
ఇసుక కొరత లేకుండా చర్యలు
మహారాణిపేట: రానున్న వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా మందస్తు చర్యలు చేపట్టామని, అన్ని ఇసుక డిపోల్లో లక్ష టన్నుల పైగా ఇసుక నిల్వలు ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం, రాజమండ్రి నుంచి ఇసుక తీసుకొచ్చి.. గాజువాక, భీమిలి, ముడసర్లోవలోని ప్రైవేట్ ఇసుక డిపోల్లో లక్ష టన్నుల చొప్పున నిల్వ చేస్తామన్నారు. జిల్లాలోని రైతు బజార్ల మరమ్మతులకు రూ.50 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జేసీ వివరించారు. జిల్లాలో భూముల రీసర్వే చురుగ్గా సాగుతోందన్నారు.