
‘జేఈఈ’ పరీక్షకు నిమిషం ఆలస్యం
● కన్నీటితో వెనుదిరిగిన విద్యార్థులు ● చినముషిడివాడ అయాన్ డిజిటల్ కేంద్ర నిర్వాహకుడు, హెడ్ కానిస్టేబుల్ ఓవరాక్షన్
పెందుర్తి: చినముషిడివాడ ఐయాన్ డిజిటల్ కేంద్రంలో బుధవారం జేఈఈ మెయిన్ సెషన్–2 పరీక్ష జరిగింది. పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. నిబంధనల ప్రకారం విద్యార్థులు రెండు గంటల ముందే కేంద్రానికి రిపోర్ట్ చేయాల్సి ఉంది. చాలా మంది విద్యార్థులు సమయానికి చేరుకున్నప్పటికీ.. ఒకటి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులను కేంద్రం నిర్వాహకులు, ఎన్‌టీఏ సిబ్బంది అనుమతించలేదు. దీంతో పలువురు విద్యార్థులు సిబ్బందిని అనుమతించమని ప్రాధేయపడ్డారు. అయినా కనికరించకపోవడంతో వారు కన్నీటిపర్యంతమై అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా.. పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఆలస్యమైన విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఐయాన్ కేంద్రం సిబ్బందితో కలిసి విద్యార్థులను బలవంతంగా కేంద్రం బయటకు లాక్కుంటూ వెళ్లారు. దీన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పట్ల హెచ్‌సీ దురుసుగా ప్రవర్తించాడు. ఆలస్యమైతే విద్యార్థులను గౌరవప్రదంగా అక్కడి నుంచి పంపించాలి తప్ప, ఇలా లాక్కుంటూ వెళ్లడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

‘జేఈఈ’ పరీక్షకు నిమిషం ఆలస్యం

‘జేఈఈ’ పరీక్షకు నిమిషం ఆలస్యం