Alliance Air
-
ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480
ముంబై: రెండున్నరేళ్ల విరామం తర్వాత రాజధాని నగరం ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ-సిమ్లా మధ్య సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి ప్రతిరోజు ఈ సర్వీసు ఉంటుందని వెల్లడించింది. కేవలం రూ. 2,480 పరిచయ ధరను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఉదయం 6.25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 7.35 గంటలకు సిమ్లా జుబ్బర్హట్టి విమానాశ్రయానికి చేరుకుని తిరిగి 8 గంటలకు ఢిల్లీకి చేరుకుని 9.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని సంస్థ తెలిపింది. న్యూఇండియాను అనుసంధానించే క్రమంలో టైర్-2/టైర్-3 పట్టణాల మధ్య ఆయా సిటీ హబ్‌లతో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీని అందించే ప్రయత్నంలో ఢిల్లీ-సిమ్లా విమానాలను ప్రారంభించామని అలయన్స్ ఎయిర్ తెలిపింది. ఇది ఉత్తర భారతదేశంలో కనెక్టివిటీని విస్తరింప జేస్తుందని అలయన్స్ ఎయిర్ డిప్యూటీ ఇంజనీర్ యష్ వర్ధన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 6నుంచి ప్రతీ రోజూ విమానాలు నడుస్తాయన్నారు. కాగా ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ తొలిసారిగా 2017 జూలైలో విమానాన్ని నడిపింది. ఆ తర్వాత పలు కారణాలతో ఈ సర్వీసును నిలిపివేసింది. -
తిరుపతికి అలయన్స్ ఎయిర్ అదనపు విమాన సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ పండుగల సీజన్ ను దృష్టిలో పెట్టుకుని జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్–తిరుపతి మధ్య అదనపు సర్వీసులు నడుపనుంది. జనవరి 7న హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2.50కి బయల్దేరి తిరుపతిలో 4.10కి ల్యాండ్ అవుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.40కి ప్రారంభమై భాగ్యనగరికి 6 గంటలకు చేరుతుంది. జనవరి 8న హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3.20కి టేకాఫ్ అయ్యి, తిరుపతిలో 4.40కి అడుగు పెడుతుంది. తిరిగి సాయంత్రం 5.10కి బయల్దేరి హైదరాబాద్‌లో 6.30కి చేరుకుంటుంది. -
16, 17 తేదీల్లో హైదరాబాద్ టు విజయవాడ
అలయన్స్ ఎయిర్ అదనపు సర్వీసులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్... హైదరాబాద్-విజయవాడ మధ్య ఆగస్టు 16, 18న అదనపు సర్వీసులు నడుపుతోంది. ఈ విమానం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2.50కి బయలుదేరి 3.50కి చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 4.20కి బయలుదేరి హైదరాబాద్‌కు 5.20కి వస్తుంది. హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ-హైదరాబాద్ మధ్య వారానికి అయిదు అలయన్స్ ఎయిర్ సర్వీసులు నడుస్తున్నాయి. 15 ఆగస్టు నుంచి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో సర్వీసులుంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం 8.30కి బయల్దేరే విమానం విజయవాడలో 9.30కి దిగుతుంది. 10 గంటలకు బయల్దేరి విశాఖపట్నంలో 11.10కి అడుగుపెడుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 11.40కి ప్రారంభమై విజయవాడ కు 12.50కి చేరుతుంది. మధ్యాహ్నం 1.20కి మొదలై 2.20కి హైదరాబాద్ వస్తుంది. -
తిరుపతికి అదనపు విమాన సర్వీసులు
హైదరాబాద్: ఎయిర్ ఇండియా పూర్తి అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ఈ నెల 20.21 తేదీల్లో తిరుపతికి అదనపు విమాన సర్వీసులను నిర్వహించనున్నది. ఈ రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి సాయంకాలం 3 గంటలకు బయల్దేరే ఏటీఆర్-72-600 విమా నం తిరుపతికి సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు చేరుతుందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. రిటర్న్ ఫ్లయిట్ తిరుపతి నుంచి 4 గంటల 40 నిమిషాలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుందని వివరించింది.