ముంబై: రెండున్నరేళ్ల విరామం తర్వాత రాజధాని నగరం ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ-సిమ్లా మధ్య సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి ప్రతిరోజు ఈ సర్వీసు ఉంటుందని వెల్లడించింది.
కేవలం రూ. 2,480 పరిచయ ధరను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఉదయం 6.25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 7.35 గంటలకు సిమ్లా జుబ్బర్‌హట్టి విమానాశ్రయానికి చేరుకుని తిరిగి 8 గంటలకు ఢిల్లీకి చేరుకుని 9.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని సంస్థ తెలిపింది.
న్యూఇండియాను అనుసంధానించే క్రమంలో టైర్-2/టైర్-3 పట్టణాల మధ్య ఆయా సిటీ హబ్‌లతో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీని అందించే ప్రయత్నంలో ఢిల్లీ-సిమ్లా విమానాలను ప్రారంభించామని అలయన్స్ ఎయిర్ తెలిపింది. ఇది ఉత్తర భారతదేశంలో కనెక్టివిటీని విస్తరింప జేస్తుందని అలయన్స్ ఎయిర్ డిప్యూటీ ఇంజనీర్ యష్ వర్ధన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 6నుంచి ప్రతీ రోజూ విమానాలు నడుస్తాయన్నారు. కాగా ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ తొలిసారిగా 2017 జూలైలో విమానాన్ని నడిపింది. ఆ తర్వాత పలు కారణాలతో ఈ సర్వీసును నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment