vijayawada- hyderabad highway
-
దట్టంగా పొగమంచు.. ట్రాఫిక్ అంతరాయం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలలో పొగమంచు దట్టంగా అలుముకుంది. వెలుతురు సరిగా లేని కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ నగరం మంచు దుప్పటితో మూసుకుపోయింది. నగర్ శివారు ప్రాంతం హయత్ నగర్ పరిసర ప్రాంతాలు ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత కూడా సూర్యుడు రాకుండా మంచుతో నిండి ఉండటంతో జాతీయ రహదారి పై వెళ్లే వాహనదారులకి ముందుగా వెళుతున్న వాహనాలు కనపడక తీవ్ర ఇబ్బంది పడుతూ వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్ల వలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత వారం పది రోజుల నుండి చలి బాగా పెరగటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. -
హైవేపై బారులు తీరిన వాహనాలు
విజయవాడ: విజయవాడ- హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హైవేపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోవడంతో కొత్తగా వస్తున్న వాహనాలకు స్థలం లేక రోడ్డుపైనే ఆపేయడంతో.. ట్రాఫీక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. జగ్గయ్యపేట, నందిగామ టోల్గేట్ల వద్ద తెల్లవారుజాము నుంచే వాహానాల రద్దీ విపరీతంగా ఉంది. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు విద్యార్థుల మృతి
మునగాల: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను కోదాడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.