
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం ఇప్పుడు మళ్లీ నగరబాట పట్టారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. నవాబుపేట (ఏపీ) నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి వరకు తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. కాగా, జాతీయ రహదారులు, స్థానిక రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తిస్తారు.
బ్లాక్ స్పాట్స్ వివరాలు
నవాబ్ పేట, రామాపురం, శ్రీరంగాపురం, మేళ్లచెరువు క్రాస్ రోడ్డు, కట్టకొమ్ముగూడ క్రాస్, కొమరబండ, ఆకుపాముల, ముకుందాపురం, దురాజ్ పల్లి, జమ్మిగూడ, జనగామ క్రాస్, ఎస్వీ కాలేజ్, కొర్ల పహాడ్, కట్టంగూరు, నల్లగొండ క్రాస్, చిట్యాల, పెద్ద కాపర్తి. ఈ బ్లాక్ స్పాట్‌ల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
చదవండి: (మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత)
Comments
Please login to add a commentAdd a comment