16, 17 తేదీల్లో హైదరాబాద్ టు విజయవాడ | 16, 17 on the Hyderabad to Vijayawada | Sakshi
Sakshi News home page

16, 17 తేదీల్లో హైదరాబాద్ టు విజయవాడ

Published Sat, Aug 13 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

16, 17 తేదీల్లో హైదరాబాద్ టు విజయవాడ

16, 17 తేదీల్లో హైదరాబాద్ టు విజయవాడ

అలయన్స్ ఎయిర్ అదనపు సర్వీసులు


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్... హైదరాబాద్-విజయవాడ మధ్య ఆగస్టు 16, 18న అదనపు సర్వీసులు నడుపుతోంది. ఈ విమానం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2.50కి బయలుదేరి 3.50కి చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 4.20కి బయలుదేరి హైదరాబాద్‌కు 5.20కి వస్తుంది. హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ-హైదరాబాద్ మధ్య వారానికి అయిదు అలయన్స్ ఎయిర్ సర్వీసులు నడుస్తున్నాయి.


15 ఆగస్టు నుంచి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో సర్వీసులుంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం 8.30కి బయల్దేరే విమానం విజయవాడలో 9.30కి దిగుతుంది. 10 గంటలకు బయల్దేరి విశాఖపట్నంలో 11.10కి అడుగుపెడుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 11.40కి ప్రారంభమై విజయవాడ కు 12.50కి చేరుతుంది. మధ్యాహ్నం 1.20కి మొదలై 2.20కి హైదరాబాద్ వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement