స్పైస్ జెట్
నడపనున్న విమానాల సంఖ్య : 5
ఎప్పటి నుంచి : జనవరి
ఎక్కడెక్కడకు...: హైదరాబాద్,
కోల్‌కతా,జార్సిగుడలకు డైలీ
చెన్నై, బెంగళూరుకు వారంలో మూడు,నాలుగు రోజులు
ఇండిగో
నడపనున్న విమానాలు : 2
ఎప్పటి నుంచి : నవంబరు 15 నుంచి కోల్‌కతాకు, 16 నుంచి బెంగళూరుకు..
ఎక్కడెక్కడకు...: కోల్‌కతా,
బెంగళూరులకు డైలీ సర్వీసులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖకు కొత్త విమాన సర్వీసులు రానున్నాయి. ఒకవైపు ప్రయాణికుల రద్దీ అధికమవుతుండడం, మరోవైపు పరిపాలనా రాజధాని కానుండడంతో విమానయాన సంస్థలు విశాఖ వైపు ఆసక్తి చూపుతున్నాయి. విశాఖపట్నానికి స్పైస్ జెట్ ఐదు, ఇండిగో సంస్థ రెండు విమాన సర్వీసులు నడపడానికి అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ విమానాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలతో పాటు ఒడిశాలోని జార్సిగుడ ఎయిర్‌పోర్టుకు కూడా నడపడానికి సంబంధిత సంస్థలు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. వీటిలో స్పైస్ జెట్ హైదరాబాద్, కోల్‌కతా, జార్సిగుడలకు డైలీ, చెన్నై, బెంగళూరులకు వారంలో మూడు, నాలుగు రోజులు చొప్పున నడపనుంది.
అలాగే ఇండిగో సంస్థ కోల్‌కతా, బెంగళూరులకు రోజూ తమ విమానాలను నడపాలని నిర్ణయించింది. స్పైస్ జెట్ సంస్థ జనవరి నుంచి విశాఖకు తమ సర్వీసులను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇండిగో సంస్థ నవంబర్ 15 నుంచి కోల్‌కతాకు, 16 నుంచి బెంగళూరుకు నడపనుంది. కోల్‌కతా సర్వీసు సాయంత్రం 6.55 గంటలకు, బెంగళూరు సర్వీసు ఉదయం 10.30 గంటలకు బయలుదేరనుంది. కాగా ఈ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల రద్దీ కోవిడ్‌కు ముందు పరిస్థితికి చేరుకుంటోంది. కోవిడ్‌కు ముందు ఏటా 2.85 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యకు దానికి చేరువలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకు అది 3 మిలియన్లకు చేరుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
తొలిసారిగా జార్సిగుడకు..
ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జార్సిగుడకు విమాన సర్వీసులు లేవు. తొలిసారిగా స్పైస్ జెట్ సంస్థ పారిశ్రామిక ప్రాంతమైన జార్సిగుడకు విమాన సర్వీసును నడపాలన్న నిర్ణయం తీసుకుంది. విశాఖ–జార్సిగుడల మధ్య ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉందన్న అంచనాతో స్పైస్ జెట్ తమ విమానాన్ని నడపడానికి
ముందుకొచ్చింది.
శ్రీలంక–విశాఖల సర్వీసు పునరుద్ధరణ
మరోవైపు శ్రీలంక–విశాఖల మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసుమళ్లీ పునరుద్ధరణ కానుంది. 2017లో కొలంబో–విశాఖ మధ్య శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే కోవిడ్ సమయంలో ఈ సర్వీసు రద్దు అయింది. త్వరలోనే ఆ విమాన సరీ్వసును పునరుద్ధరించనున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విశాఖ నుంచి సింగపూర్‌కు ఒకే ఒక్క అంతర్జాతీయ విమాన సర్వీసు నడుస్తోంది. గతంలో బ్యాంకాక్, దుబాయ్‌లకు కూడా ఇక్కడ నుంచి నడిచేవి. త్వరలో కొలంబో సర్వీసును కూడా పునరుద్ధరిస్తే ఈ ఎయిర్‌పోర్టు నుంచి రెండు అంతర్జాతీయ సర్వీసులు నడిచినట్టవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment