హైదరాబాద్‌– విజయవాడ హైవే.. ఏ వాహనానికి ఎంత టోల్‌ చార్జీ? | Toll Charges from Hyderabad to Vijayawada full details | Sakshi

Toll Charges: టోల్‌ ప్లాజాల్లో చార్జీలు.. ఏ వాహనానికి ఎంత?

Apr 1 2025 5:38 PM | Updated on Apr 1 2025 5:51 PM

హైదరాబాద్‌- విజయవాడ హైవేపై చౌటుప్పల్‌ మండలం పంతంగి వద్ద టోల్‌ప్లాజా

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం పంతంగి వద్ద టోల్‌ప్లాజా

టోల్‌ ప్లాజాల్లో సవరించిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. హైదరాబాద్‌– విజయవాడ మార్గంలోని నేషనల్‌ హైవే–65పై టోల్ చార్జీలు త‌గ్గ‌గా, తెలంగాణ (Telangana) మీదుగా సాగే ఇతర జాతీయ ర‌హ‌దారుల‌పై మాత్రం చార్జీలు పెరిగాయి.

వరంగల్‌– హైదరాబాద్‌ బైపాస్‌ రోడ్డుపై టోల్‌ ప్లాజాల్లో చార్జీలు..  
 కారు, జీపు, వ్యాన్, లైట్‌ మోటార్‌ వాహనం ఒక వేపు రూ.125, అప్, డౌన్‌ రూ.190, లైట్‌ కమర్షియల్‌ వాహనం, లైట్‌ గూడ్స్‌ వాహనం, మినీ బస్సు రూ.205, అప్, డౌన్‌ రూ.305, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ.425, అప్, డౌన్‌ రూ.635, కమర్షియల్‌ వాహనం ఒక వైపు రూ.465, అప్, డౌన్‌ రూ.695, హెచ్‌సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ.665, అప్, డౌన్‌ రూ.1,000, ఓవర్‌సైజ్‌ వాహనం ఒక వైపు రూ.810, అప్, డౌన్‌ రూ.1,215, నెలవారీ పాస్‌ (Monthly Pass) ధర రూ.340 నుంచి రూ.350కి పెరిగింది.  

ఎన్‌హెచ్‌–44పై ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద ఇలా.. 
నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్‌ లేదా లైట్‌ మోటార్‌ వాహనాలకు సింగిల్‌ జర్నీకి రూ. 90గా టోల్‌ చార్జీ ఖరారైంది. అలాగే 24 గంటల్లోపు రిటర్న్‌ జర్నీకి రూ. 135, 50 సింగిల్‌ జర్నీలతో కూడిన మంత్లీ పాస్‌కు రూ. 3,035, టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో ఉండి రిజిస్టర్‌ చేసుకున్న వాహనాలకు మంత్లీ పాస్‌ రూ. 350కు పెరిగాయి. 

లైట్‌ కమర్షియల్‌ వాహనాలు, లైట్‌ గూడ్స్‌ వాహనాలు, మినీ బస్‌లకు సింగిల్‌ జర్నీకి రూ. 145, 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీకి రూ. 220, మంత్లీ పాస్‌కు రూ. 4905లకు పెరిగాయి. 

బస్‌లు, రెండు ఎక్సెల్‌ గల ట్రక్కులకు సింగిల్‌ జర్నీకి రూ. 310, 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీకి రూ. 465, మంత్లీ పాస్‌కు రూ.10,280 లకు పెరిగాయి. 

హెవీ కన్‌స్ట్రక్షన్‌ వాహనాలు, ఎర్త్‌ మూవింగ్‌ వాహనాలు, మల్టీపుల్‌ ఎక్సల్‌ వాహనాలకు సింగిల్‌ జర్నీకి రూ.485, 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీకి రూ.725, మంత్లీ పాస్‌కు రూ.16,120 లకు పెరిగాయి. 

చ‌ద‌వండి: హైదరాబాద్‌– విజయవాడ హైవేపై టోల్ చార్జీలు ఎందుకు త‌గ్గాయి?

ఏడు ఎక్సెల్‌లు కలిగి ఉన్న భారీ వాహనాలకు సింగిల్‌ జర్నీకి రూ. 590, 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీకి రూ.885, మంత్లీ పాస్‌కు రూ. 19,625లకు చార్జీలు  (Charges)పెరిగాయి.

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement