటంతో సిరియా, ఈజిప్టు, ఇరాక్‌తో పాటు ముంబై, కరాచి, షార్జాలో ఆగి వెళ్లేవారు. దక్కన్ ఎయిర్వేస్ విమానాలు హజ్ యాత్రకు 1946, 1947.. రెండేళ్ల పాటు నడిచాయి. అనంతరం దేశానికి స్వాతంత్య్రం రావడం, హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో జరిగిన పరిణామాల దృష్ట్యా 1948–1950 వరకు విమానాలు హజ్ యాత్రకు వెళ్లలేదు. మళ్లీ 1951 నుంచి 1953 వరకు హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు విమానాలు వెళ్లాయి. 1953లో దక్కన్ ఎయిర్వేస్ ఎయిర్ ఇండియాలో విలీనం కావడంతో హజ్ యాత్రకు విమానాలు రద్దు చేశారు. ఆసిఫ్ జాహీల కాలంలో రైలు మార్గాన.. నిజాం హయాంలో హైదరాబాద్‌లో 1874లో రైల్వే లైన్ ప్రారంభమైంది. దీంతో సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారు రైలు మార్గం ద్వారా ముంబైకి చేరుకొని అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డా నౌకాశ్రయానికి చేరుకునేవారు. నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లేవారికి నాంపల్లిలో ప్రభుత్వం తరఫున ఉచితంగా భోజన వసతి ఉండేది. ఏడవ నిజాం ఉస్మాన్అలీ హయాం వచ్చే సరికి నాంపల్లి స్టేషన్ హజ్ యాత్ర సమయంలో జనసంద్రంగా మారేది. యాత్రికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో పాటు సాధారణ జనం కూడా అక్కడికి వచ్చేవారు. 1994 వరకు నౌకాయానం.. తిరిగి విమాన యానం తొలుత హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారు రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా ముంబైకి చేరుకునే వారు. మొదట్లో ఇంజన్ నౌకలు లేకపోవడంతో పరదా వాటిల్లోనే యాత్ర సాగేది. రంజాన్ 2 నెలల తర్వాత హజ్ ఆరాధనలు వస్తాయి. రంజాన్ నెల ఉపవాసాల కంటే ముందే హజ్ ఆరాధనలకు ఇళ్ల నుంచి బయలుదేరే వారు. నేను 1969 నుంచి హజ్ యాత్రకు వెళుతున్నా. అప్పటి నుంచి అందరి సామాన్లు మోసేవాడిని. అందుకే అందరూ నన్ను హబీబ్ కూలీగానే పిలుస్తారు. ఆ రోజుల్లో రంజాన్ కంటే ముందు ముంబై నుంచి సౌదీ, ముజ్జదీ అనే 2 నౌకలు, రంజాన్ తర్వాత ముహ్మదీ, అక్బర్, నూర్జహా పేర్లతో నౌకలు హజ్‌కు వెళ్లేవి. నౌక ప్రయాణం దాదాపు పదమూడు నుంచి పదిహేను రోజులు పట్టేది. చివరిసారిగా 1994 వరకు నౌకాయానం జరిగింది. అనంతరం విమానయానం ప్రారంభమైంది. – హజ్ సేవకుడు హబీబ్ అబ్దుల్ ఖాదర్ ఇల్యాస్ హబీబ్ కూలీ -
‘వావ్’: రూ.13 వేలకే అమెరికా టికెట్
సాక్షి, న్యూఢిల్లీ: ఐస్లాండ్కు చెందిన విమానయాన సంస్థ ‘వావ్ ఎయిర్’ భారత విమాన ప్రయాణీకులకు బంపర్ ఆపర్ ఇస్తోంది. త్వరలోనే భారత్‌లో కార్యకలాపాలకు రెడీ అవుతోంది. డిసెంబర్ నుంచి ఢిల్లీ నుంచి రెక్జావిక్ (ఐస్లాండ్ రాజధాని) మీదుగా ఉత్తర అమెరికా, యూరప్‌లలోని వివిధ ప్రాంతాలకు సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది. రెక్జావిక్లోని కెఫ్లావిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఉత్తర అమెరికా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు తన సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్, చికాగో, టొరొంటోలాంటి 15నగరాలకు విమాన సేవలను అందించనున్నట్టు చెప్పారు. అతి తక్కువ ధరల్లో రూ.13,499 బేసిక్ ఫేర్‌తో (పన్నులు సహా) టికెట్‌ను (వన్‌వే ప్రయాణానికి) ఆఫర్ చేస్తున్నామని వావ్ పేర్కొంది. అయితే ఈ ధరకు బ్యాగేజ్ చెకింగ్, ఫుడ్ ఖర్చులు అదనమని తెలిపింది. అలాగే ప్రీమియం టికెట్ ధర రూ.46,599 నుంచి ప్రారంభమౌతుందని వావ్ ఎయిర్ ఫౌండర్, సీఈవో స్కల్ మోజెన్సెన్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీనుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ద్వారా సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ మేరకు వారానికి ఐదు స్లాట్లు పొందేందుకు ఇప్పటికే జీఎంఆర్‌తో డీల్ కుదుర్చుకున్నట్టు చెప్పారు. ప్రతి రోజు ఇండియా, ఉత్తర అమెరికా మధ్య సుమారు 20వేల మంది ప్రయాణిస్తారనీ, ఇంత భారీ డిమాండ్ ఉన్న భారత్‌లో తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను అందిస్తున్న మొట్టమొదటి ఎయిర్‌లైన్స్ తమదేనని మోజెన్సెస్ చెప్పారు. చమురు ధరలు 100 డాలర్లు దాటిపోయినా తమకు ఎలాంటి ఆందోళనలేదని పేర్కొన్నారు. -
బాబోయ్.. విమానం!
- మార్చి 14వ తేదీన హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న ఇండిగో (6ఈ334) విమానం ఉదయం 10.40 గంటలకు టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల వెనుదిరిగి వచ్చింది. - ఇదే నెలలో బ్యాంకాక్ నుంచి దుబాయ్ వెళ్లే ఏ–380 విమానాన్ని సాంకేతిక కారణాల వల్ల తెల్లవారు జామున 3.45 గంటల సమయంలో అకస్మాత్తుగా నిలిపేయాల్సి వచ్చింది. - ఇక గత వారం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇండిగో(7117) విమానం టైర్లు పేలిపోయి రన్‌వేపై నిలిచిపోయింది. దీంతో బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 2.30 గంటల వరకు రన్‌వే మూసేశారు. ..ఇలా ఏదో ఒక కారణంతో ప్రతి నెలా రెండు నుంచి మూడు విమానాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిపోతున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆగిపోతున్న ఫ్లైట్ల వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. విమానప్రయాణంలో అనిశ్చితి.. ఆకస్మాత్తుగా ఆగిపోతున్న విమానాలు.. తరచూ నిలిచిపోతున్న రన్‌వే సేవల కారణంగా విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొన్ని విమాన సంస్థలకు చెందిన ఫ్లైట్లు పాతవి కావడం వల్లే ఈ తరహా సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో రన్‌వే తెరుచుకొనేదెప్పుడో..! శంషాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం 4.26 కిలోమీటర్ల పొడవైన ప్రైమ్ రన్‌వే నుంచే అన్ని విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రాత్రింబవళ్లు రన్‌వేపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. నిత్యం రాకపోకలు సాగించే విమానాల్లో నైట్ ఫ్లైట్సే ఎక్కువ. దీంతో రాత్రి పూట అకస్మాత్తుగా తలెత్తే సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్క విమానం రన్‌వేపై నిలిచిపోయినా.. మొత్తం సర్వీసులపై దాని ప్రభావం ఉంటోంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా విమానాశ్రయ విస్తరణలో భాగంగా 3.7 కిలోమీటర్ల పొడవైన రెండో రన్‌వే నిర్మించారు. సాంకేతికంగా దీనికి అన్ని అనుమతులూ వచ్చాయి. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతి లభిస్తే తప్ప ఈ రన్‌వే వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేదు. గతేడాది నవంబర్లోనే డీజీసీఏ ఆమోదం లభిస్తుందని భావించినా.. ఇప్పటికీ ఎదురు చూపులు తప్పడం లేదు. డీజీసీఏ అనుమతి లభిస్తే నైట్ ఫ్లైట్స్‌కు ఈ రన్‌వేను వినియోగించాలని జీఎంఆర్ భావిస్తోంది. ప్రైమ్ రన్‌వేపై ఓ విమానం ఆగిపోయినా మిగతా వాటి రాకపోకలకు రెండో దానిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ‘డీజీసీఏ నుంచి ఎంత త్వరగా అనుమతి లభిస్తే అంత త్వరగా రెండో రన్‌వే సేవలను ప్రారంభిస్తాం. అందుకోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం’అని శంషాబాద్ విమానాశ్రయ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. వీలైనంత త్వరలోనే అనుమతి లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. – సాక్షి, హైదరాబాద్ ఒక రన్‌వే..470 విమానాలు.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న ఒక్క రన్‌వే నుంచే ప్రతి రోజూ సుమారు 470 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఏ చిన్న సాంకేతిక కారణంతోనైనా ఒక విమానం రన్‌వేపై నిలిచిపోతే శంషాబాద్ రావలసిన మొత్తం విమానాలకు బ్రేక్ పడుతోంది. ఇటీవల ఇండిగో విమానం టైర్ పేలిన ఉదంతంతో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై విమానాశ్రయాల్లోనూ సర్వీసులకు అంతరాయం కలిగింది. మొత్తం 31 సర్వీసులకు బ్రేక్ పడింది. ఇందులో 10 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. మరికొన్ని సర్వీసులను మళ్లించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. విమానాల్లో సాధారణంగా తలెత్తే సాంకేతిక సమస్యల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ రన్‌వేపై అకస్మాత్తుగా నిలిచిపోయే వాటితోనే ఇతర సర్వీసులకు బ్రేక్ పడుతోంది. -
బెజవాడ నుంచి 12 కొత్త విమాన సర్వీసులు
గన్నవరం: కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం నుంచి మార్చిలో కొత్తగా 12 విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే అతిపెద్ద చౌకధరల విమాన సంస్థ ఇండిగో ఏటీఆర్ విమాన సేవల్లో భాగంగా మార్చి 2 నుంచి ఒకేసారి పది విమాన సర్వీసులను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఇక్కడికి ప్రారంభించ నుంది. ప్రాంతీయ విమాన సంస్థ ట్రూజెట్ ఎయిర్ లైన్స్ కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా కడప ఎయిర్‌పోర్టుకు ఇక్కడి నుంచి దాదాపు ఏడాదిన్నర తర్వాత మార్చి 1 నుంచి సర్వీసు పునఃప్రారంభించ నుంది. ప్రారంభ టికెట్ ధర రూ.598. ఇండిగో ప్రారంభించనున్న సర్వీసుల్లో హైదరాబాద్ విజయవాడ మధ్య ఆరు, మిగిలిన సర్వీసులను బెంగళూరు, చెన్నై నుంచి ఇక్కడికి సర్వీసులను నడపనున్నారు. -
విమానం రూట్ మార్పుపై ఆందోళన
విమానాశ్రయం (గన్నవరం): న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని ఆదివారం వైజాగ్ మీదుగా మళ్లించేందుకు ఆ సంస్థ అధికారులు చేసిన ప్రయత్నాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు, ఎయిరిండియా ప్రతినిధులకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన ఎ–319 విమానం రోజూ న్యూఢిల్లీ నుంచి ఉదయం 8.15 గంటలకు ఇక్కడికి చేరుకుని 9.05కు తిరిగి ఢిల్లీ వెళ్తుంది. ఆదివారం ఉదయం అరగంట ఆలస్యంగా 9.35కు విమానం ఇక్కడికి చేరుకుని 80 మంది ప్రయాణికులతో తిరిగి వెళ్లేందుకు సిద్ధమైంది. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీస్ సాంకేతిక కారణాలతో రద్దు కావడంతో అక్కడ ఉన్న 40 మంది ప్రయాణికులను కూడా ఇదే విమానంలో పంపించేందుకు నిర్ణయించారు. ఈ విషయమై ప్రయాణికులకు చెప్పగా వారంతా వ్యతిరేకించారు. వైజాగ్ ఆగి వెళ్లడం వల్ల రెండు గంటల సమయం వృథా అవుతుం దని, దీనివల్ల ఇతర దేశాలు వెళ్లేందుకు ముందుగా బుక్ చేసుకున్న విమాన సమయా నికి చేరుకోలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఎయిరిండియా అధికారులు వినకపోవడంతో ఎయిర్పోర్ట్, పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగగా, విమానాన్ని నేరుగా ఢిల్లీ పంపించేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదం కారణంగా సుమారు గంట ఆలస్యంగా విమానం ఢిల్లీకి బయలుదేరింది. -
తిరుపతి నుంచి విదేశాలకు విమానాలు
రేణిగుంట: త్వరలోనే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిరిండియా సుముఖత వ్యక్తం చేసినట్లు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డా.వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో గురువారం జరిగిన ఎయిర్‌పోర్టు అడ్వైజరీబోర్డు కమిటీ సమావేశానికి ఆయన చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఎయిర్‌పోర్టు ప్రగతి, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను గురించి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ హెచ్.పుల్లాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ వరప్రసాదరావు మీడియాతో మాట్లా్లడారు. తాను విమాన సర్వీసులకోసం పార్లమెంట్లో ప్రస్తావించడంతో కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు సానుకూల దృక్పథంతో ఉన్నారని తెలిపారు. -
జూలై 8 నుంచి విశాఖ–కొలంబో విమాన సర్వీసులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి శ్రీలంక దేశ రాజధాని కొలంబోల మధ్య జూలై 8వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రవేశపెడుతున్నట్టు శ్రీలంక ఎయిర్‌లైన్స్ మేనేజర్ సంజీవ జయతిలకే వెల్లడించారు. శుక్రవారం విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కొత్త రూట్ కోసం ఎయిర్ బస్ 300/321 ఎయిర్ క్రాఫ్ట్‌ను కొత్తగా ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీలంక ఎయిర్‌లైన్స్ భారతదేశంలో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూర్, కొచ్చిన్, మదురై, త్రివేండ్రం, తిరుచునాపల్లి, వారణాశి, బోధ్‌గయాల నుంచి కొలంబోకు విమాన సర్వీసులు నడుపుతున్నదన్నారు. రానుపోను ఒక్కో ప్రయాణికునికి టికెట్ ఫేర్ రూ.14,999 అని చెప్పారు. బెల్లాజియో కాసినో శ్రీలంకలోనే ప్రసిద్ధి శ్రీలంక టూరిజం వివరాలను తెలిపేందుకు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌తో పాటు బెల్లాజియో కాసినో, సినమోన్ గ్రాండ్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రముఖ గేమింగ్ ఎరినా బెల్లాజయో కాసినో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు నైట్‌లైఫ్‌గా సుపరిచితమని బెల్లాజియో కాసినో మార్కెటింగ్ హెడ్ సిసిరా తెలిపారు. నృత్యాలు, పాటలే కాకుండా ప్రపంచ శ్రేణి రెస్టారెంట్లు, బార్లతో ఈ కాసినో ప్రపంచ ప్రసిద్ధి చెందిందని ప్రెసిడెంట్ ఇండియా ఆపరేషన్స్ నందీప్ కుమార్ తెలిపారు. సినామోన్ గ్రాండ్ శ్రీలంకలో అతిపెద్ద ఫైవ్‌స్టార్ హోటల్స్‌తో సేవలందిస్తుందని సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సేల్స్ షావింద జినాదాసా తెలిపారు. -
కడపకు ట్రూజెట్ సేవలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ విమాన సేవలను అందించే ట్రూజెట్ కడపకు సర్వీసులను ప్రారంభించింది. ఏప్రిల్8న హైదరాబాద్- కడప, తిరుపతి-కడపలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారపరంగా చాలా ముఖ్యపట్టణమైన కడపకు ట్రూజెట్ ఒక్కటే సర్వీసులను అందిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇంత వరకు విమాన సర్వీసులు లేని నాగపూర్, ఔరంగాబాద్ తర్వాత ఇప్పుడు మూడో పట్టణం కడపకు సేవలను విస్తరిస్తున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. దీనివల్ల ఇప్పుడు కడప నుంచి నాగపూర్, గోవా, రాజమండ్రి పట్టణాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మూడో విమానం ఏటీఆర్-72 అందుబాటులోకి రావడంతో కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు ట్రూజెట్ ఆ ప్రకటనలో పేర్కొంది. -
ఊపిరిపీల్చుకుంటున్న చెన్నై.. విమానాలు ఓకే
చెన్నై: చెన్నై మహానగరం ఇప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. మెల్లగా తేరుకుంటోంది. భారీ వర్షాలతో ముంచెత్తిన వరదల కారణంగా ఇసుమంత జాగ కూడా విడువకుండా, మిద్దెలను సైతం తనలో ముంచేసుకున్న వర్షపు నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో కాస్త సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అవకాశం దొరికినట్లయింది. రవాణా సౌకర్యాలకు ఎలాగో ప్రస్తుతం అవకాశం లేకపోయినప్పటికీ వాయు మార్గాలను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూతపడిన విమాన సర్వీసులు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. అరక్కోణం నుంచి పూర్తి స్థాయిలో కాకున్నా కొద్ది స్థాయిలో ఓ ఏడు విమాన సర్వీసులను ప్రైవేటు విమానాల ద్వారా అందించేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు, జాతీయ విపత్తు దళం కూడా తన సహాయక చర్యలను వేగవంతం చేసింది. చెన్నైకి మరో రెండు యుద్ధ నౌకలు చేరుకున్నాయి. వీటిలో 30 టన్నుల ఆహార పదార్ధాలు, తాగు నీరు తెప్పించారు. మరోపక్క, రేపటి వరకు అన్ని రైళ్లను దక్షిణమద్య రైల్వే రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిమట్టం తగ్గిపోతున్నప్పటికీ మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై పరిస్థితి అప్పుడే మెరుగవుతుందని మాత్రం చెప్పలేం. -
ఆలస్యంగా విమానాలు...ఆందోళనలో ప్రయాణీకులు
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనివల్ల ప్రయాణీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు చేస్తున్న ఫిర్యాదులపై కూడా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. -
ఆనందం ఆకాశమంత!
విశాఖకు తరలివస్తున్న విమాన సర్వీసులు రేపటి నుంచి ఎయిర్కోస్టా విమానం త్వరలో విశాఖ-కోలాలంపూర్ సర్వీసు 1న ఎయిరేషియా ప్రతినిధుల రాక విమానయాన రంగానికి సంబంధించి విశాఖ ప్రగతి ఇప్పుడు ఆకాశమే హద్దులుగా సాగుతోంది. అంబర వీధిలో పరుగులు తీస్తోంది. ఒక్కొక్కటిగా విమాన సర్వీసులుపెరుగుతూ ఉండడంతో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు మరిన్ని ప్రారంభమవుతున్న తరుణంలో విశాఖ విమానాశ్రయానికి మరిన్ని మంచి రోజులు ఖాయంగా వస్తాయనిపిస్తోంది. విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ విమానాశ్రయం కొత్త విమానాల రాకపోకలతో కళకళలాడబోతోంది. అహర్నిశలూ విమానాల రాకపోకలకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో.. నగరానికి మరిన్ని సర్వీసులు నడపడానికి విమాన సంస్థలు ఉత్సాహం చూపుతూ ఉండడం ఆశాజనకంగా కనిపిస్తోంది. ఎయిర్ ఏషియా విమానం విశాఖలో వాలడానికి రంగం సిద్ధమవుతోంది. నగరానికి ఉగాది కానుకగా మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. విస్తృత సర్వీసులపై దృష్టి విశాఖనుంచి విదేశీ సర్వీసులు నడపడానికి ఎయిర్ ఏషియా సంస్థ ఆసక్తి చూపుతోంది. విశాఖకు వచ్చివెళ్లే దేశవిదేశీ ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, పారిశ్రామిక వేత్తలను కలిసి డిమాండ్‌పై ఆరా తీయడానికి ఏప్రిల్ 1న ఆసంస్థ ప్రతినిధులు రానున్నారని భారత విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు డి.వరదారెడ్డి తెలిపారు. విశాఖ,కోలాలంపూర్ మధ్య నిత్యం విమానాలు నడిపడానికి ఆసంస్ధ యోచిస్తోందని చెప్పారు. విశాఖ నుంచి కోల్‌కతకు, విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు సర్వీసుల నిర్వహణపై అభిప్రాయాలు సేకరిస్తారన్నారు. 30 నుంచి ఇంకా తాకిడి ఈనెల 30 నుంచి విశాఖ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి ఇంకా పెరగనుంది. బ్రెజిల్ ఎంబ్రియార్ సంస్థకు చెందిన ఎయిర్ కోస్టా విమానం విశాఖకు రానుంది. ఈ విమానం హైదరాబాదులో ఉదయం ఏడుకు బయలు దేరి విశాఖకు ఉదయం 8.20కి చేరుతుంది. మరో అరగంటకు బెంగళూరు బయలు దేరుతుంది. బెంగళూరు నుంచి రాత్రి 8.20కి విశాఖ చేరుతుంది. 8.50కి బయ లు దేరి హైదరాబాదు వెళ్తుంది. అదే రోజు బెంగళూరు- విశాఖ- భువనేశ్వర్ మధ్య ఇండి గో విమానం నడవనుంది. మధ్యాహ్నం 12.30 కి బెంగళూరులో బయల్దేరి 01.40కి విశాఖ వస్తుంది. 02.10కి బయల్దేరి భువనేశ్వర్‌కు 03.00 గంటలకు చేరుతుంది. అక్కడ 03.30కి బయలు దేరి సాయంత్రం 04.10కి విశాఖ వస్తుంది. ఇక్కడి నుంచి 04.30కి బయలు దేరి బెంగళూరుకి 05.50కి చేరుతుంది. -
ఇతర నగరాల్లో రియల్ దూకుడు!
అభివృద్ధిలో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏకైక ఆశాదీపం... పరిశ్రమలతో నిండిన విశాఖే. సింగపూర్‌ను పోలిన వనరులు, సౌకర్యాలూ ఇక్కడున్నాయి. చుట్టూ సముద్రం, భారీ నౌకలు కూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు, చమురు కంపెనీలు, షిప్‌యార్డ్, విమాన సేవలు, ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు, వేల కోట్ల ఫార్మా ఎగుమతులు, ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు, ఏడాది పొడవునా బారులు తీరే పర్యాటకులు ఇదీ క్లుప్తంగా విశాఖపట్నం అంటే. ఏడాదిగా విశాఖలో స్థిరాస్తి ధరల్లో కనీసం 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని క్రెడాయ్ విశాఖపట్నం సెక్రటరీ కోటేశ్వరరావు చెప్పారు. 2006లో రూ.25 వేలున్న గజం స్థలం ధర ఇప్పుడు రూ.50 వేలకు పైగానే పలుకుతోందని పేర్కొన్నారు. సిటీ నుంచి 15 కి.మీ. దూరంలో ఉండే మధురవాడ, ఎండాడ, మురళీనగర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2,500గా, నర్సింహానగర్, అక్కయపాలెం, అబీద్‌నగర్ వంటి ప్రాంతాల్లో రూ.3,500లు, బీచ్‌రోడ్, బాలాజీనగర్, పాండురంగాపురం వంటి ప్రాంతాల్లో రూ.4000గా ఉందని తెలిపారు. అయితే రాజకీయ అనిశ్చితి కారణంగా విశాఖలో ధరలు పెరిగాయని, మరో ఆరేడు నెలల్లో ధరలు స్థిరపడే అవకాశముందని ఆయన చెప్పారు. ఐటీ జోరు.. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి ఎలాంటి ఢోకాలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఐటీ పెట్టుబడులు వచ్చేది విశాఖకే. ఇప్పటికే ఇక్కడ 70 ఐటీ కంపెనీలు, 90 ఫార్మా కంపెనీలున్నాయి. వీటి వార్షిక టర్నోవర్ ఏటా రూ.1,450 కోట్లుగా ఉంది. ప్రత్యేక హోదా కారణంగా భారీస్థాయిలో పన్ను మినహాయింపులు లభిస్తాయని కనుక కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. మరో 50 కంపెనీలు విశాఖకు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రుషికొండలో మూడు ఐటీ సెజ్‌లు ఏర్పాటు కానున్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధికి ఢోకాలేదు.. విశాఖ నుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు ఆధారిత కంపెనీలు భారీగా రానున్నాయి. పది మండలాల్లో విస్తరించనున్న ఈ జోన్లో వివిధ కంపెనీలు రానున్నాయి. పీసీపీఐఆర్ కంపెనీలకు పన్ను రాయితీలు వర్తిస్తుండగా ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్‌కు మరింత డిమాండ్ పెరగనుంది. వైజాగ్, గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి, భీమిలిలోనూ పోర్టులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. సిటీ నుంచి 20 కి.మీ. దూరంలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రభుత్వ భవనాలూ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే అటవీ భూమిని సైతం డీ నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందువల్ల మరో 5 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. పారిశ్రామిక రాజధాని.. ‘విశాఖపట్నం’ జనాభా: 21 లక్షలు విస్తీర్ణం: 550 చ.కి.మీ. ఐటీ, ఫార్మా కంపెనీలు: 160 ఎస్ఈజెడ్లు: 4, పోర్టులు: 2 స్థిరాస్తి ధరలు 40 శాతం వరకూ పెరిగాయి {పాంతాన్ని బట్టి చ.అ. ధర రూ.2,000 నుంచి రూ.4,000 వరకూ ఉంది.