Hyderabad-vijayawada
-
శాంతించిన మున్నేరు.. హైదరాబాద్-విజయవాడ హైవే క్లియర్
సాక్షి, ఐతవరం : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. కాగా, వరదల కారణంగా కృష్టా జిల్లాలోని ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో దాదాపు 24 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కూడా విజయవాడ-హైదరాబాద్ మధ్య రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసింది. ఇక, తాజాగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై యథావిధిగా వాహనల రాకపోకలు కొనసాగుతున్నాయి. మున్నేరు వరద తగ్గడంతో వాహనాలను పోలీసులు అనుమతించారు. కాగా, అంతకుముందు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించారు. ఇది కూడా చదవండి: బోరుమంటున్న మొరంచపల్లి.. సర్వం కోల్పోయిన దీనస్థితి.. -
TSRTC: హైదరాబాద్-విజయవాడ రెగ్యులర్ సర్వీసులు రద్దు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. కాగా, కృష్ణా జిల్లాలోని కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతితో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యూలర్ టీఎస్ఆర్టీసీ బస్సుల రద్దు చేస్తున్నాం. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. ఎంజీబీఎస్ నుంచి ప్రతీ అరగంటకో బస్సు ఉంటుంది. దీనిపై మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలన్నారు. ప్రయాణికులకు ముఖ్య గమనిక! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 28, 2023 ఇది కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్ -
Alert: హైదరాబాద్‌కు వస్తున్న వారికి పోలీసుల కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం ఇప్పుడు మళ్లీ నగరబాట పట్టారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. నవాబుపేట (ఏపీ) నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి వరకు తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. కాగా, జాతీయ రహదారులు, స్థానిక రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తిస్తారు. బ్లాక్ స్పాట్స్ వివరాలు నవాబ్ పేట, రామాపురం, శ్రీరంగాపురం, మేళ్లచెరువు క్రాస్ రోడ్డు, కట్టకొమ్ముగూడ క్రాస్, కొమరబండ, ఆకుపాముల, ముకుందాపురం, దురాజ్ పల్లి, జమ్మిగూడ, జనగామ క్రాస్, ఎస్వీ కాలేజ్, కొర్ల పహాడ్, కట్టంగూరు, నల్లగొండ క్రాస్, చిట్యాల, పెద్ద కాపర్తి. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. చదవండి: (మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత) -
హైదరాబాద్–విజయవాడ మధ్య ఆర్ఆర్టీఎస్ రైలు!
సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ మధ్య ఇంటర్సిటీ రైల్ సర్వీసులు ఆధునిక సొబగులు సంతరించుకోనున్నాయి. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలు సర్వీసు ఈ నెల 19న ప్రారంభం కానుంది. తాజాగా హైదరాబాద్– విజయవాడ మధ్య అత్యాధునిక రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో మెట్రో రైలు కంటే మెరుగైన ఇంటర్సిటీ మోడల్ రైల్వే వ్యవస్థగా ఆర్‌ఆర్‌టీఎస్‌ను ప్రస్తుతం ఢిల్లీ–మీరట్ మధ్య నిర్మిస్తున్నారు. ఆ రెండు నగరాల మధ్య ఆర్ఆర్టీఎస్ రైల్వే వ్యవస్థ 2024 చివరకు అందుబాటులోకి రానుంది. తరువాత దేశంలో మరో ఏడు ఆర్ఆర్టీఎస్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో రెండు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మిగిలిన ఐదింటిలో హైదరాబాద్–సికింద్రాబాద్ మార్గంలో నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఏమిటీ ఆర్ఆర్టీఎస్.. ఇంటర్సిటీ రైలు సర్వీసుల్లో ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ అత్యాధునికమైనది. మెట్రో రైళ్లు ఓ నగర పరిధిలో సేవలందిస్తాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ నగరాల మధ్య ఇంటర్సిటీ సర్వీసులుగా ఆర్ఆర్టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విద్య, ఉద్యోగ, వ్యాపార తదితర అవసరాల కోసం ప్రయాణికులు అత్యధికంగా రాకపోకలు సాగించే సమీపంలోని ప్రధాన నగరాల మధ్య ఏర్పాటు చేసే వ్యవస్థే ఆర్ఆర్టీఎస్. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్ఆర్టీఎస్ ఏర్పాటు చేస్తాయి. అందుకోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటుచేసి, రైల్వేశాఖతో నిమిత్తం లేకుండా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సమాంతరంగా నిర్వహిస్తాయి. తొలిసారిగా 1998–99లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. రెండు దశాబ్దాల తరువాత తొలి ఆర్ఆర్టీఎస్ వ్యవస్థను ఢిల్లీ–మీరట్ మధ్య ఏర్పాటు చేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో ఆధునిక రైలు ప్రయాణం ఆర్ఆర్టీఎస్ రైళ్లు అత్యాధునిక ప్రమాణాలతో ప్రత్యేక ప్రయాణ అనుభూతి కలిగిస్తాయి. రైల్వే కోచ్‌లలో రెక్లయినర్ సీట్లు, విశాలౖమెన నడవా, ప్రతి సీటుకు ప్రయాణించే రూట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా లగేజీ ర్యాక్‌లు, మొబైల్ఫోన్లు/ల్యాప్‌టాప్ చార్జింగ్ సాకెట్లు ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు, డబుల్ గేజ్ అద్దాల కిటికీలు, ఫైర్/స్పోక్ డిటెక్టర్లు మొదలైన ఆధునిక భద్రతా ప్రమాణాలతో కోచ్‌లను రూపొందిస్తారు. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేస్తారు. ఆర్ఆర్టీఎస్ వ్యవస్థతో గంటకు 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఆధునిక రైలు ప్రయాణ అనుభూతిని ఆస్వాదించవచ్చును. మరో రెండింటికి ఓకే.. దేశం మొత్తం మీద రైల్వేశాఖతో నిమిత్తంలేకుండా 1,835 కిలోమీటర్ల మేర మెట్రో, ఆర్ఆర్టీఎస్ లైన్లుగా కేటాయించారు. వాటిలో 824 కిలోమీట్లు మెట్రోరైల్ లైన్లు కాగా మిగిలిన 1,011 కిలోమీటర్లను ఆర్ఆర్టీఎస్ పరిధిలోకి చేర్చారు. తరువాత ఢిల్లీ–హరిద్వార్, ఢిల్లీ–అల్వార్, ఢిల్లీ–జైపూర్, ఢిల్లీ–ఛండీగఢ్, రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని హైదరాబాద్– విజయవాడ, హరియాణలోని ఫరీదాబాద్–గురుగావ్, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో–కాన్పూర్ మధ్య ఆర్ఆర్టీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటిలో ఢిల్లీ–హరిద్వార్, ఢిల్లీ–అల్వార్ ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. వీటి తరువాత ఐదు ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ఎండీ వినయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. ఆర్ఆర్టీఎస్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం కిలోమీటరుకు రూ.370 కోట్ల వ్యయం అవుతుంది. 2024 చివరకు హైదరాబాద్–విజయవాడతోపాటు ఇతర ఆర్ఆర్టీఎస్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించే ప్రక్రియ చేపడతామని ఎన్సీఆర్టీసీ వర్గాలు చెప్పాయి. -
ఆరు లేన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే ఆరు లేన్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాలుగు లేన్లున్న ఈ ఎన్‌హెచ్–65ను వీలైనంత త్వరగా 6 లేన్ల రహదారిగా విస్తరించాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఉత్తమ్ కలసి వినతిపత్రం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చడంలో ఆలస్యం కారణంగా ట్రాఫిక్ సమస్య లు ఎదురవుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టిన జీఎంఆర్ సంస్థ.. 247 కి.మీ. పొడవైన 4 లేన్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 2012 అక్టోబర్ లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఉత్తమ్ చెప్పారు. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తిచేస్తాం.. ‘జీఎంఆర్‌తో ఒప్పందం ప్రకారం.. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటైన ఈ రహదారిని ఆరు లేన్ల రహదారిగా మార్చే ప్రక్రియను 2024 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి. అయితే అనేక కారణాలతో ట్రాఫిక్ తగ్గి ఆదాయమూ తగ్గిందని పరిహారం కోసం జీఎంఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని కేంద్రమంత్రి తెలిపారు. ఆరు లేన్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నేను, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. గడ్కరీ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లాం. ఈ కారణంగా ఇటీవల జీఎంఆర్ సంస్థతో కేంద్రమంత్రి చర్చలు జరిపారు. దీంతో కోర్టు వ్యాజ్యాన్ని ముగించి త్వరలో పనులు ప్రారంభించేందుకు జీఎంఆర్ అంగీకరించిందని గడ్కరీ తెలిపారు. మంత్రిత్వ శాఖలో అవసరమైన ప్రక్రియలను 2 వారాల్లో పూర్తి చేసి విస్తరణ పనులను త్వరగా ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు’అని వివరించారు. 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్–విజయవాడ హైవే 4 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా మంజూరైందని, ప్రస్తుతం ఎంపీగా 6 లేన్లుగా విస్తరించడంలో తనవంతు పాత్ర పోషించడం ఎంతో సంతృప్తినిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. రూ.1,470 కోట్ల అంచనాతో పనులు.. తెలంగాణ, ఏపీలను కలిపే ఈ రహదారిపై రద్దీ కారణంగా 2007లో ఎక్స్‌ప్రెస్‌వేకు మంజూరు లభించింది. 25 ఏళ్లకు బిడ్‌ను పొందిన జీఎంఆర్ సంస్థ 2009లో 4 లేన్ల పనులను ప్రారంభించింది. రూ. 1,470 కోట్ల అంచనా వ్యయంతో 2010, మార్చి 22న ప్రారంభమైన పనులు 2012లో పూర్తయ్యాయి. -
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వేల సంఖ్యలో వెళ్తున్న వాహనాలతో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై నల్గొండజిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్ను చెల్లించేందుకు వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగడంతో రద్దీ చాలా పెరిగిపోతుందని వాహనదారులు చెబుతున్నారు. ఒకవైపు సొంత వాహనాలున్న వారు, మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య నేడు అధికంగా ఉంది. నేడు భోగి పండుగ కాగా, రేపు (శనివారం) మకర సంక్రాంతిని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ఇళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నగరం ఖాళీ అవుతుంటే.. పండక్కి గ్రామాలకు వెళ్లేవారితో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. -
16, 17 తేదీల్లో హైదరాబాద్ టు విజయవాడ
అలయన్స్ ఎయిర్ అదనపు సర్వీసులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్... హైదరాబాద్-విజయవాడ మధ్య ఆగస్టు 16, 18న అదనపు సర్వీసులు నడుపుతోంది. ఈ విమానం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2.50కి బయలుదేరి 3.50కి చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 4.20కి బయలుదేరి హైదరాబాద్‌కు 5.20కి వస్తుంది. హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ-హైదరాబాద్ మధ్య వారానికి అయిదు అలయన్స్ ఎయిర్ సర్వీసులు నడుస్తున్నాయి. 15 ఆగస్టు నుంచి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో సర్వీసులుంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం 8.30కి బయల్దేరే విమానం విజయవాడలో 9.30కి దిగుతుంది. 10 గంటలకు బయల్దేరి విశాఖపట్నంలో 11.10కి అడుగుపెడుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 11.40కి ప్రారంభమై విజయవాడ కు 12.50కి చేరుతుంది. మధ్యాహ్నం 1.20కి మొదలై 2.20కి హైదరాబాద్ వస్తుంది. -
హైదరాబాద్ టు విజయవాడ
భువనగిరి : హైదరాబాద్- విజయవాడ మధ్యన కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీబూరనర్సయ్యగౌడ్ రైల్వే శాఖకు సూచించారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ వాత్సవతో జరిగిన సమావేశంలో ఎంపీ ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం విజయవాడకు వరంగల్, ఖమ్మం మీదుగా రైలు మార్గం ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి ఉంది. ఇది కాచిగూడ చౌటుప్పల్, చిట్యాల సూర్యాపేట, కోదాడ, నందిగామ, జగ్గయ్యపేట మీదుగా వెళ్తుంది. జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతం నల్లగొండ జిల్లాలో అధికంగా ఉంది. హైవే వెంట రైలు మార్గం వస్తే జిల్లాలో మరో రైలు మార్గం రావడం ద్వారా సూర్యాపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. త ద్వారా ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్- ఖాజీపేట- విజయవాడ మార్గంలో 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుం ది. అలాగే సికింద్రాబాద్ - ఖాజీపేట మార్గంలో అత్యాధునిక బుల్లెట్ రైలును ప్రవేశపెట్టాలని కోరారు. ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా రైల్వేకు అధిక ఆదాయం తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్నా నిధులు మాత్రం ఆమేరకు రావడం లేదు. ఇక నుంచి మన వాటా ప్రకారం నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోర తాం. కొత్త ప్రతిపాదనల్లో హైదరాబాద్- విజయవాడ కొత్త రైలు మార్గం వేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటికీ బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పూర్తి చేయాలని, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు విన్నవించాం. కేంద్రం దృష్టికి కూడా ఈ ప్రతిపాదనలను తీసుకెళ్తా. -డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, ఎంపీ, భువనగిరి రాయగిరి స్టేషన్ పేరు మార్చాలి రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదగిరి రైల్వే స్టేషన్‌గా మార్చాలి. రాయగిరి రైల్వే స్టేషన్ స్థాయిని పెంచి మాడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలి. ఇక్కడి నుంచి వెళ్లే అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రాయగిరి స్టేషన్లో ఆపాలి. ఎంఎంటీఎస్ రైళ్లను రాయగిరి వరకు కొనసాగించాలి. భువనగిరి వరకు ప్రతిపాదనలో ఉన్న మూడో లైను పనులకు నిధులు మంజూరు చేయాలి. దాన్ని వరంగల్ వరకు పొడిగించాలి. భవిష్యత్‌లో బుల్లెట్ రైళ్లను ఏర్పాటకు కృషి చేయాలి. వ్యాపార అభివృద్ధికి భువనగిరిలో కంటైనర్ కార్బో ఏర్పాటు చేయాలి. బీబీనగర్- నడికుడి మార్గంలో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలి.