
విపత్తులను ఇలా ఎదుర్కొందాం
ఉత్కంఠభరితంగా మాక్‌డ్రిల్
మహారాణిపేట: భూకంపం వస్తే ఏం చేయాలి? సునామీ వస్తే ఎలా తప్పించుకోవాలి? అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా స్పందించాలి? ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలో జిల్లా ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ అవగాహన కల్పించింది. మహారాణిపేటలోని జబర్‌తోటలో బుధవారం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహించారు. కళ్లెదుటే ప్రమాదం జరుగుతుంటే ఎలా స్పందించాలో ప్రత్యక్షంగా చూపించారు. భూకంపం వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. డీపీఎం కళావతి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ సిబ్బంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అగ్నిమాపక, పోలీసు, జీవీఎంసీ, రెవెన్యూ, వైద్యారోగ్య, ఆర్‌అండ్‌బీ, పరిశ్రమలు, సివిల్ సప్లైస్, పశుసంవర్ధక, ఈపీడీసీఎల్, గ్రామీణ నీటి సరఫరా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

విపత్తులను ఇలా ఎదుర్కొందాం

విపత్తులను ఇలా ఎదుర్కొందాం

విపత్తులను ఇలా ఎదుర్కొందాం